జీఎస్టీపై సమన్వయ కమిటీ అవసరం

Sat,July 15, 2017 11:15 PM

జిల్లా స్థాయిలో జీఎస్టీ సమన్వయ కమిటీలను ఏర్పరిచి వాటిలో ఉన్నతాధికారులను, వాణిజ్య ప్రతినిధులనునియమించాలని అఖిల భారత వర్తక సమాఖ్య పేర్కొన్నది. ఈ సూచనను ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలె.ఆ కమిటీ సూచనలను జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదించడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారవర్గాల సమస్యలు తీరవచ్చు.

జీఎస్టీ (వస్తువు, సేవలపన్ను) అన్ని వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నది. ఈ కొత్త పన్నుల విధానం పట్ల కొన్ని వ్యాపార వర్గాలు ఆశావాహంగా ఉన్నాయి. మరికొన్ని తమ సమస్యలను ప్రభుత్వంతోపా టు జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలనుకుం టున్నాయి. వ్యాపారం ఏదైనా జీఎస్టీ కింద నమోదు చేసుకోవడం ప్రయోజనకరం. దీనివ ల్ల సరుకులు లేదా సేవల సరఫరాదారుగా చట్టపరమైన గుర్తింపు, ఇన్‌పుట్ క్రెడిట్, కొనుగోలు దారుల నుంచి పన్ను వసూలు చేసేందుకు చట్టపరమైన అధికారం పొందడం లాంటివి ముఖ్యమైన ప్రయోజనాలు. ఇరువై లక్షల టర్నోవర్ కలిగిన ప్రతి వ్యాపారస్తుడు జీఎస్టీ పరిధిలోకి వస్తాడు. వార్షిక టర్నోవర్ ఇరువై లక్షల నుంచి డ్బ్భై ఐదు లక్షల మధ్య ఉంటే, చిరువ్యాపారులు జీఎస్టీకి అనుబంధంగా ఉన్న సంవిధాన (కంపోజిషన్) పథకం కింద నమోదు చేయించుకొని, వర్తకులు 1 శాతం, తయారీదారులు 2 శాతం రెస్టారెంట్లు 5 శాతం పన్నును వినియోగదారుల వద్ద వసూలు చేసుకోవచ్చు. సంవిధాన పథకం కింద నమోదు చేసుకోవాలా అనేది ఆయా వ్యాపారస్తులే నిర్ణయించుకోవాలె. ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారికి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కూడా వర్తించదు. ఇక సాధారణ క్యాటగిరిలో నమోదైన సంఘటిత, అసంఘటిత వ్యాపార రంగాలపై జీఎస్టీ ప్రభావం ఎంత ఉంటుందో పరిశీలిద్దాం.

ఆర్థిక సేవల రంగం: పొదుపు, పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలు, బీమా పాలసీ లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం కొనుగోలు ఇవన్నీ ఆర్థిక సేవల కిందికి వస్త యి. ఈ రంగంపై జీఎస్టీకి పూర్వం 15 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు పన్ను 18 శాతానికి చేరింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సేవా రుసుము ఉండేది కాదు. ఇప్పుడు జీఎస్టీ వర్తిస్తుం ది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలు, ఆరోగ్య బీమా, పెట్టుబడి బీమా కలిసుండే యులిప్ బీమా సేవలు, వాహన బీమా, ఇతర సాధారణ బీమా పాలసీలపై ఇకనుంచి 3 శాతం అదనపు భారం పడినట్టే. సంప్రదాయ పాలసీలు కూడా జీఎస్టీ ప్రభావం వల్ల భారమవుతున్నయి. స్టాక్‌మార్కెట్‌లో ఈక్విటీ ట్రైడింగ్ మీద సేవా రుసుము ఉన్నది. బ్రోకర్‌ను బట్టి ఈ రుసుము మారుతుంది. సేవా రుసుము వసూలు చేస్తారు కనుక ఈక్విటీ ట్రేడింగ్ సేవా రుసుములపై ఇక నుంచి 18 శాతం చెల్లించాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్‌లో మదింపునకు కూడా అదనంగా 3 శాతం పెరుగవచ్చు. గతంలో బంగారు ఆభరణాలపై 12.43 శాతం వరకు పన్ను పర్తించేది. ఇప్పుడు బంగారాన్ని 3 శాతం స్లాబులో చేర్చారు. మజూరీ రుసుములపై 18 శాతం సేవా పన్ను వర్తిస్తుంది. కస్ట వ్‌‌సు డ్యూటీ యథాతథంగా ఉంటుంది.

వాహన పరిశ్రమ: కొత్త పన్ను విధానంపై వాహన పరిశ్రమ పలు అంశాలపై స్పష్టత కోరుతున్నది. 2030 నాటికి 100 శాతం విద్యుత్తు కార్ల దేశంగా భారత్ నిలువాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ అధిక సెస్సు వల్ల విద్యుత్తు వాహనాల వృద్ధికి ఆటంకం కలుగుతుంది. హైబ్రిడ్ కార్లపై 15 శాతం సెస్సుకు తోడు జీఎస్టీ 28 శాతాన్ని విధించడంతో మొత్తం పన్ను 43 శాతానికి చేరుకుంది. ఇది పెట్రోల్, డీజిల్ వాహనాలపై పడే పన్ను కన్నా సుమారు 13 శాతం అధికం. జీఎస్టీ విధానం వల్ల స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (యస్‌యువి) మార్కెట్‌లో వృద్ధి సాధించవ చ్చు. ఈ విభాగం కార్లపై ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే హైబ్రిడ్ వాహనాల తయారీకి భారీ స్థాయి లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సంస్థలు సందిగ్ధం లో పడ్డాయి. ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి రాతపూర్వక హామీ ఇవ్వకపోయినా, హైబ్రిడ్ కార్లపై పన్ను, సెస్సును సమీక్షించడానికి ముందుకు వచ్చిందని వాహనరంగంలోని ప్రతినిధులు చెబుతున్నా రు. ప్రభుత్వం పన్ను తగ్గించకపోతే నాన్‌హైబ్రిడ్ వాహనాలను తీసుకొస్తామని మహీంద్రా అండ్ మ హీంద్రా ఎండీ తెలిపారు. మారుతీ సుజికి మాత్రం పెట్రోలు, డీజిల్ కార్ల మోడళ్ళ ధరలను 3 శాతం వరకు తగ్గించి జీఎస్టీ పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నది.

మొబైల్ ఫోన్ల రంగం: దేశీయంగా మొబైల్ ఫోన్ల విక్రయాలు ఏడాదికి రూ.1.20 లక్షల కోట్ల వరకు జరుగుతున్నయి. రిలయన్స్ జియో ప్రవేశానంతరం 4జీ డేటా ధరలు తగ్గిపోయాయి. అందువల్ల స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్ళు భారీ పెరుగొచ్చు. జీఎస్టీకి ముందు సుమారు 7 శాతం పన్ను మొబైల్ తయారీపై అమ లు కాగా జీఎస్టీ పరిధిలో 12 శాతం కానుంది. విదేశాల్లో తయారుచేసి, దేశంలోకి దిగుమతి అయ్యే మొబైల్ ఫోన్లపై 10 శాతం బేసిక్ కస్టవ్‌‌సు డ్యూటీతో పాటు జీఎస్టీ 12 శాతం కలిసి 22 శాతం పన్ను అవుతుంది. అందువల్ల దేశంలోనే ఫోన్ల తయారీ లేదా అసెంబ్లింగ్‌కు సంస్థలు ముందుకురావచ్చు. జీఎస్టీ వల్ల దేశీయ మొబైల్ తయారీ రంగంపై 5 శాతం అదనపు పన్ను భారం పడినా, తయారీదారు తమ మార్జిన్‌ను తగ్గించుకొని ధరలు పెంచకుండా అమ్మకాలను పెంచుకొనే ఆలోచనలున్నట్లు వ్యాపార వర్గా ల నుంచి అవగతమవుతున్నది.

స్థిరాస్థి రంగం: కొత్త పన్నుల వ్యవస్థలో గృహ కొనుగోలుదారులపై అదనపు భారం పడనుందని భారత స్థిరాస్థి అభివృద్ధి దారుల సంఘాల సమాఖ్య చెబుతున్నది. తెలంగాణలో సేవల పన్ను, వ్యాట్ కలిపి 5.75 శాతం పన్నుభారం అమల్లో ఉండేది. కొత్త పన్నుల వ్యవస్థలో రెండురకాల ఐచ్ఛికాలను ఎంచుకునే వెసులుబాటు ఇచ్చారు. స్థలం విలువను మినహాయించి నిర్మాణంపైనే జీఎస్టీ చెల్లిస్తే 18 శాతం పన్నుగా నిర్ణయించారు. స్థలం, నిర్మాణం కలి పి విలువను లెక్కపెడితే 12 శాతం పన్ను చెల్లించే విధంగా నిర్ణయించారు. విల్లాల విషయంలో స్థలం ఖరీదు ఎక్కువ, నిర్మాణం విలువ తక్కువగా ఉం టుంది. జీఎస్టీలో వివిధ నిర్మాణ వస్తువులపై పన్ను వివిధ రకాలుగా ఉండటం వల్ల ఇన్‌పుట్ క్రెడిట్ లభించినట్లయితే దాని ప్రయోజనాలను వినియోగదారునికి చేరవేయడానికి సరఫరాదారులతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా స్థిరాస్థి రంగం చెబుతున్నది. గృహ నిర్మాణరంగంలో జీఎస్టీతో పాటుగా కొనుగోలుదారుడు స్టాంపు డ్యూటీని కూడా చెల్లించాలి. వచ్చే ఐదేండ్లలో అందరికీ గృహాలు అనే నినాదంతో ముందుకు వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రంగ సమస్యలను పరిష్కరించి పన్ను భారాన్ని తగ్గించాలని క్రెడాయ్ కోరుతున్నది.
ఇతర రంగాలు: జీఎస్టీ అమలులోకి వచ్చిన రోజే బీడీల ఉత్పత్తి 40 శాతం తగ్గింది. ఈ పరిశ్రమ జీఎ స్టీ పరిధిలోకి రావడంతో మొత్తం 51 శాతం పన్ను ను బీడీ పరిశ్రమ భరించవలసి వస్తున్నది. బీడీ పరిశ్రమలో గత ఆరేండ్లుగా ఆరు లక్షల మంది కార్మికు లు తగ్గినట్లు తెలుస్తున్నది.

ఫాస్ట్ మువింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌యంసీ జీ) విభాగంలోని 81 శాతం వస్తువులకు 18 శాతం పన్ను రేటుగా నిర్ణయించారు. గతంలో ఈ వస్తువులపై 22- 24 శాతం ఉండేది. దీనితో పన్ను ప్రయోజనాన్ని కంపెనీలు వినియోగదారులకు చేరవేయవలసి ఉన్నది. ఇక ఎఫ్‌యంసీజీలోని మిగతా 19 శాతం వస్తువులకు జీఎస్టీలో 28 శాతం స్లాబును ఖరారు చేస్తారు. ఎఫ్‌యంసీజీ కంపెనీలపై మిశ్రమ ప్రభావం ఉండవచ్చని అంచనా. జీఎస్టీ వల్ల సెక్సు వర్కర్లపై భారం పడుతున్నది. శానిటరీ ప్యాడ్లపై 12 శాతం పన్ను విధించడంతో వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రభుత్వం గత పదేళ్ళుగా ప్రచారం చేస్తుండటంతో శానిటరీ ప్యాడ్లపై వినియోగం పెరిగింది.

100 రూపాయల కన్న తక్కువ ధరగల సినిమా టికెట్లపై 18 శాతం, 100 కన్న ఎక్కువ ఉన్న టికెట్ల పై 28 శాతం జీఎస్టీ ఉన్నది. పశ్చిమబెంగాల్‌లో ప్రాంతీయ చలన చిత్రాలకు 2 శాతం, ఇతర భాషల చిత్రాలకు 30 శాతం అమల్లో ఉండేది. తెలంగాణ లో, తమిళనాడులో జీఎస్టీ ఈ పరిశ్రమను గందరగోళంలోకి నెట్టింది. కళాశాల, విశ్వవిద్యాలయాల్లో సేవల పన్ను 18 శాతంగా ఉన్నది. గతంలోని 3 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఆర్థికంగా వెనుకబడిన వారు ఉత్తమస్థాయి విశ్వవిద్యాలయాల్లో చేర డం సులువైన పని కాదు.
sathish
వినియోగదారులు, పరిశ్రమ వర్గాలు కొత్త పన్ను విధానంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోజనాలను పొందే విధానానికి అలవాటు పడవలసి ఉంది. సార్వభౌమ ఏసీడీ బాండ్లలో మదుపు చేసే వారికి జీఎస్టీ ప్రభావం శూన్యం. పైగా ఇవి 2.4 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించడాన్ని గమనించాలి. మ్యూచువల్ ఫండ్ విషయంలో సంస్థ ఖర్చు ల విషయంలో ఉన్న పరిమితిని దాటితే జీఎస్టీ ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారరంగంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. ఉన్నత విద్యను వృద్ధి చేయాలంటే కేంద్ర, రాష్ర్టాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలి.

అనిశ్చితిలో ఉన్న సినీ రంగ పరిశ్రమ సమస్యను పట్టణ ప్రజల దృక్కోణంలో చూడాలె. పట్టణ మధ్య తరగతి ప్రజలకు సినిమాయే అగ్గువకు దొరికే వినో దం. వీరిని దృష్టిలో ఉంచుకోవాలె. మహారాష్ట్ర ప్రభుత్వం మాదిరి రహదారి పన్ను 2 శాతం పెంచడాన్ని ఇతర రాష్ర్టాలు అనుసరించవద్దు. బంగారం వ్యాపారంలో జీఎస్టీ వల్ల పారదర్శకత పెరిగి దీర్ఘకాలంలో అనుకూల ఫలితం ఉండవచ్చు. జిల్లా స్థాయి లో జీఎస్టీ సమన్వయ కమిటీలను ఏర్పరిచి వాటిలో ఉన్నతాధికారులను, వాణిజ్య ప్రతినిధులను నియ మించాలని అఖిల భారత వర్తక సమాఖ్య పేర్కొన్న ది. ఈ సూచనను ప్రభుత్వం గమనంలోకి తీసుకో వాలె. ఆ కమిటీ సూచనలను జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదించడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారవర్గాల సమస్యలు తీరవచ్చు.

ఏ మార్పు ప్రవేశపెట్టినా సమస్యలు ఎదురు కావ డం సాధారణమే. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి చూస్తే, ఇదొక విప్లవాత్మక మార్పు. అందువల్ల సమ స్యలు ఎదురుకాకతప్పదు. జీఎస్టీ అమల్లో సాధక బాధకాలను వెంటవెంట సమీక్షిస్తూ సర్దుబాట్లు చేస్తూపోతే ఇదొక అనుకూల చట్టంగా నిలుస్తది. లేక పోతే సమస్య మారుతుంది. అంతిమంగా జీఎస్టీ అమల్లో విధానకర్తలు అనుసరించే విధానం ప్రధాన మైనది.

471
Tags

More News

VIRAL NEWS