పొరుగు దేశాలపై చైనా జల పెత్తనం

Wed,October 11, 2017 01:24 AM

చైనా యుద్ధంలోకి దిగకుండానే, ఇతర దేశాలను ఇబ్బందుల పాలు చేస్తున్నది. ఏదైనా దేశాన్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే, అక్కడి నుంచి వచ్చే సరుకులను అనధికారికంగా అడ్డుకుంటుంది. కీలకమైన సరుకులు తమ దేశం నుంచి ఎగుమతి కాకుండా నిలిపివేస్తుంది. పర్యాటకులకు ఇబ్బందులను కలిగిస్తుంది. చైనా జల వివరాలను అందించకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతున్నది. నీటి కొరత అధికంగా ఉండే ఆసియా దేశాలకు చైనా జల పెత్తనాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది.

చైనా ఎంతో కాలంగా మంచినీటిని వ్యూహాత్మక ఆయుధం గా వాడుతున్నది. తమ లక్ష్యాలను సాధించడానికి ఇటువంటి విధానాలను అనుసరించడంలో చైనా నాయకులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆసియాలోని ప్రతి అంతర్జాతీయ నదీ వ్యవస్థను చైనా తన గుప్పెట్లో పెట్టుకుంటున్నది. ఈ విధం గా జల ప్రవాహాలను నియంత్రిస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా ఇరుగుపొరుగు దేశాలను జల రంగ భౌగోళిక రాజకీయ క్రీడలోకి లాగుతున్నది. భారత్‌కు నీటి వివరాలు ఇవ్వకుండా దాచడం ఇందులో భాగమే. ఇరుగుపొరుగు దేశాల మీద జల పెత్తనాన్ని కొనసాగించడానికి చైనా ప్రయత్నిస్తున్నది.
dragan
చైనా హాన్ జాతికి చెందని టిబెట్ తదితర భూభాగాలను చైనా ఆక్రమించుకున్నది. చైనా భూభాగంలో అరువై శాతం ఈ విధంగా హాన్ జాతి కి చెందనివే. ఈ ఆక్రమణల ద్వారానే నదీ వ్యవస్థలపై మరే దేశానికి లేనం త పెత్తనం లభించింది. ఈ విధంగా లభించిన ఆధిపత్యం ద్వారా పొరుగు దేశాలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నది. నిరంతరం అంతర్జాతీయ నదులపై ఎగువ ప్రాంతాల్లో డ్యామ్‌లు నిర్మిస్తున్నది. ప్రపంచంలోని మిగ తా మొత్తం దేశాల కన్నా చైనాలోనే ఎక్కువ డ్యామ్‌లు ఉన్నాయి. ఇంకా ఇటువంటి డ్యామ్‌ల నిర్మాణం సాగుతూనే ఉన్నది. దీనివల్ల దిగువన ఉన్న దేశాలు చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తున్నది. ఉదాహరణకు దిగువ మెకాంగ్ నదీ బేసిన్ దేశాలైన నేపాల్, కజక్‌స్థాన్ చైనాపై ఆధారపడక తప్పదు. చైనా ఇప్పటి వరకు ఏ ఒక్క దేశంతో కూడా జల పంపిణీ ఒప్పందం చేసుకోలేదు. అయితే జల లభ్యత వివరాలను మాత్రం పరస్పరం అందిపుచ్చుకుంటుంది. దీనివల్ల దిగువ దేశాలు వరదల బారిన పడకుండా జాగ్రత్త పడుతాయి. కానీ ఇటీవల భారత్‌కు జల లభ్యత వివరాలు అందించలేదు. దీనివల్ల భారత్ వరదల బారిన పడకుండా ప్రజల కు ముందస్తు హెచ్చరికలు చేయలేని పరిస్థితి. ఇటీవల ఈశాన్య ప్రాంతం లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువే వానలు పడ్డాయి. అయినా అసోం తదితర రాష్ర్టాలు తీవ్ర స్థాయిలో బ్రహ్మపుత్ర నది వరదలకు గురయ్యాయి.

భారత్‌కు నీటి ప్రవాహ వివరాలు ఇవ్వకుండా దాచిపెట్టడం క్రూరత్వ మే కాకుండా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే. 1997లో ఆమోదం పొందిన ఐక్యరాజ్యసమితి జల ప్రవాహ ఒప్పందం ప్రతి దేశం దిగువ దేశాలకు జల వివరాలు ఇవ్వాలె. కానీ ఈ ఒప్పందంపై సంతకం చేయని మూడు దేశాలలో చైనా ఒకటి. అయితే భారత్‌కు, చైనాకు మధ్య ఐదేండ్ల ద్వైపాక్షిక ఒప్పందం ఒకటి వచ్చే ఏడాదితో ముగుస్తున్నది. ఈ ఒప్పందం ప్రకారం టిబెట్‌లోని మూడు పరిశీలనా కేంద్రాల నుంచి సేకరించిన బ్రహ్మపుత్ర నది వివరాలను ప్రతి రోజు భారత్‌కు అందించవల సి ఉంటుంది. మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు వరదలు వచ్చే కాలంలో ఈ వివరాలు అందించవలసి ఉంటుంది. 2015లో సట్లె జ్ నదీ జలాలపై కూడా ఇటువంటి ఒప్పందం కుదిరింది. చైనా వరదలు వచ్చిన తరువాత తమ జలాశయాల నుంచి విడుదల చేసే నీటి వివరాల ను అందించవలసి ఉంటుంది.

ఈ వరదల వల్ల అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌పదేశ్ రాష్ర్టాలు వరదలకు గురవుతాయి. సాధారణంగా దిగువ రాష్ర్టాలకు ఎగువ రాష్ర్టాలు నదీజలాల వివరాలను ఉచితంగా అందజేస్తా యి. కానీ చైనా ఈ వివరాలను అందజేయడానికి కొంత రొక్కం వసూలు చేస్తుంది. ఈ మేరకు రొక్కం ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. ఈ ఏడాది సొమ్మును పంపించింది కూడా. కానీ చైనా జల వివరాలు అందించనే లేదు. తమ పరిశీలనా కేంద్రాలను మరమ్మతు చేస్తున్నామని ఆలస్యంగా బదులు ఇచ్చింది. మనకే కాదు బంగ్లాదేశ్‌కు కూడా జల వివరాలను అందించలేదు. చైనా అధికార పత్రిక తాము వివరాలు అందించనందుకు ఏదో మొక్కుబడి వివరణను ప్రచురించింది. కానీ డోక్లామ్ గొడవ మూలంగానే భారత్‌కు వివరాలు అందించలేదనేది స్పష్టం.

chalani
భారత్ చైనా మధ్య డోక్లామ్ వివాదం జూన్‌లో తలెత్తింది. కానీ ఇంకా ముందే చైనా భారత్‌పై ఆగ్రహంతో ఉన్నది. తమ బెల్ట్ అండ్ రోడ్ ప్రతిపాదనకు భారత్ అంగీకరించడం లేదనేది చైనా ఆగ్రహానికి కారణం. ఈ ప్రతిపాదనపై మే నెల 14-15 తేదీలలో జరిగిన సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. దీంతో భారత్‌ను శిక్షించాలని భావించింది. ఇది భారత్ నయా వలస వాద ధోరణికి నిదర్శనం. చైనా రాజకీయ అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఉంటుంది. 1997లో బ్రిటన్ హాంగ్‌కాంగ్‌ను చైనాకు అప్పగించింది. ఈ సందర్భంగా హాంగ్‌కాంగ్‌లోని ఆర్థిక వ్యవస్థను కాపాడుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ షరతు గత ఇరువై ఏండ్లలో ప్రాధాన్యం కోల్పోయిందని అంటున్నది. చైనా యుద్ధంలోకి దిగకుండానే, ఇతర దేశాలను ఇబ్బందుల పాలు చేస్తున్నది. ఏదైనా దేశాన్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే, అక్కడి నుంచి వచ్చే సరుకులను అనధికారికంగా అడ్డుకుంటుంది. కీలకమైన సరుకులు తమ దేశం నుంచి ఎగుమతి కాకుండా నిలిపివేస్తుంది. పర్యాటకులకు ఇబ్బందులను కలిగిస్తుంది. చైనా జల వివరాలను అందించక పోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతున్నది. నీటి కొరత అధికంగా ఉండే ఆసియా దేశాలకు చైనా జల పెత్తనాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది.
(రచయిత: ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చిలో వ్యూహాత్మక అధ్యయనాల ఆచార్యుడు. బెర్లిన్‌లోని రాబర్ట్ బోష్ అకాడమీలోఅధ్యయనవేత్త)

397
Tags

More News

VIRAL NEWS