తెలంగాణ గెలువాలె

Wed,December 5, 2018 11:05 PM

సర్వేల పేర ఓటర్లను తప్పుదోవ పట్టించే కుట్రలు సాగుతున్నాయని గ్రహించడం వల్లనే నమస్తే తెలంగాణ వాస్తవ పరిస్థితిపై ఒక అధ్యయనం సాగించి ప్రజల ముందుపెట్టింది. ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారనేది ముందే వెల్లడించడం ఈ సర్వే ఉద్దేశం కాదు. బ్యాలట్ పెట్టెలు విప్పిన తర్వాత వెల్లడయ్యేవే అసలైన ఫలితాలు. కానీ, మనం వాస్తవ పరిస్థితిని తెలుసుకొని సర్వసన్నద్ధమై ఉన్నప్పుడు, ప్రత్యర్థులు అడ్డగోలుగా తప్పుడు ప్రచారాలకు దిగడానికి జంకుతారు.

తెలంగాణ సాధించి, నాలుగున్నరేండ్లు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిపాలనపై ప్రజల తీర్పు ఇవ్వడానికి ఇక ఒకరోజు వ్యవధి ఉన్నది. అధికారం లో ఉన్న నాయకుడు ధైర్యంగా తన పరిపాలనపైనే ప్రజల తీర్పు కోరడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. తాను అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు ఆందోళనల రూపంలో, కోర్టుకేసుల ద్వారా అవరోధాలు కల్పిస్తున్న నేపథ్యంలో, ప్రజాభిప్రా యం కోరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఈ ప్రచారంలో కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చర్చానీయాంశాలుగా మారాయి. కేసీఆర్ అసాధారణమైన రీతిలో స్వయంగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలకు తన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ముఖ్యం కాదని ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలువాలని బోధించారు. నాయకులు చెప్పింది వినడం కాదు, సభ నుంచి తిరిగిపోయిన తర్వాత మీ గ్రామాల్లో చర్చించుకోండి అని మార్గదర్శనం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు, ప్రజల్లో ఉత్తమ రాజకీయ సంస్కృతిని నెలకొల్పాలనే కేసీఆర్ దృక్పథం ప్రశంసనీయమైనది. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు భాగస్వామ్యం బాధ్యత ఉంటాయనే అవగాహన ప్రజలకు కలుగుతుంది. ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ఎన్నికలు ప్రకటించిన నాటినుంచి టీఆర్‌ఎస్‌ది కొంత పైచేయిగానే ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ను గట్టిగా ఢీకొట్టాలనే వీరావేశం తొణికిసలాడింది. గెలుపో టముల సంగతెట్లా ఉన్నా, టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల కనిపించింది. కానీ ఆ ఊపు ఎంతోకాలం నిలబడలేదు. నాయకు లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఉద్యమకాలం నుంచి చంద్రబాబు తన మాటలు, చేష్టల ద్వారా తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్నాడు.

కాంగ్రెస్ నాయకత్వం అతడిని నెత్తిన పెట్టుకోవడాన్ని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. కిందిస్థాయి నాయకుల్లో కూడా నైతిక సందిగ్ధత ఏర్పడ్డది. ప్రజల్లో తిరిగే కొద్దీ తాము ఓడిపోయే యుద్ధం చేస్తున్నామనే నైరా శ్యం వారిని ఆవరించింది. దీంతో రాష్ట్రమంతా చుట్టి ప్రచారం చేద్దామని భావించిన స్టార్ క్యాంపేయినర్లు కూడా తమ నియోజకవర్గాల కు పరిమితం కావలిసిన పరిస్థితి ఏర్పడ్డది. నవంబర్‌లో జరుగుతాయని భావించిన పోలిం గ్ డిసెంబర్‌కు జరుగడం తమకు అనుకూలమని మొదట కాంగ్రెస్ నాయకులు భావించారు. కానీ కూటమిలో సీట్ల సర్దుబాటు బాగోతం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం తర్వాత కూడా తెగకపోవడం ఆ పార్టీల ప్రతిష్ఠను దిగజార్చింది. చంద్రబాబునాయుడు ప్రచారంలోకి దిగే కొద్దీ కాంగ్రెస్ పార్టీ వారికి ఇరకాటం ఎక్కువైంది. సోనియా గాంధీని తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పించడంతో తెరవెనుక చక్రం తిప్పేది చంద్రబాబనే అభిప్రాయం ప్రజల్లో బలపడ్డ ది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు అయినప్పటికీ, ఈ సందర్భంగా ఉద్యమ వాతావరణం నెలకొనడం విచిత్రం. మొదట్లో చర్చ అంతా కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలపైనే సాగింది. కానీ చంద్రబాబు ప్రవేశించడంతో తెలంగాణ స్వాభిమానం దెబ్బతిన్నది. తెలంగాణ ఉద్యమకారులు టీఆర్‌ఎస్‌కు మరింత అండగా నిలిచే పరిస్థితి ఏర్పడ్డది. టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయడం స్వాభిమాన ఉద్యమంగా మారిపోయింది. ఎన్నికలకు ముందు సర్వేలు జరుపడం సాధారణం. కానీ సర్వేల పేరుతో మైండ్‌గేమ్స్ ఆడటమనే వికృత ధోరణి ఇటీవల పెరిగిపోయింది. మరోవైపు ఆంధ్రామీడియా విలువలు మరిచి ప్రజలను తప్పుదారి పట్టించడంలో, తెలంగాణ ఉద్యమకారులను, రాజకీయశక్తులను అవహేళన చేయడంలో పేరు పొందింది. దీనికి ఇప్పుడు సోషల్ మీడియా తోడయింది.

ఆంధ్రా పాలక వర్గాలు, టీవీ చానెల్స్ ఎంత బరితెగించి అబద్ధాలు ప్రచారం చేయగలవనేది ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజలకు అనుభవమే. తెలంగాణ సాధించే క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్నప్పటికీ, ఆ విషయాన్ని చెప్పకుండా, నైరాశ్యాన్ని నింపడం వల్ల అనేకమంది పిల్లలు అమరులయ్యారు. ఈ ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణను చేజిక్కించుకోవడానికి ఆంధ్ర పాలకవర్గాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అబద్ధాలు, అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలె. సర్వేల పేర ఓటర్లను తప్పుదోవ పట్టించే కుట్రలు సాగుతున్నాయని గ్రహించడం వల్లనే నమస్తే తెలంగాణ వాస్తవ పరిస్థితిపై ఒక అధ్యయనం సాగించి ప్రజల ముందుపెట్టింది. ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారనేది ముందే వెల్లడించడం ఈ సర్వే ఉద్దే శం కాదు. బ్యాలట్ పెట్టెలు విప్పిన తర్వాత వెల్లడయ్యేవే అసలైన ఫలితాలు. కానీ, మనం వాస్త వ పరిస్థితిని తెలుసుకొని సర్వసన్నద్ధమై ఉన్నప్పుడు, ప్రత్యర్థులు అడ్డగోలుగా తప్పుడు ప్రచారాలకు దిగడానికి జంకుతారు. వారిని కొంతలో కొంతైనా అదుపు చేసినవారమవుతాం. అందువల్లనే నమస్తే తెలంగాణ పత్రిక పోలింగ్‌కు కొద్దిరోజులు ముందున్న మనోస్థితిని శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ప్రజల ముందుంచింది. తెలంగాణ ప్రజల విజ్ఞత శంకించవీలులేనిది. ఎంతోకా లం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పరాన్నభుక్కుల చేతబడకుండా ప్రజలు కాపాడుకుంటారనే ప్రబల విశ్వాసం ఉన్నది.

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles