ఆటోరంగ క్షీణత ప్రమాదసూచిక!

Sat,September 7, 2019 01:39 AM

car
దేశంలో ఆటోరంగ క్షీణత ఆర్థికవేత్తలనే గాక, సమస్త ప్రజలకు గుబులు పుట్టిస్తున్నది. దేశంలో వాహన ఉత్పత్తి, తయారీరంగం గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో మందగమనంలో ఉన్నది. దేశవ్యాప్తంగా కొనుగోళ్లు పడిపోయి వాహన ఉత్పత్తి, తయారీరంగంలో ఉన్న పెద్ద కంపెనీల న్నీ భవిష్యత్తుపై భయాందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆటోరంగానికి అవసరమైన సాయం అందిస్తూ, జీఎస్టీ పన్ను భారాన్ని తొలిగించి ఆదుకోవాలని కోరుతున్నాయి. లేనట్లయితే వాహన ఉత్పత్తిని తగ్గించుకునే చర్యల కారణంగా లక్షల సంఖ్యలో కార్మికులు జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.

గత కొంతకాలంగా దేశంలో వాహన కొనుగోలు తీవ్రంగా పడిపోయిం ది. ఆటోరంగంలో అమ్మకాలు పడిపోవటం గత ఆగస్టు నాటికి పది నెలలుగా కొనసాగుతున్నది. ఇలా అమ్మకాలు పది నెలలుగా పడిపోవటం చరిత్రలో ఇదే మొదటిసారి. దేశ స్థూల జాతీయోత్పత్తిలో 7 శాతంగా ఉన్న ఆటోరంగంలో ఇలాంటి దుస్థితి మన ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ మధ్యనే జరిగిన ఆటోరంగ దిగ్గజ కంపెనీల సీఈఓల సమావేశం కూడా ప్రభుత్వం వెంటనే తగువిధంగా ఆదుకోవాలని కోరింది. అలాగే అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీఎస్టీ పన్నులను కూడా తొలిగించాలని కోరటం గమనార్హం. ఈ సందర్భంగానే టాటా మోటార్స్‌ సీఈఓ గుంటర్‌ బష్చెర్‌ వ్యక్తంచేసిన అభిప్రాయం ప్రకారం.. భారత ఆటోమోటివ్‌ వృద్ధి కథ ఇక ముగిసినట్లే.

గత ఏప్రిల్‌-జూన్‌ నెలల్లో గత ఐదేండ్లనాటి కన్నా వృద్ధిరేటులో తగ్గుదల నమోదయ్యింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం, వ్యవసాయరంగం కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతూ వృద్ధిరేటు క్షీణిస్తున్నది. ఇలా ఆటోరంగంలో కనిపిస్తున్న మందగమనం, క్షీణత మిగతా రంగాలకు కూడా విస్తరించి మొత్తంగా దేశీయ ఆర్థికవ్యవస్థనే కబలించే పరిస్థితి ఏర్పడుతున్నది. అంతిమంగా ఆర్థిక సంక్షోభంలో దేశం కూరుకుపోయేపరిస్థితులు అతి చేరువలో కనిపిస్తుండటమే తీవ్ర ఆందోళనకరం.


గత కొంతకాలంగా దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆటోరంగంలో అమ్మకాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో ఆయా వాహన ఉత్పత్తి, తయారీరంగ పరిశ్రమలు తమ ఉత్పత్తుల్లో కోత లు విధించటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 3,50,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో తక్షణ కర్తవ్యంగా ఆటోరంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఇక్కడే, ఇప్పుడే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. దానిలో భాగంగా వచ్చే పండుగల సీజన్‌ నాటికి వాహనాల కొనుగోళ్లు పెరుగాలంటే.. పన్నుల భారాన్ని తగ్గించటంతో పాటు ఆయా కంపెనీలను తగినవిధంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. టాటా కంపెనీ అయితే ఈ దశాబ్దంలోనే మునుపెన్న డూ లేనివిధంగా వాహన ఉత్పత్తిలో సగానికి సగం తగ్గించుకున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వాహన ఉత్పత్తి, తయారీ కంపెనీలకు తగినవిధంగా సాయపడుతామని ప్రకటించటం ముదావహం. అదే క్రమంలో పన్నులు, పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై పన్నుల భారాన్ని తగ్గించటంతో పాటు, సంకర వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. దీంతో వాహన అమ్మకాల్లో స్వల్ప పెరుగుదల నమోదు కావ టం గమనించాల్సిన విషయమే. టాటా మోటార్స్‌లో 8 శాతం, మారుతి సుజుకీ ఇండియాలో 2.5 శాతం వృద్ధి నమోదైంది.

ఆటోరంగంలో ఏర్పడిన మందగమనం, తగ్గిపోయిన అమ్మకాల నేపథ్యంలో ప్రభుత్వం అండగా నిలిచి కంపెనీలను ఆదుకోకపోతే మొత్తంగా ఆర్థికవ్యవస్థపైనే తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న బష్చెక్‌ అభిప్రాయంతో మహింద్రా అండ్‌ మహింద్రా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా కూడా ఏకీభవించారు. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యూరో-VI ఇంధన కార్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడినారు. దీనికి అనుగుణంగానే యూరో-VI కార్లకు మార్కెట్లలో విపరీత డిమాండ్‌ ఉన్నది. ఈ పరిస్థితి భారతీయ మార్కెట్‌లో దేశీయ కంపెనీలకు పెద్ద అడ్డంకిగా ఉంటున్నది. ఆర్థిక మందగమనంతో పాటు వాహన రంగంలో కొత్తగా వస్తున్న ఆధునిక వాహనాల ఫలితంగా కూడా ఆటోరంగం పతనానికి కారణమవుతున్నది. దీంతోపాటు మహింద్రా కంపెనీ వ్యవసాయరంగ ఉత్పత్తులు, ట్రాక్టర్ల తయారీలో కూడా కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో వాహన తయారీ, అమ్మకాల్లో అగ్రభాగాన నిలిచే మారుతి సుజుకీ కంపెనీ ఢిల్లీ సమీపంలోని గుర్‌గాం, మానేసర్‌లోని కంపెనీల్లో వారానికి రెండు రోజులు ఉత్పత్తులను నిలిపేయాల్సి న పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో వాహన అమ్మకాల్లో ఏర్పడిన మందగమనానికి అనుగుణంగా ఉత్పత్తిని కూడా తగ్గిస్తున్న స్థితి ఉన్నది. మహిం ద్రా కంపెనీ అధిపతి గోయెంకా తమ కంపెనీల్లో కాంట్రాక్ట్‌ కార్మికులుగా పనిచేస్తున్న పదిహేను వందల మంది కార్మికులను పనిలోంచి తొలిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మొత్తంగా చూస్తే భారత ఆర్థికవ్యవస్థ నే కృషించిపోతున్న తీరు కనిపిస్తున్నది. గత ఏప్రిల్‌-జూన్‌ నెలల్లో గత ఐదేండ్లనాటి కన్నా వృద్ధిరేటులో తగ్గుదల నమోదయ్యింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం, వ్యవసాయరంగం కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతూ వృద్ధిరేటు క్షీణిస్తున్నది. ఇలా ఆటోరంగంలో కనిపిస్తున్న మందగమనం, క్షీణత మిగతా రంగాలకు కూడా విస్తరించి మొత్తంగా దేశీయ ఆర్థికవ్యవస్థనే కబలించే పరిస్థితి ఏర్పడుతున్నది. అంతిమంగా ఆర్థిక సంక్షోభంలో దేశం కూరుకుపోయే పరిస్థితులు అతి చేరువలో కనిపిస్తుండటమే తీవ్ర ఆందోళనకరం.
-(‘ది వైర్‌' సౌజన్యంతో..)

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles