రైతు రాజ్యమంటే ఇదే.. ఇదే..

Sat,August 12, 2017 11:38 PM

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తమ మాట నిలబెట్టుకుంటున్నారనడానికి అనేక ఉదాహరణలు ఇవ్వొచ్చు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వచ్చిన పంట దిగుబడులే సర్కారు పనితీరుకు నిదర్శనం. లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత దేశంలో మరే రాష్ర్టానికి లేదు. రైతుల సంక్షేమం కోసం ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు.పురుగు మందుల కల్తీని అరికట్టారు. కరెంటు బాధలు లేకుండా చేశారు. నీటి పారుదల రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు.

పూర్వం వ్యవసాయం ఒక వ్యాపారం కాదు, అదొక జీవన సరళి. సమాజంలో గౌరవానికి వ్యవసాయం ఒక ఉదాహరణ. ఎప్పుడూ డబ్బులకు వ్యవసా య ఉత్పత్తులను అమ్ముకునేవారు కాదు. వస్తు,పంట మార్పిడితోనే జీవనం సాగించారు. పూర్వకాలంలో ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్ అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్థం.. వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధ మం. అలాంటి ఉత్తమమైన అన్నదాత కాలక్రమేణా స్వార్థ రాజకీయాల వల్ల అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. గతంలో రైతులను రాళ్ళతో కొట్టించారు కొందరు, వ్యవసాయం దండుగ అన్నారు మరికొందరు. కానీ రైతును రాజును చేయాలని, వ్యవసాయాన్ని పండుగ చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులు గర్వపడే విధంగా బతుకాలె అని భావించి రైతు సమాఖ్యలకు బీజం పోశారు. ఇప్పుడు అందరి దారి వ్యవసాయం వైపు, అందరి చూపు తెలంగాణ వైపు.

రైతు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలంటే పరిపాలనా వ్యవస్థలో మార్పు రావాలె. అందుకు రైతు కష్టం తెలిసిన ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మన తెలంగాణ రైతులు చేసుకున్న అదృష్టం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, రైతు దేశానికి వెన్నెముక అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చే సామెతలు. ఎందుకంటే అంత ముఖ్యమైన గ్రామాలను, రైతులను పట్టించుకున్న దాఖాలాలు గతంలో లేవు. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్ధను బలోపేతం చేయడానికి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పంటల ధరలను నిర్ణయించే శక్తి రైతులకే ఉం డాలి. ఈ విషయాలను రైతు కోణంలో ఆలోచించిన మొట్టమొదటి రైతు ముఖ్యమంత్రి మన కేసీఆర్.

రైతుల సంక్షేమం కోసం దూరదృష్టితో రైతు రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా జలకళ తెప్పించి పంట పొలాలకు మళ్ళించారు. గతంలో రైతులు కరెంట్ కోసం పొలాల గట్టున కటిక చీకట్లో కునుకుతీసి కరెంటు షాక్ వల్ల లేదా పాము కాటుకు ప్రాణాలు కోల్పోయేవారు. నేడు రైతన్నలకు సమృద్ధిగా, నాణ్యమైన కరెంటు ను అందిస్తున్నారు. రైతన్నలు భార్యాపిల్లలతో ఇంటికాడనే హాయిగా పడుకునే రోజు లు వచ్చాయి. అంతేకాదు పంటల పెట్టుబడికి రైతన్నలు అప్పులపాలు కాకూడదని సంవత్సరానికి పంటలకు కావలసిన ఎరువులు, విత్తనాలకు ఎకరానికి 8 వేల రూపాయలు ప్రభుత్వమే అందించడం కేసీఆర్ రైతు హృదయానికి దర్పణం.
రైతు శక్తిమంతుడు కావాలంటే మొదట రైతులు సంఘటితం కావాలనేది గొప్ప ఆలో చన. ఈ సంకల్పంతో రైతు సంఘాలను ఏర్పాటుకు దిశానిర్దేశం చేస్తున్న మన ముఖ్యంత్రికి రాజకీయాలకతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎం దుకంటే సాధారణంగా స్వార్థ రాజకీయ నాయకులు రైతులను పార్టీల పరంగా, కులాల పరంగా, నీళ్ళపరంగా, నేల పరంగా వేరుచేసి ఓట్లకు వాడుకున్నారే తప్ప వారిని సంఘటితం చేసి ప్రగతి బాటలో నడిపించలేదు. ఒక రైతే ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు.

కేసీఅర్ నిజాయితీగా నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా, రైతుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నారు.
రైతులకు పంట తోడ్పాటు ఇవ్వాలంటే, వారి లెక్క తేలాలె. కేసీఆర్ రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయడానికి కూడా రైతుల వివరాలు ఉండాలె. అం దువల్ల మొదట సర్వేలను నిర్వహించారు. దీనిలో భాగంగా మొదట గ్రామస్థాయిలో ఉన్న రైతులను గుర్తించి గ్రామ రైతు సంఘాలను ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా వీరికి ఎప్పటికప్పుడు సహకారం అం దించడానికి గ్రామ స్థాయిలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. గ్రామ రైతు సంఘాల ప్రతినిధులతో మండల స్థాయిలో ఒక మండల రైతుసం ఘాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ మండల రైతు సంఘం ఆ మండలంలోని అన్ని గ్రామ రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ జవాబుదారీగా ఉంటుంది. ఈ విధంగా ఒక జిల్లాలోని అన్ని మండలాల రైతు సంఘాలు కలిసి జిల్లా రైతు సంఘంగా ఏర్పడుతాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని రైతుసంఘాల ప్రతినిధుల సమాహారంగా రాష్ట్రస్థాయిలో రైతు సమాఖ్యను ఏర్పాటుచేస్తారు.

ఈవిధంగా రైతుసంఘాల ఏర్పాటు దేశ చరిత్ర లో నూతన ఒరవడిగా చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలోని ఇతర రాష్ర్టాల్లో కానీ లేక గతంలో ఉమ్మ డి రాష్ట్రంలో కానీ బ్యాంకు రుణాల కోసం మాత్రమే రైతుసంఘాలను ఏర్పాటుచేశారు. దాని లో కూడా రైతులందరు సభ్యులుగా లేరు. గ్రామ స్థాయిలో మాత్రమే రైతు సంఘం ఉండేది. అది పరిమితమైన పాత్ర పోషించేది.

రాష్ట్రస్థాయిలో ఏర్పడే రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్లతో మూలనిధి ఏర్పాటుచేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది కూడా ప్రశంసనీయమైన చర్య. దీన్నిబట్టి రైతు సమాఖ్యల ఏర్పాటులో, వాటి విధి నిర్వహణలో, రైతుల అవసరాలు తీర్చడంలో ముఖ్యమంత్రికి ఎంత దూరదృష్టి, స్పష్టత ఉన్నదో తెలిసిపోతున్నది. రాష్ట్రస్థాయిలోని రాష్ట్ర రైతు సమాఖ్యకు ముఖ్యమంత్రి స్థాయి పరపతి ఉంటుందని స్వయంగా కేసీఆర్ చెప్పడం రైతులపై ఆయనకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నది.

అన్ని స్థాయిల్లోని రైతు సంఘాలు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి దశలోనూ ఎక్కడికక్కడ అంకితభావంతో పనిచేయాలె. అన్నదాతకు మేలు చేసే కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలుచేసి రైతుల అభివృద్ధికి పాటుపడాలి. అప్పుడే కేసీఆర్ కలలుగన్న రైతు రాజ్యం సిద్ధిస్తుంది. రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్లతో మూ నిధి ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థికశక్తిగా మార్చితే, రైతులకు గిట్టుబా టు ధర లభిస్తుంది. సరైన గిట్టుబాటు ధర రానిపక్షం లో రైతు సంఘాలకే పర్మిట్లు ఇచ్చి ప్రాసెసింగ్ చేసే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత.

రైతుకు ఎకరానికి రెండు పంటలకుగాను ఎనిమి ది వేల పెట్టుబడిని అందించడం వల్ల రైతులు అప్పు ల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం తప్పుతుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రైతుసం ఘాలు, ఇతర అధికారులు అంకితభావంతో పని చేస్తే రాను న్న రోజుల్లో రైతులు ఆశించేస్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు.
రైతులు కూడా పాత మూస పద్ధతులను వీడి ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అలవాటు చేసుకోవ డం ఈ సమయంలో ఎంతైనా అవసరం. రైతులం తా ఓకే పంట వేయడంతో ఉత్పత్తి పెరిగి సరైన ధర రాక నష్టపోతున్నారు. కాబట్టి మనకు ఏది అవసర మో, ఎంత అవసరమో ఏ పంటకు డిమాండ్ ఉన్న దో అదే వేసేవిధంగా ప్రతి గ్రామంలో రైతులు తమ భూములను క్రాప్ కాలనీలుగా మార్చుకోవాలి. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితంగా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతి ఒక్క రు ఆహ్వానించాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ముఖ్యమంత్రి నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాలె. ఇందుకు అధికారులు కూడా ఎప్పటికప్పుడు తగిన కార్యాచరణను రైతులకు సూచిం చాలె. వ్యవసాయంలో నూతన పద్ధతులను అనుస రిస్తే లాభసాటిగా మారుతుంది. దశాబ్దాల తరబడి రైతులు ఎదుర్కొంటున్న దోపిడీ నుంచి విముక్తి లభిస్తుంది.

రైతు సంఘాలను శక్తివంతమైన సంస్థలుగా చేయాలంటే పక్కా ప్రణాళికతో కార్యక్రమాలను నిర్వహించాలి. సంక్షేమ పథకాలపై సమావేశాలు ఏర్పాటుచేసి రైతులకు అవగాహన కలిగించాలి. క్రాప్ కాలనీలు, ఎకరానికి 8 వేల రూపాయల పెట్టుబడి, వాతావరణ పరిస్థితులు, పంటల రకాలు, సేం ద్రియ పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలు, మూల నిధి వినియోగం, పంటల బీమా, పంటల స్టోరేజీ, సాగునీటి వాడకం, వ్యవసాయంలో నూతన పద్ధతు లు, శాస్త్రీయ విధానాలు, భూమి రకాలు, సొంత విత్తనాల ఏర్పాటు, దళారీ వ్యవస్థ నిర్మూలన మొద లైన అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలె. ప్రతికూల పరిస్థితుల్లో రైతు నిబ్బరంగా ఉండటం ఎట్లనో వివరించాలె. ఎగుమతి చేసే పంటలు, పం డ్లు, కూరగాయల సాగు, హార్టికల్చర్ సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. ఈ అవగాహనా కార్యక్రమాల్లో రైతు సంఘాలది కీలక పాత్ర చేయాలె.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమం త్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భం గా తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమం త్రి తమ మాట నిలబెట్టుకుంటున్నారనడానికి అనేక ఉదాహరణలు ఇవ్వొచ్చు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వచ్చిన పంట దిగుబడులే సర్కారు పనితీరుకు నిదర్శనం. లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత దేశంలో మరే రాష్ర్టానికి లేదు. రైతుల సంక్షేమం కోసం ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. పురుగు మందుల కల్తీని అరికట్టారు. కరెంటు బాధలు లేకుండా చేశారు. నీటి పారుదల రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ విధంగా రైతు సంక్షేమం కోసం అన్ని విషయాల్లో పెద్దన్నలా గా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే కాదు, ప్రపంచానికే ఆదర్శం.
ravi

764
Tags

More News

VIRAL NEWS