బ్యాంకులు బాగుపడని విలీనాలు

Fri,September 6, 2019 12:58 AM

దేశంలో బ్యాంకుల విలీనాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా పది బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు విలీనం కానున్నాయి. కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి. తాజా బ్యాంకుల విలీనంతో 27 ప్రభుత్వరంగ బ్యాంకుల సం ఖ్య 12కు తగ్గనున్నాయి. ఈ విలీనాలతో వివిధ బ్యాంకుల శాఖలు 30 వేలు కలిసిపోతాయి. గతంలో ఇదేవిధంగా ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరో డాలలో వివిధ బ్యాంకులు విలీనమయ్యాయి. తాజాగా పెద్ద ఎత్తున ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియతో దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల విలీనంతో ఒనగూడే ప్రయోజనాల దృష్టితో చూస్తే ప్రభుత్వవాదన పసలేనిదిగానే కనిపిస్తున్నది. గతంలో దీనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల విలీనంతో ఆశించిన ఫలితాలేవీ రాలేదు. ఆ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆర్థికవ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చూసినా బ్యాంకుల విలీనం ద్వారా జరిగే మేలు ఏమిటో ఎవరూ చెప్పటం లేదు. బ్యాంకుల దగ్గర పేరుకుపోయిన మొండి బకాయిల విషయం ఎటూ తేలలేదు. వాటిని తిరిగిరాబట్టడానికి చేపట్టాల్సిన చర్య ల విషయంలో నిర్దిష్ట విధానాలలో ఇప్పటికీ స్పష్టత లేదు. అప్పు ఎగవేతదారులపై నిర్దిష్ట చర్యలేవీ కనిపించటం లేదు. బ్యాంకుల విలీన ప్రక్రియ, ఫలితాలు ఈ విధంగా ఉంటే.., కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి పాత కథనే చెప్పుకొస్తున్నారు. ఈ విలీనంతో బ్యాంకులు శక్తిమంతమై అంతర్జాతీయ ఆర్థికసంస్థలతో పోటీ పడుతాయంటున్నారు.

దేశంలో పేరెన్నికగన్న బ్యాంకులన్నీ గ్రామీణ భారతంలోనే పురుడు పోసుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన అనేకానేక సంక్షోభాలను తట్టుకొని నిలిచాయి. 1949లో బ్యాంకింగ్‌రంగ రెగ్యులేషన్ చట్టం వచ్చి న తర్వాత కూడా ఈ బ్యాంకులు తమదైన ఆర్థికశక్తి, ప్రజా సంబంధాలతో నిలిచి శక్తిసామర్థ్యాలను చాటాయి. జాతీయాభివృద్ధిలో తమదైన పాత్ర పోషించాయి. దేశ సమగ్రాభివృద్ధిలో ఈ బ్యాంకులు నిర్వహించిన పాత్ర ఎనలేనిది.


అలాగే బ్యాంకుల పనితీరు, నిర్వహణలో నైపుణ్యం, ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్నారు. 2025 నాటికి దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదుగటానికి బ్యాం కుల విలీనం దన్నుగా ఉంటుందని కేంద్ర మంత్రి చెబుతున్నారు. గతం లో కూడా ఇదేవిధంగా చెప్పారు. 5 అసోసియేట్ బ్యాంకులను భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలుపటం ద్వారా ఆశించిన ఫలితాలేవీ రాలేదు. దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం నుంచి ఈ బ్యాంక్ విలీనాలు దేశాన్ని తప్పించలేకపోయాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగానూ అనుభవంలో ఉన్న విషయమేమంటే.. బ్యాంకు ల విలీనాలతో పెద్ద బ్యాంకులుగా అవతరింపజేయటం ద్వారా ఏ విధ మైన ఉపయోగం కలుగలేదు. జర్మనీలోని రెండు అతిపెద్ద బ్యాంకులను విలీనం చేయడం వల్ల అక్కడి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించవచ్చని పాలకులు భావించారు. కానీ ఆ బ్యాంకుల విలీనం ద్వారా ఏ విధమైన ఫలితాలు రాలేదు. కనీసం మన పాలకులు ఇలాంటి అంతర్జాతీయ అనుభవాలనేమీ పరిగణనలోకి తీసుకోలేదు. గుణపాఠాలుగా గుర్తించలేదు! ప్రధాని మోదీ తన ఆర్థిక సంస్కరణల ద్వారా గొప్ప ఫలితాలుంటాయిని చెప్పుకొచ్చారు. కానీ ఏ రూపంలోనూ ఆర్థికస్థితి గతులు మెరుగ వ్వలేదు. మోదీ ఆర్థిక సంస్కరణల ద్వారా ఆశించిన ఫలితాలు రాకపో గా, ఆర్థికసంక్షోభం మరింత పెరుగుతున్నది. ఆర్థిక సూచికలు పాతాళంలోకి పడిపోతున్నాయి. రానురాను ఆర్థిక సూచికలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోతూ ఆర్థికస్థితి భయానక స్థితిలో కృషించిపోతున్నది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులను బలోపేతం చేయటం పట్ల దృషిసారించకుండా బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకులను శక్తివంతం చేస్తామనుకోవటం అసంబద్ధం. ప్రభుత్వరంగ బ్యాంకులపై వేటు వేయటం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాబోదు. ఒక్కొక్క ప్రభుత్వరంగ బ్యాంకు ఆయా ప్రాంతాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నాయి. ఉదాహరణకు కర్ణాటకలోని కోస్తా జిల్లాలకు చెందిన సిండికేట్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను తీసుకుంటే అవి బ్యాకింగ్ రంగంలోని నలుగురు ప్రముఖ వ్యక్తుల కృషితో ఉనికిలోకి వచ్చాయి.

ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి స్వచ్ఛంద విలీనానికి ఒప్పుకోలు పత్రాలను తీసుకుంటున్నారు. కాబట్టి విలీన ప్రక్రియ అంతా ఇకనుంచి బోర్డు ప్రక్రియగా కొనసాగుతుంది. బ్యాంకుల విలీనంతో లక్షలాదిగా ఉన్న పొదుపరులు, ఖాతాదారులు బ్యాంకుల్లో కనిపించే కొత్త ముఖాలతో సేవలు పొందటంలో తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఇదేవిధంగా ఎస్‌బీఐలో అసోసియేట్ బ్యాంకుల విలీనం తర్వాత అనేక సమస్యలు ఎదురయ్యా యి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు బ్యాంకుల విలీనం తర్వాత అనుభవాల నేపథ్యంలో కూడా ప్రస్తుత విలీన ప్రక్రియలో కనీస చర్యలు తీసుకోలేదు.


ఈ బ్యాంకులు స్థానిక ప్రజల అవసరాలు, ఆర్థికస్థితిగతుల ఉన్నతి కోసం ఏర్పాటు చేయబడినాయి. కార్పొరేషన్ బ్యాంకును హాజీ అబ్దుల్లా, సిండికేట్ బ్యాంక్‌ను టీఎంఏ పాయ్, విజయ బ్యాంక్‌ను ఏబీ శెట్టీ, కెనరా బ్యాంకును అమ్మెంబల్ సుబ్బారావ్ పాయ్ లాంటి వారు ఎంతో సామాజిక ప్రయోజన దృష్టితో ఏర్పాటు చేశారు. వీరిలో ఏ ఒక్కరూ పారిశ్రామికవేత్తలు కాకపోవటం గమనార్హం. బ్యాంకుల ఏర్పాటులో వారి లక్ష్యమేమంటే.. ప్రజల్లో పొదుపు సంస్కృతిని పెంపొందించటం, ప్రజల అవసరాలు తీర్చటంగా చెప్పుకున్నారు. ఆ దిశగానే దశాబ్దాలుగా ఈ బ్యాంకులు సేవలందించాయి. ఈ క్రమం లో ఆయా ప్రాంతాల ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయాయి. ఇలాం టి సందర్భంలో ఆ బ్యాంకులను మరో బ్యాంక్‌లో విలీనం చేసినప్పుడు స్థానిక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కెనరాబ్యాంక్, సిండికేట్ బ్యాంకులను 1969లోనే జాతీయం చేసినా, ప్రజల వ్యతిరేకత వల్ల కార్పొరేషన్ బ్యాంక్, విజయా బ్యాంక్‌లను జాతీయం చేయటానికి ప్రభుత్వం 11 ఏండ్లు ఆగాల్సి వచ్చింది. దేశంలో పేరెన్నిక గన్న బ్యాంకులన్నీ గ్రామీణ భారతంలోనే పురుడు పోసుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన అనేకానేక సంక్షోభాలను తట్టుకొని నిలిచాయి. 1949లో బ్యాంకింగ్‌రంగ రెగ్యులేషన్ చట్టం వచ్చి న తర్వాత కూడా ఈ బ్యాంకులు తమదైన ఆర్థికశక్తి, ప్రజా సంబంధాలతో నిలిచి శక్తిసామర్థ్యాలను చాటాయి. జాతీయాభివృద్ధిలో తమదైన పాత్ర పోషించాయి. దేశ సమగ్రాభివృద్ధిలో ఈ బ్యాంకులు నిర్వహించి న పాత్ర ఎనలేనిది. ఈ బ్యాంకుల కారణంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందటమే కాకుండా, వాటి తోడ్పాటుతో ఎన్నో విద్యాలయాలు, హోటళ్లు, చిన్న పరిశ్రమలు వెలిశాయి. ఈ విధంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి వికాసంలో బ్యాంకుల భాగస్వామ్యం ఎంతో ఉన్నది. భారత బ్యాంకింగ్ రంగంలో ఈ బ్యాంకులకు ప్రత్యేక, విశిష్ట స్థానం ఉన్నది. కర్ణాటకలోని కోస్తా తీరంలో ఏర్పాటైన బ్యాంకులు మరెక్కడా లేవు. సంఖ్యలోనూ, ప్రజా సేవలోనూ ఈ బ్యాంకులు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దేశంలోని మహా నగరాలైన ముంబై, కలకాత్తా, చెన్నై లాం టి నగరాలలో తప్ప, మరెక్కడా ఈ స్థాయిలో బ్యాంకులు దేశంలో లేవు.

ఈ నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు కర్ణాటకలోని కోస్తా జిల్లాల రూపురేఖలు మార్చటంలో, పారిశ్రామికాభివృద్ధిలో కీలక భూమిక పోషించాయి. ఇదంతా ఇప్పుడు చరిత్ర. బ్యాంకుల విలీన గతానుభవాలు ఇలా ఉన్నా.., తాజా బ్యాంకుల విలీన ప్రక్రియను ఆహ్వానిస్తున్న వర్గాల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న వారు గతనుభవాలను చూడ నిరాకరిస్తున్నారు. మరోవైపు బ్యాంకుల విలీన ప్రక్రియతో ద్రవ్య చెలామణి పెరుగుతుందని చెబుతున్నదానికి ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి పెద వి విరుపే సమాధానంగా కనిపిస్తున్నది. బ్యాంకుల విలీన ప్రక్రియ కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు మాత్రమే లాభదాయకంగా ఉంటున్నది. మరోవైపు బ్యాంకుల విలీన ప్రక్రియతో బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల కుదింపుతో మరో పెద్ద సమస్య ముందుకు రాబోతున్నది. బ్యాంకు ఉద్యోగులను తొలిగించటం, కుదించటం జరుగదని ప్రభుత్వం చెబుతు న్నా.., ఆచరణలో రాబోయేరోజుల్లో ఎదురయ్యే పరిస్థితులు అవేననే భయాలు ముసురుకుంటున్నాయి. బ్యాంకుల విలీన ప్రక్రియ అంతా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొత్తగా నియమించిన సీఈఓల సూచనల మేరకే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు సీఈఓల నియామకాలు చేపడుతున్నాయి. సీఈఓల ఆధ్వర్యంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందని చెప్పటం అనూహ్యమే. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో.. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి స్వచ్ఛంద విలీనానికి ఒప్పుకోలు పత్రాలను తీసుకుంటున్నారు. కాబట్టి విలీన ప్రక్రియ అంతా ఇకనుంచి బోర్డు ప్రక్రియగా కొనసాగుతుంది. బ్యాంకుల విలీనంతో లక్షలాదిగా ఉన్న పొదుపరులు, ఖాతాదారులు బ్యాంకుల్లో కనిపించే కొత్త ముఖాలతో సేవలు పొందటంలో తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఇదేవిధంగా ఎస్‌బీఐలో అసోసియేట్ బ్యాంకుల విలీనం తర్వాత అనేక సమస్యలు ఎదురయ్యా యి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు బ్యాంకుల విలీనం తర్వాత అనుభవాల నేపథ్యంలో కూడా ప్రస్తుత విలీన ప్రక్రియలో కనీస చర్యలు తీసుకోలేదు. ఆర్థికపరిస్థితిలో ఎదురయ్యే సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. బ్యాంకుల విలీన ప్రక్రియతో ఎదురవుతున్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో మెగా బ్యాంక్ విలీన ప్రక్రియకు ఉపక్రమించటం వినాశదాయకమే. దీంతో అనేక విధాలుగా సమస్యలు ముందుకు రానున్నాయి.
tr-bhatt
ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా చర్యలేవీ లేకుండా బ్యాంకుల విలీనంతోనే సరిపెట్టాలనుకుంటే.. మరింత సమస్యల విలయంలో చిక్కుకోక తప్పదు. ప్రజల, సామాజిక అవసరాలు తీర్చటంలో, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించటంలో తగు పాత్ర పోషించాల్సిన బ్యాంకులు క్రియాశూన్యంగా మిగిలిపోయే పరిస్థితి ఆర్థికవ్యవస్థకు పెను ప్రమాదమని చెప్పక తప్పదు.

(రచయిత: అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి)

384
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles