ఉగ్రవాదికి చైనా వత్తాసు

Wed,November 15, 2017 12:47 AM

భారత్‌ను అడ్డుకోవటానికి ఐరాసలో మసూద్ అంశాన్ని తప్పుదారి పట్టించటమే మంచి ఉపాయంగా చైనా భావిస్తున్నది. చైనా పదేపదే ఇదేవిధంగా చేయటం ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ చిత్తశుద్ధిపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి.దుష్టరాజ్యంగా పేరుపడ్డ ఉత్తరకొరియాతో, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన పాకిస్థాన్‌తో బలమైన సంబంధాలు పెట్టుకోవటం చైనా ప్రతిష్ఠను దిగజార్చుతున్నది.

మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనను చైనా ముంచివేసింది. భారత్ ఈ ప్రతిపాదనను మరోసారి ఐరాసలో ఇప్పటికిప్పుడు పెట్టలేదు. ఐరాస చరిత్రలో భద్రతామండలి దృష్టినుంచి ఒక ఉగ్రవాది బయటపడి ప్రపంచశక్తిగా ఎదిగిన దాఖలాలు లేవు. పద్నాలుగు మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి అజహర్‌ను ఉగ్రవాదిగా నిర్ధారించడానికి సిద్ధపడినప్పటికీ చైనా అడ్డుకున్నది. చైనా అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై తప్పకుండా పోరాటం చేయాల్సిందే. ఇక్కడ అజహర్ ఉగ్రచరిత్ర గురించి తప్పకుండా చెప్పుకోవాలి. అతడు మొదట హర్కత్ ఉల్ అన్సార్ గ్రూప్‌తో చేతులు కలిపి సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అఫ్ఘానిస్థాన్‌లో ఆయుధాలు పట్టాడు. అనతికాలంలోనే ఆ సంస్థకు నిధుల సేకరణలో కేంద్రబిందువుగా మారాడు. అంతటితో ఆగకుండా జీహాదీ సందేశాన్ని విస్తరించడంకోసం, నిధులు సమీకరణ కోసం, అంతర్జాతీయంగా సంబంధాలు పెంపొందించడంకోసం అనేకసార్లు పశ్చిమదేశాల్లో పర్యటించాడు. లండన్‌లో జరిగిన 7/7 బాంబుదాడుల్లో ఉగ్రవాదులకు అవసరమైన వస్తు సామాగ్రిని అతడే అందించాడని వెల్లడైంది.
Chinese-Flag
1994లో శ్రీనగర్‌కు వెళ్తుండగా మసూద్‌ను భారత్ అరెస్టు చేసింది. ఏడాది తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదులు నలుగురు విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. ఈ పాశవికచర్యకు బాధ్యత వహించిన ఏవన్ ఫరన్ ఉగ్రవాద సంస్థ భారత ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లలో మసూద్‌ను విడుదల చేయాలన్నది ఒకటి. 1999 డిసెంబర్ 24న ఖాట్మండ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814ను ఉగ్రవాదు లు హైజాక్ చేశారు. అనేక చర్చల అనంతరం ఉగ్రవాదులు భారత్ జైళ్లలో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను అప్పగిస్తే విమానాన్ని విడిచిపెడుతామని డిమాండ్లు పెట్టారు. హైజాకర్లు అప్పగించాలని కోరిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు మసూద్ అజహర్.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అజహర్‌ను ఉగ్రవాది అనడాన్ని చైనా అంగీకరించకుండా గందరగోళపరుస్తున్నది. చైనా వైఖరి వెనుక ఉన్న అనేక కారణాల్లో పాకిస్థాన్‌తో ఆ దేశానికి ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ముఖ్యమైనవి. భారత్-అమెరికాల మధ్య సంబంధాలు బలపడటం కూడా చైనా వైఖరికి కారణం. డోక్లాంపై భారత్ గట్టిగా నిలబడటం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సత్సంబంధాలు మరో కారణం. చైనా వన్ బెల్ట్, వన్‌రోడ్‌ను భారత్ అడ్డుకోవడం కూడా బీజింగ్ పాలకులు ఆగ్రహం తెప్పిస్తున్నది. శ్రీలంక విషయంలో భారత్ స్థిరమైన వైఖరితో పోతుండటంతో ఆ దేశంపై కూడా చైనా పట్టుకోల్పోతున్నది.
మాల్దీవులకు చైనా దగ్గరకాకుండా భారత్, అమెరికా ప్రయత్నిస్తున్నా యి. మాల్దీవుల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట హిందూ మహా సముద్రంపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి చైనా ఆ దేశాన్ని వాడుకోవాలని చూస్తున్నది. సెప్టెంబర్‌లో జరిగిన 19వ బ్రిక్స్ సమావేశం డిక్లరేషన్‌లో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల పేర్లను కూడా చేర్చా రు. అందులో మసూద్ అజహర్ స్థాపించిన జైష్ ఏ మహమ్మద్ కూడా ఉంది. భారత విమానం హైజాక్‌తో విడుదలై పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత అతడు ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అయితే బ్రిక్స్ డిక్లరేషన్‌లో జైషే ఎ మహమ్మద్ సంస్థను ఉగ్రవాదసంస్థగా చేర్చేందుకు అంగీకరించి న చైనా, ఆ సంస్థను స్థాపించిన వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోవటం విచిత్రం. పాకిస్థాన్ అభ్యంతరాల మూలంగా చైనా ఈ వైఖరి తీసుకున్నది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదానికి మద్దతు విషయంలో పాకిస్థాన్‌ను తీవ్రమైన పదజాలంతో విమర్శించటం గమనార్హం. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచంలో ఏకాకిగా మారింది. ఈ పరిస్థితుల్లో మసూద్‌ను వెనుకేసుకరావడానికి ఏం చేయా లో తెలియని పరిస్థితుల్లో ఉన్నది.
chatarji
భారత్‌ను అడ్డుకోవటానికి ఐరాసలో మసూద్ అంశాన్ని తప్పుదారి పట్టించటమే మంచి ఉపాయంగా చైనా భావిస్తున్నది. చైనా పదేపదే ఇదే విధంగా చేయటం ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ చిత్తశుద్ధిపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దుష్టరాజ్యంగా పేరుపడ్డ ఉత్తరకొరియాతో, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన పాకిస్థాన్‌తో బలమైన సంబంధాలు పెట్టుకోవటం చైనా ప్రతిష్ఠను దిగజార్చుతున్నది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో భారత్ వేరే మార్గాలను అనుసరించాలి. ఈ విషయాన్ని చర్చించేందుకు భారత్ అమెరికాలు వచ్చే నెలలో సమావేశం కానున్నాయి. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారైన పక్షంలో పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న ఇతర ఉగ్రవాదులను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. పాకిస్థాన్‌లో ఉన్న 60 మంది ఉగ్రవాదులను తనకు అప్పగించాలని భారత్ ఇప్పటికే ఓ జాబితాను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి లో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు భారత్ విజయం సాధించాలంటే ఇప్పుడున్న విధానం సరిపోదు. ఎందుకంటే అప్పుడు కూడా చైనా మళ్లీ పాత వాదన వినిపించే అవకాశమే ఎక్కువ ఉంది.
(వ్యాసకర్త: మాజీ సైనికాధికారి) rediff.com సౌజన్యంతో..

459
Tags

More News

VIRAL NEWS