వైతాళికులకు అక్షరాంజలి

Tue,September 12, 2017 12:10 AM

సంపాదకులు ఎంతో శ్రమకోర్చి పలు వ్యాసాలూ సేకరించినప్పటికీ మరికొందరు అట్లాగే మిగిలిపోయారు. సుప్రసిద్ధ మేధావి ఎం.ఎన్.జయసూర్య, కమ్యూనిస్ట్ యోధుడు రాజ్ బహదూర్‌గౌర్ తత్త్వశాస్త్ర ఆచార్యుడు ఆలంఖుమ్ద్ మీర్, సుప్రసిద్ధ సంస్కృత పండితులు భాష్యం విజయసారథి, ఇట్లా మరెందరో పెద్దలు. వీరందరి పరిచయ వ్యాసాలతో మరొక సంకలనం ప్రచురిస్తే బాగుంటుంది.

దశాబ్దాల కల నెరవేరి స్వరాష్ట్రం సాకారమై మూడేండ్లు దాటింది. ఈ స్వల్ప కాలవ్యవధిలో మనం ఆర్థిక, సామాజిక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాం. వివిధ రంగాల్లో రాష్ట్రం ఎగురవేస్తున్న వికాస కేతనం జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసా పాత్రమవుతున్నది. అభివృద్ధికి ఆదర్శప్రాయమవుతున్నది. భవిష్య భారత నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం కీలక భూమిక పోషించడం తథ్యం. శతాబ్దాల వైభవాన్ని తలుచుకుంటూ భవితకు బంగారుబాటలు వేసుకుంటున్న తెలంగాణ సాంస్కృతిక రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఇచ్చే అవార్డులతో పాటు కాళోజీ, దాశరథి వంటి మహనీయుల పేరిట పురస్కారాలను ప్రభుత్వం ఇస్తు న్నది. ప్రభుత్వం అందిస్తున్న స్ఫూర్తితో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థలు కూడా తమవంతు కృషిచేస్తున్నాయి. సాహిత్యరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు ప్రచురణ సంస్థలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ బాటలోనే తెలంగాణకు నిరుపమానమైన సేవలందించిన 130 మంది మహనీయు ల జీవన రేఖలను మూడు సంపుటాల ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు నీల్ కమల్ పబ్లిషర్స్ తెలంగాణ వైతాళికులు పేరిట ప్రశంసనీయమైన ప్రయత్నం చేసింది. జననేతలు, అక్షరమూర్తులు, ప్రతిభామూర్తులు పేర్ల తో గుమ్మనగారి బాలశ్రీనివాసమూర్తి సంపాదకత్వంలో ఈ సంపుటాలు వచ్చాయి. తెలంగాణ వైతాళికులు మూడు సంపుటాలు వేయి పుటలకు పైగా ఉన్నాయి.

తెలంగాణ చరిత్రలో 19, 20 శతాబ్దాల్లో తొలి అర్ధ భాగం కీలకమైన వి. ఈ కాలంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమదైన ముద్రతో సమాజాన్ని ప్రభావితం చేశారు. అయితే దురదృష్టవశాత్తు విశాలాంధ్ర ఏర్పడి న తరువాత వీరి పేర్లు వినిపించకుండాపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆ మహనీయుల గురించిన సాధికారిక పరిచయం అందని ద్రాక్షగానే మారింది. తెలంగాణ వైతాళికులు మూడు సంపుటాలు ఆ లోటు ను తీర్చాయి.

మొదటి సంపుటం జననేతలు- ఇందులో రాజ్ బహదూర్ వెంకట్రా మారెడ్డి మొదలుకొని నేటి వయోవృద్ధ స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్యగుప్త వరకు యాభై మంది పరిచయ వ్యాసాలున్నాయి. ఉన్నతస్థాయి పోలీసు అధికారిగా ఉంటూ తెలంగాణ సమాజానికి అత్యుత్తమ సహాయాన్ని అందించినవారు రాజ్‌బహదూర్ వెంకట్రామారెడ్డి. ఆర్యసమాజం ద్వారా సంఘ సంస్కరణ బీజాలు నాటిన కేశవరావు కొరట్కర్, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, దళిత ఉద్యమ కర్తలు బి.ఎస్.వెంకట్రావు , భాగ్యరెడ్డివర్మ, అరిగె రామస్వామి, మహిళా నాయకత్వంలో ముందు వరుసలో నిలిచిన సంగెం లక్ష్మీబాయి, సదాల క్ష్మి, ఉద్యమ జీవితాన్ని నిర్వహించిన రావి, బద్ధం, ఆరుట్ల, మగ్దూం, భీమిరెడ్డి, విసునూర్ దేశ్‌ముఖులను ఎదురించి నిలిచిన చాకలి ఐలమ్మ వంటి వారితో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ, బొజ్జం నర్సింలు, బత్తిని మొగిలయ్యగౌడ్, బొమ్మగాని ధర్మభిక్షం, వంటివారిని గురించిన వ్యాసా లూ ఇందులో ఉన్నాయి. ఇటీవలి తరంలోని ఎం.ఎస్.రాజలింగం, పీవీ నరసింహారావు, కోదాటి నారాయణరావు, జి.వెంకటస్వామి, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కె.జయశంకర్‌ల పరిచయ వ్యాసాలున్నాయి. ఎల్. ఎన్.గుప్త, జే.ఎస్.మెల్కోటే, వినాయకరావు విద్యాలంకార్, పల్లెర్ల హనుమంతరావు వంటి మహనీయులను మరిచిపోకుండా పరిచయం చేశారు. తెలంగాణ ప్రాంతంలో జన్మించకపోయినా తమ యావత్ జీవితాన్ని ఈ ప్రాంతంలోనే ధారపోసిన ఉన్నవ వెంకట్రామ య్య వంటి వారిని ఇం దులో చేర్చడం సముచితంగా ఉన్నది. ఈ సంపుటానికి పాత్రికేయ భీష్ము లు పొత్తూరి వెంకటేశ్వరరావు నవ్యోద్యాన స్వాదుఫలం పేరుతో చక్కటి పీఠికను అందించారు.

తెలంగాణ మాగాణంలో విస్తారమైన సాహిత్యసంపద ఆవిర్భవించిం ది. ఈ పరంపర పాల్కుర్కి సోమనాథునితో ఆరంభమై అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనాకాలం లో తెలుగు భాషా, సాహిత్యాలకు అంతులేని అవరోధాలు ఎదురయ్యా యి. అయినా తెలంగాణ సాహితీవేత్తలు ఈ గండాలను దాటుకొని భాషా సాహిత్యాలను పరిరక్షించుకున్నారు. సాంస్కృతిక పోరాటాలతో తమ సాహిత్యాన్ని పరిపుష్టం చేసుకున్నారు. ఇటువంటి సాహితీమూర్తుల పరిచయ సంకలనమే అక్షరమూర్తులు. ఇందులో విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు లక్ష్మణరావుతో ఆరంభమై స్వర్ణకమలాలు రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవితో ముగుస్తుంది. మహా పరిశోధకులు ఆదిరాజు, తెలంగాణ వైతాళికులు సురవరం, యక్షగాన కవి చేర్విరాల భాగయ్య, కాపుబిడ్డ కావ్యకర్త గంగుల శాయిరెడ్డి, కాళోజీ, పీవీల వంటి ప్రసిద్ధులు, కవితా గురువు గార్లపాటి రాఘవరెడ్డి, ప్రజల మనిషి వట్టికోట, తెలంగా ణ తొలి శతావధాని కృష్ణమాచార్యులు ఈ వ్యాస సంకలనంలో పాత తరానికి ప్రతినిధులు. ఆచార్య బిరుదురాజు, పొట్లపల్లి, వానమామలై, దాశరథి సోదరులు, కాళోజీ రామేశ్వరరావు, గడియారం, హీరాలాల్ మోరి యా, సినారె, సదాశివ, కేశవపంతుల ఇట్లా ప్రతిభావంతులైన సాహితీమూర్తులను అక్షరమూర్తులు పేరు పరిచయం చేశారు. అవధాన రంగంలో సుప్రసిద్ధులైన గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, చేరా, కపిలవాయి లింగమూ ర్తి, బోయ జంగయ్య, అంపశయ్య నవీన్, రవ్వాశ్రీహరి, ముదిగొండ వీరభద్రయ్య వంటి సమకాలీనుల పరిచయాలు కూడా ఉన్నాయి.
harinath
19వ శతాబ్ది మధ్యకాలంలోనే తన ఇంటిని స్వచ్ఛందస్థాయిలో గ్రం థాలయంగా మార్చిన ముదిగొండ శంకరారాధ్యులతో మొదలైన ఈ వ్యాస పరంపర ప్రసిద్ధ పాత్రికేయులు వానమామలై వరదాచార్యులు పరిచయంతో ముగిసింది. ఇందులో తెలుగులో తొలి సినీ గేయకర్త చందాల కేశవదాసు, బహుముఖ ప్రజ్ఞావంతులు ఒద్దిరాజు సోదరులు, ప్రముఖ విద్వాంసులు గుండేరావు హర్కారే, విద్యాదాత చందా కాంత య్య, చిందు యక్షగాన కళాకారిణి ఎల్లమ్మ, విద్యావేత్త టి.ఎస్.నారాయ ణ, క్రికెట్ క్రీడాకారుడు ఎం,ఎల్.జయసింహ, అంతర్జాతీయ చిత్రకారు డు కాపు రాజయ్య, నేరెళ్ళ వేణుమాధవ్, చుక్క సత్తయ్య, వంటి మహనీయుల పరిచయ వ్యాసాలున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో సద్గురు శివానందమూర్తి విశిష్టతను ఒక వ్యాసంలో వివరించారు.

ఈ సంకలనాల వ్యాస రచనలో అరువై మంది వ్యాసకర్తలు చేయూత నందించారు. విశ్వవిద్యాలయ ఆచార్యులు మొదలుకొని పరిశోధక విద్యార్థుల వరకు ఇందులో వ్యాసరచన చేశారు. ఇదే పరంపరలో మరొక సంకలనం కూడా వెలువడితే బాగుంటుంది. సంపాదకులు ఎంతో శ్రమకోర్చి పలు వ్యాసాలూ సేకరించినప్పటికీ మరికొందరు అట్లాగే మిగిలిపోయా రు. సుప్రసిద్ధ మేధావి ఎం.ఎన్.జయసూర్య, కమ్యూనిస్ట్ యోధుడు రాజ్ బహదూర్ గౌర్ తత్త్వశాస్త్ర ఆచార్యుడు ఆలంఖుమ్ద్ మీర్, సుప్రసిద్ధ సం స్కృత పండితులు భాష్యం విజయసారథి, ఇట్లా మరెందరో పెద్దలు. వీరందరి పరిచయ వ్యాసాలతో మరొక సంకలనం ప్రచురిస్తే బాగుంటుం ది. ఇదే తరహాలో తెలంగాణ నలుమూలల్లోని ఉత్సాహవంతులైన భాషాసేవకులు తమ ప్రస్థానం ప్రారంభించడానికి ఈ సంకలనాలు స్ఫూర్తిని స్తాయి. తెలంగాణ వికాసానికి ఇదొక ముందడుగు.

2090
Tags

More News

VIRAL NEWS