అందరికీ అభివృద్ధి ఫలాలు

Sun,June 18, 2017 01:49 AM

అందరు కనీసం డిగ్రీ, బీటెక్, బీఈడీ, మెడిసిన్, పీజీ, పీహెచ్‌డీ దాక విద్యావంతులవ్వాలి. టీచర్లుగా, లెక్చరర్లుగా, ఆధునిక వ్యవసాయదారులుగా, కాంట్రాక్టర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, ప్రజా ప్రతినిధులుగా, సైంటిస్టులుగా, సామాజిక శాస్త్రవేత్తలుగా ఎదుగాలి. వీరంతా ఆయా ఆదివాసీ గణతెగల నుంచి ఎదుగడం అవసరం. ఇలా ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో 15-18 ఏళ్ళల్లో సాధిస్తున్న అభివృద్ధి పరిణామాలు మరింత వేగవంతం చేసినప్పుడే అది నిజమైన సామాజిక పరిణామం.

వేల ఏళ్ళ వైజ్ఞానిక ఆవిష్కరణల, సం పద సృష్టి క్రమంలో ఆదివాసులు, కొన్ని గణాలు, తెగలు, కులాలు, దేశాలు ఇప్పటికీ వెనుకటి లాగే వెనుకబడిన జీవన ప్రమాణాలతో జీవిస్తున్నాయి. వీరి అభివృద్ధికి స్థానిక సంప్రదాయిక వనరులతో, జ్ఞానంతో, వాటి పరిశోధనలతో నూతన అభివృద్ధి నమూనాలను సమాంతరంగా రూపొందించుకోవడమో, లేదా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం గా ప్రాచుర్యంలో ఉన్న అభివృద్ధి నమూనాలను స్వీకరించి ముందుకు సాగడమో అవసరం. ఈ రెండూ చేయకపోతే అభివృద్ధి చెందుతున్న సమాజానికి బరువుగా మారారని పౌర సమాజం, ఆధిపత్య అధికారవర్గాలు భావిం చవచ్చు. వారు ఎదగడానికి కొన్ని ప్రణాళికలు చేపట్టక తప్పనిస్థితి ఏర్పడుతుంది. అవి ఆయా ప్రాంతాల గణతెగల, జాతుల, దేశాల చరిత్రకు, సం స్కృతికి, సంప్రదాయాలకు, అభివృద్ధి నమూనాలకు భిన్నంగా ఉండవచ్చు. పాతవాటిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేయవచ్చు.

పాతవాటిని వ్యతిరేకించవచ్చు. పాతవి తీసి కొత్తవి పెట్టుమని అనివార్యం చేయవచ్చు. జీవన ప్రమాణాలు పెరుగడం, పెంచుకోవడం ఎప్పటికప్పుడు ప్రతితరం సాధించుకోవాల్సిన కర్తవ్యం. ఒక వైస్ ఛాన్స్‌లర్ కొడుకు పదవ తరగతి ఫెయిల్ అయితే అటెండర్ కూడా కాలేడు. అందువల్ల ఆధునిక విద్య, నైపుణ్యాలతో ఆధునిక కాలంలో ఎవరికివారే సొంతంగా ఎదిగినప్పుడే వారి అభివృద్ధి సాధ్యం. ఆస్తి హక్కు వారసత్వంగా కొనసాగేవారికి ఆస్తి అందవచ్చేమో గానీ, జ్ఞానం అందే అవకాశం తక్కువ. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు కావల్సింది జీవన ప్రమాణాల పెరుగుదల, స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం, సమానావకాశాలు, ఆత్మగౌరవం. అందువల్ల అభివృద్ధిలో అందుకుంటున్న వాటాయే, అందుకోవాల్సిన వాటాయే ఉద్యమాలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు మౌలికాంశంగా ఉండాలి.

సైన్స్ టెక్నాలజీ శాస్ర్తాలు, అవకాశాలు అందరికి సమానంగా అందడాని కి కుటుంబం, గ్రామం, కులం, జిల్లా ప్రాతిపదికలుగా ప్రతి దశలో ప్రణాళికలు రూపొందించడానికి ఉద్యమాలు అవసరం. ఆగిపోయిన చైతన్యాన్ని, సంస్కృతిని, మానవ సంబంధాల తీరును, రక్తసంబంధాల తీరును, స్త్రీ, పురుష, కుల వివక్షను, ప్రాంతాల మధ్య అసమానతలను, మైండ్ సెట్ మార్చడానికి భావజాల, సాంస్కృతిక, భౌతిక ఉద్యమాలు అవసరం. ప్రజల జీవన ప్రమాణాలు, సంస్కృతి విలువలు, విద్య, వైద్య, మానవీ య విలువలు, వైజ్ఞానిక ఆవిష్కరణలు, ఆధునిక అభివృద్ధి అందుకొని ఎదు గడానికి, నూతన సంస్కృతి, మానవ సంబంధాలు, రక్తసంబంధాలు ఎదుగడానికి అప్పుడప్పుడు భావజాల, భౌతిక ఉద్యమాలు అవసరమవుతా యి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు మేళవించి సంపద ఉత్పత్తులు పెంచడం అవసరం. అందుకు చెరువులు, కుంట లు, వాన నీళ్ళు, నదులు, వాగుల నీరు నిల్వ చేసుకోవడం అవసరం.

బావు లు, బోర్లు అవసరమైనప్పుడు అవికూడా ఎంతో అవసరం. ఏదైనా అది వాన నీళ్ల మిగులు జలాలే. అందువల్ల నీళ్లను వాన నీళ్లను నీళ్ల సమస్త రూపా ల్లో నిల్వ చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన పని. కనుక చెరువులు, కుంటల పూడికలు తీసి అందులోని మట్టిని పొలాల్లో సారవంతం చేసుకోవడానికి వేసుకోవడం అవసరం. చెరువు కట్టలు, చెరువులు బాగు చేసుకొని చెరువు లోతు పెంచుకొని, పంటలు పండించడం అవసరం. తద్వారా పంట పెరుగుతుంది.

పని దినాలు పెరుగుతాయి.ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలు పాఠ్యాంశాలుగా రూపొందించబడటంవల్ల, ఆధునిక విద్య అందుకోవడం అవసరం. తద్వారా ఉపాధి సౌకర్యాలు మెరుగవుతాయి. ఇందుకు వెనుకబడిపోయిన వారు అవి కావాలని కోరుకుంటారు. అందుకు జనాభా దామాషా, రిజర్వేషన్లు, కుటుంబం, కులం, ప్రాంతం, ప్రాదేశిక నియోజకవర్గాల పరిధి, రాష్ట్రం మొదలైన ప్రాతిపదికలను ముందుకుతెస్తారు. వాటిని మౌలిక అంశాలుగా, యూనిట్లుగా వర్గీకరిస్తారు. అలాగే స్త్రీలు, పురుషుల మధ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇతరవర్గాల మధ్య, మతాల మధ్య సాపత్యం, సారూప్యం చర్చిస్తారు. తమకు కావల్సిం ది, రావల్సింది డిమాండ్ చేస్తారు. అందుకు ఉద్యమిస్తారు.

రెండువేల ఏళ్ళుగా ఎలాంటి మార్పులేని గణతెగలు, ఆదివాసీలు, ఆధునిక జీవన ప్రమాణాలు అందుకోవడానికి అందరితో సమానంగా ఎదుగడానికి ఎంతకాలం పడుతుంది? ఆధునిక విద్యతోనే అన్ని సాధ్యమైనప్పు డు ఆధునిక విద్య అందుకోవడానికి ఎంతకాలం అవసరం? ఐదేళ్ళప్రా యం నుంచి చదువుకుంటే 17 సంవత్సరాల విద్య (10+2+3+2= 17) తో ఏదో ఒక ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, సీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ వంటివి పూర్తిచేయవచ్చు. తద్వా రా మానవ సమాజం ఆయా శాస్ర్తాల్లో సాధించిన అత్యున్నత అభివృద్ధిని కనీస మాత్రంగా నేర్చుకోవడం, తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత నిత్య విద్యార్థి గా, పరిశోధక విద్యార్థిగా ఎంఫిల్‌లు, పీహెచ్‌డీలు, పోస్ట్ డాక్టరేట్లు మరో ఐదారేళ్ళు పట్టవచ్చు.

మొత్తంగా 22 సంవత్సరాల చదువు అధ్యయనం, పరిశోధనతో ఎవరై నా ఎదుగడం సాధ్యమే. కనుక 5+17+5=27 సంవత్సరాల వయస్సునాటికి ఆయా శాస్ర్తాల్లో ఒక అత్యున్నతస్థాయి అధ్యయనం పూర్తవుతుంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మొదలుకొని డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, ఎంబీ ఏలు, సీఏలు ఎదుగుతారు. ఇతర రంగాలలోనైతే వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా, జాబ్ గివర్స్‌గా, పెట్టుబడిదారులుగా, ఐకాన్‌లుగా ఎదుగుతారు.శాంతియుతంగా అభివృద్ధి, అధికారం సాధించలేం అనుకునేవారు ఆయుధాలు పడుతారు. సాయుధ పోరాటాలతో అధికారంతో వచ్చేవారు అధికారంలోకి వచ్చాక శాంతియుత పరివర్తనతో సమసమాజాన్ని సాధిస్తామని అంటారు.

ఆయుధాలు నమ్మినవారు శాంతియుత పరివర్తనను విశ్వసించడం, ఆచరించడం అంత సులభం కాదు. వారు తిరిగి సాయుధంగానే తమ వ్యతిరేకులను రకరకాల పేర్లుపెట్టి అణచివేయడం, భౌతికంగా తొలి గించడం జరుగుతూ వచ్చిన విషయం చరిత్రలో గమనించవచ్చు. శాంతియుత పరివర్తనను నమ్మేవారు, అదిప్పుడే ఆచరిస్తూ శాంతియుతంగా సాధించగలిగే అభివృద్ధినంతా అందుకోవడానికి ప్రజల అభివృద్ధి కోసం కృషిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సామాజికశాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఆవిష్కర్తలు తమ వైజ్ఞానిక, సాంకేతిక నైపుణ్యాలు ప్రజలకు ఏ వ్యవస్థలోనైనా సరే అందరికి అందాలని అనేకవిధాలుగా కృషిచేస్తున్నారు.

అందులో భాగంగానే ఇవాళ ఇంటర్నెట్, సెల్‌ఫోన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, స్కైప్, విద్యుత్, రేడియో, టీవీ, , రైళ్ళు, విమానాలు, బస్సులు, జీపులు, కార్లు, బైకులు, సైకిళ్లు అన్నిదేశాల్లో, అన్ని వ్యవస్థల్లో అందుబాటులోకి వచ్చాయి. దీన్ని మరింత వేగంగా ప్రజలకు అందిస్తూ సంపదసృష్టిలో ముందుకు సాగ డం కోసం ఆయా ఉద్యమాలు, ప్రజలు, ప్రభుత్వాలు, ఆయా సామాజిక వర్గాలు కలిసికట్టుగా, కాస్త సంఘర్షణాయుతంగానైనా కృషిచేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏ వ్యవస్థలోనైనా ప్రజలు సుఖిస్తారు. కొందరు యుద్ధ విజయాల ద్వారా అధికారంలో ఉండవచ్చు. అయినా సరే వారు ప్రజల కోసం శాంతియుత పరివర్తన ఏ మేరకు సాధ్యమో అది చిట్టచివరి దాకా సాధించాలి.

1977-82 నుంచి లెక్క వేసుకున్నా 35 ఏళ్ళ ఉద్యమాల తర్వాత టీవీ ల్లో, ప్రదర్శనల్లో ఆదివాసులు ఎండిపోయిన చేపల్లా కనపడటం విచారక రం. వారి ఎత్తు, చిత్తు, ఆహారం, ఆహార్యం, దేహదారుఢ్యం, జీవన ప్రమాణాలు, సంస్కృతి, సంపద సృష్టిలో, ఆధునిక అభివృద్ధి అందుకోవడంలో ఎంతో వెనుకబడి ఉన్నారనిపిస్తుంది. 35 ఏళ్ళ ఉద్యమాలు వారికి అందించిన సౌఖ్యాలేమిటి? అభివృద్ధి ఏమిటి? వారు విద్య, ఉద్యోగ, ఉపాధి రం గాల్లో, సంపద సృష్టిలో, నైపుణ్యాల్లో సాధించిన అభివృద్ధి, మౌలికాంశంగా పరిశోధనలు, విశ్లేషణలు జరిగినప్పుడే ఆయా సామాజిక వర్గాలు, ఆదివాసులు ఏమేరకు ఎదుగుతున్నారో ఉద్యమాలు వారి జీవితాల ఎదుగుదలకు ఏ మేరకు సహకరిస్తున్నాయో తెలుస్తుంది.

స్థానిక వనరులతో, చెరువులు, కుంటలు, పొలాలు సస్యశ్యామలం చేసుకోవడంతోపాటు, అటవీ ఉత్పత్తులను ఇతోధికంగా పెంచి, సంరక్షించి మార్కెట్ చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులు ఎకరాకు అనేక రెట్లు సాధించడం మౌలికాంశం. తాగు, సాగునీరు, ఆధునిక విద్య వంటి కనీస అవసరాలు తీరేవిధంగా అభివృద్ధి క్రమాలకు ఉద్యమాలు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజలు ఎదుగుతారు. ఆదివాసుల, ఆయా సామాజిక వర్గాల ఎండిపోయిన చేపల్లా, పౌష్ఠికాహారం లోపంతో ఉన్న శరీరాకృతి నుంచి కనీసం అరవై కిలోల బరువు, ఐదు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు, చిత్తుకు ఎదిగితే అది అనేక ప్రశ్నలకు జవాబు గా ఉంటుంది. అలాగే అందరు కనీసం డిగ్రీ, బీటెక్, బీఈడీ, మెడిసిన్, పీజీ, పీహెచ్‌డీ దాక విద్యావంతులవ్వాలి.

టీచర్లుగా, లెక్చరర్లుగా, ఆధునిక వ్యవసాయదారులుగా, కాంట్రాక్టర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, ప్రజా ప్రతినిధులుగా, సైంటిస్టులుగా, సామాజిక శాస్త్రవేత్తలుగా ఎదుగాలి. వీరంతా ఆయా ఆదివాసీ గణతెగల నుంచి ఎదుగడం అవసరం. ఇలా ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో 15-18 ఏళ్ళల్లో సాధిస్తున్న అభివృద్ధి పరిణామాలు మరింత వేగవంతం చేసినప్పుడే అది నిజమైన సామాజిక పరిణామం.

417
Tags

More News

VIRAL NEWS