న్యాయం కోరిన మూర్తులు

Sat,January 13, 2018 01:12 AM

న్యాయమూర్తులు కొందరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పుబట్టడం వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలుతుందనే భయాందోళనలు అవసరం లేదు. మన దేశంలో
ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పటికే వేళ్లూనుకున్నది. ప్రజలకు రాజ్యాంగ వ్యవస్థలపై ఇంకా నమ్మకం సడలలేదు. న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయనేది తెలుసు. ఇటీవలి కాలంలో కొందరు న్యాయమూర్తులు అపఖ్యాతిపాలైన మాట వాస్తవమే. అయినప్పటికీ స్థూలంగా చూస్తే న్యాయమూర్తుల విశ్వసనీయత దెబ్బతినలేదు. ఏ కొద్దిమంది వల్లనో ఈ విశ్వసనీయత ఇకముందు దెబ్బతినకుండా కాపాడుకోవాలె. ఇటీవలి పరిణామాలు న్యాయవ్యవస్థను సంస్కరించవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు గురువారం పత్రికా సమావేశం ఏర్పాటుచేసి ప్రధాన న్యాయమూర్తిని బహిరంగంగా తప్పుబట్టడం దిగ్భ్రాంతికరం. దేశ చరిత్రలో ఏనాడూ ఇటువంటి ఘటన చోటుచేసుకోలేదు. న్యాయవ్యవస్థలో ఆంతరంగికంగా ఎన్ని విభేదాలు ఉన్నా, న్యాయమూర్తులు గుంభనంగా వ్యవహరించడం పరిపాటి. సమాజంలో కలిమిడిగా తిరుగకుండా, సందేహాలకు అతీతంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అటువంటి ప్రధాన న్యాయమూర్తి తరువాత, అత్యంత సీనియర్ న్యాయమూర్తులు- చలమేశ్వర్, గొగోయి, లోకుర్, కురియన్ జోసెఫ్- బహిరంగంగా ప్రధాన న్యాయమూర్తిని తప్పుబట్టారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన వ్యవహారసరళిని మార్చుకోవాలని కొద్దినెలల కిందటే వీరు లేఖ రాసి ఆయనకు అందజేశారు. జస్టిస్ మిశ్రా నుంచి స్పందన లేకపోవడంతో, గురువారం ఉదయం ఆయనను కలుసుకొని చివరి ప్రయత్నంచేశారు. ఆయనలో మార్పురాదని గ్రహించి, బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో పరిణామాలు వాంఛనీయం కాదని, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా లేకపోతే, ప్రజాస్వామ్యం నిలువ జాలదని వారు అభిప్రాయపడ్డారు. కొద్దినెలల కిందట వారు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను వారు బయటపెట్టారు. న్యాయ వ్యవస్థలో తాజా పోకడలు ఆమోదయోగ్యంగా లేవనేది అందరికీ తెలిసిందే. కానీ న్యాయవ్యవస్థ వ్యవహారం కనుక, బహిరంగ విమర్శలు భారీస్థాయిలో వ్యక్తంకాలేదు. న్యాయమూర్తులే ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు న్యాయవ్యవస్థపై భిన్న కోణాలలో చర్చ జరుపడానికి ఆస్కారం ఏర్పడ్డది. దీనిని వ్యక్తిగత విభేదాలుగా కాకుండా, వ్యవస్థాగత లోపాలను సవరించుకోవడానికి మార్గంగా భావించాలె.

న్యాయమూర్తులు ముక్తసరిగా అయినా తమ విభేదాల కారణాన్ని వివరించారు. న్యాయమూర్తికి రాసిన లేఖ ద్వారా వారి వాదనలు స్పష్టంగా తెలుస్తున్నాయి. న్యాయస్థానం ముందు కు కేసులు వచ్చినప్పుడు, వాటిని ఏయే న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించాలనేది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. అయితే ఏది ఎవరికి కేటాయించాలనే విషయమై ఇప్పటికే స్థిరపడిన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం కేటాయిస్తే ఆరోపణలకు తావు ఉండదు. కానీ ప్రధాన న్యాయమూర్తి సుస్థిర సంప్రదాయాలను ఉల్లంఘి స్తూ, కొన్ని కీలకమైన కేసులను కొందరు న్యాయమూర్తులకే కేటాయిస్తున్నారు. సీనియర్ న్యాయమూర్తుల ముందున్న కేసులను, మరో ధర్మాసనానికి అప్పగించి, హడావుడిగా నిర్ణయాలు తీసుకు న్నతీరు అభ్యంతరకరమైనది. బీజేపీ నేత అమిత్ షా నిందితుడుగా ఉన్న కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అనుమానాస్పదస్థితిలో మరణించా డు. మెడికల్ కాలేజీ కుంభకోణం కొందరు న్యాయమూర్తులపై అనుమానాలు కలిగిస్తున్నది. ఇటువం టి కీలకమైన కేసుల విషయంలో ప్రధాన న్యాయమూర్తి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చిం ది. న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవి. ఇప్పటికైనా ప్రధాన న్యాయమూర్తి స్పందిం చి, ఆరోపణలకు తావులేకుండా వ్యవహరించి, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడాలె. ఈ వివాదాన్ని ఇంకా సాగదీయడం న్యాయవ్యవస్థకు, ప్రజాస్వామిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు.

న్యాయమూర్తులు కొందరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పుబట్టడం వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలుతుందనే భయాందోళనలు అవసరం లేదు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పటికే వేళ్లూనుకున్నది. ప్రజలకు రాజ్యాంగ వ్యవస్థలపై ఇంకా నమ్మకం సడలలేదు. న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయనేది తెలుసు. ఇటీవలి కాలంలో కొందరు న్యాయమూర్తులు అపఖ్యాతిపాలైన మాట వాస్తవమే. అయినప్పటికీ స్థూలంగా చూస్తే న్యాయమూర్తుల విశ్వసనీయత దెబ్బతినలేదు. ఏ కొద్దిమంది వల్లనో ఈ విశ్వసనీయత ఇక ముందు దెబ్బ తినకుండా కాపాడుకోవాలె. ఇటీవలి పరిణామాలు న్యాయవ్యవస్థను సంస్కరించవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. కొందరు న్యాయమూర్తులు నోరువిప్పడం కూడా మంచికే జరిగిందనుకోవాలె. న్యాయ వ్యవస్థలోని వారే ఈ సంస్కరణలకు పూనుకుంటే ప్రజలు హర్షిస్తరు. ఎక్కడైతే పారదర్శకత ఉండదో, అక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి జాడ్యాలుంటాయి. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే క్రమంలో అధికార పీఠం నుంచి న్యాయ వ్యవస్థను కాపాడటం ప్రధాన ఆశయంగా ఉండేది. కానీ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వా మ్యం పరస్పర విరుద్ధమైన అంశాలు కాదు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది న్యాయమూర్తులు గ్రహించాలె. తమపై వచ్చే సద్విమర్శలను ఆహ్వానించాలె. న్యాయ వ్యవస్థ లో నియామకాలు, న్యాయమూర్తుల ఆస్తులు, రాజకీయ సంబంధాలు మొదలైన అంశాలలో నిజాయితీగా వ్యవహరించాలె. సమాచార హక్కుకు మొదటి నుంచి మద్దతు పలికిన న్యాయ వ్యవస్థ, తాము కూడా ఇందుకు అతీతులం కాదని గ్రహించాలె. న్యాయ వ్యవస్థలోని సంస్కరణ గురించి విస్తృత చర్చ జరుపడానికి, మార్పులు చేపట్టడానికి ఇంతకన్నా మంచి సందర్భం లేదు.

651
Tags

More News

VIRAL NEWS