సుప్రీం తీర్పుల్లో భిన్నకోణాలు

Sat,September 9, 2017 11:21 PM

బాధిత స్త్రీ ఎప్పటికీ బాధితురాలుగానే ఉండా లా? ఆమె కేసు వేసిన నాటి నుంచి రిజిష్ట్రర్ కాకుం డా, ఎటువంటి అరెస్టు చేయకుండా నెలరోజుల పాటు ఎదురుచూడాలా? బాధిత స్త్రీ తన వైవాహిక జీవితం విషయమై పోలీస్‌స్టేషన్‌కు లేదా కోర్టుకు వచ్చిందంటే, అంతకుముందు వారి కుటుంబంలో లేదా పెద్ద మనుషుల ద్వారా లేదా మహిళా సంఘా ల ద్వారా ఎన్నో రాజీ చర్చలు జరిగి ఉంటాయి. ఏది ఏమైనా తీర్పులన్నీ శాశ్వతం కావు. కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. రాజేశ్‌శర్మ కేసులోని తీర్పు ఏవిధంగాఉపయోగపడుతుందో వేచి చూద్దాం.

భారత శిక్షా స్మృతిలో 498-ఏ సెక్షన్ ఒక మంచి ఉద్దేశంతో చేర్చినప్పటికీ, చాలామంది వివాహితలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. భర్త, అత్తమామలకు దూరంగా లేదా ఇతర ప్రాంతాల్లో నివసించే ఆడపడుచు, ఆడపడుచు భర్త, మరిది, మరిది భార్య ఇలాంటి వారిపై కూడా నిందారోపణలు చేసి గృహహింస కేసుల్లో ఫిర్యాదు ఇస్తున్నారు. దీంతో పోలీసులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించకుండా, ఫిర్యాదులో పేర్కొన్న అందరిని అరెస్టు చేస్తున్నారని అభియోగం. దీనివల్ల గృహహింసకు సంబం ధంలేని వారు జైలు పాలవుతున్నారు. కొన్నిసార్లు చిన్న మనస్పర్థలకు కూడా భార్య అహం చేత కోర్టులలో కేసు వేయడం లేదా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం, ఆ తదుపరి భర్తను, హింసకు సంబంధంలేని భర్త సంబంధీకులను అరెస్టు చేయడం మూలాన, వారి వైవాహిక జీవితానికి ముప్పు వస్తున్నది. వారి వైవాహిక జీవిత పునరుద్ధరణ అసాధ్యం కావచ్చు. తద్వారా వారి సంతానం నిరాదరణకు గురయ్యే అవకాశం ఉన్నది.
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో కేసుల్లో చాలా మంది స్త్రీలు 498-ఏ సెక్షన్లను దుర్వినియోగపరుస్తున్నారని ఆందోళన చెందుతూ తీర్పు లు ఇవ్వటం, పోలీసు దర్యాప్తు అధికారులకు, దిగువ న్యాయస్థానాల్లో పనిచేసే మెజిస్ట్రేట్లకు, తగు సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం చందర్‌భాను కేసులో తీర్పు ఇస్తూ పోలీసు వారికి కొన్ని ఉత్తర్వులను ఇచ్చింది. 498-ఏ సెక్షన్ కింద, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ముందస్తు అనుమతి లేకుండా కేసు రిజిష్ట్రర్ చేయరా దు. ఆయన ముందస్తు అనుమతితో, పూర్తి దర్యాప్తు అనంతరమే నిందితులను అరెస్టు చేయాలి. కేసును రిజిష్ట్రర్ చేయడానికి ముందుగా ఇరువర్గాల వారి రాజీకి ప్రయత్నం చేయాలి. దానివల్ల కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకుండా ఉంటుంది.

2017 జూలై ఏడవ తేదీన సుప్రీంకోర్టు ఇరువురు న్యాయమూర్తుల ధర్మాసనం రాజేశ్‌శర్మ- స్టేట్ ఆఫ్ యూపీ కేసులో జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాలను ఉటంకి స్తూ, 498-ఏ సెక్షన్‌ను దుర్వినియోగపరుస్తున్నారని ఆందోళన చెందింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన చందర్‌భాను తీర్పు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్నేశ్ కుమార్- స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులను కూడా ప్రస్తావించింది. రాజేశ్‌శర్మ కేసు తీర్పులోని ముఖ్య ఉత్తర్వులు ఏమిటంటే ప్రతి జిల్లా జడ్జి తన పరిధిలో కుటుంబ సంక్షేమ కమిటీని ముగ్గురు సభ్యుల తో ఏర్పాటుచేయాలి. ఆ కమిటీలో పారా లీగల్ వలంటీర్లు, విశ్రాంత ఉద్యోగి, సర్వీసు లో ఉన్నటువంటి వారి భార్యలు, జిల్లా జడ్జి దృష్టిలో తగినటువంటి వారిని నియమించవచ్చు. బాధిత స్త్రీ ఫిర్యాదును పోలీసు అధికారి లేదా న్యాయాధికారి కమిటీకి పంపించాలి. ఆ కమిటీ సభ్యులు ఇరువర్గాలను ప్రత్యక్షంగా లేదా ఫోను ద్వారా విచారించి, ఆ ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేదా అందులోని పేర్కొన్న వారందరిపైన కేసు రిజిష్ట్రర్ చేయవలసి ఉంటుందా అనేది తెలియపరుస్తూ పోలీసు అధికారికి లేదా మెజిస్ట్రేట్‌కు నెలలోపు నివేదిక అందించవలసి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు, మెజిస్ట్రేట్ కేసు రిజిష్ట్రర్ చేస్తారు. ఫిర్యాదుకు సంబంధం లేని వారిని కేసు నుంచి తొలిగి స్తారు. ఆ కమిటీలోని ముగ్గురు సభ్యులకు గౌరవ వేతనం ఉంటుంది. కమిటీ రిపోర్టు వచ్చేవరకు అరెస్టులు చేయకూడదు. కమిటీ ముందు ఇరువర్గాలు అవగాహనకు వస్తే, జిల్లా జడ్జి ఆ కేసును ముగించవచ్చు. అయితే ఈ ఉత్తర్వులు శారీరక హింస లేదా మరణం సంబంధి త కేసులకు వర్తించవు.

సుప్రీంకోర్టు గతంలో ఆర్నేశ్ కుమార్-స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో అరెస్టుపై చాలా కఠిన ఉత్తర్వులను జారీచేసింది. ఆ తీర్పు 498-ఏ సెక్షన్‌కు సంబంధించిన అరెస్టులకు మాత్రమే కాకుండా ఇతరత్రా కేసులకు కూడా వర్తిస్తుంది. ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను నేర విచారణ ప్రక్రియ స్మృతి 41 సెక్షన్‌ను అనుగుణంగా మాత్రమే అరెస్టు చేయాలె. ఏ పోలీ సు అధికారి అయినా అరెస్టుకు ముందు రెండు వారాల గడువుతో, తన ముందు దర్యాప్తునకు హాజరుకావాలని నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సంపూర్ణ దర్యాప్తు తర్వాతనే అరెస్టు చేయాలె. ఏ పోలీసు అధికారి అయినా 41 సెక్షన్‌కు అనుగుణంగా నడుచుకోనట్లయితే అతనిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడ మే కాకుండా న్యాయధిక్కారం చేసినవాడు అవుతా డు. మెజిస్ట్రేట్ ఏ కారణాలు లేకుండా ముద్దాయిని రిమాండుకు పంపితే హైకోర్టు శాఖాపరమైన చర్యల ను తీసుకోవచ్చు. అరెస్టుకు సంబంధించి ఇంత కఠి న ఆంక్షలు ఉండగా, మరోసారి రాజేశ్ శర్మ కేసు లో సుప్రీంకోర్టు కుటుంబ సంక్షేమ కమిటీలను నియమించాలనీ, అరెస్టు చేపట్టరాదంటూ పేర్కొన్న ది. ఈ తీర్పు ప్రకారం జిల్లా కేంద్రాల్లో ముగ్గురు సభ్యులతో ఒకటి, రెండు కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి గౌరవవేతనంగా ప్రతి ఒక్క ఫిర్యాదుకు రూ. 500 నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అంటే ముగ్గు రు సభ్యు లు ఒకరోజు 10 ఫిర్యాదులను విచారించినట్లయితే మొత్తంగా రూ. 15వేలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిధుల నుంచి ఇవ్వాలి. వారికి గౌరవ వేత నం ఇస్తున్నందు వల్లనేమో ఏ విధమైన సిబ్బంది, కంప్యూటర్, స్టేషనరీ ఏర్పాటు లేదు. ఇరు వర్గాల వారికి నోటీసులు ఇచ్చి వారిని ఎక్కడ విచారించాలి అనే దానిపై కమిటీలకు సూచనలు తీర్పు లో లేవు. కమిటీకి ఫిర్యాదులు పంపవలసిన విధా నం, కమిటీ తమ రిపోర్టును సంబంధిత పోలీస్ అధికారికి, మెజిస్ట్రేట్‌కు పంపాల్సిన విధానం పేర్కోలేదు. ఈ కమిటీ నెల రోజుల్లోగా రిపోర్టును ఇవ్వనట్లయితే సంబంధి త పోలీసు అధికారి లేదా కోర్టు ఏ విధంగా ముం దుకుపోవాలో తెలియదు. కమిటీ ముందు సంబంధిత వర్గాలు విచారణకు హాజరుకానట్లయితే, కమి టీ చేయవలసిన కార్యక్రమం ఏమిటో తెలియదు.

కమిటీ సభ్యులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారనేది ఒక ప్రశ్న. వారికి ఎటువంటి నియమ నిబంధనలు విధించలేదు. వారు బాధిత స్త్రీ లేదా నిందితునితో కుమ్మక్కై దుర్వినియోగపరిచే అవకాశం లేదనలేం. ఇరువర్గాల వారు కమిటీ సభ్యులతో ఏ పాటి హుందాగా ప్రవర్తిస్తారనేది సందేహాస్పదం. జవాబుదారీతనం లేకుండా కమిటీ సభ్యులు ఏ మేరకు ఇరువర్గాల వారిని సంతృప్తిపరుచగలరు. కమిటీ రిపోర్టు ఇచ్చేవరకు నిందితులను అరెస్టు చేయ కూడ దు. కానీ బాధిత స్త్రీ, ఆమె కుటుంబీకు లు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా అరెస్టు చేయలేదనే విషయా న్ని జీర్ణించుకోవడం కష్టం.

జిల్లా కేంద్రానికి సంబంధించి కుటుంబ సంక్షేమ కమిటీలను నియమించడం బాగుండవచ్చు. ఒకవేళ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో లేదా మెజిస్ట్రేట్ కోర్టులలో 498-ఏ సెక్షన్ కింద ఫిర్యాదు వచ్చినట్లయితే వాటిని కూడా జిల్లా కేంద్రంలోని సంక్షేమ కమిటీలకు పంపించాలనే విష యం స్పష్టం కాలేదు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి పంపించాలంటే దానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు.

radha
సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం లలితాకుమారి-స్టేట్ ఆఫ్ యూపీ కేసులోని తీర్పుని ఉటంకిస్తూ ఏదైనా కాగ్నిజబుల్ నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినట్లయితే పోలీసు వారు వెంటనే దానిని రిజిష్ట్రర్ చేయాలని పేర్కొన్నది. ఆ తీర్పు సెక్షన్154 సీఆర్‌పీసీకి అనుగుణంగా ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం రాజేశ్‌శర్మ కేసులో ఇరువురు న్యాయమూర్తులు కేసు వెంటనే రిజిష్ట్రర్ చేయరాదు అని ఇచ్చిన తీర్పు ఐదుగురు న్యాయమూర్తు ల ధర్మాసనం తీర్పుకు వ్యతిరేకమనుకుంటాను. అదే విధంగా ఆర్నేశ్‌కుమార్ కేసులో సెక్షన్ 41 సీఆర్‌పీసీని ఉటంకిస్తూ ఏడేండ్ల శిక్ష లోబడి ఉన్నటువంటి కేసులలో నిందితులకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయరాదనే తీర్పు ఉండగా, పోలీసు వారు సెక్షన్ 498-ఏ కేసులో ఎటువంటి కారణాలు లేకుం డా లేదా ముందస్తు నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేస్తారని అనుకోవడం సమంజసం కా దు. ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా చార్జిషీట్లు దాఖలు చేసినట్లయి తే అటువంటి నిందితులు కేసు నుంచి విముక్తి కోసం దిగువ న్యాయస్థానాల్లో సెక్షన్ 239 సీఆర్‌పీసీ ప్రకారంగా లబ్ధి పొందే అవకాశం ఉన్నది. కేసును రిజి ష్ట్రర్ చేసిన తర్వాత ఫిర్యాదుదారు కొంతమంది పేర్లు అనవసరంగా ఇరికించారని దర్యాప్తులో తేలితే పోలీసువారు వారిని కేసు నుంచి తొలిగించి మిగితా వారిపై సెక్షన్ 173 సీఆర్‌పీసీ కింద నేరారోపణ పత్రం దాఖలుచేసే అధికారం ఉంది. ఈ అధికారా న్ని ఏ స్థాయిలో అయినా దుర్వినియోగపరిచే అవకాశం ఉంది. అది ఒక పోలీసు అధికారికి మాత్రమే వర్తిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. కుటుంబ సం క్షేమ కమిటీలు కూడా అధికారాన్ని దుర్వినియోగపరుచవచ్చు.

బాధిత స్త్రీ ఎప్పటికీ బాధితురాలుగానే ఉండా లా? ఆమె కేసు వేసిన నాటి నుంచి రిజిష్ట్రర్ కాకుం డా, ఎటువంటి అరెస్టు చేయకుండా నెలరోజుల పాటు ఎదురుచూడాలా? బాధిత స్త్రీ తన వైవాహిక జీవితం విషయమై పోలీస్‌స్టేషన్‌కు లేదా కోర్టుకు వచ్చిందంటే, అంతకుముందు వారి కుటుంబంలో లేదా పెద్ద మనుషుల ద్వారా లేదా మహిళా సంఘా ల ద్వారా ఎన్నో రాజీ చర్చలు జరిగి ఉంటాయి. ఏది ఏమైనా తీర్పులన్నీ శాశ్వతం కావు. కాలానుగుణం గా మారే అవకాశం ఉంది. రాజేశ్‌శర్మ కేసులోని తీ ర్పు ఏవిధంగా ఉపయోగపడుతుందో వేచి చూద్దాం.

1175
Tags

More News

VIRAL NEWS