క్యాన్సర్‌ను నిరోధించాలె

Wed,July 17, 2019 12:43 AM

ప్రాణాంతక క్యానర్స్ మహమ్మారితో రోజు కు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిందంటే చాలు ప్రాణాలను నిలుపుకోవడం కఠిన పరీక్షే. క్యాన్సర్ వ్యాధి నివారణకు, దానికి సంబంధించిన చికిత్స కోసం లక్షల్లో చేయాల్సి ఉం టుంది. అంతపెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయలేని పేదల కుటుంబాలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ఔషధ ధరల నియం త్రణ సంస్థ క్యాన్సర్‌కు సంబంధించిన ఔష ధాల ధరలను తగ్గించినట్లు ప్రకటించడం హర్షణీయం. ఇలా తగ్గించిన ఔషధాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచేట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే క్యాన్సర్ వ్యాధి కారకాల నిరోధానికి కూడా ప్రభు త్వాలు కృషి చేయాలి.
- జంపాల అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా

నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణం

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు, ఆ ప్రమాదాల్లో జరుగుతున్న మరణాల తీరుతెన్నులను పోలీసులు విడుదల చేస్తున్న సీసీ పుటేజీ వీడి యోల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. చిన్నపాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పాటించకపోవటం లాంటి కారణాలతోనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు ఆ వీడియోల్లో స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ప్రయాణికులు ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించి తమ ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలె. పోలీసుల నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను పెద్దమొత్తంలో అరికట్టవచ్చనేది ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాలి.
- కె.శ్రీనివాస్, పెద్ద సముద్రాల, సిద్దిపేట జిల్లా

చెత్త నిబంధనలు

ఐసీసీ చెత్త నిబంధనలు, అంపైర్ల తప్పిదం వల్లనే వరల్డ్‌కప్ గెలువాల్సిన న్యూజిలాండ్ ఓటమి పాలయింది. అయినా ఆ జట్టు ఆటగాళ్లు సంయమ నం పాటించి గౌరవంగా వ్యవహరించడం అభినందనీయం. ఐసీసీ నిబంధనల వల్ల మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తిగా వ్యక్తం చేస్తుండటం క్రికెట్ అభిమానులను ఆలోచింపజేస్తున్నది. అందరి అభిప్రాయమూ అదే ఐసీసీ ఇరు జట్లను విజేతలుగా ప్రకటించాల్సి ఉండాల్సిందని.
- జీడిపల్లి లింగారావు, రామకృష్ణకాలనీ, కరీంనగర్

179
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles