స్వపాలనలో కళాకవితా సుగంధాలు

Sat,June 17, 2017 12:19 AM

ఈ నలుగురి అపూర్వ సమ్మేళనంతో అనతి కాలంలోనే సాహిత్య సాంస్కృతిక రంగాలు స్వర్ణయుగాన్ని చవిచూడనున్నాయి. వీరు చేపట్టే సాహిత్య, సాంస్కృతిక రంగాల పునర్నిర్మాణానికి కవులు, రచయితలు, కళాకారులు కూడా తగిన సహాయ సహకారాలు అందించాల్సి ఉన్నది.

పరాయి పాలనలో అన్నిరంగాలు వివక్షకు గురైనట్లే తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలు పూడ్చలేనంతవివక్షకు గురయ్యాయి. తెలంగాణ మట్టిలో తరగని సారం ఉన్నది. ఇక్కడి కవుల్లో, కళాకారుల్లో అనంతమైన స్పందనోత్తేజం దాగి ఉన్నది. కళలకు, సాంస్కృతిక రంగాలకు జనాదరణ తో పాటు ప్రభుత్వాల ప్రోత్సాహం ఎంతైనా అవసరం. కనీస సదుపాయాలు, సౌకర్యాలు, కళలకు, కళాకారులకు సమకూర్చి ప్రభుత్వాలు సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అభివృద్ధి పేరిట కళలను, కళారూపాలను, సాహితాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం చేశారు. ప్రభుత్వాల ఆదరణ కొరవడినా ఇక్కడి ప్రజలు తమతమ హృదయ స్పందనలను రచనల ద్వారా కళల ద్వారా ఈ ప్రాంత వైభవాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. ఉద్యమ కాలంలో కవులు, కళాకారులు తమతమ రచనల ద్వారా, కళా ప్రదర్శన ల ద్వారా జనచైతన్యాన్ని ప్రోది చేయడంలో సఫలీకృతులైనారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల అకాడమీలు రద్దయి సాం స్కృతిక జీవనం ఒకింత కుంటుపడింది. రాష్ట్రం ఏర్పడింది. ప్రజల కలలు పండినయి. కవులు, కళాకారులు జనాదరణతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఆశిస్తున్నారు.

ఎక్కడ సాహిత్య, సాంస్కృతిక రంగాలు సుసంపన్నంగా, వైభవోపేతంగా వర్ధిల్లుతాయో ఆ రాజ్యం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది. ప్రజలు భౌతిక అవసరాల్నే కాదు బౌద్ధిక సౌకర్యాలను ఆశిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వైపు అడుగులేస్తూ అన్నిరంగాల పునర్ని ర్మాణానికి పూనుకున్నట్లే సాహిత్య, సాంస్కృతికరంగాల పునర్నిర్మాణాని కి, పునర్వికాసానికి పూనుకున్నది. ముఖ్యమంత్రే, స్వయంగా సాహిత్యకారుడు కావడం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు వరం. నిబద్ధత, నిర్మాణాత్మక దృష్టితో ఈ రంగాల అభివృద్ధి కోసం మూల స్తంభాల వంటి నలుగురు సాహితీ దిగ్గాజలకు ఈ బాధ్యతను అప్పగించి చిత్తశుద్ధి ప్రదర్శించా రు. వారిలో ప్రథముడు, అపారమైన అనుభవం, సాహిత్య, సాంస్కృతి క రంగాల్లో అభినివేశం ఉన్న సకలజనులను సమాదరించే ప్రభుత్వ సాం స్కృతిక సలహాదారు కేవీ రమణాచారి. ఎటువంటి కళాకారున్నైనా ప్రోత్సహంచే సహృదయుడు. రెండవ వారు నిబద్ధత, సృజనశీలత, క్రియాశీల త ముప్పురిగొన్న ఉద్యమ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి. వీరు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమితులు కావడంతో తెలంగాణ సాహిత్య చరిత్ర మరో మలుపు తిరుగనున్నదని సాహిత్యకారుల ప్రగాఢ విశ్వాసం.

ఈ ప్రాంత కళల పట్ల, సంస్కృతి పట్ల అపారమై న గౌరవం కలిగి నిత్య చైతన్యంతో కవిగా, గాయకునిగా ఉత్తేజాన్ని కల్పి స్తూ అభ్యుదయానికి బాటలు వేస్తున్న యువకుడు దేశపతి శ్రీనివాస్. వీరి కి తోడుగా పేరుకు మాత్రమే అధికారి, గొప్పకవి, అనువాదకు డు, పరిపాలనాదక్షుడు మామిడి హరికృష్ణ. వీరు రాష్ట్ర సాంస్కృతిక వ్యవహా రాల శాఖ సంచాలకులుగా ఉండటం మరింత ప్రోత్సాహాన్నిచ్చే అంశం. ఇంతవరకు అందరి సహకారంతో ఒంటిచేతి మీద ఈ మూడేళ్ళలో తెలంగాణ సంస్కృతిని, కవిత్వాన్ని ప్రతిబింబించే సంకలనాలను అయిదారు తీసుకొచ్చారు. అవి కొత్తసాలు, తొలిపొద్దు, తంగేడు, మట్టిముద్ద, తల్లివే రు, హరితహారం వంటి అపురూప సంకలనాలు. వీటిని ప్రచురించడంతో కవులు కవనోత్సాహంతో ఉన్నారు.పైన పేర్కొన్న నలుగురి ఆలోచనా విధానాలు ఏకోన్ముఖంగా సాగుతుండటంతో తెలంగాణ సాంస్కృతిక వైభవం వేయి వెలుగులు పంచుతుందనడంలో సందేహం లేదు. భాష, సంస్కృతి, కళల పట్ల మంచి పట్టు, అవగాహన, ప్రణాళికలున్న కేవీ రమణాచారి వంటి పెద్దలు ఏమైనా సమ స్యలుంటే ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకపోగల నేర్పరులు. నిధులు రాబట్టే చతురులు. వీరి సూచనలతో, సలహాలతో సాహిత్య, సాంస్కృతిక రంగాలవృద్ధి వేగవంతం అవుతుందని భావించవచ్చు.

సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమితులైన వెంటనే నందిని సిధా రెడ్డి అన్ని జిల్లాల కవులతో, రచయితలతో సంప్రదింపులు చేపట్టారు. పునర్నిర్మాణానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కవిగానే కాక తెలంగాణ ఉద్యమకాలంలో రచయితలనందరినీ, అన్ని భావజాలల వారిని ఏకతాటిపై తీసుకరాగలిగిన చొరవ, నిబద్ధత అతనిలో మనం చూశాం. అన్నిచోట్లా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అనేక మహాసభలు విజయవంతంగా నిర్వహించి ఎందరో యువ కవుల కు ప్రేరణ కలిగించారు. వారు వెన్నుతట్టి, మార్గదర్శనం చేసిన ఎంద రో ప్రస్తుతం విస్తృతంగా రాస్తున్నారు. అతిత్వరలో ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ గర్వించే విధంగా వీరి నేతృత్వంలో మనం నిర్వహించుకోబోతున్నాం. ఇదం తా మనకు స్ఫూర్తిని, ఉత్సా హాన్నిచ్చే అంశాలు. తెలంగా ణ సాహిత్య అకాడమీ ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. అరుదైన పుస్తక ప్రచురణలు, తెలంగాణ సాహిత్య నిర్దిష్ట చరిత్ర, ఉత్తమ రచనల కు ప్రోత్సాహాలు తదితర అం శాలెన్నో సాహిత్య అకాడమీ ముందున్నాయి. ఇవన్నీ సిధారెడ్డి నేతృత్వం లో నెరవేరుతవని అందరు భావిస్తున్నారు. సిధారెడ్డికి సన్నిహితుడు, కవి, గాయకుడు, ఉద్యమోపజీవి. ఉద్యమకాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు నిలువెత్తు సాక్షి దేశపతి శ్రీనివాస్. కళా, సాహిత్య రంగాల పట్ల సరైన అవగాహన కలిగిన వ్యక్తి ప్రభుత్వ సలహాదారుగా ఉండటం ఈ రంగాల కు అదనపు ప్రయోజనమే. ఈ ముగ్గురి రూపకల్పనలతో, ఆలోచనలతో, సలహాలతో, సూచనలతో, నిబద్ధతతో భాషా, సాంస్కృతికశాఖ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లగలదని ప్రజల విశ్వాసం.

ఇతర ప్రభుత్వ అధికారిని ఎవరినైనా సంచాలకులుగా భాషా సాంస్కృతిక శాఖకు కేటాయించినట్లయితే కార్యక్రమాలు మొక్కుబడిగా సాగేవే మో. మామిడి హరికృష్ణ యువ కవి, బహు భాషావేత్త, క్రియాశీలత కలిగిన వాడు మనకు లభించడంతో రవీంద్రభారతి పరిసరాలు కళా, కవితా సుగంధాలతో పరిమళిస్తున్నాయి. వీరు ప్రణాళికలు మరింత విస్తృత పరి చి జిల్లా కేంద్రాల్లో అనేక సాహిత్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరిం త చేరువ కావలసి ఉన్నది.ఈ నలుగురి అపూర్వ సమ్మేళనంతో అనతి కాలంలోనే సాహిత్య సాం స్కృతిక రంగాలు స్వర్ణయుగాన్ని చవి చూడనున్నాయి. వీరు చేపట్టే సాహి త్య, సాంస్కృతిక రంగాల పునర్నిర్మాణానికి కవులు, రచయితలు, కళాకారులు కూడా తగిన సహాయ సహకారాలు అందించాల్సి ఉన్నది.
kotla

357
Tags

More News

VIRAL NEWS