పరిహసించడం మానండి

Sat,August 12, 2017 11:19 PM

తొలి, మలి ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకొన్న త్యాగధనులు, ఉద్యమకారులు కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారు. ఇప్పుడు బంగారు తెలంగాణను సాధించేకాలం ఎంతోదూరం లేదు. బంగారు తెలంగాణ స్వప్నం నెరవేరాలంటే మన ముఖ్యమంత్రి అంతులేని పోరాటం చేయాల్సి ఉన్నది. ప్రగతిరథం రాష్ట్రంలో బలంగానే ఉన్నది. రథానికి పూనిన కేసీఆర్ ఆలోచనల అశ్వాల జవసత్వాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అవాంతారాలన్నీ దూది పింజాల్లా గాలికి ఎగిరిపోతున్న తరుణంలో దుమ్మూధూళి సృష్టించి శిఖండిలా అడ్డుపడకండి.

ఉద్యమం ఏ ఒక్క ని సొత్తో గాదు అంటూ మేచినేని కిషన్‌రావు పత్రికలకెక్కి నిప్పులు పోయడం బాధాక రం. ప్రజల భావాలను పరికించి పరి పాలించేవారే ప్రభువులు. ఉద్యమం లో కేసీఆర్ ఆమరణదీక్ష చేపట్టి రాష్ట్ర సాధనకు కారణమయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ప్రపంచం లో ఎక్కడా లేనివిధంగా ప్రజా సం క్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. తన మనశ్శాంతిని కోల్పోయి రైతుల కు మనశ్శాంతిని కలుగజేస్తున్న మానవతావాది. కాంగ్రెసేతర పార్టీలతో 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడ్డప్పు డు మొదలైంది రుణమాఫీ ప్రక్రియ. దీన్ని ఆ తర్వాత జనతాదళ్ ప్రభుత్వం చేపట్టి రైతాంగాన్ని ఆదుకోలేదా? వ్యవసాయం దండుగన్న నారా చంద్రబాబునాయుడు, ఒక్క పైసా తెలంగాణ అభివృద్ధికి ఇవ్వనుగాక ఇవ్వనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే ఉత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్.

గత పాలనలో రాజధాని నగర ప్రజలదాహం తీర్చని పరాయి పాలనకంటే ఎక్కువగా నగరాన్ని జలమయం చేసి భగీరథ మిషన్ ద్వారా పల్లెపల్లెకు మంచినీటిని అందిస్తున్నా, మిషన్‌కాకతీయ పథకంతో వేలాది చెరువులు నింపి సస్యశ్యామలం చేసినా, ధృతరాష్ర్టుల్లా మిగిలారే మీరు! మీరా తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించేది? అదీ 1969 ఉద్యమాన్నిఅడ్డం పెట్టుకొని బరితెగిస్తారా! ఆత్మవిమర్శ చేసుకోకుండా పరనిందకు పాల్పడుతారా! టీఆర్‌ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శినంటూ సాక్షాత్తూ స్థాపక-అధ్యక్షుల మీదనే రాళ్లేస్తారా? ఈ విమ ర్శలు కేసీఆర్‌నే కాదు, ప్రజల గుండెలను కూడా గాయప రుస్తాయి. ప్రజల విజ్ఞతను కించపరుచడం లేకితనానికి నిదర్శనం.

1969 ఉద్యమానికి మీకేం సంబంధం? 1969 తొలి తెలంగాణ ఉద్యమ చరిత్రను విశ్లేషిస్తే అందులో మీ పాత్ర ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. 1969 ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే నీవు అప్పుడు తెలంగాణలోనే లేవు కదా! ఉంటే ఏ జైలులో శిక్ష అనుభవించావు? 36 9 ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తే స్పందించని నీకు 1969 ఉద్యమానికి సంబంధం ఎక్కడిది? కేసీఆర్ 1969 తొలి తెలంగాణ పోరాట యోధులను గుర్తిస్తున్నారు. కానీ వారికి లబ్ధి చేకూర్చకుండా ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని నీవు మంటగలుపడం లేదా!
మీలాగా తెలంగాణ నాయకునిగా ముసుగేసుకొని కేసీఆర్ తెరపైకి రాలేదు. టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి 13 ఏండ్లుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికలకు లెక్కకుమించి అభ్యర్థులను నిలబెట్టి, 63 అసెంబ్లీ సీట్ల ను గెలిపించుకున్న ధీరోదాత్త నాయకుడు కేసీఆర్. పంచ తంత్రంలో నీలి నక్కలాగా 1969 ఉద్యమకారుల సంస్థ కు నాయకుడివైనావు. 2013లో తెలంగాణ మూవ్‌మెం ట్ డిటెన్యూస్ ఫోరం రిజిష్టర్ చేసుకొని ఆ సంస్థ నాయకులు పింఛన్ కోసం పోరాడుతుంటే ఎక్కడ వెనుకబడి పోతానేమోనని 2015లో నీవు స్థాపించుకున్న సంస్థను రిజిష్టర్ చేసుకున్నావనేది గుర్తుంచుకోండి.

1987 మాదిరిగానే 1991లో అన్నివర్గాలను ఏకతా టిమీదికి తేవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో సదస్సు నిర్వహిస్తే కుయుక్తులతో కలిసిరాకుండా ఐక్యతను దెబ్బతీసిందెవరు? ఇతర పార్టీల, సంఘాల నాయకులు ఎంత ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు వారి వెంట నడువలేదెందుకు?

2001లో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించిన పార్టీ తరఫున దిగిన అభ్యర్థులు గెలువడం రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో తెలంగాణవాదాన్ని బలవత్తరం చేసింది స్వార్థం కోసమేనా? ట్యంక్ బండ్ మీది విగ్రహాల కూల్చివేతలో కేసీఆర్ లేకపోతే ఆయన నాయక త్వం ఏమైనా బలహీనమైందా?

తెలంగాణ ఉద్యమం క్విట్ ఇండి యా ఉద్యమంలా సాగింది. నాడు భగత్‌సింగ్‌లా తెలంగాణ శ్రీకాంతాచారి బలిదానమయ్యారు. నాటి మహాత్మునిలా అహింసావాదంలో కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని నడిపారని ఎంపీ జితేందర్‌రెడ్డి బుధవా రం (9-8-2017) లోక్‌సభలో చెప్పినప్పుడు హౌజ్‌లో ఉన్న ఎంపీ లందరూ ఉద్విగ్నులయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ అంటే అది. కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్టుగానే అమరుల కుటుంబాలకు 10 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యో గం కల్పించారు.1969 ఉద్యమంలో తుపాకీ తూటాలకు దెబ్బతిని బతుకుచితికిన యోధులకు 5 లక్ష లు ఇచ్చి ఆదుకున్నారు. జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బతుకుచితికిన కొందరు యోధులకు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు.

అంతర్జాతీయస్థాయిలో అమరులకు స్మృతి కేంద్రం, స్తూపం నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించి పనులు ప్రారంభించారు. పోరాట యోధుల వీరత్వం మరో పోరాటయోధుడు, త్యాగశీలి కేసీఆర్‌కే తెలుస్తుంది. ఆయన తెలంగాణ కోసం త్యాగాలుచేసిన వారిని తప్పకుండా గుర్తిస్తారు. ప్రజలకు న్యాయంచేస్తారు. తొలి, మలి ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకొన్న త్యాగధనులు, ఉద్యమకారు లు కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారు. ఇప్పుడు బంగారు తెలంగాణను సాధించేకాలం ఎంతో దూరం లేదు. బంగారు తెలంగాణ స్వప్నం నెరవేరాలం టే మన ముఖ్యమంత్రి అంతులేని పోరాటం చేయాల్సి ఉన్నది. ప్రగతిరథం రాష్ట్రంలో బలంగానే ఉన్నది. రథానికి పూనిన కేసీఆర్ ఆలోచనల అశ్వాల జవసత్వాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అవాంతారాలన్నీ దూది పింజాల్లా గాలికి ఎగిరిపోతున్న తరుణంలో దుమ్మూధూళి సృష్టించి శిఖండిలా అడ్డుపడకండి.
professor

644
Tags

More News

VIRAL NEWS