రైతన్నలకు భరోసా

Sat,June 17, 2017 12:25 AM

వ్యవసాయరంగ రూపురేఖలు మొత్తం మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణమైన రీతిలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద వ్యవసాయానికి 5755 కోట్ల కేటాయింపు జరిగింది. జిల్లాల సంఖ్యను పెంచడం ద్వారా ప్రతి గ్రామంపై ప్రభుత్వం దృష్టిపెట్టే అవకాశం ఏర్పడ్డది. రైతుల సర్వేను ఇప్పటికే 80 శాతం పూర్తిచేసింది. దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి వసతి లభిస్తున్నది. వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం కూడా పూర్తయింది. అయితే తన కార్యాచణ అమలులో రైతుల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

వానాకాలం ప్రారంభం కావడానికి ముందు నుంచే రైతులకు అండగా నిలువడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనవి. రైతులకు ఏడు లక్షల క్వింటాళ్ళ (సబ్సిడీ) విత్తనాలు అవసరమవుతాయి. ఇందులో 4.34 లక్షల క్వింటాళ్ళను ఇప్పటికే స్టాక్ పాయింట్ల లో పెట్టింది. 2.52 లక్షల క్వింటాళ్ళు అమ్మకం కేంద్రాలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉపకేంద్రాల దగ్గరకు చేర్చింది. ఇదే విధంగా 8.89 లక్షల టన్నుల ఎరువులను స్టాక్ పాయింట్స్, అమ్మకం కేంద్రాల దగ్గర సిద్ధంగా పెట్టింది. రైతులు ఇప్పటికే అరవై వేల క్వింటాళ్ళ విత్తనాలు తీసుకున్నారు.

రైతన్నలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం పగలనక, రాత్రనక పడిగాపులు కాసేవారు. లాఠీ దెబ్బలు తిన్న విషాదకర అనుభవాలున్నాయి. పరాయి పాలకులు ఎరువులు, విత్తనాలను పోలీసు స్టేషన్లలో పెట్టి అమ్మిన దారుణాలను ఇంకా రైతులు మరిచిపోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఫలితంగా రైతన్నలకు నేరస్తులుగా ముద్రపడేది. ఎరువులు కల్తీవి అయినా, విత్తనాలు నాసిరకమైనవి అయినా చెప్పుకునే దిక్కులేదు. కల్తీ వ్యాపారులకు భయం లేకుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రైతులను మోసం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇందుకోసం కొత్త చట్టా న్ని తీసుకొస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాలను సరఫరా చేయడంతో తన బాధ్యత తీరిందనుకోవడం లేదు. ఇటీవల విడుదల చేసిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక (2017-18) పరిశీలిస్తే వ్యవసాయరంగాన్ని ఎంతగా తీర్చిదిద్దబోతున్నదీ తెలుస్తుంది.

ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, రైతులను కూడా అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు భూమి పరీక్షలను చేపట్టలేదు, ఈ అవసరాన్ని రైతులకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రతి కమతం భూమిని పరీక్ష చేసి నేల స్వభావాన్ని నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు నేల స్వభావం, నీటి వసతి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు పండించాలె, ఏయే ఎరువులు ఎంత వేయాలనే సూచనలను అధికారు లు ఇస్తారు. దీనివల్ల అవసరం లేకున్నా ఎరువులు వేయడం ఉండదు. నేలల పరీక్ష, కొత్త పంట రకాల సృష్టి కోసం పరిశోధనా శాలలను పటిష్ఠం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్రిమి సంహారకాల ఉపయోగం, యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులు మొదలైన అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడానికి పథకాలు రూపొందించింది. మహిళా రైతులకు కూడా శిక్షణ ఇప్పిస్తుంది. చిన్న మధ్యతరగతి రైతులు యంత్రాలను ఉపయోగించుకోలేక పోతున్నారు. అందువల్ల అద్దె యంత్రాలను ఇవ్వడానికి వీలుగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది.

కిసాన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఇప్పటి వరకు బ్యాంకు తోడ్పాటు పొందని రైతులకు రుణాలు ఇప్పించడానికి శిబిరాలు ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. బీమా పథకాలపై కూడా అవగాహన కలిగించాలని నిర్ణయించింది. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళించడానికి కూడా పథకాలను రూపొందిస్తున్నది. వ్యవసాయ భూమిని పెంచడం కోసం కొత్త జలవనరులను సృష్టించాలని తలపెట్టింది. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెట్‌కు సంబంధించిన రోజువారీ సమాచారాన్ని రైతులకు అందించడానికి ఇంటర్‌నెట్‌ను ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి కలిసి మొత్తం 90.89 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకున్నది.

వ్యవసాయరంగ రూపురేఖలు మొత్తం మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణమైన రీతిలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద వ్యవసాయానికి 5755 కోట్ల కేటాయింపు జరిగింది. జిల్లాల సంఖ్యను పెంచడం ద్వారా ప్రతి గ్రామంపై ప్రభు త్వం దృష్టి పెట్టే అవకాశం ఏర్పడ్డది. రైతుల సర్వేను ఇప్పటికే 80 శాతం పూర్తి చేసింది. దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి వసతి లభిస్తున్నది. వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం కూడా పూర్తయింది. అయితే తన కార్యాచణ అమలులో రైతుల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

ఇందుకోసం రైతు సంఘాలను ఏర్పా టు చేస్తున్నది. ప్రభుత్వానికి, రైతులకు మధ్య సమన్వయం ఏర్పరుచడానికి, పథకాలు విజయవంతం కావడానికి, రైతులకు మార్గదర్శనం చేయడానికి ఈ రైతు సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే తపన పడినంత మాత్రాన సరిపోదు. రైతులు కూడా చైతన్యవంతులై వ్యవసాయ రంగంలో వచ్చే విప్లవాత్మక మార్పులకు సారథులు కావాలె. ఇంకా చిన్న కమతాలలో, భూమి స్వభావం తెలువకుండా, మార్కెట్ పోకడలను పట్టించుకోకుండా పాత పద్ధతులలో వ్యవసాయం సాగిస్తే సత్ఫలితాలు రావు. ప్రతి గ్రామంలోని రైతులు సమిష్టి తత్తం పెంచుకోవాలె. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుకోవాలె. అనవసర వివాదాలకు పోకుండా, అభివృద్ధి చెందడంపై దృష్టి పెట్టాలె. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా సరళిని అర్థం చేసుకొని కృషి సాగిస్తే వ్యవసాయం నిజంగా పండుగలా మారుతుంది.

559
Tags

More News

VIRAL NEWS