విష జ్వరాలను అదుపు చేయాలి

Wed,August 21, 2019 10:55 PM

ఈ మధ్య పడిన వానలతో రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలాయి. ఎక్కువగా చిన్నపిల్లల్లో విషజ్వరాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దవాఖానాలన్నీ జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. దవాఖాన్లలో రోగులకు సరైన వసతులు, అవసరమైన మందులు కూడా ఉంటున్న పరిస్థితి లేదు. కాబట్టి సీజనల్ వ్యాధులను ఎదుర్కోవటానికి దవాఖాన ల్లో చాలినన్ని మందులు అందుబాటులో ఉంచాలి. మౌలిక సదుపా యాలు కల్పించాలె. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విషజ్వరాల ప్రభావం ఎక్కువ గా ఉంటున్నది. కాబట్టి మండలస్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా విషజ్వరాల కోసం మందులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- విష్ణు, హయత్‌నగర్

సెల్‌ఫోన్ ఎందుకోసం?

ఆధునిక ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన ప్రతి వస్తువూ ప్రజల చేతుల్లో ఆడంబరంగా మారిపోతున్నది. ఈ నేపథ్యంలోంచే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్నది. ఫోన్ అవసరం పరస్పర సమాచారం కోసమే అయితే ఫోన్లలోని బేసిక్ మోడల్ అయినా సరిపోతుంది. కానీ ఇవ్వాళ పాఠశాల విద్యార్థుల నుంచి అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఫ్యాషన్ గా మారిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్లను ముఖ్యంగా విద్యార్థులు, యువత ఏ తీరుగా వినియోగిస్తున్నారు అన్నదానిపై ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణ ఉండటం లేదు. స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటే పలురకాల సైట్లలో ఎంతటి వికృతాలున్నాయో అందరూ ఆలోచించాలి. ఇలాంటి వికృత సైట్ల మూలంగానే సమాజంలో నేర ప్రవృత్తి, సామాజిక హింస పెరిగిపోతున్న ది. జరుగుతున్న నేరాలు, వాటి స్వభావాలను లోతుగా విశ్లేషించి చూస్తే వాటన్నింటి వెనుకాల స్మార్ట్ ఫోన్లే కారణమని తెలుస్తున్నది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచటం ఒక బాధ్యత గా చేపట్టాలి. నిజానికి ఇంజినీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఓ మోస్తరుగా ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు పదోతరగ తి విద్యార్థి చేతిలోకి చేరితే జరిగే అనర్థాలు ఈ రీతిన ఉంటాయో జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి. ఇప్పటికైనా అందరూ మేల్కోవాలి.
- డి.గణేశ్, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా

123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles