వారికి మతం ఒక రక్షణ కవచం

Tue,August 20, 2019 01:54 AM

నా దేశంలో బుద్ధిహీనుల సంత ఉంది. వారు అమాయక ప్రజలతో కొబ్బరికాయలోని ఆరోగ్యకరమైన, పౌష్టిక విలువలున్న నీటిని మురికి నీటిలో పోయిస్తారు. నదిలోని మురికి నీటిని పవిత్ర జలంగా నమ్మించి తాగిస్తారు- అన్నారు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇందులో చిన్నాచితకవి కొన్నయితే, పెద్ద ఎత్తున జరిగేవి మరికొన్ని. ఆకలి తట్టుకోలేకో, పేదరికంలో మగ్గిపోలేకో చేసే చిన్న చిన్న నేరాలకు తప్పక శిక్షలుంటాయి. అదే అధికార బలంతోనో అండదండలతోనో జరిగే వాటికి శిక్షలుండవు. ముఖ్యంగా మన దేశంలో మతపరంగా, కులపరంగా, వర్గపరంగా విభజింపబడి ఉన్నచోట అధిక సంఖ్యాకులు ఎలా మోసపోతుంటారో చూద్దాం. జనంలో అధిక సంఖ్యాకులు వీళ్లే గనుక... జాగ్రత్త పడాల్సిందీ వీళ్లే! మతం- నైతిక విలువల్ని పెంచేదే గనక అయితే మత ప్రబోధకులు చిన్నపిల్లలపై ఎందుకు లైంగిక దాడులకు పాల్పడుతారు? మానవ బాంబులుగా ఎందుకు తయారవుతారు? మతం అంటేనే ఊహాజనితం. అందులో మరి సత్యానికెక్కడ తావుందీ? అట్లని అబద్ధం చెప్పే హక్కు కూడా మతానికి లేదు. ప్రమాదవశాత్తూ కరంటు షాక్ కొట్టి మరణించిన యువకుడిని స్వస్థత ప్రార్థనతో తిరిగి బతికించాడు ఒక ఎవాంగ్లిస్ట్. షో-రక్తికట్టించాడు. కానీ అనారోగ్యంతో చనిపోయిన తన తండ్రిని బతికించుకోలేకపోయాడు. మహత్తు కింద మార్చి జనాన్ని మోసం చేస్తున్నారు. ఒక పాస్టర్ ముప్పై పెండ్లిండ్లు చేసుకున్నాడు. కొందరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి మేకల దొంగతనం కేసులో పట్టబడినాడు. ఒక ఎఫ్.బి. డాట్ కామ్-క్రిస్టియన్ ట్రూతర్స్ యునైటెడ్ వారు ఈ విధంగా ప్రకటించారు. మీ ఆదాయంలో పెద్ద మొత్తం దేవుడికి ఇమ్మని నేను సూచిస్తాను. దేవుడికి ఇమ్మంటున్నానంటే, అది నాకివ్వమంటున్నానన్న మాట. మల్టీ మిలియన్ డాలర్లతో నేను మరో కొత్త భవనం కొనుక్కుంటానన్న మాట. దైవ విశ్వాసకులు మాత్రం వారి దైనందిన కార్యక్రమాలకు సరిపడినంత డబ్బు లేక ఇబ్బంది పడుతుంటారు.

గుడ్డితనం వ్యక్తిని మాత్రమే బాధిస్తుంది. గుడ్డి నమ్మకాలు వ్యవస్థను అంధత్వంతో పీడిస్తాయి. ప్రార్థనా స్థలాల ముందు ఆకలితో అడుక్కునే వారికే దేవుడు పట్టెడన్నం పెట్టలేకపోతుంటే ఇక కోట్ల మంది కోర్కెలు ఎలా తీర్చగలడూ?


అది వేరే విషయమన్న మాట! అన్ని మతాల ప్రార్థనా స్థలాలలో ఫ్యాన్లు, కూలర్లు పెట్టడం చూస్తుం టాం. అవి దేవుడికి కాదు. గుడ్డితనం వ్యక్తిని మాత్రమే బాధిస్తుంది. గుడ్డి నమ్మకాలు వ్యవస్థను అంధత్వంతో పీడిస్తాయి. ప్రార్థనా స్థలాల ముందు ఆకలితో అడుక్కునే వారికే దేవుడు పట్టెడన్నం పెట్టలేకపోతుంటే ఇక కోట్ల మంది కోర్కెలు ఎలా తీర్చగలడూ? మత ఛాందసం, బూజుపట్టిన భావజాలం మెదళ్ళలో నింపుకున్నవారు చేస్తున్న అకృత్యాలు రోజూ కండ్ల ముందే చూస్తున్నాం. పదిహేడేళ్ల పెండ్లి కుమార్తె తను కన్యనే అని తొలిరాత్రి భర్తకు నిరూపించలేకపోయింది. భర్త ఆమెను శోభనం గదిలోనే చంపేశాడు. మనం 21 శతాబ్దంలోనే ఉన్నామా? ఎవరు ఎవరినైనా ఎక్కడైనా చంపేయగల ఆటవిక సమాజంలో ఉన్నామా? వధూవరులు అగ్నిచుట్టూ ఏడు సార్లు ఎందుకు తిరుగుతారు? -అన్న దానికి వేద సైన్సు పండితులు ఇచ్చే వివరణ ఇలా ఉంటుంది. ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి. అది 1 నుంచి 9 సంఖ్యలలో ఒక ఏడుతో తప్ప అన్నింటితో విభజింపబడుతుంది. అందువల్ల అలా ఏడుసార్లు ప్రదక్షణలు చేయడం వల్ల ఆ జంట విడిపోకుండా ఉంటారని అందులోని గూడార్థమట. మరి అలా సంప్రదాయాల ప్రకారం పెండ్లి చేసుకుని కూడా ఎందరో విడిపోతున్నారు కదా? మరి ఈ సూడో సైన్సు పండితులు దీనికి కారణాలేమైనా చెపుతారా? ఈ మధ్య ఒకాయన కొరుకుడు బాబా అవతారమెత్తాడు. ఆడా మగా అని తేడా లేకుండా 200 ఫీజు తీసుకుని మీదపడి కొరుకుతాడు. తన పంటి గాటు పడితే రోగాలు నయమౌతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ ప్రచారం చేసుకున్నాడు. ఈ కొరుకుడు బాబా బాగోతం వీడియోలు తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసులు స్పందించి తహసీల్‌దార్ ఎదుట బైండోవర్ చేశారు. అలాగే మరో మహిళ కూడా దేవుడు పూనాడని శిగాలు ఊగుతూ ఉంటే, జనాన్ని మోసం చేస్తూ ఉంటే అరెస్టు చేశారు. అందుకే జనం విద్యావంతులైతే సరిపోదు. వివేకవంతులు కావాలి. విజ్ఞులు చెప్పే విషయాల గూర్చి ఆలోచించుకుంటూ ఉండాలి. ప్రఖ్యాత తెలుగు అభ్యుదయ కవి ఆరుద్ర అంటారు-దేవుడి మీద తిరగబడలేని వాడు ప్రజలను మార్చలేడు. ప్రజలను మార్చకపోతే మూఢాచారాలు అంతరించవు.

నారు పోసినవాడే నీరు పోస్తాడు అని అనుకుంటారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని కూడా అనుకుంటారు. నిజమే! మరి ఇంతకూ ఆ దేవుడెక్కడా? అద్దంలో చూసుకుంటే నీ దేవుడు కనిపిస్తాడు. అతని అభిప్రాయాలన్నీ నీ మెదడులోనే ఉన్నాయి. అందువల్ల అతను బయట ఎక్కడా లేడు. దైవ భావన అన్నది మనిషి మెదడులోనే ఉన్నది. దానిని అందులోంచి తీసేస్తే-అసలు సిసలైన మనిషి మిగులుతాడు. దైవ భావన భారాన్ని మోస్తూ మనిషి శతాబ్దాలు దాటి వచ్చాడు. అయినా రాను రాను మనిషి, మనిషిగా మిగలకుండా పోతున్నాడు. మనిషి ఆలోచనలతో.. మనిషి మనిషిగా ఉంటేనే మనిషి బతుకుతాడు.


మూఢాచారాలున్నంత కాలం అభ్యుదయం సాధ్యం కాదు! అని. దైవ భావన చాటున నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. బెంగళూరులో జరిగిన ఒక తాజా ఉదాహరణ. ఇరువై నాలుగేండ్ల బీసీఏ గ్రాడ్యుయేట్. తల్లిదండ్రులు విడిపోయినందు వల్ల ఒంటరిదైంది. చుట్టూ ఎన్నో సమస్యలతో ప్రశాంతత కరువై-టెలివిజన్‌లో ఒక జోతిష్యుడి ప్రకటనకు ఆకర్షింపబడి మోసపోయింది. ఆ జ్యోతిష్యుణ్ణి కలిస్తే పూజ కోసం 15 వేలు తెమ్మన్నాడు. అంత డబ్బు లేదంటే సగమైనా ఇమ్మన్నాడు. నానా తంటాలు పడి సగం డబ్బు చెల్లించింది. ఎన్ని నెలలైనా ఫలితం కనిపించలేదు. ఆమె డబ్బులు కావాలని పట్టుబట్టింది. తర్వాత ఇస్తానని వెనక్కి పంపించాడు. కొన్నిరోజులకు జ్యోతిష్యుడే అమ్మాయికి ఫోన్ చేసి పిలిచాడు. తన గురువు గారు వచ్చారని ఆయనైతే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతాడని చెప్పి, అమ్మాయిని మరొకతనికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ గురువు గారు అరగంట పూజ చేసి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గ్రహించి ఆ అమ్మాయి తప్పించుకుని పారిపోయింది. తర్వాత మరోరోజు స్నేహితురాల్ని వెంటబెట్టుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లింది. డబ్బు తిరిగి ఇవ్వమని గొడవ చేయడానికే వెళ్లింది. అతని గదికి తాళం కనబడింది. తర్వాత మళ్లీ మళ్లీ వెళ్లినా తాళమే కనిపిస్తున్నది. జ్యోతిష్యుడి గురించి ఆరా తీస్తూ చుట్టుపక్కల వారిని అడుగుతుంటే ఎవరో ఒక ప్రొఫెసర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆయన హేతువాద సంఘ ఫెడరేషన్ అధ్యక్షుడు. అమ్మాయి ఆయనకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆయన రంగంలోకి దిగి, ఆధారాలు సేకరించి కేసు పోలీసులకు అప్పగించాడు. గురుశిష్యులిద్దరిని కటకటాల వెనక్కి పంపాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి ఏ మీడియాలో కనబడవు. కాబట్టి ఇలాంటి వాటిపట్ల సామాన్యులే వివేకవంతంగా ఆలోచిస్తూ మసలుకుంటూ ఉండాలి. కొన్ని జిల్లాలలో జోగినుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. యుక్తవయసు రాగానే జోగినిని చేసి ఇంట్లోంచి పంపిస్తారు. పేరుకే దేవుడి భార్య. కానీ సమాజంలోని పెద్దమనుషులకు ఆమె ఉమ్మడి ఆస్తి. యవ్వనం ఉన్నన్ని రోజులు బాగానే బతుకుతారు. ముసలితనంలో కష్టాలు మొదలవుతాయి.
Devaraju-Maharaju
సమస్యల నుంచి తమను బయటపడేసినందుకు చాలామంది ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. కానీ ఆ సమస్యల్ని సృష్టించించి ఎవరన్నది ఆలోచించరు. నారు పోసినవాడే నీరు పోస్తాడు అని అనుకుంటారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని కూడా అనుకుంటారు. నిజమే! మరి ఇంతకూ ఆ దేవుడెక్కడా? అద్దంలో చూసుకుంటే నీ దేవుడు కనిపిస్తాడు. అతని అభిప్రాయాలన్నీ నీ మెదడులోనే ఉన్నాయి. అందువల్ల అతను బయట ఎక్కడా లేడు. దైవ భావన అన్నది మనిషి మెదడులోనే ఉన్నది. దానిని అందులోంచి తీసేస్తే-అసలు సిసలైన మనిషి మిగులుతాడు. దైవ భావన భారాన్ని మోస్తూ మనిషి శతాబ్దాలు దాటి వచ్చాడు. అయినా రాను రాను మనిషి, మనిషిగా మిగలకుండా పోతున్నాడు. మనిషి ఆలోచనలతో.. మనిషి మనిషిగా ఉంటేనే మనిషి బతుకుతాడు.
(వ్యాసకర్త: సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles