వినియోగదారుల హక్కులకు భరోసా

Wed,August 21, 2019 12:37 AM

అమెరికా పార్లమెంటు 1890లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చట్టాన్ని రూపొందించింది. కొనుగోలుదారుల ప్రయోజనాన్ని పరిరక్షించేందుకు 1914లో, 1938లో ఈ చట్టానికి అనేక సవరణలు చేసింది. అమెరికా సమాజం లో అక్షరాస్యత, చైతన్యం ఎక్కువ. వినియోగదారులు, వ్యాపారులు బాధ్యతలను, హక్కులను గుర్తెరిగి వ్యవహరించడం పరిపాటి. మన దేశం లో అక్షరాస్యత తక్కువ. అయినప్పటికీ ఐక్యరాజ్యసమితి 1985లో చేసిన సూచనల ప్రకారం వినియోగదారుల హక్కుల పరిరక్షణకు చట్టాన్ని చేసిం ది. మోసపూరిత వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రపంచంలోని చట్టాలన్నింటికన్నా మెరుగ్గా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1986 నుంచి అమలుచేస్తున్నది. ఈ చట్టం ప్రజల చైతన్యాన్ని అనుగుణంగా అమలు జరుగుతున్నది. మన దేశంలోని వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం- దళారుల ప్రమేయం లేకుండా, అతితక్కువ రుసుంతో, తక్కువకాలంలో (90 రోజుల్లో) న్యాయం పొందవచ్చు. జిల్లా, రాష్ట్ర. జాతీయ వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించి వ్యక్తిగతంగా న్యాయం పొందే సౌలభ్యం మన ప్రభుత్వం కల్పించింది. నేరస్తులుగా నిరూపితమైన వ్యక్తులపై, సంస్థలపై, సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవటం, అరెస్టులు చేయించి మూడేండ్ల వరకు కారాగార శిక్ష, 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానా విధిం చే అధికారం సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి అనుబంధంగా ఉన్న ఇన్‌వెస్టింగ్‌కు కల్పించింది.

ఆన్‌లైన్ వ్యాపారాలు పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు జరిగే అవకాశం ఉన్నది. ప్రజలకు ఈ విధమైన మోసాలు జరిగితే న్యాయం పొందడం ఎట్లనో తెలువదు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ జరుగాలంటే, ప్రభుత్వం చట్టాలను రూపొందించినంత మాత్రాన సరిపోదు. ప్రజల చైతన్యం మూలంగానే ఈ చట్టం మరింత పకడ్బందీగా అమలవుతుంది. మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ. చాలామంది చదువుకున్న వారిలో కూడా హక్కులకు సంబంధించిన అవగాహన తక్కువ. వ్యాపార సంస్థలు మోసం చేస్తే ఏ విధంగా న్యాయం పొందాలో చాలా మందికి తెలువదు.


1986 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టానికి ప్రభుత్వం ఇటీ వల మరికొన్ని సవరణలు తెచ్చింది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిల్లో- పేర్లను ఫోరం బదులు కమిషన్‌గా మార్చింది. జిల్లా కమిషన్ లో ఫిర్యాదు చేసేందుకు పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు, రాష్ట్ర కమిషన్‌లో రూ.కోటి నుంచి పది కోట్ల వరకు జాతీయ కమిషన్‌లో పది కోట్లకు పైబడి నష్టపరిహారం పొందే విధంగా పరిధిని పెంచింది. జిల్లా కమిషన్‌లో వినియోగదారుల, ప్రజల ప్రయోజనార్థం మధ్యవర్తిత్వం ద్వారా సత్వరం న్యాయం అందించేందుకు తొలుత ప్రయత్నించే వీలు కల్పించింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు, కేసులు పరిష్కరించేందు కు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు నిష్ణాతులైన సేవాభావం గల ప్యానల్ సభ్యులను ఎంపిక చేయటం నిష్పక్షపాతంగా కేసుల పరిష్కారాన్ని దోహదపడటం విశేషం. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదును ఆన్‌లైన్‌లో స్వీకరించవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షులను విచారించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వసతులు, ఏర్పాటుచేయటం, నూతన భవన నిర్మాణాలు చేపట్టడం వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాల్ని జిల్లా కమిషన్ లో రాష్ట్ర కమిషన్‌లలో ఏర్పాటు చేయడం, మధ్యవర్తిత్వం కేంద్రాల నిర్వహణకు సమావేశ మందిరాలు నిర్మించటం జరుగుతున్నది. అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక, విజ్ఞానాభివృద్ధి వల్ల వ్యాపార స్వరూపం మారిపోయింది. ఈ నేపథ్యంలో నూతన వ్యాపారాభివృద్ధి ప్రక్రియలు, ఆర్థిక సంస్కరణల మూలంగా, ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్, టెలీ షాపింగ్ వ్యాపారాలు విస్తరించటం జరుగుతున్నది.

దేశవ్యాప్తంగా వినియోగదారులు తప్పుడు ప్రకటనలకు మోసపోవటం, సైబర్ నేరాలు సాధారణమైపోయాయి. వినియోగదారులు నూతన విధానాల్లో సైతం మోసానికి గురువుతున్నందు వల్ల ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనార్థం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలో ఎన్నో మార్పులు చేసింది. 1400 పైగా ప్రముఖులు ఇచ్చిన సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సమీక్షించిన అనంతరం చట్టానికి తగు సవరణల తో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019ను లోక్‌సభ జూలై 31న, రాజ్యసభ ఆగస్టు 6న ఆమోదించాయి. ఆగస్టు 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదంతో నూతన చట్టం అమలులోకి వచ్చింది. నూతన చట్టంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. మోసపోయిన ప్రజలకు సత్వరం న్యాయం అందించడం, పరిహారం చెల్లించడం కోసం ఏర్పాట్లు చేసింది. వాస్తవ విరుద్ధమైన ఆకర్షణీయ ప్రకటనలతో వినయోగదారులను మోసగించే సంస్థలపై, ప్రచార, ప్రసార సాధనాల్లో ప్రకటనల్లో భాగస్వాములయ్యే సెలబ్రిటీలపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకున్నది. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనే వ్యవస్థ ను రూపొందించి వారికి విచక్షణాధికారాలు, విచారణాధికారాలు కల్పిం చింది. మోసపూరిత ప్రకటనలపై వ్యాపార సంస్థలపై, వ్యాపారులపై సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవటం కోసం సీసీపీఏను ఏర్పాటుచేసింది. వారు నేరుగా జిల్లా కలెక్టర్ల సహాయం తీసుకొని, విచారణలు నేరుగా చేపట్టి చర్యలు తీసుకోవచ్చు. సత్వర సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సద్వినియోగం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన స్పం దించి వసతుల కల్పనకు దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Anabheri-Rajeshwar-rao
ఈ కొత్త చట్టం అమలుకు వీలుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గ దర్శకాలను అందించబోతున్నది. ఈ మేరకు రాష్ర్టాలలో రాష్ట్ర, జిల్లా కమి షన్‌ల ఏర్పాటు జరుగాలె. సభ్యుల నియామక ప్రక్రియ కూడా చేపట్టవ లసి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకొని మౌలిక ఏర్పా ట్లు చేసుకోవలసి ఉంటుంది. ఆన్‌లైన్ వ్యాపారాలు పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు జరిగే అవకా శం ఉన్నది. ప్రజలకు ఈ విధమైన మోసాలు జరిగితే న్యాయం పొందడం ఎట్లనో తెలువదు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ జరుగాలంటే, ప్రభుత్వం చట్టాలను రూపొందించినంత మాత్రాన సరిపోదు. ప్రజల చైత న్యం మూలంగానే ఈ చట్టం మరింత పకడ్బందీగా అమలవుతుంది. మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ. చాలామంది చదువుకున్న వారిలో కూడా హక్కులకు సంబంధించిన అవగాహన తక్కువ. వ్యాపార సంస్థలు మోసం చేస్తే ఏ విధంగా న్యాయం పొందాలో చాలా మందికి తెలువదు. అందువల్ల వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగినవారు ప్రజల కు ఈ వ్యవస్థ వల్ల కలిగే ఉపయోగం గురించి వివరించాలె. వినియోగ దారుల హక్కుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలె. మన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు గ్రామ, మండల, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన, మహిళా సంఘాల కార్యకర్తలు నూతన వినియోగదారుల చట్టం 2019ను అవగాహన చేసుకొని మన ప్రజలందరికీ గ్రామస్థాయి వరకు సంపూర్ణ అవగాహన కల్పించాలి.

192
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles