అద్భుతం: ఈ విద్యాయజ్ఞం!

Wed,July 17, 2019 12:44 AM

education-hub
కేసీఆర్ చేసిన యజ్ఞాల గురించి తెలిసింది గానీ మైనారిటీల విద్యాయజ్ఞం గురించి మాత్రం గతవారమే మాకు తెలిసిం ది. వృత్తిరిత్యా నేను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను. మా సొంతూ రు కడప జిల్లా కల్పనాయిని చెరువు. కొన్నేండ్లుగా అమెరి కాలోని మేరీలాండ్‌లో ఉంటున్న. మా అమ్మాయి ప్రణతి పదో తరగతి పూర్తిచేసి 11వ తరగతిలోకి వచ్చింది. మా అమ్మాయి స్కూల్‌లో ఏదైనా ఒక అంశంపై ఒక పేపర్ సబ్‌మిట్ చేయాల్సి ఉన్నది. మా అమ్మాయి భారతదేశంలో ముస్లిం, ఇతర మైనారిటీల విద్య, ఆర్థికస్థితిగతులపై అధ్యయనం చేయాలనుకున్నది. దీనికోసమే నేను రెండువారాల కోసం నా కూతురుతో కలిసి ఇండియాకు వచ్చాను.తెలంగాణ, ఏపీ రాష్ర్టాలలోని దళితులు, ముస్లింలు, పేదల స్థితిగతులపై మా అమ్మాయి క్షేత్రస్థాయి పర్య టన చేసింది. తోడుగా నేను కూడా వెళ్లాను. మా పర్యటనలో ప్రధానంగా ముస్లిం విద్యార్థినుల విద్యపై తెలుసుకోవాలన్న ఆతృత మా అమ్మాయి ప్రణతిలో కనిపించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో విద్యావ్యవ స్థ, నోబెల్ అవార్డు గ్రహీత మాలాల ప్రభావం మా అమ్మాయిపై ఉండి ఉండవచ్చు. మైనారిటీలకు విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న మా అమ్మాయి ప్రశ్నకు సమాధానం హైదరాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుందని భావించాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అలాగే వీలైతే మదరస్సాల్లోని విద్యను కూడా పరిశీలించాలనుకున్నాం. ఇదే విషయాన్ని నా మిత్రుడు స్కై బాబా తో చెబితే ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముస్లిం మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూళ్ళను పర్యవేక్షించే ఒక అధికారి (ఖాసిం మొహమ్మ ద్)ను నాకు పరిచయం చేశారు.

మా అమ్మాయి అంతకుముందే ప్రిన్సిపల్‌ను అమ్మాయిలకు ప్యాడ్స్ ఉచితంగా ఇస్తారా అని అడిగింది. అందుకు సమాధానంగా అక్కడ పెట్టెల్లో ఉన్న ప్యాడ్స్‌ను ప్రిన్సిపల్ మా అమ్మాయిని తీసుకెళ్లి చూపించారు. ఏ అమ్మాయికి ఏ రోజు పీరియడ్స్ వచ్చాయన్న వివరాలు కూడా రిజిష్టర్‌లో నమోదు చేస్తామని, ప్యాడ్స్ వాడటం గురించి, పరిశుభ్రత గురించి వివరిస్తామని చెప్పారు.


ఆయన తన సహాయకుడిని మాకు తోడు గా పంపి ఖైరతాబాద్‌లోని ఒక అమ్మాయిల రెసిడెన్షియల్ పాఠశాలకు పం పించారు. అక్కడి ప్రిన్సిపల్ ఐశా మస్రత్ మా రాక ఉద్దేశాన్ని తెలసుకొని ఎంతో సంతోషించారు. ఎంతో ఉత్సాహంగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానా లిస్తూ దగ్గరుండి ప్రతి తరగతి గదిని చూపించారు. పిల్లలు పడుకునే పడ కలూ, ఆడుకునే స్థలం, వంటగది, డైనింగ్ హాల్, సిక్ రూం.. ఇలా ప్రతిదీ దగ్గ రుండి వివరిస్తూ చూపించారు. మామూలు ప్రభుత్వ పాఠశాలల మాదిరి కాకుండా పిల్లలు చాలా ఆరో గ్యంగా, ఉత్సాహంగా కనిపించారు. వంటగదికి వెళ్లినపుడు అక్కడ ఆ సాయంత్రం బీట్‌రూట్ హల్వా చేస్తున్నారు. అది పిల్లలకు సాయంత్రం స్నాక్ అట. మాకూ తినిపించారు. చాలా బాగుంది. వంటగది పరిసరాలు దుర్వాసన, ఈగలు లేకుండా శుభ్రంగా ఉన్నాయి. సిక్‌రూంలోకి వెళ్లినపుడు అక్కడ నలుగురు పిల్లలు మంచాలపై విశ్రాం తి తీసుకుంటూ కనిపించారు. వాళ్లను కనిపెట్టుకొని అక్కడే ఒక టీచర్ ఉన్నారు. (ఆ రోజు ఉండాల్సిన నర్స్ సెలవులో ఉన్నదని ప్రిన్సిపల్ చెప్పా రు). మా అమ్మాయి అంతకుముందే ప్రిన్సిపల్‌ను అమ్మాయిలకు ప్యాడ్స్ ఉచితంగా ఇస్తారా అని అడిగింది. అందుకు సమాధానంగా అక్కడ పెట్టె ల్లో ఉన్న ప్యాడ్స్‌ను ప్రిన్సిపల్ మా అమ్మాయిని తీసుకెళ్లి చూపించారు. ఏ అమ్మాయికి ఏ రోజు పీరియడ్స్ వచ్చాయన్న వివరాలు కూడా రిజిష్టర్‌లో నమోదు చేస్తామని, ప్యాడ్స్ వాడటం గురించి, పరిశుభ్రత గురించి వివరి స్తామని చెప్పారు. తరగతి గదులు కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. అందరికీ సరిపడా బల్ల లున్నాయి. ప్రతి ఒక్కరి యునిఫాం మురికిలేకుండా శుభ్రంగా కనిపించా యి.

ఒక్కో తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారట. వారిని 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విడదీస్తారట. అలా ఆ పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ సుమారుగా 400 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఒక్కో తరగతికి తీసుకునే 80 మందిలో మొత్తం మైనారిటీ మతాలకు 75 (60 సీట్లు), అంటే 64 ముస్లింలకు, 7 క్రైస్తవులకు, జైనులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులకు ఒక్కొక్క రికి ఒక్క శాతం చొప్పున కేటాయించా రు. మిగిలిన 25 శాతం అంటే 20 సీట్ల ను ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, బీసీలకు 12, ఓసీలకు 3 శాతం చొప్పున కేటా యించారు. ఏటా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపరీక్ష పెట్టి దాని ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రమంతా కలిసి 204 ఉన్నా యి. అంటే సగటున ఒక్కో పాఠశాలలో 700 మంది అనుకున్నా లక్షన్నర మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా 16 వేల మంది విద్యా ర్థులు చేరుతున్నారు. ఇదొక అద్భుతమైన పథకం. మైనారిటీల్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు తెస్తుందనిపించింది. ఇలాంటి పాఠశాలలు దేశ మంతా తెరువాలి. పిల్లల మీద, వారి చదువుల మీద పెట్టే ఏ పైసా వృథా కాదు. దానికి మించిన సార్థకత దేనికి ఉంటుంది? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మైనారిటీ విద్యాసంస్థలను చూసి, అక్కడి పరిస్థితులపై మా అమ్మాయి అధ్యయనం చేసిన తర్వాత జూలై 13న అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యాం. అక్కడి విద్యా సౌకర్యాలను చూసిన తర్వాత దేశంలో నిజమైన మార్పు కనిపించిందనిపించింది. తెలంగాణ ప్రభుత్వం మైనా రిటీ విద్యార్థులపై పెట్టిన దృష్టి దీర్ఘకాలంలో దేశంలో మార్పునకు నాంది పలుకుతుందనిపించింది. ఇదో సామాజిక విప్లవంగా తోచింది. అక్కడి పరిస్థితులు చూశాక సంతోషంగా ఫీలయ్యాం.
Prasad
కేసీయార్‌కు స్నేహితుడైన జగన్ ఈ పథకాన్ని ఏపీలో కూడా ప్రవేశపె డితే ప్రజలకు ఎంతో మేలు చేసినవాడవుతాడు. చివరగా ఆ ప్రిన్సిపల్‌ను మా అమ్మాయి అడిగిన ఒక ప్రశ్న. మీరు ముస్లిం అమ్మాయిలకు పాఠశాల నడుపుతున్నారు కదా, మీ మీద బాం బులేస్తామని ఎవరూ బెదిరించలేదా? ఆ ప్రిన్సిపల్‌కు ప్రశ్న అర్థంగాక కాసేపు తెల్లమొహం వేసింది.
(మేరీల్యాండ్, అమెరికా నుంచి)

263
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles