మారని చదువులు


Fri,January 18, 2019 01:16 AM

అందరికీ విద్య లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రత్యేక కార్యాచరణలతో విద్యావ్యాప్తికి కృషిచేస్తున్నాయి. అయితే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలంటే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే బడి విధానం అవసరమని కొఠారీ కమిషన్ సూచించింది. కామన్ స్కూల్ విధానంతోనే విద్యాప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశముంటుందని విద్యావేత్తలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోంచే అలహాబాద్ హైకోర్టు నిర్దేశాలు గమనించదగ్గవి.


ప్రథమ్ సంస్థ ఏటా వెల్లడిస్తున్న విద్యాస్థితి నివేదిక క్షేత్రస్థాయి వాస్తవాలకు నిలువుటద్దంగా నిలిచింది. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగిన తీరు కొంతఊరట కలిగించింది. అయితే విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నది. పదాలు, వాక్యాలు చదువగలిగే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా మరింత తగ్గిందని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(అసర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 596 జిల్లాల్లోని మూడు నుంచి పదహారేండ్ల వయసున్న ఐదు లక్షలకు పైగా విద్యార్థుల పై విద్యా ప్రమాణాల విషయంలో చేసిన అధ్యయనంలో తేలిన ఈ చేదు నిజాలు మన విద్యావ్యవస్థ దురవస్థను చాటి చెబుతున్నది. 2007తో పోలిస్తే బడిలో చేరని పిల్లల సంఖ్య మూడు శాతం తగ్గింది. కానీ విద్యా ప్రమాణాల్లో మాత్రం 2.8 శాతం పడిపోవటం దిగ్భ్రాంతికరం. అస ర్ అధ్యయనం ప్రకారం- ఐదవ తరగతి విద్యార్థుల్లో రెండవ తరగతి స్థాయి పాఠ్యాంశాలు చదువగలిగే విద్యార్థులు 2016లో 47.1 శాతం ఉంటే, 2018 నాటికి అది 43.6 శాతానికి పడిపోయింది. 8వ తరగతి విద్యార్థుల్లో 76.1 శాతం నుంచి 69.5 శాతానికి పడిపోవటం ఆందోళన కలిగించేదే. మెరుగైన విద్యా ప్రమాణాలకు ఉపాధ్యాయుల నియామకమే కీలకం. కానీ దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల పాఠశాలల్లో 10.3 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే లోపం ఎక్కడ ఉన్నదో తెలుస్తున్నది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వారి పని విధానం కారణంగానే పల్లె నుంచి పట్టణాల దాకా ప్రాథమిక స్థాయిలో పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల ప్రైవేట్ బాట పడుతున్నారు. తాజా అసర్ అధ్యయనం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువులో మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం.

అసర్ రిపోర్టు వెలువడిన రెండు మూడు రోజులు దేశవ్యాప్తంగా చదువుల స్థితిగతులపై చర్చ జరుగటం, ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవటం పరిపాటి అయ్యింది. గత కొన్నేండ్లుగా ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఏటా పాఠశాల విద్యపై అధ్యయన రిపోర్టును వెలువరిస్తూ విద్యా ప్రమాణాల్లో ఉన్న దీన స్థితిని చెబుతూనే ఉన్నది. ఏడెనిమిది తరగతుల విద్యార్థులు సైతం కనీస కూడికలు, తీసివేత లెక్కలు చేయలేని దుస్థితిని చెబుతూనే ఉన్నది. అక్షరాలను గుర్తించి చదువలేని స్థితిని చూపు తూ మన చదువుల దీన హీన స్థితిని గురించి హెచ్చరిస్తూనే ఉన్నది. అయినా విద్యాప్రమాణా ల్లో గుణాత్మక మార్పుల్లో అడుగు ముందుకు పడటం లేదు. మరోవైపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవటం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాల నెపంతో అసలు సమస్యను దాటవేసే ధోరణి సాగిపోతున్నది. మన దేశీయ సంప్రదాయ విద్యా క్రమాన్ని, ప్రైవేట్ విద్యాసంస్థల తీరుతెన్నులను చూస్తే, విద్యాప్రమాణాలకు మౌలిక వసతులు, సమస్యలు అసలు అవరోధాలే కావని తేటతెల్లమవుతుంది. విద్యా విషయ సమస్య అంతా చదువులు చెప్పే బోధకుల్లోని నిబద్ధతలో ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లటానికి ఉపాధ్యాయుల తీరు తెన్నులే కారణమని అనేక అధ్యయనాలు చెప్పాయి. పనిచేసే చోటనే ఉండకపోవటం, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపటం లాంటి చర్యలతో ప్రజలకు ప్రభుత్వ బడులపై పూర్తిగా విశ్వాసం సన్నగిల్లింది. తాజా నివేదికలో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాల్లోనే కన్నా ప్రభుత్వ బడుల్లోనే విద్యాప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని తేలింది.

అందరికీ విద్య లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రత్యేక కార్యాచరణలతో విద్యావ్యాప్తికి కృషిచేస్తున్నాయి. అయితే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలంటే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే బడి విధానం అవసరమని కొఠారీ కమిషన్ సూచించింది. కామన్ స్కూల్ విధానంతోనే విద్యాప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశముంటుందని విద్యావేత్తలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోంచే అలహాబాద్ హైకోర్టు నిర్దేశాలు గమనించదగ్గవి. ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే ప్రతి ఒక్కరూ అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా తమ పిల్లల్ని తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరించేవారు ప్రైవేట్ పాఠశాలలకు ఫీజుల రూపంలో ఎంత మొత్తం చెల్లిస్తారో, అంతే మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలి. ఆ మొత్తాన్ని ప్రభుత్వ బడుల్లో చేరిన పిల్లల మౌలిక అవసరాల కల్పనకు ఖర్చు చేయాలని అలహాబాద్ హైకో ర్టు సూచించటం గమనించదగ్గది. సరిగ్గా ఈ స్ఫూర్తికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యతో పాటు, సంక్షేమ హాస్టళ్లన్నింటిలో మెరుగైన పౌష్టికాహారం అందిస్తున్న ది. అన్నివర్గాల ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ విద్యాప్రమాణాల విషయంలో కూడా ఆదర్శంగా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నది. తాజా అసర్ రిపోర్టు చూసిన తర్వాతనై నా సమాజంలో చలనం రావాలి. మెరుగైన విద్యా ప్రమాణాల కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగానే ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాలి.

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles