ఉష్ణ గ్రహం!

Fri,August 10, 2018 01:03 AM

తెలంగాణలో చేపట్టిన హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు ఆశాకిరణాలని చెప్పటం వాతావరణ పరిరక్ష ణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న నిబద్ధతను చాటుతున్నది. నిజానికి అభివృద్ధి, పర్యావరణం రెండూ పరస్పర విరుద్ధ అంశాలు కావు. మానవ అభివృద్ధి వికాసాలకు ఈ రెండు అంశాలను సమతుల్యతతో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ పని దేశదేశాల్లో ప్రభుత్వాలు చేయకపోవడం వల్లనే నేడు ఈ దుస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లనుంచీ అభివృద్ధి గురించి చెబుతున్న ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.

జీవకోటికి అనువైన అరుదైన వరప్రదాయనిగా భూమికి పేరున్నది. మరే గ్రహంపై లేని విధం గా శీతోష్ణస్థితులు, గాలి, నీరు సమస్త ప్రాణికోటికి ఆవాసంగా పుడమి తల్లిని రూపుదిద్దాయి. కానీ కొన్ని దశాబ్దాల పరిణామాలతో జీవకోటి మనుగడకే కష్టమయ్యే స్థితి ఏర్పడుతున్నది. ఈ మధ్యనే పెరుగుతున్న భూ తాపంపై పరిశోధన చేసిన ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భూమి ఒక ఉష్ణగృహం (హాట్ హౌజ్)గా మారిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అం తేకాదు ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే భూమి పూర్వపుస్థితికి రావటం అసాధ్యమని అంటున్నారు. సముద్ర మట్టాలు పెరిగిపోయి సముద్ర తీరప్రాంతాలను, దేశాలనూ ముంచెత్తుతాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రత 4-5 డిగ్రీల మేర పెరిగితే, సముద్ర మట్టాలు 60 మీటర్ల ఎత్తుకు ఎగబాకే ప్రమాదమున్నదనేది ఆందోళన కలిగించేదే. మానవ కార్యకలాపాల కారణంగా రెండు డిగ్రీల సెల్షియస్ మేర ఉష్ణోగ్రత పెరిగితే, అది భూ వ్యవస్థలో ప్రతి చర్యలను రేకెత్తిస్తుంది. ఫీడ్‌బ్యాక్స్‌గా పిలిచే వీటి కారణంగా భూమి మరింత వేడెక్కిపోతుంది. ఈ చర్య-ప్రతిచర్యల కారణంగా భూమి క్రమేణా ఉష్ణగృహం లేదా ఉష్ణగ్రహంగా తయారయ్యే ప్రమాదం ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మానవ కార్యకలాపాల వల్ల భూతాపం పెరిగిపోయి వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని మొదట చెప్పినప్పుడు అందరూ దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే భూ ఉపరితలంపై విస్తారంగా విస్తరించి ఉన్న సముద్రాలు వాతావరణంలోని కార్బన్‌డై ఆక్సైడ్ ను గ్రహించి వేస్తాయని, దానిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. కాలం గుడుస్తున్నాకొద్దీ 1920 దశకంలో స్వీడన్ శాస్త్రవేత్త స్వాంటే అర్హీనియస్ చెప్పినది వాస్తవమని అనుభవంలోకి వస్తున్నది. సముద్రాలు విడుదలవుతున్న కార్బన్‌డై ఆక్సైడ్‌లో మూడో వంతు ను మాత్రమే గ్రహిస్తున్నాయి. మిగతా రెండు పాళ్ల బొగ్గుపులుసు వాయువు భూ ఉపరితలంపైనే పదేండ్ల కాలం ఉండి ఉష్ణగ్రతలు పెరగడా నికి హేతువవుతున్నది. పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక అవసరాల కోసం ఇంధన వినియోగం పెరుగుదల, అడవుల నరికివేత, పలుచనవుతు న్న పచ్చదనం మొదలైన కారణాల వల్ల వాతావరణంలో వేడి గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా పర్యావరణం గతితప్పింది. ఇది ఏ ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమైలేదు. కుండపోత వర్షాలు, ముంచుకొచ్చే వరదలు, తీవ్రమైన వడగాల్పులతో ఎండలు, పెను తుఫానులు మొదలైనవి మనిషిపై పగబట్టి దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలకు మన దేశం, తెలంగాణ కూడా మినహాయింపు కాదు. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగే పరిస్థితి ఉన్నదని పరిశోధనలు చెబుతున్నాయి. మూడు కాలాల్లో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈపీటీఆర్‌ఐ సగటు ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో అంచనా వేసింది. ఎనభైయవ దశకం నుంచి ఊష్ణోగ్రతలను, కాలాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రం మొత్తంగా 0.4 డిగ్రీలకు పెరిగిందని తెలుపటం గమనార్హం.

భూగోళం వేడెక్కడంపై ఎప్పటికప్పుడు చర్చించుకోవటమే తప్ప చర్యలు మాత్రం కానరావ టం లేదు. ఇప్పటివరకు 21 ప్రపంచ దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. కానీ కర్బన ఉద్గా రాల తగ్గింపు విషయంలో కట్టుబడి ఉన్న దేశాలు అరుదు. సదస్సుల్లో చేసిన తీర్మానాలు, ఒప్పందాలేవీ వాస్తవరూపం దాల్చలేదు. మొత్తంగా భూతాపానికి అభివృద్ధి చెందిన దేశాలు కారణం కాబట్టి, అవే ఆ భారాన్ని మోయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడిప్పుడే నిలదీస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు ఇంధన వినియోగాన్ని, థర్మల్, అణువిద్యుత్ ఉత్పత్తులను తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను చెబుతూనే ప్రపంచ దేశాలు త్యాగం చేయాలని అంటున్న అమెరికా, తాను మాత్రం ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకొని బాధ్యతలేని గడుసుతనాన్ని ప్రదర్శించటం గర్హనీయం. అంతర్జాతీయంగా పరిస్థితులు ఇలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నాయని ఈపీటీఆర్‌ఐ పేర్కొనటం ముదావహం. తెలంగాణలో చేపట్టిన హరితహా రం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు ఆశాకిరణాలని చెప్పటం వాతావరణ పరిరక్ష ణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న నిబద్ధతను చాటుతున్నది. నిజానికి అభివృద్ధి, పర్యావరణం రెం డూ పరస్పర విరుద్ధ అంశాలు కావు. మానవ అభివృద్ధి వికాసాలకు ఈ రెండు అంశాలను సమతుల్యతతో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ పని దేశదేశాల్లో ప్రభుత్వాలు చేయకపోవడం వల్లనే నేడు ఈ దుస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లనుంచీ అభివృద్ధి గురించి చెబుతున్న ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అడవుల విధ్వంసం, నిర్వాసిత సమస్యను కనిష్ఠ స్థాయికి కుదించి అభివృద్ధి ఫలాలను అందరికీ పంచే మహోన్నత కార్యానికి పూనుకున్నది. ఇది అందరికీ అనుసరణీయం, ఆదర్శం.

337
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles