వ్యవస్థ లోపాలకు పిల్లలు బలి

Thu,October 12, 2017 01:15 AM

ఇప్పుడు అమలవుతున్న సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతిని సరిగా అర్థం చేసుకోలేని వారే డిటెన్షన్ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇది సరి గా వారికి అర్థమై ఉంటే, దాన్ని సరిగా అమలు చేయడానికి కావలసిన పరిస్థితుల ఏర్పాటుగురించి మాట్లాడేవారు. ఈ విధానం సరిగా అమలైతే పిల్లలు ఫెయిలవడం ఉండదు. అపుడు డిటెన్షన్ విధానం గురించి చర్చే ఉండదు. డిటెన్షన్ విధానం గురించి చర్చిస్తున్నామంటే సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతిని సరిగా అమలు చేయలేదని ఒప్పుకున్నట్లే.

ఒక ఇంగ్లీషు సామెత It takes a village to rear a child. ఒక పిల్లవాడి అర్థవంతమైన ఎదుగుదలకు సమా జం మొత్తం బాధ్యత వహించాలి అనేది స్థూలంగా దీని అర్థం. ఈ సామెత స్ఫూర్తి కోణంలోనే సామాజిక శాస్త్రవేత్త లు పిల్లలు చదువుల్లో ఫెయిల్ అవడాన్ని సమాజం మొత్తం వైఫల్యంగా అర్థం చేసుకుంటారు. పిల్లల మెదడులో అభ్యసనారీతులు శైశవం నుంచే రూపుదిద్దుకుంటాయి. స్కూల్లో చేరడానికి ముందు పిల్లలకుండే గృహ, సామాజిక వాతావరణాలు ఈ అభ్యసనారీతులను ప్రభావితం చేస్తాయి. స్కూల్లో చేరడానికి ముందు ఏర్పడిన ఈ అభ్యసనారీతులకు అనుకూల వాతావరణం స్కూల్లో లోపిస్తే పిల్లలు చదువులో వెనుకబడుతారు. ఇది కాగ్నిటివ్ సైన్స్‌లో నిష్ణాతుల అభిప్రాయం.

పిల్లలు నేర్చుకోలేదంటే నేర్పే విధానంలో లోపం ఉన్నట్లు, దానికి పరిష్కారం నేర్పే విధానాన్ని మార్చుకోవడం, దాన్ని మార్చుకునే వాతావరణాన్ని కల్పించకుండా పిల్లలను ఫెయిల్ చేయడం, పాత బోధనా పద్ధతికే మళ్లీమళ్లీ గురి చేయడం సరైంది కాదనేది బోధనాశాస్త్ర సారం. పిల్లలు పొరపాట్లు చేయడం ద్వారా, మళ్లీమళ్లీ ప్రయత్నాలు చేయడం ద్వారా చాలా సహజంగా నేర్చుకుంటారు. మనం పిల్లల్లో పొరపాట్లు చేయడం అసహజమనే భావనను కల్పిస్తూ, ఇతరులతో పోలుస్తూ, లక్ష్యాలను నిర్దేశిస్తూ నేర్పే ప్రయత్నం చేస్తాం. దీంతో ఏర్పడే భయం వల్ల పిల్లలు నేర్చుకోవడంలో వెనుకబడుతారని విద్యా మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు.

జీవితకాలం మొత్తంలో మూడేండ్ల లోపే మెదడు అభివృద్ధి అత్యంత వేగంగా ఉంటుంది. ఈ దశలో పోషకాహారం లోపిస్తే మెదడు అభివృద్ధి సన్నగిల్లి ఉద్దీపనలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది, దీంతో నేర్చుకోవడంలో వెనుకబడుతారని న్యూరో బయాలజిస్ట్‌లు చెబుతారు.

విద్యలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ విద్యా విధాన రూపకల్పనలో ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాయి. గతేడాది ఉత్తర భార త దేశానికి చెందిన ఆరు రాష్ర్టాల్లో యునిసెఫ్, దేశవ్యాప్తంగా NCERTలు నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలుపై సమీక్షా నివేదికలను విడి విడిగా ప్రచురించాయి. ఇవి ఈ విధాన అమలును మెరుగుపరిచే సూచనలను ఇచ్చాయి. కానీ ఈ విధానాన్ని తప్పుపట్టడం గాని, దాని రద్దును గానీ ప్రతిపాదించలేదు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు?ఎలా ఫెయిలవుతారు? అన్న విషయాలపై లోతైన అవగాహన లోపించడం వల్లనే డిటెన్ష న్ విధానాన్ని సమర్థిస్తున్నారు. చిన్నారులు ఇంటి భాషను ఎలా నేర్చుకుంటారనే విషయాన్ని పరిశీలిస్తే పిల్లలు నేర్చుకునే క్రమమేమిటో బోధపడుతుంది. పెద్దవాళ్లను అనుకరిస్తూ పదాలను తప్పుతప్పుగా పలుకుతూ నెమ్మదినెమ్మదిగా సరైన పదజాలాన్ని నేర్చుకుంటారు. చిన్నపిల్లలు పదాలను ఏ విధంగా పలికినా కూడా మురిసిపోతూ వారిని ఉత్సాహపెట్టే ఉద్దీపనలనే మనం అందిస్తాం, తప్పులను సవరించే ప్రయత్నం పెద్దగా చేయం. తప్పు పలుకకూడదని భయపెటం. దీంతో వాళ్ళు క్రమంగా, చాలా సహజంగా ఇంటి భాషను నేర్చుకుంటారు.అలాగే నడువడం, సైకి ల్ తొక్కడం ఆటల్లో ప్రావీణ్యం పొందడం క్రమంగా జరుగుతుంది. పిల్ల లు నిర్ణీత సమయంలోనే నేర్చుకోవాలని ఆశిస్తాం, అందరూ ఒకే వేగంతో నేర్చుకోవాలని ఆశిస్తాం, ఒకేరకమైన విషయాలను నేర్చుకోవాలని ఆశిస్తాం. ఇది ఆదేశాలను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ, విధేయులుగా తయారుచేసే లక్ష్యంతో పనిచేసే ఫ్యాక్టరీ నమూనా లక్షణం. ఈ నమూనా పిల్లల నేర్చుకునే ప్రక్రియను అసహజం చేస్తుంది, భారంగా మారుస్తుంది, ఫలితంగా విద్యా ప్రక్రియ నుంచి పిల్లలను దూరం చేస్తుంది.

మెదడు అభివృద్ధి, పని గురించిన అధ్యయనాలకు సంబంధించి గత దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ ది బ్రెయిన్‌గా వ్యాఖ్యానిస్తారు. ఆధునిక పరికరాల సహాయంతో మెదడు పనితీరు గురించి ఆవిష్కరించబడిన విషయాలు నేర్చుకునే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి సంబంధించి విప్లవాత్మకమైనవి. జన్మించే సమయానికి శిశువులో వంద బిలియన్ల కణాలను మెదడు కలిగి ఉంటుంది. నిష్క్రియాత్మకంగా విడివిడిగా సంబంధం లేకుండా ఉండే ఈ కణాలన్నీక్రమంగా శిశువు పొందే అనుభవాల ఆధారంగా అనుసంధానించబడుతాయి. మూడేండ్ల వయసుకల్లా వెయ్యి ట్రిలియన్ల అనుసంధానాలు జరుగుతాయని అంచనా. పిల్లల గృహ, సమీప పరిసరాల నుంచి సరైన అనుభవాలు పొందే అవకాశం లేనప్పుడు ఈ అభివృద్ధి మందగిస్తుంది. దాంతో స్కూల్ దశను విజయవంతంగా పూర్తిచేసుకోవడానికి సంబంధించిన కేంద్రీకరణ దృష్టి, అవధానం, స్మరణ సామర్థ్యా లలో లోపాలు ఏర్పడుతాయి. దాంతో పిల్లల అకడమిక్ వికాసం కుంటు పడుతుంది. ఇక మన స్కూళ్లలో అమలవుతున్న బోధనా విధానాలు పిల్ల ల పూర్వ అనుభవాల కేంద్రంగా, వారి స్వీయ పరిశీలనలతో, అనుభవాలతో జ్ఞాన నిర్మాణాన్ని కలిగించేదిగా గాక బట్టీ విధానాలతో విసుగును కలిగించేదిగా ఉండటం వల్ల పిల్లలు విఫలమవుతారు. ఈ పరిస్థితులను నివారించడానికే జాతీయ విద్యా ప్రణాళికా చట్టం-2005, నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని ప్రతిపాదించింది. ఈ స్ఫూర్తితోనే ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేంత వరకు డిటెన్షన్ విధానం ఉండకూడదనే నిర్దేశాలను విద్యాహక్కు చట్టం కలిగి ఉంది. ఇది మన దేశ విద్యారంగానికి సంబంధించి చాలా ఆలస్యంగా జరిగిన ఒక మంచి పరిణామం.
reddy
ఇప్పుడు అమలవుతున్న సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతిని సరిగా అర్థం చేసుకోలేని వారే డిటెన్షన్ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇది సరి గా వారికి అర్థమై ఉంటే, దాన్ని సరిగా అమలు చేయడానికి కావలసిన పరిస్థితుల ఏర్పాటుగురించి మాట్లాడేవారు. ఈ విధానం సరిగా అమలైతే పిల్లలు ఫెయిలవడం ఉండదు. అపుడు డిటెన్షన్ విధా నం గురించి చర్చే ఉండదు. డిటెన్షన్ విధానం గురించి చర్చిస్తున్నా మం టే సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతిని సరిగా అమలు చేయలేదని ఒప్పుకున్నట్లే. దానికి పరిష్కారం సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతిని సంస్కరించడం కావాలి తప్ప డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం కాదు. మిగతా పరిస్థితులను యథాతథంగా ఉంచి డిటెన్షన్ విధానాన్ని అమలు చేసినట్లయితే పిల్లల్లో ఇప్పుడున్న అకడమిక్ లోపం తగ్గుతుందనడానికి ఆధారాలేమీ లేవు. పిల్లలు ఫెయిలవడాన్ని వారి తల్లిదండ్రులు ఒక సామాజిక మచ్చగా భావిస్తారు. అందుకని అక్రమ మార్గాల అన్వేషణలో పడుతారు, పరీక్షల్లో విద్యార్థుల వైఫల్యాన్ని ఉపాధ్యాయుల పనితీరుకు ముడిపెడుతారు కాబట్టి, ఉపాధ్యాయులు కూడా అక్రమ విధానాలను ప్రోత్సహిస్తారు. వివిధ రాష్ర్టాల్లో స్కూల్ బోర్డ్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలే దీనికి ఉదాహరణ. పరీక్షల ముందు పరీక్షల కేంద్రంగా ప్రత్యేక శిక్షణలు, క్యాంపులు నిర్వహించే సంస్కృతి పెరుగుతుంది. ఇది బోధన అభ్యసన ప్రక్రియ రూపాన్ని మార్చి విపరిణామాలను కలిగిస్తుంది. పదవ తరగతి పరీక్షల విషయంలో ఇప్పుడు జరుగుతున్న తంతు తెలిసిందే. ఫిబ్రవరి వరకు పూర్తిచేయవలసిన సిలబస్ డిసెంబర్‌లోనే పూర్తిచేయడం, పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యాల కోసమే ప్రత్యేక తరగతులు, క్యాంపులు నిర్వహించబడడం, వీటివల్ల నేర్చుకోవలసిన విషయాలను సరైన విధానంలో, సమగ్రంగా నేర్చుకోలేకపోవడం జరుగుతుంది, మార్కుల, గ్రేడు ల జాబితా గొప్పగానే ఉంటుంది. కానీ తీవ్రమైన అకడమిక్ లోపంతో కనపడని కన్నాలను కలిగి ఉంటుంది.
(వ్యాసకర్త: SCIE-సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు)

562
Tags

More News

VIRAL NEWS