కర్ణాటక తీర్పు

Wed,May 16, 2018 01:12 AM

కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా సాగించిన పోరాటంలో జనతాదళ్ (ఎస్) మనుగడ ప్రశ్నార్థకమయ్యేదే. కానీ జాతీయస్థాయిలో రాజకీయ పునరేకీకరణకు పావులు కదుపుతున్న కేసీఆర్ సందర్భోచితంగా జనతాదళ్ (ఎస్)కు మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో ఉంటున్న తెలుగువారి మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. జనతాదళ్ (ఎస్) ఎన్నికల ప్రణాళికకు కూడా కేసీఆర్ భావజాలం స్ఫూర్తిదాయకమైంది. కేసీఆర్ అండగా నిలువడం జనతాదళ్ (ఎస్)కు నైతిక బలాన్ని, ఆత్మైస్థెర్యాన్ని పెంచింది. రాబోయేకాలంలో జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్‌గా ఏర్పడుతాయని, ఏ జాతీయ పార్టీని పల్లకిలో ఎక్కించుకొని మోయబోవని స్పష్టమైంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్టుగానే ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డినా అధికారం చేపట్టడానికి కావలసిన సాధారణ మెజార్టీని సాధించలేకపో యాయి. సాధారణ మెజారిటీకీ అడుగుదూరంలో బీజేపీ 104 సీట్లకే పరిమితమవగా, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 సీట్లు తెచ్చుకున్నాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కర్ణాటక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ అయితే ఎన్నికల ప్రచారానికి 32 మంది కేంద్రమంత్రులను రంగంలోకి దించడమే కాదు, ప్రధాని మోదీ అన్నీ తానై ప్రచారాన్ని నిర్వహించారు. పరుష పదజా లంతో ప్రతిపక్షాలను నిందించటందాకా పోయారు. ఆయన వాడిన పదజాలంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిందంటే ప్రచారసరళి ఎంత ఉద్వేగభరితంగా సాగిందో అర్థం చేసుకోవ చ్చు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అయితే దక్షిణ భారతానికి కర్ణాటక ముఖద్వారమ ని, ఈ రాష్ర్టాన్ని చేజిక్కించుకొని దక్షిణ భారతానికి విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీని మళ్ళా గెలిపించిన సంప్రదాయం లేదు. ఆ సంప్రదాయానికి భిన్నంగా అధికారంలోకి రావాలని భావించిన సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రచార భారాన్నంతా ఒంటరిగా మోశారు. రాహుల్‌గాంధీ రంగంలోకి దిగినప్పటికీ, ప్రచార సరళి సిద్ధరామయ్యకు, మోదీకి మధ్య సాగినట్టుగానే కనిపించింది.

బీజేపీ పూర్తి మెజారిటీ సాధించనప్పటికీ, అధికారం ఎవరు చేపడుతారో ఇప్పుడే చెప్పలేనప్పటికీ, ఈ పార్టీ బలం విస్మరించలేనిది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ మ్యాజిక్ పనిచేయడం లేదనీ, అమిత్‌షా సత్తా కూడా పనిచేయడం లేదనే అభిప్రాయం క్రమంగా ఏర్పడుతున్న తరుణంలో కర్ణాటక ఎన్నికలు బీజేపీకి ఆత్మ స్థె ర్యాన్ని ఇచ్చాయి. గుజరాత్ ఎన్నికల్లో కష్టంగా గెలువడం, ఆ తర్వాత కొన్ని ఉప ఎన్నికల్లో ఎదురుగాలి వీయడం వల్ల మోదీ ప్రతిష్ఠ మసకబారుతున్నదనే ప్రచారం సాగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలో బీజేపీ పుంజుకున్న తీరు ప్రాధాన్యం గలది. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీశాయని చెప్పవచ్చు. కర్ణాటక చేజారిపోవడంతో, పంజాబ్ వంటి ఒక పెద్ద రాష్ట్రంతోపాటు పుదుచ్చేరి, మిజోరం మాత్రమే కాంగ్రెస్‌కు మిగిలాయి. రాహుల్ గాంధీ నాయకత్వం మరోసారి ప్రశ్నార్థకమైంది. సార్వత్రిక ఎన్నికలలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఆయన నిలబడగలరా అనే సందేహాన్ని కర్ణాటక ఫలితాలు మళ్ళా ముందుకు తెచ్చాయి. ప్రాంతీయ పార్టీలన్నీ యూపీఏలో చేరి రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించాలనే ప్రతిపాదన చేసే స్థాయిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సిద్ధరామయ్యకు కూడా ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పోటీచేసిన రెండు స్థానాలలో ఒకదానిలో ఓడిపోతే, మరో స్థానంలో తక్కువ సం ఖ్య ఓట్లతో గెలిచారు. కన్నడ అభిమానాన్ని రాజకీయంగా మలుచుకోలేకపోయారు. లింగాయత్‌లకు మతపరమైన మైనార్టీ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసినా ఆ సామాజిక వర్గం బీజేపీకే మద్దతు ఇచ్చింది. సిద్ధరామయ్య వ్యూహాలన్నీ ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వలేక పోయాయి.

కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా సాగించిన పోరాటంలో జనతాదళ్ (ఎస్) మనుగడ ప్రశ్నార్థకమయ్యేదే. కానీ జాతీయస్థాయిలో రాజకీయ పునరేకీకరణకు పావులు కదుపుతున్న కేసీఆర్ సందర్భోచితంగా జనతాదళ్ (ఎస్)కు మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో ఉంటున్న తెలుగువారి మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. జనతాదళ్ (ఎస్) ఎన్నికల ప్రణాళికకు కూడా కేసీఆర్ భావజాలం స్ఫూర్తిదాయకమైంది. కేసీఆర్ అండగా నిలువడం జనతాదళ్ (ఎస్)కు నైతిక బలాన్ని, ఆత్మైస్థెర్యాన్ని పెంచింది. రాబోయేకాలంలో జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్‌గా ఏర్పడుతాయని, ఏ జాతీయ పార్టీని పల్లకిలో ఎక్కించుకొని మోయబోవని స్పష్టమైంది. రేపు జాతీయస్థాయిలో ఏమి జరుగబోతోందో కర్ణాటక పరిణామాలు సూచిస్తున్నాయి. తాను స్వయంగా బీజేపీని ఎదుర్కోలేక పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ అధికారం చేపట్టకుండా నిరోధించడానికి, అతి వేగంగా స్పందించి, జనతాదళ్ (ఎస్)కు మద్దతు ప్రకటించక తప్పలేదు. ప్రజలు తిరస్కరించినందున వల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని కోరలేని పరిస్థితి కూడా ఉన్నది. కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కలిస్తే మెజారిటీ లభిస్తుంది. అయితే గవర్నర్ వజూభాయి వాలా ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. స్పష్టమైన మెజారిటీ కలిగిన నాయకుడు ఉన్నప్పుడు, మరో వ్యక్తిని ప్రభుత్వం చేపట్టవలిసిందిగా ఆహ్వానించడం తగదు. మెజారిటీ ఎవరూ కలిగిలేనప్పుడు మాత్రమే అతి పెద్ద పార్టీని పిలిచి ప్రయత్నాలు సాగించవచ్చు. అధికారం ఎవరు చేపట్టినా, కర్ణాటక ఓటర్ల తీర్పు మాత్రం జాతీయ పార్టీలు తమ వ్యూహాలను రచించుకోవడానికి ఒక ప్రాతిపదికను కల్పించాయి.

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles