టెలికం వివాదం ఘోర తప్పిదం


Sun,November 17, 2019 12:45 AM

వొడాఫోన్, బిర్లా నియంత్రణ కోల్పోతే, ప్రభుత్వానికి వార్షిక స్పెక్ట్రమ్ రెవెన్యూ 1.7 బిలియన్ డాలర్ల ఆదాయం నిలిచిపోతుంది. బ్యాంకులకు 4 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం పారిశ్రామికరంగాన్ని కఠినంగా నియంత్రిస్తున్న పరిస్థితుల్లో బిర్లా లేదా అమెజాన్.కామ్ బాస్ జెఫ్ బెజోస్ అంబానీతో పోటీపడుతున్న తీరు ఇదేవిధంగా ఉంటే దేశంలో ప్రైవేట్‌రంగం ఎంతవరకు నిలదొక్కుకోగలదనే అనుమానంగా కలుగుతుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ప్రభుత్వానికి, వ్యాపారరంగానికి మధ్య విభేదం ప్రధాని మోదీ సృష్టించింది కాదు. కానీ ఇప్పుడున్న అపార్థాన్ని అగాథంగా మారనివ్వడం మాత్రం ప్రభుత్వం చేసే ఘోర తప్పిదమవుతుంది.

towers
టెక్స్‌టైల్ మొదలుకొని టెలికం వరకు విస్తరించిన కుమార్ మంగళం బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి కష్టాలనేటివి వందేండ్ల నేస్తాలు. 1919లో ఈ వ్యాపారవేత్త ముత్తాత జూట్ మిల్లు ప్రారంభించాలనుకున్నారు. అప్పటికే ఆధిపత్యం కలిగి ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆండ్య్రూ యూల్ అండ్ కంపెనీ కలకత్తా చుట్టుపక్కల ఉన్న భూమినంతా కొనేసింది. ఇంపీరియల్ బ్యాంక్ (ఇప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలిరూపం) బిర్లాకు రుణం ఇవ్వడానికి నిరాకరించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వం బిర్లా వ్యాపారాన్ని ఎంతో దయతో ఎదుగకుండా అడ్డుకున్న ది! అప్పుడు దేశంలో ఉన్న సోవియెట్ తరహా రాజ్య సామ్యవాదం కుటుంబ వారసత్వ సంస్థలను పోటీలేకుండా కాపాడింది. కానీ ఆ వ్యాపారం ఎదుగకుండా చేసిం ది. దేశంలో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బిర్లా తం డ్రి ఆదిత్య విక్రమ్ థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వెళ్ళారు. ఆర్థికశక్తి కేం ద్రీకరణ ఎక్కడ ఉన్నది? బడా వ్యాపారసంస్థల దగ్గరా లేక ప్రభుత్వం దగ్గరా అనేది కనిపించడం లేదని 1979లో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక అక్కడినుంచి నలభై ఏండ్లు ముందుకువస్తే.. ఈ వ్యాపార సామ్రాజ్య 52 ఏండ్ల ప్రస్తుత చైర్మన్ తన తండ్రి అనుభవించిన నిరుత్సాహాన్నే అనుభవిస్తున్నారు. 1990లో మొదలైన సరళీకరణ స్ఫూర్తి ఇప్పుడు ఆవిరైపోయింది. ఒకప్పటి ప్రభు త్వ నియంత్రణ గల లైసెన్స్ రాజ్ అంతరించింది. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ మళ్లా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ నియంత్రణ అనే జాడ్యం ఆవరించింది. ఇది బిర్లాషేర్ హోల్డర్లను నిరుత్సాహపరుస్తున్నది. 2014లో ప్రధాని మోదీ అధికారానికి రాకముందే ఈ దిగజారుడు మొదలైంది. అందువల్లనే కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన అనే మోదీ నినాదానికి వ్యాపారరంగం మద్దతు ఇచ్చింది. కానీ ఐదేండ్ల తర్వాత చూస్తే ప్రభుత్వానికి, వ్యాపారవర్గాలకు మధ్య సంబంధాలు పరీక్షగా మారాయి.

ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమైన టెలి కమ్యూనికేషన్ రంగాన్నే ఉదాహరణగా తీసుకుందాం. 1990 దశకంలో ప్రభుత్వరంగంలోని టెలికం తలుపులు తెరిచినప్పటినుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన పెట్టుబడిదారిగా ఉన్నది. ఎటిఅండ్‌టి, టాటా గ్రూప్, లికా-షింగ్‌కు చెందిన సీకే హచిసన్ హోల్డింగ్స్ లిమిటెడ్ మొదలైన భాగస్వాములు, ప్రత్యర్థి సంస్థలు మధ్యలో వచ్చాయి వెళ్ళాయి. కానీ బిర్లా సంస్థ మాత్రం నిలకడగా నిలబడ్డది. దేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లు ఉన్న పెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌లో బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటా ఉన్నది. ఇందులో బ్రిటిష్ భాగస్వామ్య సంస్థకు 45 శాతం వాటా ఉన్నది. అనేక ఒడిదుడుకులకు తట్టుకొని నిలిచిన ఈ సంస్థ గత ప్రభుత్వ ఫీజులు, వడ్డీ, జరిమానాలు అన్నీ కలిసి 28 వేల కోట్లు చెల్లించాలని ఇటీవల భారత న్యాయస్థా నం ఆదేశించింది. 13 బిలియన్ డాలర్ల టెలికం పరిశ్రమ ఇప్పటికే శుష్కించిపో యి ఉంటే, దానిని మరింత దెబ్బకొట్టాలని భారత్ భావిస్తున్నది. నిధులు లేక ఇబ్బంది పడుతున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది 5జీ వేలంలో భారీమొత్తం ఆపరేటర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నది. ఇక బిర్లా కంపెనీ ఎంతకని తట్టుకొ ని ఉంటుంది. వొడాఫోన్ ఐడియా 14 బిలియన్ డాలర్ల రుణాలతో నష్టాల్లో ఉన్నది.

వొడాఫోన్ గ్రూప్ ఇంకా ఎంతకని తట్టుకొని ఉంటుందనేది అనుమానమే. ప్రభుత్వ డిమాండ్ల మూలంగా కంపెనీ దెబ్బతినడం ఇది మొదటిసారి కాదు. 20 12లో యూకే సంస్థకు టాక్స్ నోటీసు జారీ చేయకుండానే, పన్ను చట్టాన్ని పాత కాలం నుంచి అమలుచేస్తూ 2.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని కోరింది. ఏడేండ్ల తర్వాత కూడా ఈ కేసు ఇంకా తెగనే లేదు. ఇప్పుడు మరో కొత్త చట్టాన్ని ప్రయోగించింది. వొడాఫోన్ ఆరు నెలల ఆదాయ నివేదికలో భారత కార్యకలాపాల బుక్ వ్యాల్యూను తగ్గించివేస్తూ దీనిని మూత పెట్టవచ్చునని హెచ్చరించింది. వొడాఫోన్‌కు వేరే సెల్యులర్ టవర్ కంపెనీలో 42 శాతం వాటా ఉన్నది. ఈ వాటాను అమ్మి ప్రధాన టెలికమ్ వెంచర్‌లో పెట్టుబడి కోసం చేసిన అప్పును తీర్చాలని భావిస్తున్న ది. దీని తర్వాత ఈ యూకే సంస్థకు వొడాఫోన్ ఐడియాలో వంద కోట్ల డాలర్లకు మించి వాటా ఉండదని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చి సంస్థ వెల్లడించింది. అయినప్పటికీ 2022 వరకు స్పెక్ట్రమ్ సంబంధిత చెల్లింపుల కోసం భారత్‌లోని వ్యాపారసంస్థ 5.5 బిలియన్ డాలర్లు ముట్టచెప్పవలసి ఉంటుంది.

ఇంతకూ బిర్లా సంస్థ ఎందుకు ఉల్లంఘించవలసి వచ్చింది? వొడాఫోన్ భార తీయ గ్రూప్‌లోని 26 శాతం వాటాలో గ్రాసిమ్ సిమెంట్‌కు 11.6 శాతం వాటా ఉన్నది. మిగతా 2.6 శాతం వాటా హిండాల్కోకు ఉన్నది. హిండాల్కో ప్రపంచ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇది డిమాండ్ లేకపోవడం వల్ల అమెరికా కంపెనీ ఆలెరిస్ కార్పొరేషన్ సంక్లిష్ట స్వాధీన విధానం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీంతో టెలికం విభాగాన్ని ఆదుకునే భారమంతా గ్రాసిమ్‌పై పడ్డది. ఈ సంస్థ బిర్లా సిమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కలప ఫైబర్, కాస్టిక్ సోడా వంటి రసాయనాలు మొదలైన వ్యాపారాల్లో ఉన్నది. ముంబయి కేంద్రంగా ఉండే ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం-ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే, బిర్లా కంపెనీ కూడా టెలికం రంగాన్ని వీడదలుచుకోనట్టయితే- గ్రాసిమ్‌పై ఒక్కో వాటాకు 187 రూపాయల భారం పడుతుంది. బిర్లా కనుక వెనుకకు తగ్గితే గ్రాసిమ్‌కు ఒక్కో షేరుకు 1,126 రూపాయల మేర రుణం తగులుతుంది. ఇప్పటి స్టాక్ మార్కెట్ విలువలో ఇది 47 శాతం కన్నా ఎక్కువ. వొడాఫోన్ పరిస్థితి ఇన్వెస్టర్ల మనసులో ఒక అనిశ్చితిని సృష్టిస్తున్నది. అమెరికా-చైనా ట్రేడ్‌వార్ మూలంగా టెక్స్‌టైల్ మార్కెట్‌లో ఏర్పడిన అనిశ్చితి తొలిగిపోతే, ఫైబర్ ధరలు నిలకడగా ఉం టాయి. గ్రాసిమ్ టెలికం రంగంపై తన సొమ్మును వృథా చేసుకునే బదులు ఫైబర్, రసాయనాలు, సిమెంట్ రంగాలపై రెండు బిలియన్ డాలర్లు వెచ్చించడం మంచిది.
Adli
టెలికమ్ పరిశ్రమను-దేశంలోని అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్‌ఫోకమ్ లిమిటెడ్‌కు, అప్పుల కుప్పల్లో ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌కు మధ్య- రెండు గుర్రాల పందెంగా మార్చిన మూర్ఖపు విధాన ఫలితమేమిటో ప్రభుత్వానికి తెలిసివస్తుంది. వొడాఫోన్ దివాలా తీస్తే ఆ ప్రభావం ఈ రంగంలోని ఇతర ప్రయోజనకారుల మీద కూడా పడుతుంది. వొడాఫోన్, బిర్లా నియంత్రణ కోల్పోతే, ప్రభుత్వానికి వార్షిక స్పెక్ట్రమ్ రెవెన్యూ 1.7 బిలియన్ డాలర్ల ఆదాయం నిలిచిపోతుంది. బ్యాంకులకు 4 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం పారిశ్రామికరంగాన్ని కఠినంగా నియంత్రిస్తున్న పరిస్థితుల్లో బిర్లా లేదా అమెజాన్.కామ్ బాస్ జెఫ్ బెజోస్ అంబానీతో పోటీపడుతున్న తీరు ఇదేవిధంగా ఉంటే దేశంలో ప్రైవేట్‌రంగం ఎంతవరకు నిలదొక్కుకోగలదనే అనుమానంగా కలుగుతుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ప్రభుత్వానికి, వ్యాపారరంగానికి మధ్య విభేదం ప్రధాని మోదీ సృష్టించింది కాదు. కానీ ఇప్పుడున్న అపార్థాన్ని అగాథంగా మారనివ్వడం మాత్రం ప్రభుత్వం చేసే ఘోర తప్పిదమవుతుంది.
(ఎన్డీటీవీ సౌజన్యం...)

835
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles