గ్రంథాలయాలే వెలుగుబాటలు

Sat,August 12, 2017 01:51 AM

'విద్య ఒక నిరంతర ప్రక్రియ. తల్లి ఒడిలో కూర్చొని మాట లు నేర్చుకోవడం మొదలుకొని మనిషి మరణించేదాకా ఏదో ఒక అంశాన్ని తెలుసుకుంటూనే ఉంటాడు, అభ్యసిస్తూనే ఉంటాడు. జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉంటా డు. ఈ జ్ఞాన సముపార్జనకు ప్రధానమైన మార్గం గ్రం థాలయం. ఇదొక సార్వజనీన శాశ్వత స్వయంశిక్షణ సాధనం. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించే ఏకైక మందిరం. అందుకే గ్రంథాలయా న్ని ఎలాంటి ప్రతిఫలం కోరకుండా సేవ చేసే సంస్థ అంటారు. గ్రంథాలయ ఉపయోగం మనకున్న ధనసంపదను బట్టి గాక, దాన్ని మనం ఉపయోగించుకోగల శక్తిని బట్టి నిర్ణయమవుతుంది అంటారు పద్మశ్రీ షియా లి రామామృత రంగనాథన్. ఇది ఆ మహా మానవుడి 125వ జయం తి సందర్భం. ఆయన గ్రంథాలయ శాస్ర్తానికి సంబంధించి న ఎన్నో నూతన సిద్ధాంతాలను రూపొందించారు. దేశంలో గ్రంథపాలకుల హోదాను అధ్యాపకుల తో సమం చేయడానికి అద్వితీయమైన కృషి చేశారు. ఆ దార్శనికుని జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయాల గురించి మాట్లా డుకుందాం.
FAtherLIbraryScience
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారా లు. ఆధునిక దేవాలయాలు. వీటిలో సకల శాస్ర్తాలకు, కళలకు, సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలు పాఠకుల కోసం ఎదురుచూస్తుంటాయి. దిన, వార, మాస పత్రికలెన్నో అందుబాటులో ఉంటాయి. ప్రపంచ పరిజ్ఞానమంతా గ్రంథాల్లో భద్రపరచబడి ఉంటుంది. ఒక వ్యక్తి శీలాన్ని, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని రూపొందించేవి గ్రంథాలయాలే. గ్రంథాలయాలకు వెళ్ళేవారి ప్రవర్తనలో, వెళ్ళనివారి ప్రవర్తనలో స్పష్టమైన తేడా కనబడుతుంది.

పిల్లల కోసం బాల సాహిత్యం, వృద్ధుల కోసం పురాణ సాహిత్యం, అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే సాహిత్య గ్రంథాలు గ్రంథాల యంలో దొరుకుతాయి. పుస్తక పఠనం గొప్ప వరం. మన ఆలోచనా తీరుతెన్నులను, స్పందించే పద్ధతులను, జీవన విధానాన్ని మనం చదివే గ్రంథాలు ప్రభావితం చేస్తాయి. నేను ఫలానా పుస్తకం చదివి నా జీవిత గమనాన్ని ఎంచుకున్నాను అనే ప్రముఖ వ్యక్తుల మాటలను మనం విం టూనే ఉంటాం. అంటే మన మీద పుస్తకాల ప్రభావం ఎంతో ఉంటుంది. మనకు తెలియకుండానే మనకు సంస్కారం ఎలా రూపొందుతుందో దీన్నిబట్టే అర్థమవుతున్నది.
ప్రపంచంలో పేరెన్నికగన్న ప్రముఖ వ్యక్తుల అనుభవాలు, సమాజం లో గుర్తింపుపొందిన సుప్రసిద్ధుల జీవిత చరిత్రలు, దేశభక్తుల స్వీయ చరిత్రలు చదువడం మనకు స్ఫూర్తినిస్తుంది. మన జీవిత గమ్యాన్ని, గమనాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రంథాలయాలకు వెళ్ళకముందు మనకు అనేక విషయాలు తెలుసునన్న భ్రమ, విశ్వాసం చాలామందికి ఉంటుం ది. గ్రంథాలయ సందర్శనం ద్వారా, ఉత్తమ గ్రంథాలు చదివిన తర్వా త మనకు తక్కువ తెలుసునని అర్థం అవుతుంది. మనం తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది చాలా ఉందని బోధపడుతుంది. అజ్ఞానపు చీకట్లు తొలిగిపోతా యి. విజ్ఞానపు జ్యోతులు వెలుగడం ప్రారంభమవుతుంది. భారత జాతీయోద్యమం, తెలంగాణ విమోచనోద్యమం మొదలైన ప్రజా ఉద్యమాలన్నింటికీ గ్రంథాలయాలు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. తెలుగునాట తెలుగుభాషా పరిరక్షణోద్యమం గ్రంథాలయాల ద్వారానే ప్రారంభమైంది. పదిమంది మేధావులు, దేశభక్తులు, సమాజ సేవాతత్పరులు ఒకచోట చేరడానికి, చర్చించుకోవడానికి, సమాలోచన చేయడానికి గ్రంథాలయాలు తోడ్పడుతా యి. గ్రంథాలయాల్లో సమావేశ మందిరాలు, సభాస్థలులు కూడా ఉంటాయి. అక్కడ ప్రయోజనకరమైన సదస్సులు, ఇష్టాగోష్ఠి జరుగుతుంటాయి. ఇవి గ్రంథాలయ పాఠకుల మానసిక వికాసానికి ఉపయోగపడుతాయి.

గ్రంథాలయాల అవసరాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఒక రాష్ట్ర గ్రంథాలయాన్ని, గ్రంథాలయ శాఖను ఏర్పాటుచేసింది. అలాగే అన్ని జిల్లాల్లో జిల్లా గ్రంథాలయాలు, ప్రముఖ నగరాల్లో నగర గ్రంథాలయాలు, ప్రాంతీయ గ్రంథాలయాలు, శాఖా గ్రంథాలయా లు ఏర్పడ్డాయి. పాఠకులకు కావలసిన విలువైన, అపురూపమైన గ్రంథాలు నేడు అందుబాటులో ఉన్నాయి. వాటిని చదివి జ్ఞానం పెంచుకోవలసిన బాధ్యత పాఠకులదే. కాలం మారుతున్న కొద్దీ కాలంతోపాటు గ్రంథాలయాల తీరుతెన్నులూ, పని విధానంలోనూ క్రమంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు గ్రంథాలయాలు కేవలం గ్రంథాలను నిలువజేసే కేంద్రాలుగా కాకుండా సేవాకేంద్రాలుగా పరిణామం చెందుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం సాధిస్తున్న ప్రగతి ప్రభావాలు గ్రంథాలయాల పైన కూడా స్పష్టంగానే పడుతున్నా యి. ప్రచురిత గ్రంథాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రానిక్ సాధనాలు వచ్చేస్తున్నాయి. కంప్యూటర్ వినియోగం, ఇంటర్నెట్ వ్యవస్థ అందుబాటులో కి రావడంతో గ్రంథాలయ వ్యవస్థలోనూ మౌలికమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయినా సకల శాస్ర్తాలకూ, సాంకేతిక విజ్ఞానానికి వెన్నెముకగా కొనసాగుతున్నది గ్రంథాలయాలే.

పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. నేడు మనం గర్వంగా చెప్పుకుంటున్న గొప్ప దేశభక్తులు, జాతీయోద్యమ నాయకులు, మహాకవులు, రచయిత లు, మేధావులు, శాస్త్రవేత్తలు, కళాకారులు అందరూ గ్రంథాలయాల నుం చి సమాజంలోకి వచ్చినవారే. ఈ సమాజ గమనాన్ని ప్రభావితం చేసన వారే. ఈ వాస్తవాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. గ్రంథ పఠనం ఒక ఆరోగ్యకరమైన అలవాటు. ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలై న గ్రంథాలయాలకు వెళ్దాం. ఉత్తమ గ్రంథాల నుంచి స్ఫూర్తిని పొందు దాం. మన వ్యక్తిత్వాలను రూపొందించుకుందాం. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మిత్రుడితో సమానం అన్న సూక్తిని గుర్తుంచుకుందాం. ఎం తో జ్ఞానసంపద గ్రంథాలయాల రూపంలో మనకు అందుబాటులో ఉన్న ది. ఆ గ్రంథాలయాలను ఉపయోగించు కొని జ్ఞానసంపదను వృద్ధి చేసు కుందాం. ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు మనవంతుగా పాటుపడుదాం.
(నేడు పద్మశ్రీ షియాలి రామామృత రంగనాథన్ జయంతి..)
barati

2681
Tags

More News

VIRAL NEWS