హార్వీ నేర్పుతున్న పాఠాలు

Tue,September 12, 2017 11:48 PM

హార్వీ పెను తుఫాను భారీ ఎత్తున జీవితాలను ముంచెత్తించింది. దాదాపు 180 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం గావించింది. టెక్సాస్‌లో వారం రోజుల పాటు ముంచెత్తిన వానలు, దక్షిణ ఫ్లోరిడాను అతలాకుతలం చేసిన తుఫాను అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

అమెరికాకు అన్నీ హంగులూ ఉన్నట్టే, లేనివీ ఉన్నాయి. రైటిస్టు పెద్దలకు ప్రభుత్వ విధి నిర్వహణకు సంబంధించి సమగ్ర దృష్టి లేదు. వారు విపరీతమైన విధానాలు అనుసరిస్తూ కొందరి ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడగలదు అన్నట్టు భిన్న ముఖాలను ప్రదర్శిస్తారు.

వాతావరణ మార్పు వల్ల ఈ తీవ్ర ప్రకృతి బీభత్సాలు జరిగాయనేది తెలిసిందే. వాతావరణ మార్పు అనేది పచ్చి అబద్ధమని నమ్మేవారు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. వాతావరణం వేడెక్కడానికి దోహదపడే శిలాజ ఇంధనాల ను ఎక్కువగా వాడేది అమెరికానే. వాతావరణ మార్పు వల్ల జరిగే ఉత్పాతాలు అమెరికాలోనే సంభవించడం విశేషం. ఫలానా ప్రకృతి ప్రకోపం వాతావరణంలో గ్రీన్‌హౌజ్ వాయువుల వల్లనే సంభవించిందని వేలెత్తి చూపించడం కష్టం. కానీ గ్రీన్‌హౌజ్ వాయువుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుందనీ, హార్వీ పెను తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నారు. గ్రీన్‌హౌజ్ వాయువుల వంటి మానవ కల్పిత కారకాల వల్ల వైపరీత్యాలు సంభవిస్తాయని కొన్నేండ్ల కిందటే వాతావరణ మార్పుపై ఏర్పాటు చేసిన భిన్న ప్రభుత్వాల కమిటీ తేల్చి చెప్పింది. ఎక్కువ వేడిమి ఉంటే, గాలిలో ఎక్కువ తేమ తయారవుతుంది. ఇది ఎక్కువ బాష్పీకరణకు దారి తీస్తుంది అని ప్రముఖ ఖగో ళ భౌతికవేత్త ఆడమ్ ఫ్రాంక్ నిక్కచ్చిగా చెప్పారు.

హార్వీ వైపరీత్యం సృష్టించిన బీభత్సం గురించి చెప్పుకోవలసింది ఉన్నది. గ్రీన్‌హౌజ్ ఉద్గారాలను వెలువరించడంలో హోస్టన్, టెక్సాస్ పాత్ర పెద్దగా ఏమీ లేకపోవచ్చు. కానీ వాతావరణ మార్పును అరికట్టే విధానాలను అమలు చేయించడంలో మరింత క్రియాశీల పాత్ర పోషించగలిగి ఉండేవి. తరచు ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నందు వల్ల వీటిని ఎదుర్కోవడానికి స్థానిక ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాల్సింది.

ఈ పెను తుఫాన్ వచ్చినప్పుడు సహాయ చర్యల విషయంలో, మరమ్మతులకు నిధుల విషయంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వ సహాయం కోసం చూడటం గమనార్హం. 2008 ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. ప్రభుత్వ సహాయ చర్యలు ఎందుకంటూ ప్రశ్నించే అమెరికాలోనే ఇది జరుగుతున్నది. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ ఇంతకాలం నియోలిబరల్ విధానాలను బోధించింది. ప్రభుత్వ వ్యవస్థను కుదించాలని అన్నది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే చట్టా లు ఉండవద్దన్నది. మరి ఇప్పుడు ఈ సంస్థలన్నీ ప్రభుత్వ సహాయం కావాలంటున్నాయి. ఇటువంటి ఉదంతాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవలసి ఉన్నది. సమాజానికి అవసరమైన భద్రతను మార్కెట్లు తమకు తాముగా సమకూర్చలేవు. మార్కెట్లు విఫలమైనప్పుడు, సామూహిక కృషి తప్పనిసరి అవుతుంది.

ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు ఎట్లాగైతే వ్యవహరించారో, అదే విధంగా వాతావరణ మార్పు వల్ల కలిగే వైపరీత్యాలను ఎదుర్కొనడాని కి కూడా సమిష్టిగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. భవనాలను, ఇతర మౌలిక సదుపాయాలను వైపరీత్యాలకు తట్టుకునే విధంగా నిర్మించుకోవాలె. వరదలు, తుఫానులు వస్తే మునిగిపోయే ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. తుఫానుల ప్రభావాన్ని తట్టుకునే పర్యావరణాన్ని దెబ్బతినకుండా కాపాడుకోవాలె. ప్రత్యేకించి తడినేలలను కాపాడుకోవాలె. ఇటీవల హోస్టన్‌లో ప్రమాదకర రసాయనాలు వెలువడటం ఆందోళనకు దారితీసింది. ప్రకృతి బీభత్సాలను దృష్టిలో పెట్టుకునే నిర్మాణాలు చేపడితే ఇటువంటివి సంభవించవు. ప్రమాదాలు ముంచెత్తినప్పుడు ప్రజలను తరలించడానికి ఇతర విధాలా తగు ఏర్పాట్లు ఉండా లె. తరలింపు ప్రదేశాలు కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలె.

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలనే కోణంలోనే- పెట్టుబడులు అనుమతించాలె. ఇందుకోసం కఠిన నియంత్రణలు ఉండాలె. టెక్సాస్ లో ఇతరత్రా ఎటువంటి రాజకీయ సంస్కృతి ఉన్నప్పటికీ, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఈ విధానాలు అమలు కావాలె. కఠిన నియంత్రణలు ఉంటే తప్ప వ్యక్తులు, సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకోవు. ఏమైనా నష్టం జరిగితే వాటిని భరించేది తాము కాదని వారికి తెలుసు. ప్రభుత్వం లేదా ఇతరులు మూల్యం చెల్లిస్తారు కనుక తమకేమీ పట్టన ట్టు వ్యవహరిస్తారు. సమాజానికి నష్టం జరుగుతుందనే ఆవేదన ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టేవారికి ఉండదు. పర్యావరణ పరిరక్షణతో సహా ప్రణాళికా విధానాలు, నియంత్రణలు కట్టుదిట్టంగా అమలు కావాలె. ఈ ముందు జాగ్రత్తలు లేకపోతే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, వరదలు ముంచెత్తి దయనీయమైన పరిస్థితులు ఏర్పడుతాయి. వైపరీత్య నిర్వహణా ప్రణాళిక, తగు నిధులు లేకపోతే, ప్రతి నగరం హోస్టన్ మాదిరిగానే విపత్తు వచ్చినప్పుడు అయోమయంలో పడిపోతుంది. ప్రజలను తరలించకపోతే ప్రకృతి బీభత్సం వల్ల మరణిస్తారు. తరలిద్దామనుకుంటే, అందుకు ముందస్తు ఏర్పాట్లు లేవు కనుక తరలింపు గందరగోళంగా సాగి కూడా ప్రజలు మరణిస్తారు. ట్రాఫిక్ స్తంభించిపోయి, జనం బయటపడటమే సాధ్యం కాదు.

అధ్యక్షుడు ట్రంప్, ఆయన రిపబ్లికన్ పార్టీ అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక సిద్ధాంతం వల్ల అమెరికా, ప్రపంచ దేశాలు భారీ మూల్యం చెల్లించవలసి వస్తున్నది. అమెరికా వెలువరుస్తున్న భారీ గ్రీన్‌హౌజ్ ఉద్గారాలకు ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించవలసి వస్తున్నది. ఇప్పటికీ, తలసరి గ్రీన్‌హౌజ్ ఉద్గారాలలో అమెరికా అగ్రస్థానంలో ఉన్నది. దీనికి ఇప్పుడు అమెరికా కూడా మూల్యం చెల్లిస్తున్నది. గ్రీన్‌హౌజ్ ఉద్గారాల వల్ల ప్రపంచానికి వచ్చే ప్రమాదాన్ని అన్ని దేశాలూ గుర్తించాయి. పాఠా లు నేర్చుకున్నాయి. హైతి, ఈక్వెడార్ వంటి పేద దేశాలు కూడా ఎంతో వ్యయప్రయాసలతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దేశాలూ, మళ్ళా ఎంతో వ్యయమైనప్పటికీ, తగు రీతిలో నిర్మాణాలు చేపడుతూ వైపరీత్యాలను ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నాయి.

అమెరికా ఇప్పటివరకు ఎన్నో వైపరీత్యాలను చవి చూసింది. 2005 లో కత్రినా పెను తుఫాను న్యూ ఆర్లియాన్స్‌లో విధ్వంసాన్ని సృష్టించిం ది. 2012లో సాండీ వల్ల న్యూయార్క్ సిటీ మూతపడ్డది. ఇప్పుడు టెక్సాస్‌లో హార్వీ భీకర దాడి అనుభవిస్తూనే ఉన్నాం. ఫ్లోరిడాలో ఇర్మా బీభత్సం కూడా అనుభవిస్తున్నాం. పేద దేశాలతో పోలిస్తే అమెరికాకు ఎన్నో అనుకూల అంశాలున్నాయి. వైపరీత్యాల నిర్వహణలో అమెరికా ఎంతో సమర్థతతో వ్యవహరించవచ్చు. అమెరికాకు వనరులున్నాయి. ఈ సంక్లిష్ట ఘటనలను, వాటి పరిణామాలను విశ్లేషించే నైపుణ్యాలు ఉన్నాయి. ఈ విశ్లేషణల నుంచి సూత్రీకరణలను రూపొందించి, పెట్టుబడుల పథకాలపై నియంత్రణలను విధించవచ్చు. ఈ విధంగా ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడవచ్చు.
josaf

అమెరికాకు అన్నీ హంగులూ ఉన్నట్టే, లేనివీ ఉన్నాయి. రైటిస్టు పెద్దలకు ప్రభుత్వ విధి నిర్వహణకు సంబంధించి సమగ్ర దృష్టి లేదు. వారు విపరీతమైన విధానాలు అనుసరిస్తూ కొందరి ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడగలదు అన్నట్టు భిన్న ముఖాలను ప్రదర్శిస్తారు. ఏదైనా సంక్షోభం రాకముందు ప్రభుత్వ నియంత్రణలను వ్యతిరేకిస్తారు. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రణాళికలు ఉం డకూడదంటారు. సంక్షోభం రాగానే తమకు నష్టం జరిగిందంటూ ప్రభు త్వం నుంచి పరిహారంగా బిలియన్ల డాలర్లు పరిహారంగా పొందుతారు. నిజానికి వారు తమకు నష్టాలు జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోగలిగిన స్థోమత గలవారే.అమెరికా, ఇతర దేశాలు హార్వీ పెను తుఫాన్ నుంచి పాఠాలు నేర్చుకుంటాయనీ, వీరు మారడానికి మరిన్ని ప్రకృతి వైపరీత్యాల అవసరం ఉండదని ఆశిద్దాం.
(వ్యాసకర్త: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత)

894
Tags

More News

VIRAL NEWS