బహిరంగ ధూమపానం నిషేధించాలె

Fri,May 19, 2017 12:56 AM

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయ రాదని, అలాచేస్తే జరిమానా కూడా ఉం టుందని కోర్టు ఉత్తర్వులు, పోలీసుల హెచ్చరికలున్నాయి. నిషేధం అమలు విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. బహిరంగ ధూమపానం వల్ల సిగరెట్, బీడీ, చుట్ట తాగినవారే కాకుండా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి బహిరంగ ధూమపాన నిషేధం అమలు పట్ల ప్రభుత్వాలు, అధికారులు కఠినంగా వ్యవహరించాలి. పొగ రాయుళ్లపై జరిమా నాలు విధించాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి.
- తవుటు రాంచంద్రం, జగిత్యాల

తీరుమారాలె
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా ప్రతిపక్షాల తీరుమాత్రం మారడం లేదు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్య క్రమాన్ని షురూ చేసినా ఏదో రకంగా అడ్డుపడాలనుకోవడం యం. ప్రతిపక్షాలు కొత్తరాష్ర్టానికి అవసరమయ్యే అంశాల మీద పోరా టం సాగిస్తే ప్రజలు హర్షిస్తారు.
- బక్క బాబురావు, సికింద్రాబాద్

దేశీయ గొర్రెలే మేలు
రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ఇవ్వతలపెట్టిన గొర్రెల ను ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చిస్తే అవి ఇక్కడి వాతావరణంలో ఇమడలేక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మాత్రమే గొర్రెలను సేకరించి ఇస్తే బాగుంటుంది. అవి తెలంగాణ ప్రాంత వాతావరణంలో మనగలుగుతాయి.
- బెల్లి చంద్రశేఖర్, యాదాద్రి భువనగిరి జిల్లా

334
Tags

More News

VIRAL NEWS