ఆత్మీయతకు అభయం.. టీ సర్కార్

Tue,November 14, 2017 01:03 AM

ప్రభుత్వం అంటే బడ్జెట్ లెక్కలు చూసుకొని ఖర్చుపెట్టే బ్యాంకు కాదు, ప్రజల కోసం పరితపించే ధర్మకర్త. ఎక్కడ ప్రజలు సమస్యల్లో ఉన్నా.. ఖజానా లెక్కలు చూసుకోకుండా, బడ్జెట్ పేజీలు తిప్పుకోకుండా సమస్యను తీర్చే నాయకులు కొందరే ఉంటారు. అందు లో కేసీఆర్ నెం-1 అనడానికి ఎలాంటి సంశయం లేదు. కేసీఆర్ చూపిం చే ఈ ఉదాత్తమైన పరిపాలన శైలివల్లే తెలంగాణలోని సబ్బండ వర్గాలు, సమస్త కులాలు, మతాలు సంతోషంగా బతుకుతున్నయి.

తెలంగాణ సర్కారు సరికొత్తగా పరిపాలనను కొనసాగిస్తున్న ది. కాగితాలపై నిధులు కేటాయించి.. ఇదే అభివృద్ధి అని నమ్మించిన గత పాలకుల దుర్నీతికి చరమగీతం పాడిన కేసీఆర్ సర్కారు అభివృద్ధిని మానవీయ మార్గంలోకి మళ్లించింది. రోడ్లేయ్యడమంటే అదేదో మీద పూతపూసినట్టు, విద్యను బాగుచేయడమంటే ఓ బిల్డింగ్ కట్టి టీచర్లను మరిచినట్టు, ఇండ్లు కట్టమంటే ఇరు కు గదులు నిర్మించి చేతులు దులుపుకున్నట్టు, సర్కారు వైద్యమంటే చావునోట్లో తలబెట్టినట్టే అన్నట్టుగా ఉన్న ప్రజల భావనను పూర్తిగా మార్చేసిం ది. అభివృద్ధి అంటే పైపై హంగులు కాదు, ఎన్నికల నినాదాలు అస్సల్కే కాదు, పాలకుల బాధ్యత అన్నట్టుగా టీ-సర్కారు కొత్తపంథాలో దూసుకుపోతున్నది. రాజకీయ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని తరాజులో తూచినట్టు సమానంగా నడుపగలిగిన పొలిటికల్ జీనియస్ కేసిఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల పరిపాలనలో గొప్ప మార్పు కనిపిస్తున్నది. అందుకే దశాబ్దాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న తాగు, సాగునీళ్లు, విద్య, వైద్యం, విద్యుత్, ఉపాధి, సంక్షేమం లాంటి రంగాల్లోని సమస్యలన్నీ మూడున్నరేండ్లలోనే తోక ముడిచిపోతున్నాయి. అంతేకాదు గత ప్రభుత్వాల హయాంలో పెచ్చుమీరిన అవినీతి.. తెలంగాణ నుంచి పూర్తి గా పారిపోయింది. ఇప్పుడు పాలన అంత పారదర్శకతతో కొనసాగడం ప్రజలకు అమితానందాన్ని కలిగిస్తున్నది. దశాబ్దాల చరిత్రలో ఏ సర్కారు చేయని అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అనామకులకు, అభాగ్యులకు నేనున్నానే భరోసా కల్పి స్తూ.. సరికొత్త పంథాలో దూసుకుపోతున్నది. ఈ క్రమంలో ప్రభు త్వం అమలుచేస్తున్న కొన్ని మానవీయ పథకాలు గమనార్హమైనవి.

పార్థీవ వాహనాలు: ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించిన భార్యను భుజంపై మోసుకెళ్లిన మాంఝీ వార్త సోషల్ మీడియాలో సంచలనమైన విషయం తెలిసిందే. ఒక్క మాంఝీ మాత్రమే కాదు.. ఇంకా అనేకమంది మాంఝీలు వివిధ రాష్ర్టాల్లో ఇప్పటికీ అలాంటి కష్టాలనే పడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. నగరాల్లోని దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించిన నిరుపేదల మృతదేహాలను పార్థీవ వాహనాలు నయాపైస ఖర్చులేకుండా సొంతూరుకు తరలి స్తున్నా యి. సర్కారు చేసే ఈ పరమపద సహాయం ప్రతిపక్షాలకు చిన్నగా కనిపించవచ్చు కానీ.. అందులో తల్లడిల్లిన గుండెలను తడిమిచూసే అనుబంధం ఉంది. కన్నీటిలోనూ కడవరకు భరోసాగా నిలిచే ఓ అభయం ఉందన్నది మాత్రం నిజం. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 50 వాహనాలు సేవలనందిస్తున్నాయి. ఇందులో 34 వాహనాలు నగరంలో రోజువారీగా 25 నుంచి 30 వరకు మృతదేహాలను మారుమూల గ్రామాలకు తరలిస్తున్నాయి. 2016 నవంబర్ 1 నుంచి నేటివరకు దాదాపుగా 13,161 పార్థివదేహాలను వారి గృహాలకు చేర్చి వారి కుటుంబాల హృదయవేదనలో భాగం పంచుకోవడం ద్వారా కేసిఆర్ సర్కారు కొత్త చరిత్రను లిఖించింది. ఇంతటి కార్యక్రమం, ఇంత విజయవంతంగా మరెక్కడా జరుగుతుందని కనీసం ఊహించడం కూడా కష్టమే.

ఐదు రూపాయలకే కడుపునిండా భోజనం: అన్నం పరబ్రహ్మ స్వరూ పం అంటారు. అందరికీ అన్నదానం చేయాలని ఉంటుంది. కానీ ఆత్మగౌరవంతో బతికే పల్లెజనం అడుక్కొని తినడానికి ఒప్పుకోరు. దీంతో వ్యక్తిగత పనుల మీద నగరానికి వచ్చిన అనేకమంది పేదలు భోజనం చేయలేక పస్తులుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సూక్ష్మాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసిఆర్ 5 రూపాయల భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం అన్నార్తుల హృదయాలను కదిలిస్తున్నది. ఇప్పటికే 150 కేంద్రాల ద్వారా పెద్దపెద్ద హాస్పిటల్స్, బస్టాండ్, రైల్వేస్టేషన్, కూలీలుండే ప్రాంతా ల్లో అమలవుతున్నది. రోజుకు 35 వేల మందికి భోజనం అందిస్తూ అన్నార్తుల చేత ప్రశంసలందుకుంటున్నది. తెలంగాణ సర్కారు నిధులతో హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా నడుస్తున్న పథకం కేసిఆర్ సర్కారు మానవీయతకు నిలువెత్తు నిదర్శనం.

దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలు: మూగజీవాల సంరక్షణ కోసం సంచార వైద్యశాలను ప్రారంభించిన రాష్ర్టాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. గ్రామీణ తెలంగాణలో పశుసంపదను పెంచి వ్యవసాయ కుటుంబాలకు ఆదాయం పెంచాలనే సదుద్దేశంతో ముందుకుపోతున్నది. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా పశురక్షణ కోసం ఒక్కో అంబులెన్సుకు రూ.14.65 లక్షలు వెచ్చించడం మాములు విషయం కాదు. ఇలాంటి వంద అంబులెన్సులను ప్రారంభించిన సర్కారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పశుసేవలో నిమగ్నమైపోయింది. పాడిపశువులకు జబ్బుచేస్తే రైతులు ఒక్క ఫోన్ కొడితే (1962 నంబర్‌కు) 30 నిమిషాల్లోనే డాక్టర్లు, ఉచిత మందులు, అత్యవసర పరికరాలు, అధునాతన వసతులతో ఉన్న సంచార పశువైద్యశాలతో సహా వచ్చి చికిత్స చేయడం రైతులను అమితానందానికి లోనుచేస్తున్నది.

కన్నతల్లి చంటిబిడ్డ రక్ష (కేసీఆర్ కిట్) పథకం: మనకు తెలిసిన కాన్పు అంటే కచ్చితంగా చిన్న ఆపరేషనో, పెద్ద ఆపరేషనో జరుగాల్సిందే. బిడ్డ పుట్టిన సంబురం లేకుండా తల్లి కుట్ల నొప్పులతో అవస్థ పడాల్సిందే. ఇది ఓ వైపు జరుగుతుంటే.. దవా ఖానలో ఛార్జీలు కట్టేందుకు తల్లిగారు, అత్తగారు కజ్జాలు పెట్టుకోవాలి. కానీ తెలంగాణలో ఆ ట్రెండ్‌ను మార్చేసింది కేసిఆర్ ప్రభుత్వం. బాలింతకు ఓ కోడిగుడ్డు పెట్టి, ఇంత మినుప పిండి పెడితే చాలనుకున్న సర్కార్ల అమానవీయతను చీల్చిచెండాడింది. బాలింతలంటే సమాజానికి బలమ ని, కాన్పునకు పోయే స్త్రీని కంటికి రెప్పలా చూసుకుంటున్నది. నీళ్లుపోసుకున్న నాటినుంచి కాన్ప య్యి బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకు కేసిఆర్ కిట్ పథకం ద్వారా సకల సౌకర్యాల ను ఉచితంగా కల్పించడంతో పాటు.. వివిధ దశల్లో రూ.12 వేలు అందిస్తున్నది. కన్నతల్లికి, చంటిబిడ్డ కు అవసరమయ్యే రూ. 2150ల విలువ చేసే 16 రకాల వస్తువుల కిట్‌ను ఉచితంగా అందిస్తున్న ది. అంతేకాదు.. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలూ అందిస్తున్నది.
ramana

ఇవే కాదు, ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా సం క్షేమానికి పాల్పడుతున్నది. ప్రభుత్వం అంటే బడ్జెట్ లెక్కలు చూసుకొని ఖర్చుపెట్టే బ్యాంకు కాదు, ప్రజల కోసం పరితపించే ధర్మకర్త. ఎక్కడ ప్రజ లు సమస్యల్లో ఉన్నా.. ఖజానా లెక్కలు చూసుకోకుండా, బడ్జెట్ పేజీలు తిప్పుకోకుండా సమస్యను తీర్చే నాయకులు కొందరే ఉంటారు. అందు లో కేసీఆర్ నెం-1 అనడానికి ఎలాంటి సంశయం లేదు. కేసీఆర్ చూపిం చే ఈ ఉదాత్తమైన పరిపాలన శైలివల్లే తెలంగాణలోని సబ్బండ వర్గాలు, సమస్త కులాలు, మతాలు సంతోషంగా బతుకుతున్నయి. తెలంగాణ ప్రజానీకం ఈ పరిపాలన మరింత ఉన్నతంగా సాగాలని, మానవత్వం పరిఢవిల్లాలని, సమస్తజనులు సంతోషించే సుపరిపాలనకు కేసిఆర్ పాల న ఆది కావాలని ఆశిస్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలి, బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావాలి.

404
Tags

More News

VIRAL NEWS