భారత సోషలిస్టు సమాజ నిర్మాత

Thu,October 12, 2017 01:14 AM

ఛత్రపతి సాహు మహారాజ్ లాంటి భారతీయ బీసీ రాజు ప్రజలకు ఓటుహక్కు ఉండాలని, ప్రజల పార్టీ ఉం డాలని ప్రయత్నిస్తున్న తరుణం. ఈ దేశాన్ని బ్రిటిష్ వారు వదిలిపోతే తన జాతి, ప్రజల పరిస్థితి ఏమిటని అంబేద్క ర్ పోరాడుతున్న కాలం. బ్రిటిష్‌వారు ఇంకా ఎక్కువ కాలం ఉంటే అధికారం తమ చేతిలో నుంచి శూద్రుల చేతి కి పోయే పరిస్థితి ఉందని అగ్రవర్ణాలు పోరాటం తీవ్రతరం చేశారు. 1947, ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుంచి అగ్రవర్ణాలకు ఈ దేశ అధికార బదిలీ జరిగింది. దక్షిణ భారతదేశాన పెరియా ర్ శూద్రుల హక్కుల గురించి పోరాడి అధికారంలోకి తీసుకొస్తే ఉత్తర భారతాన ఆ పాత్ర ను నిర్వహించిన వ్యక్తి రామ్ మనోహర్ లోహి యా. అగ్రవర్ణాల రాజకీయాలతో తాను విసిగిపోయానని ఒక ధైర్యాన్నిచ్చి , ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ లాంటి బీసీలు ఉత్తరాదిన అధికారంలోకి రావడానికి కారణం రామ్ మనోహర్ లోహి యా సోషలిస్ట్ సిద్ధాంత శిష్యులుగా పనిచేయడమే.
Ram_Manohar
రామ్ మనోహర్ లోహియా ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్ జిల్లా , ఫైజాబాద్‌లో 1910 మార్చి 23న వ్యాపార కుటుంబంలో జన్మించాడు. తల్లి చంద్రిమాదేవి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి హీరాలాల్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యుడు అయినందువల్ల నెహ్రూ, గాంధీల తో లోహియాకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా 1934 కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులో ఒకడిగా ఉంటూ జాతీయ స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూనే అంతర్జాతీయ విషయాలపై ఆసక్తి చూపారు. వివిధ సమస్యలపై పోరాడుతూ ఇండియాతో పాటు ఇంగ్లాండ్, అమెరికా, నేపాల్, పోర్చుగీసు దేశాల్లో కూడా జైలుశిక్ష అనుభవించారు. గాంధీ మరణాంతరం కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో 1950లో నరేంద్రదే వ్, జయప్రకాశ్ నారాయణ, అశోక్ మెహతాలతో కలిసి సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. ఆ మహనీయుడు చనిపోయి అర్ధ శతాబ్దికి చేరినా నేటి సమాజంలో లోహియా కలలుగన్న అత్యధిక , వీలైనంత సమానత్వ సోషలిస్టు సమాజ ఆశయాలను సాధిద్దామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం.

- వెంకటకిషన్ ఇట్యాల
(ఛత్రపతి సాహు మహారాజ్ సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు)
(నేడు రామ్ మనోహర్ లోహియా వర్ధంతి )

587
Tags

More News

VIRAL NEWS