వినియోగదారుని అనిశ్చితి ప్రభావం


Thu,September 19, 2019 12:45 AM

ఆటోమొబైల్‌ రంగంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు రావడానికి ఎన్నో కారణాలు. వాటిలో మొదటిది వినియోగదారుల అనిశ్చితి. ప్రస్తుతం ఆటోవాహనాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా భవిష్యత్తులో దానిని 18 శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో జీఎస్టీ తగ్గుతుందనే భావనతో వినియోగదారులు వాహనాల కొనుగోలు వాయిదా వేస్తునారు. ఇక రెండవది సెకండ్‌హ్యాండ్‌ వాహనాల మార్కెట్‌ ప్రభావం. వినియోగదారుడు నూతన వాహనాలకు బదులు పాతవాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నాడు. గతేడాదిలో 40 లక్షల పాత కార్ల అమ్మకాలు జరిగాయని, ఈ సంవత్సరం ఆ సంఖ్య 10 శాతం పెరుగవచ్చని ‘ఓఎల్‌ఎక్స్‌' నివేదికలు చెబుతున్నాయి.


దేశంలో ముఖ్యమైన రంగాల్లో ఆటోమొబైల్‌ రంగం ఒకటి. వాహన విక్రయాలపరంగా ప్రపంచంలో మనది నాలుగవ స్థానం. మన దేశంలో ఆటో పరిశ్రమ నుంచి ఏటా రూ.3 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నది. ఈ రంగం లో దాదాపు 3 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అలాంటిది కొన్ని నెలలుగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని క్షీణత ఆటోమొబైల్‌ మార్కెట్లో కనిపిస్తున్నది. కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 28 ఏండ్ల కనిష్ఠ స్థాయికి తగ్గాయి. అమ్మకాలు పెంచేందుకు కంపెనీలు పలురకాల ప్రమోషన్‌ పద్ధతులు ఉపయోగిస్తున్నా ఫలితం శూన్యం. ఆటోమొబైల్‌ తయారీ, అమ్మకాల రంగంలో, వాటి మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగాల అవకాశాలు తగ్గడమే కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు కూడా అంధకారంలో పడింది. 2017 డిసెంబర్‌ వరకు లాభాల్లో ఉన్న ఆటోమొబైల్‌ రంగం ఏడాది కాలంగా సుమారు 30 శాతం నష్టాలను నమోదు చేసింది. దేశీయ ఆటోరంగ మార్కెట్లో పేరొందిన బ్రాండ్స్‌ మారుతి, మహీంద్రా, అశోక్‌ లీలాండ్‌, హీరో, బజాబ్‌ వంటి సంస్థలు సైతం నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భారతీయ ఆటో ఉత్పత్తుల అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం, ఆగస్టులో ఆటో ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

ఈ ఏడాది జూలైలో మొత్తం దేశీయ ఆటో అమ్మకాలు దాదాపు 19 ఏండ్ల కనిష్ఠానికి పతనమైంది. గత సంవత్సరం జూలైతో చూస్తే 18.71 శాతం దిగజారి 22,45,223 యూనిట్ల నుంచి 18,25,148 యూనిట్లకు పరిమితమయ్యాయి. వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 31.57 కార్ల అమ్మకాలు 41.09 శాతం క్షీణించాయి. అలాగే, ట్రక్కులు, బస్సుల అమ్మకాలు 39 శాతం క్షీణించాయి. ఇక ద్విచక్ర అమ్మకాలు సుమారు 22 శాతం పడిపోయాయి. ఒకవిధంగా, 1997-98 తర్వాత కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇంత తక్కువస్థాయికి పడిపోయాయి. భారతీయ ఆటో మొబైల్‌ మార్కెట్‌ లీడర్‌ మారుతి సుజుకీ అమ్మకాలు 36.14 శాతం పత నమై 93,173 యూనిట్లకు తగ్గాయి. హుందాయ్‌ 16.58 శాతం, మహీం ద్రా అండ్‌ మహీంద్రా 31.58 శాతం క్షీణతలను చవిచూశాయి.

ఈ రం గంలో ఎగుమతులు సైతం 2.37 శాతానికి తగ్గిపోయాయి. ఈ ఏడాది జాతీయ ఈక్విటీ మార్కెట్‌ ఇండెక్స్‌లో అన్నిరంగాలతో పోల్చిచూస్తే ఆటోమొబైల్‌ రంగం పూర్తిగా చతికిలపడిపోయింది. గత 16 నెలలో ఈ రంగం 42 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయింది. మార్కెట్లో తగినంత డిమాండ్‌ లేకపోవడంతో, నిల్వలు పేరుకుపోయి చివరికి సంస్థలు ఉత్పత్తి తగ్గించుకోవడమే కాకుండా ఉత్పత్తి విరామాలు ప్రకటిస్తున్నాయి. 2018 ఆగస్టులో 3,67094 ప్రయాణికుల వాహనాలు ఉత్పత్తి చేయగా ఆ సం ఖ్య డిమాండ్‌ లేమి కారణంగా ఈ ఏడాది ఆగస్టులో 2,77,432 ప్రయాణికుల వాహనాలకు తగ్గిపోయింది. దేశీయ తయారీరంగంలోని ఉద్యోగాల్లో సుమారు 50 శాతం ఆటోమొబైల్‌ రంగంలో ఉన్నవే. ఫలితంగా, కేవలం ఉద్యోగస్తులే కాకుండా డీలర్స్‌, మార్కెటింగ్‌ ఏజెంట్ల ఉద్యోగాల్లో కోతలు మొదలయ్యాయి. గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌తో గడి చిన 18 నెలల్లో దేశవ్యాప్తంగా 271 నగరాల్లో 286 షోరూంలు మూతపడినాయి. ఆప్రభావం తిరిగి ఉద్యోగస్తులపై పడి నిరుద్యోగ పరిస్థితులు తలెత్తుతున్నాయి.
venkateswarlu
ఆటోమొబైల్‌ రంగంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు రావడానికి ఎన్నో కారణాలు. వాటిలో మొదటిది వినియోగదారుల అనిశ్చితి. ప్రస్తుతం ఆటోవాహనాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా భవిష్యత్తులో దానిని 18 శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో జీఎస్టీ తగ్గుతుందనే భావనతో వినియోగదారులు వాహనాల కొనుగోలు వాయిదా వేస్తునారు. ఇక రెండవది సెకండ్‌హ్యాండ్‌ వాహనాల మార్కెట్‌ ప్రభావం. వినియోగదారుడు నూతన వాహనాలకు బదులు పాతవాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నాడు. గతేడాదిలో 40 లక్షల పాత కార్ల అమ్మకాలు జరిగాయని, ఈ సంవత్సరం ఆ సంఖ్య 10 శాతం పెరుగవచ్చని ‘ఓఎల్‌ఎక్స్‌' నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడం కూడా మరొక కారణ మే. అందులో భాగంగానే ఈ వాహనాలపై జీఎస్టీ 5 శాతం ఉన్న స్లాబులోకి తెచ్చింది. అంతేకాదు, ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ ఫీజును సైతం తగ్గించింది కేంద్రం. అందుకనే పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహనాలు కొనేవారి సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. అం తేకాదు, గత రెండేండ్లలో మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర ల పెరుగుదల కూడా ముఖ్య కారణమే. బ్యాంకింగ్‌రంగ పరిస్థితి కూడా పరోక్షంగా ఈ రంగం మీద పడుతున్నది. బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరుగడం వల్ల వాహన రుణాలు ఆశించినస్థాయిలో మంజూరు చేయలేకపోతున్నా యి. అలాగే, యాన్‌బీఎఫ్‌సీ సంస్థల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉండటం చేత ఆశించిన మేర రుణ వితరణ చేయలేకపోతున్నాయి. ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం కూడా ఈ రంగం మీద పడుతున్నది. అంతేకాదు, మనదేశంలో ఉబర్‌, ఓలా వంటి టాక్సీ సర్వీసెస్‌ అందుబాటులోకి రావడం కూడా ఒక కారణం.

ప్రస్తుత పరిస్థితిని అధిగమించాలంటే కేంద్రం ఫిస్కల్‌ పాలసీ రూపం లో పన్నులు తగ్గించాలి. అందులో భాగంగా జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలి. దీంతో పాటు బీమా, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా తగ్గించాలి. ద్రవ్య పాలసీ ద్వారా వాహనాల రుణాల వితరణ పెంచడంతో పాటు వాహనాల వడ్డీ రేట్లను తగ్గించాలి. ఆటోమొబైల్‌ రంగం క్షీణత కేవ లం ఆ రంగం మీదనే కాకుండా, ఆ రంగ ఆధారిత పరిశ్రమలైన ఉక్కు, టైర్స్‌, విడిభాగాల పరిశ్రమల, బీమా రంగం మీద పడి ఇవి కూడా సంక్షోభంలోకి కూరుకుపోకముందే కేంద్రం తగు చర్యలు తీసుకోవాలి.
(వ్యాసకర్త: ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు)

341
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles