ప్రజాపోరాటానికి ఊతమిచ్చిన పాట

Fri,October 13, 2017 01:27 AM

ప్రకృతి కవి, ప్రజాకవి, ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు 2017 సుద్దాల హన్మంతు జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. ఎస్.ఎస్.తేజ అధ్యక్షతన జరుగు ఈ సభలో ముఖ్య అతిథులుగా పల్లారాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ హాజరవుతారు. విశిష్ట అతిథులుగా ఆర్.నారాయణమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి హాజరవుతారు. స్వాగతోపన్యాసం ఉత్తేజ్, స్మారకోపన్యాసం కె.వి.యల్ చేస్తారు. స్మారక గీతం రచ్చ భారతి గానం చేస్తుండగా వందన సమర్పణ సీహెచ్ స్వప్న చేస్తారు. జి.సోమిరెడ్డిగారికి ప్రత్యేక సన్మానం ఉంటుంది. అందరికీ ఆహ్వానం.
- డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, వ్యవస్థాపక అధ్యక్షులు, సుద్దాల ఫౌండేషన్


తెలంగాణ నేల మీద మొలకెత్తిన పాటల్లో చైతన్యపు లయలున్నాయి. అణగారిన ప్రజల రక్తనాళాల్లో ఉత్తేజపు కణాలను సృష్టించే విద్వత్తున్నది. ఈ ప్రాంత ప్రజల పోరాటానికి ఊత మై నిలిచింది పాట. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం కోసం, అన్నిరకాల పోరాట రూపాల్లో సాహసోపేతంగా పాల్గొనడంలో పాటలు రగిలించిన ప్రేరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాటి దొరల అరాచకాలకు, నిజాం పాలన పీడనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాలు పరాధీనులైన ప్రజలను ఐక్యం చేశాయి. అందుకు నాయకుల ఉపన్యాసాలతో పాటుగా ప్రజా కళారూపాలు కూడా దోహ దం చేశాయి. ప్రజల నుంచి స్వీకరించిన కళారూపాల ద్వారా, వారి బాధలనే ఇతివృత్తంగా మల్చుకొని, సమరోత్సాహపు గేయాలను చైతన్యపు కాగడాలుగా జ్వలింపజేసిన ప్రజాకవి సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు 1910లో జన్మించారు. నిద్రాణమైయున్న తెలంగాణ ప్రజల్లో నూతన వెలుగుల కోసం నిప్పు కణికల్లాంటి గేయాల ను రాసిన సమరయోధుడాయన. జానపదులకు అర్థమయ్యేరీతిలో రాయడంలో, గానం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. సుద్దాల హనుమంతు పేరు వినగానే మనందరికి గుర్తుకొచ్చే పాట పల్లెటూరి పిల్లగాడ. బి.నర్సింగరావు నిర్మించిన మా భూమి చిత్రంలోనిది. ఆయన జీవితం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో మొదలైంది.

చిన్నతనం నుంచే తండ్రి గారి జానపద గాన వారసత్వాన్ని అందుకొ ని వ్యవసాయశాఖలో ఉద్యోగంలో చేరారు. నిజాం పాలనలో జరుగుతు న్న అరాచకాలను అడ్డుకోవడానికి ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తన పైఆధికారి నిలదీస్తే అప్పటికప్పుడు ఉద్యోగానికి రాజీనా మా చేసిన ధీరోదాత్తుడు. ఆ తర్వాత ఆంధ్ర మహాసభలో రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో చేరి, పూర్తిస్థాయి కమ్యూనిష్టు కార్యకర్తగా చివరి వర కు సాగిన ఉన్నతాశయుడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు. రాజాకార్ల దురాగతాలను ఎండగట్టడానికి పాటనే ఆయుధం చేసుకున్న కళాకారుడు. ఒక చేత్తో పెన్ను, మరోచేత్తో గన్ను పట్టుకున్న విప్లవకారుడు. సుద్దాల గ్రామంలో పార్టీ నిర్మాణంలో భాగంగా వచ్చి అక్కడే ఉండి ప్రజలతో కలిసి సమస్యలపై ఉద్యమించారు. ఆర్‌ఎంపీ డాక్టరుగా ప్రజల మనిషిగా జీవనం సాగించారు. జానకమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఆయన పెద్దకొడుకే అశోక్ తేజ. తెలంగాణ పాటకు జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చిన ముద్దుబిడ్డ. హనుమంతు ఆత్మకథను తన మాటల్లోనే వాయిస్‌రికార్డు చేశారు అశోక్ తేజ. అందులో ఒకచోట తన పని నేపథ్యం గూర్చి ఇలా చెప్తారు. పార్టీ నాకు కళారంగం అప్పగించింది.

జానపద కళారూపాలైన బుర్రకథ, బుడబుక్కల, గొల్లసుద్దులు, పిట్టలదొర మొదలగు ప్రక్రియలతో పోరాటాలకు ఆయత్తపరిచే సాహిత్యాన్ని రాశాను. నేను ఛందస్సు నేర్చుకోలేదు. వ్యాకరణం, నిఘంటువులతో కుస్తీపడితే వచ్చింది కాదు నా కవిత్వం. దౌర్జన్యం చూసిన ఆవేశంలో మండిన మనస్సు అందించిన వేగాత్మకమైన ఆవేశపు లయలో వెలుగుకు వచ్చినవి నా గేయాలు. వాటిలోనే..ప్రజా ప్రభూ త్వం సాధిస్తాం, దెబ్బకు దెబ్బ, రణభేరి మ్రోగుతుంది తెలుగోడ మొదలైనవి. హన్మంతు జీవితం మనందరికి ఆదర్శం. జీర్ణాశయంలో ఏర్పడిన క్యాన్సర్‌తో 1982 అక్టోబర్ 10న కన్నుమూశారు. ఆయన ఊపిరితో ఉం డగానే తండ్రిగురించి పాటరాసి ఆయనకు వినిపించారు అశోక్‌తేజ. అది..
goreti
పల్లెటూరి పిల్లగాని/పాలగుండె నిమిరి
కూలివాని కళ్లలోని/జాలి గాథ చదివి
ప్రజాస్వామ్యమిదాయని/ప్రశ్నించిన ప్రజాకవీ
ప్రభాత గీతాలు పాడ/ప్రభవించిన ప్రభారవి
నిన్నంతం చేయలేదు నాన్నా ఏమృత్యువు
నింగివోలే ప్రకృతివోలె చిరంజీవి నువ్వు..
అన్నారు అశోక్ తేజ.
హనుమంతు రచనలు: ఉద్యమ అవసరాల నిమిత్తం అశువుగా పాడటం వల్ల కావచ్చు కొన్ని పాటలను రికార్డు చేసుకోలేదు. దినదిన గండాలతో, అడవుల్లో, గుట్టల్లో పోలీసులకు చిక్కకుండా గెరిల్లా పోరాటంలో పాల్గొన్నందువల్ల రాసినవి భద్రపర్చుకోవడం సాధ్యం కాలేదేమో! తన చివరి కోరిక తన పాటలను ఒక పుస్తకం రూపంలో చూసుకోవాలని ఉండేది. జానపద పరిశోధకులు, ఆచార్య జయధీర్ తిరుమలరావు కొన్ని పాటలను సేకరించి ప్రచురించారు. అది అసమగ్రంగా ఉండటంతో సుద్దా ల హనుమంతు శతజయంతి వేడుకల సందర్భంగా పల్లెటూరి పిల్లగా డా.. పేరుతో ప్రజాకవి సుద్దాల హనుమంతు పాటలు కళారూపాలు పుస్తకాన్ని సుద్దాల ఫౌండేషన్ ద్వారా ప్రచురించారు. హనుమంతు రాసిన వందలాది పాటల్లో.. 33 పాటలు మాత్రమే దొరికాయి. నాటి సామాజిక, రాజకీయ,సాం స్కృతిక జీవనానికి ఆయన పాటలు ఆనవాళ్లుగా నిలిచాయి. సమాజంలో పీడన ఉన్నంత కాలం ఆయన పాటలు ప్రజల మధ్యన తిరుగాడుతూనే ఉంటాయి.

గోరటి వెంకన్నకు సుద్దాల జాతీయ పురస్కారం: పల్లె కన్నీరు పెడుతుం దో..,గల్లి చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది.., సంత మా ఊరి సంత.. లాంటి వందల గేయాలను రాసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజాకవి గోరటి వెంకన్న నేటి కాలపు ప్రజా వాగ్గేయకారుడు. మనకాలపు ప్రజాకవిగా గుర్తింపుపొందిన గొరటి వెంకన్నను 2017వ సంతవ్సరం సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం కోసం ఎంపిక చేయడం అభినందనీయం. సుద్దాల అవార్డును ఏర్పాటు చేయాలి: తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులకై రచనలు చేస్తూ, ఈ ప్రాంత దుష్టపాలకుల దుర్మార్గాన్ని ఎదిరించి న ప్రజాకవులు కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణ్ణమాచార్యుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అవార్డులను ఇస్తున్నట్టుగానే సుద్దాల హనుమంతు పేరిట కూడా అవార్డులను ఇవ్వాలి. సాహిత్యం జాతి సం పద. కవులు, రచయితలు, కళాకారులకు సముచితస్థానం కల్పించిన నాడే ఆ ప్రాంత విశిష్ఠత మనుగడలోకి వస్తుంది.
ravinder
(ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా)

477
Tags

More News

VIRAL NEWS