పాలనా ప్రతిభ

Tue,September 12, 2017 11:49 PM

రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మొదలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ దాకా జాతీయంగా, అంతర్జాతీయంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం కేంద్ర మంత్రి విజయ్ గోయల్, ఐఎల్‌ఓ ఇంజినీర్ ఆండ్రీస్‌చే ప్రశంసలు అందుకున్నది.

ఈ పథకాన్నిమహారాష్ట్ర, ఒడిషా,బెంగాల్, కర్ణాటక రాష్ర్టాల ప్రతినిధులే గాకుండా, ఇటలీ దేశ ప్రతినిధులు కూడా అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకుంటున్నారు. జనరంజక పాలన అందిస్తూ రాష్ర్టాన్ని ప్రగతి పథాన నడిపిస్తున్న నేతలకూ అదే స్థాయి లో గౌరవ పురస్కారాలు, ప్రశంసలు అందుతున్నాయి. ప్రపంచమంతా అబ్బురపడేలా అహింసాయుత పోరాటం సాగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా కూడా తన అసాధారణ పాలనాదక్షతను ప్రదర్శించడం ప్రశంసలందుకుంటున్నది. తెలంగాణ వారికి స్వీయపాలన చేతకాదని, విఫల రాష్ట్రంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టిన వారి నోరు మూత పడేవిధంగా తెలంగాణ అద్భుతమైన రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనడానికి మూడేండ్లలో లభించిన ప్రశంసలు, అవార్డులే తార్కాణాలు. అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ రంగంలో మన రాష్ట్రం ఆదర్శం గా నిలువడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. పరిపాలనా రంగంలో వినూత్న విధానాలు, సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం, పాలనలో పారదర్శకతను పాదుకొలుపడం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అందుకే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలతోపాటు, ప్రతిష్ఠాత్మక మీడియా, సామాజిక సంస్థలు, శాస్త్రసాంకేతిక రంగ సంస్థల నుంచి అవార్డులు లభిస్తున్నాయి. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి రాజకీయ నాయకత్వానికి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదనడానికి తెలంగాణలో సాగుతున్న పరిపాలనే నిదర్శనం.

మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి ఈ మూడేండ్లలో రాష్ర్టానికి దక్కిన ప్రశంసలు, వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు ప్రకటించిన అవార్డులు గీటురాయిగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఏటా ఇండియా టుడే నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్టాన్ని మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. అంతేకాదు, సమ్మిళిత అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్రంగా కీర్తించింది. అంతేగాకుండా పారదర్శక పాలననందిస్తూ అభివృద్ధినీ, సంక్షేమాన్నీ సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నదని కీర్తించింది. ప్రతి సంవత్సరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇచ్చే సాక్షరభారత్ అవార్డులకు తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రం నుంచీ రెండు గ్రామాలు ఎంపిక కాలేదంటే తెలంగాణ ఘనతను చెప్పుకోవాల్సిందే. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం అం దిస్తున్న ఆన్‌లైన్ సేవలకు ప్రతిష్ఠాత్మక 11 స్కోచ్ అవార్డులు దక్కాయి. వాటిలో రాష్ట్ర పౌర సరఫరాశాఖకు ఐదు, రవాణా శాఖకు రెండు, సెర్ప్, వ్యవసాయ శాఖ, ఆర్టీఎస్కే, డీసీఎంఏకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కాయి. ఏటా ఇచ్చే స్కోచ్ అవార్డులు టీఎస్ జెన్‌కో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్‌శాఖకు స్కోచ్ అవార్డులు వచ్చాయి. డీటీసీపీకి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు వచ్చిం ది. స్మార్ట్ టెక్నాలజీలో జాతీయస్థాయిలో నాలుగు అవార్డుల దక్కాయి. సౌరవిద్యుత్‌లోనూ రాష్ర్టానికి మూడు అవార్డులు రావటం రాష్ట్ర ప్రగతి సోపానానికి సంకేతమే. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)సంస్థకు జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. ఓపీ వైద్యసేవల్లో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలి చి, జాతీయస్థాయిలో రెండో అత్యుత్తమ పురస్కా రం దక్కిందంటే సంక్షేమ పాలనాతీరును అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మొదలు మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ దాకా జాతీయంగా, అంతర్జాతీయం గా ఆదర్శంగా నిలుస్తున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం కేంద్ర మంత్రి విజయ్ గోయల్, ఐఎల్‌ఓ ఇంజినీర్ ఆండ్రీస్‌చే ప్రశంసలు అందుకున్నది. ఈ పథకాన్ని మహారాష్ట్ర, ఒడిషా,బెంగాల్, కర్ణాటక రాష్ర్టాల ప్రతినిధులే గాకుం డా, ఇటలీ దేశ ప్రతినిధులు కూడా అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకుంటున్నారు. జనరంజక పాలన అందిస్తూ రాష్ర్టాన్ని ప్రగతి పథాన నడిపిస్తున్న నేతలకూ అదే స్థాయి లో గౌరవ పురస్కారాలు, ప్రశంసలు అందుతున్నాయి. రైతుల అభివృ ద్ధి, సంక్షేమానికి కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు లభించింది. వినూ త్న పద్ధతుల్లో టెక్నాలజీ వినియోగం, పరిపాలన, పారదర్శకతలను సమన్వయం చేస్తూ విధు లు నిర్వహిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ను ప్రఖ్యాత స్కోచ్ సంస్థ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. అలాగే టీ హబ్ ద్వారా స్టార్టప్‌లకు చేయూతనందించటంలో కేటీఆర్ దేశంలోనే ముందువరుసలో నిలిచారని స్కోచ్ ప్రకటించడం గమనార్హం. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి వరల్డ్ పీస్ ప్రాస్పరిటీ ఫౌండేషన్ అవార్డు, ఎంపీ కల్వకుంట్ల కవితకు నారీప్రతిభా పురస్కారం అందాయి. ఇవన్నీ రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్న నాయకత్వ నిబద్ధతకు దక్కిన గౌరవ మర్యాదలుగా చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ర్టానికి దక్కిన అవార్డులు, వచ్చిన ప్రశంసలను కూడా పాలనావిధానాలకు వచ్చిన గుర్తింపుగానే చూడాలి. నిబద్ధత కలిగిన నేతల పాలనలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమ రం గంలో మరిన్ని మైలు రాళ్లు దాటాలని, ఉన్నత శిఖరాలకు చేరాలనేదే అందరి ఆకాంక్ష.

780
Tags

More News

VIRAL NEWS