అటవీ పెంపకం దిశగా


Sun,November 17, 2019 12:41 AM

రాష్ట్రంలో భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడాసంప్రదాయ విశ్వవిద్యాలయాలుగా సాధారణ కోర్సులను ప్రారంభించకుండా పారిశ్రామిక, వ్యవయసాయ రంగాన్ని పశువైద్య, ఉద్యాన, అటవీశాఖ అభివృద్ధిని కాక్షించే కోర్సులను, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యాలను పెంపొందించే కోర్సులను ప్రవేశపెట్టాలి. ఈ కొత్త యూనివర్సిటీ చదువులతోనైనా చదివే చదువును జీవికతో అనుసంధానం చేయాలి.

Anabheri-Rajeshwar-rao
తెలంగాణ అభివృద్ధిలో మాన వ వనరులతో పాటు, ప్రకృ తి వనరులను, సహజ వన రులను సద్వినియోగం చేసు కొని దేశంలోని రాష్ర్టాలన్నింటిలో తెలంగా ణను అగ్రభాగాన నిలుపటానికి ముఖ్య మంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందించ దగినది. ఈ నేపథ్యలోనే సీఎం కేసీఆర్ మున్నెన్నడూ చేయని, ఆలోచించని విధం గా రాష్ర్టాభివృద్ధికి కృషిచేస్తున్నారు. దీనిలో భాగంగానే వ్యవసాయరంగ అభివృద్ధి కోసం సాగు నీటి ప్రాజెక్టులను విప్లవాత్మ కంగా చేపట్టారు. దీనికోసం తెలంగాణను సస్యశ్యామలం చేయటం కోసం అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటి లో తలమానికంగా చెప్పుకోవాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఒకరకంగా తెలంగాణ వరప్రదాయని. అలాగే సాగునీటి అవస రాలకు అనుబంధంగా ఉండే చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని రూపొందించి చెరువులన్నింటికీ జీవకళ తెచ్చారు.

ఇక గ్రామీణాభివృద్ధి దిశగా చేపట్టిన కార్యక్రమాలు, పథకా లు గ్రామాల రూపురేఖలను మార్చేశాయి. కులవృత్తులను పున రుజ్జీవింపచేయటం, వృత్తిదారులకు అన్నివిధాలా సాయం చేయటంతో ప్రజలంతా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటున్నారు. అన్నింటిలో ముఖ్యమైనది రాష్ర్టాన్ని పైరు పైచ్చలతో ఉండేట్లు చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెం పొందించేందుకు హరితహారాన్ని చేపట్టడం చరిత్రాత్మకం. దీనికోసం ఇప్పటికే అనేక దఫాలుగా హరితహారం కార్యక్రమా న్ని చేపట్టి కోట్ల మొక్కలను నాటిపించారు. దీంతో పాటు రాష్ట్రంలో పర్యావ రణాన్ని పరిరక్షించేందుకు, రుతుపవనాల ను గాడిలో పెట్టేందుకు అటవీ సంపదను పెంపొందించే బృహ త్తర కార్యాక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.

నిజానికి నేటి ఆధునిక అభివృద్ధి చెందిన సమాజానికి పెద్ద సవాలుగా మారి న పర్యావరణ సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో ముందుచూపుతో కూడుకొని ఉన్నవి. కరువు కాటకాలకు, వరదలకు, అకాల వర్షాలకు కారణం పర్యావరణ అసమతుల్యతనే ప్రధాన కారణం. పర్యావరణ సమతుల్యత ను పరిరక్షించుకోవటం నేటి సమాజాభివృద్ధికి కీలకం. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా అటవీ అభివృద్ధి కోసం అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగానే.. సిద్దిపేట జిల్లా ములుగులో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటైన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ రాష్ర్టానికి మణిహారం.

1985 నుంచి రాష్ర్టాల్లో అటవీ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) రాష్ర్టాలన్నింటిలో అటవీకళాశాల, పరిశోధనాసంస్థలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. నిధులు కూడా రాష్ర్టాభివృద్ధికి, అటవీశాఖ అభివృద్ధికి అందిస్తామన్న భరోసా ఇచ్చింది. అటవీ పరిశోధనలు ప్రోత్సహించాలన్నది. అయితే గత ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి పట్ల ఆసక్తి చూపలేదు. తెలంగాణ ప్రాం తంలో అటవీ పరిశోధన, అటవీ కళాశాల ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దేశంలో ని ఇతర రాష్ర్టాల్లో 21 ప్రాంతాల్లో నాలుగు సంవత్సరాల బీఎ స్సీ కోర్సు, రెండు సంవత్సరాల పీజీ ఎమ్మెస్సీ కోర్సు, మూడు సంవత్సరాల పీహెచ్‌డీ కోర్సులు అటవీ పరిశోధనల వృత్తివి ద్యా కోర్సులతో విద్యాసంస్థలు నెలకొల్పారు. తెలంగాణ విద్యార్థులు మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేదు.

రాష్ర్టావిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో అటవీ సంపద పెంపుదలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, అటవీ సంపద వృత్తి పట్ల, ఆర్థికాభివృద్ధికి గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. ప్రజలు ప్రకృతి, సహజ వనరుల ను ఉపయోగించుకొని పెంపొందేందుకు సిద్దిపేట జిల్లా ములుగులో నాలుగు సంవత్సర బీఎస్సీ కోర్సు (ఫారెస్ట్రీ), ఎమ్మెస్సీ (ఫారెస్ట్రీ) రెండు సంవత్సరాల కోర్సు, మూడు సంవత్సరాల పీహెచ్‌డీ కోర్సు ప్రవేశపెట్టింది.వ్యవసాయ, పశు, ఉద్యానవన శాఖలతో పాటు అటవీశాఖలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో అటవీ విద్యను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న కృషి అభినందనీయం.

రాష్ట్రంలో ప్రస్తుతం 11 యూనివర్సిటీ లున్నాయి. వ్యవసాయ, ఆరోగ్య విద్య, పశు, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు వేర్వేరు చట్టాల పరిధిలో పనిచేస్తున్నాయి. దీనివల్ల పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. దీని దృష్ట్యా ఇవన్నీ ఒకే చట్ట పరిధిలో పనిచేస్తూ ఒకేరకమైన విధివిధానాలు కొనసాగాలా కామన్ చట్టానికి రూపకల్పన చేయబోతుండటం హర్షణీయం. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు నాలుగు చట్టాలను తీసుకురావడం, ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీలకు ఒక చట్టం. జేఎన్‌టీయూ హైదరాబాద్, జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌కు సాంకేతిక విశ్వవిద్యాలయ చట్టం పరిధిలోకి తీసుకొనిరావడం ప్రశంసనీయం. రాష్ట్రంలో ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు రెండు వేర్వేరు చట్టాలు రూపొందించ డం గమనించదగినది.

రాష్ట్రంలో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపుతో ప్రొఫెసర్ జయశంక ర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశువైద్య, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఆయా శాఖ ఆధ్వర్యంలో రూపొందించబడి ప్రత్యేక చట్టాలతో కొనసాగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్) అఫ్లియేషన్ గుర్తింపుతో కొనసాగుతూ దేశవ్యాప్తంగా పోస్టుగ్రాడ్యూయేషన్ కోర్సులు జాతీ య పరిశోధనాసంస్థల్లో పరిశోధన చేయడానికి ప్రవేశం పొందవచ్చు. జాతీయసంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అన్ని జాతీ యస్థాయి ప్రవేశాలకు, ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నది.

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన అటవీ కళాశాల, పరిశోధనాసంస్థలో నాలుగేండ్ల విద్యను పూర్తిచేసిన వారిని పట్టభద్రులుగా సంప్రదాయ విశ్వవిద్యాలయాలు గుర్తించినప్పటికీ జాతీయస్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ఉద్యోగ నియామక సంస్థలు మన టీఎస్ ఎఫ్‌సీఆర్‌ఐకి భారతీయ వ్యవసాయ పరిశోధనాసంస్థ అఫ్లియేషన్ తప్పనిసరి. అటవీ కళాశాల పరిశోధనా సంస్థను ఐసీఏఆర్ గుర్తింపు, అఫ్లియేషన్ పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఆ కశాశాలను ములుగు సమీపంలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో అనుబం ధసంస్థగా, కళాశాలగా తీర్చిదిద్దాలి. అటవీ విద్యలో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు విస్తృత అవకాశాలు పొందే ఆస్కారం ఉన్నది.

రాష్ట్రంలో భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా సంప్రదాయ విశ్వవిద్యాలయాలుగా సాధారణ కోర్సులను ప్రారంభించకుండా పారిశ్రామిక, వ్యవయసాయ రంగాన్ని పశువైద్య, ఉద్యాన, అటవీశాఖ అభివృద్ధిని కాక్షించే కోర్సులను, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యాలను పెంపొందించే కోర్సులను ప్రవేశపెట్టాలి. ఈ కొత్త యూనివర్సిటీ చదువులతోనైనా చదివే చదువును జీవిక తో అనుసంధానం చేయాలి. చదువుకున్న ఏ విద్యార్థీ నిరుద్యో గిగా ఉండకూడదు. అలా ఉంటే చదువు లోపమే తప్ప, చదివి న విద్యార్థి నేరం కాదని గుర్తించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రోత్సహించాలి. అట్లనే మారుమూల ప్రాంతాల్లో కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా రాష్ట్రం మరింతగా అభివృద్ధిని సాధించే అవకాశం ఉన్నది.
(వ్యాసకర్త: రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, పాఠశాల విద్య)

621
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles