సులభ్ సంస్థలను ప్రోత్సహించాలె


Tue,November 19, 2019 01:30 AM

బీహార్‌కు చెందిన సంఘసంస్కర్త, గాంధేయవాది బిందేశ్వర్ పాఠక్ 1968లో పారిశుధ్య కార్మికుల బాధలను చూసి, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడానికి ఉద్యమం ప్రారంభించారు. వారితో కలిసి జీవించి పారిశు ధ్య కార్మికులు మానవహక్కులు కోల్పోతున్నారని గ్రహించారు. 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్థాపించి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య కార్మికులకు మానవ హక్కులను కల్పించడం వంటి లక్ష్యాలతో తన కార్యాచరణ ప్రకటించారు. వ్యర్థ పదార్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన స్థాపించిన సంస్థ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించబడినాయి. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వలంటీర్లు ఈ సంస్థలో పనిచేస్తూ దేశవ్యాప్తంగా టాయిలెట్స్‌ను నిర్వహిస్తున్నారు. పే అండ్ యూజ్ పద్ధతిలో ప్రజలు ఈ టాయిలెట్స్ ఉపయోగించుకుంటున్నారు. పాఠక్ వంటివారు చేసిన కృషి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం 2014లో మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా బహిరంగ మలవిసర్జనను అరికట్టాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.


మరుగుదొడ్ల సమస్య చెప్పుకోవడానికి చిన్నగానే కన్పించవచ్చు. కానీ చాలామంది బాలికలు బడి మానేయడానికి విద్యాలయాల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రపం చవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి టాయ్‌లెట్ లేకపోవడం, 90 కోట్ల మంది చిన్నారులకు సరైన వాష్‌రూమ్ సౌకర్యం లేక సతమతమవుతున్నారు. సింగపూర్‌లో జాక్ సిమ్, మన దేశంలో బిందేశ్వర్ పాఠక్ వంటివారు చేసిన కృషి ఫలితంగా ఏటా నవంబర్ 19న ప్రపంచ టాయ్‌లెట్ డే 120 దేశాల్లో నిర్వహిస్తున్నారు. టాయ్‌లెట్స్ నిర్మించ డం ఒకెత్తయితే, వాటిని నిర్వహించడం మరొక ఎత్తు.

పారిశుధ్య నిర్వహణలో ఆధునిక పద్ధతులను చేపట్టాలి. బాలబాలికలకు విడిగా విద్యాలయాల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. కార్మికులకు అవసరమైన పనిముట్లను, రక్షితమాస్కులను ప్రభుత్వం సరఫరా చేయాలి. దేశంలో రుషికేశ్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో టాయ్‌లెట్ కాలేజీ లు ఏర్పడినాయి. ఇలాంటి కాలేజీలను అన్నిప్రాంతాల్లో ఏర్పాటుచేయాలి. టాయ్‌లెట్స్ నిర్మాణానికి సులభ్ లాంటి సంస్థలను ప్రోత్సహించాలి. మరుగుదొడ్లు వినియోగించుకోకపోతే వచ్చే నష్టాలను స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ప్రజలకు వివరించాలి. ప్రజలు నిర్మించుకొనే మరుగుదొడ్ల కు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. అయితే కల్పించిన రాయితీలను ప్రజలకు వెంటనే అందజేసినట్లయితే మరు గుదొడ్ల నిర్మాణంపై వారు ఆసక్తి చూపుతారు. మరుగు దొడ్ల ను వెంటనే నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుం ది. అప్పుడే స్వచ్ఛ భారత్ విజయవంతమవుతుంది.
- యం.రాంప్రదీప్, సామాజిక కార్యకర్త

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles