‘పౌర’చిక్కుల్లో అస్సామీలు

Tue,July 16, 2019 03:45 AM

అస్సాంలో జాతీయ పౌరసత్వ నమోదు రిజిష్టర్ తుది జాబితాను ఈ జూలై 31న విడుదల చేస్తామని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నది. బహుశా ఇది ప్రపంచలోనే అతిపెద్ద పౌరజాబితా పరిశీలనా కార్యక్రమం గా చెప్పబడుతున్నది. ఈ పౌర నమోదు కార్యక్రమం కారణంగా లక్షలా ది మంది జీవితాలు త్రిశంకు స్వర్గంలో చిక్కుకున్నాయి. అంతిమ (ఫైనల్) పౌర నమోదు ప్రక్రియగా చెబుతున్న ఈ కార్యక్రమం నెలరోజులుగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో పౌర నమోదు ప్రక్రియ అంటే ఏమిటి? అది అస్సాంలో ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? లాంటి అనేక ప్రశ్నలను దేశ ప్రజల ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో దాని పూర్వాపరాలను, సమస్యలను పరిశీలించవలసి ఉన్నది. పౌర రిజిష్టర్ అంటే అస్సాంలో నివసిస్తున్న భారత పౌరుల పేర్ల నమోదు రిజిష్టర్ అని అర్థం. దశాబ్దాలుగా అస్సాంలోకి వలస వచ్చిన వారిని వలస వచ్చిన వారు, లేదా విదేశీయు లు అన్న పేరుతో పిలుస్తున్నారు. అస్సాంలోకి దఫ దఫాలుగా అనేక మార్లు ప్రజా వలసలు సాగాయి. మొదటిసారి బ్రిటిష్ వలస పాలనలో జరిగితే, దేశ స్వాతంత్య్రం తర్వాత సరిహద్దు దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసలు అస్సాంలోకి జరిగాయి. ఈ విదేశీయులు అన్న దానితోనే అస్సాంలోని సమస్య అంతా ముడిపడి ఉన్నది. వలసకారులు, లేదా విదేశీయుల రాకతో స్థానిక ప్రజలు మైనార్టీలో పడిపోయి వారి సాంస్కృతిక, రాజకీయ జీవితం ప్రమాదంలో పడిపోయిందన్న భావన స్థానిక అస్సామీయుల్లో నెలకొన్నది. మొదటిసారి 1951లో జనాభా గణనను చేపట్టి ఓ ఏడాది కాలంలో పౌర నమోదు రిజిష్టర్‌ను పూర్తిచేశారు. దేశ విభజనతో చోటుచేసుకున్న మత కలహాలలో పెద్ద ఎత్తున దేశ సరిహద్దుల వెంట వలసలు, చొరబా ట్లు చోటుచేసుకున్నాయి.

పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ అస్సాంలో ఓ బృహత్తర కార్యంగా మారింది. ఇది అనేక దశలుగా కొనసాగుతున్నది. మొదట రాష్ట్రవ్యాప్తంగా జనాభా గణన చేపడుతారు. ఈ క్రమంలో గమనించాల్సిన విషయం ఏమంటే.. ఒంటరి వ్యక్తులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. వారు తమ పేరు నమోదు కోసం జాతీయ పౌర నమోదు రిజిష్టర్ (ఎన్‌ఆర్‌సీ) దరఖాస్తు చేసుకోవాలి. వారి కుటుంబీకులు, పూర్వీకులు 1971కన్నా ముందునుంచే అస్సాంలో నివసిస్తున్నారని రుజువులు చూపాలి. వారితో తమకు ఉన్న రక్త సంబంధాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే వారి దరఖాస్తు పరిశీలనకు నోచుకుంటుంది.


ఈ విధంగా ప్రజల వలసల నేపథ్యంలో నాటి పౌరగణనపై అనేక అసంతృప్తులు, అనుమానాలు ఏర్పడినాయి. 1951 నుంచీ అస్సాంలో పౌర రిజిష్టర్‌ను 2015 దాకా పౌర నమోదు ప్రక్రియ ను నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉన్నది. ఈ పౌరగణన లక్ష్యమేమంటే రాష్టంలో ఉన్న అక్రమ వలసదారులను, విదేశీయులను గుర్తించటమే. 1971 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత పెద్ద ఎత్తున అస్సాంలోకి బంగ్లా నుంచి వలస వచ్చారని, అలాంటి వలస వచ్చిన విదేశీయులను గుర్తించి వెనక్కి పంపేయాలని అస్సాం ప్రజల ఆకాంక్ష. ఈ నేపథ్యంలోంచే బంగ్లాదేశ్ అవతరణ జరిగిన ఎనిమిదేండ్ల తర్వాత 1979లో అస్సాంలో విదేశీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. విదేశీయులు అస్సాంలోకి పెద్ద ఎత్తున చొరబడి ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం చేసే పరిస్థితి వచ్చి, భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడిందని స్థానిక ప్రజలు ఆం దోళన బాట పట్టారు. విదేశీ చొరబాటుదారుల సమస్య మీదనే 1985లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) విదేశీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోంచే ఏఏఎస్‌యూ అస్సాం ఒప్పందం ఉనికిలోకి వచ్చింది. అస్సాం ఒప్పందం ప్రకారం.. 1966 నుంచి 19 71 మధ్య అస్సాంలోకి వచ్చిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలిగించి, వారిని పదేండ్ల కాలం వరకు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులుగా ప్రకటించాలి. పదేండ్ల కాలం పూర్తయిన తర్వాత తొలిగించిన పేర్లను తిరిగి ఓటర్ జాబితాలో చేర్చాలని ఒప్పందంలో రాసుకున్నారు. 1971 మార్చి 25 తర్వాత బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలో అస్సాంలోకి వచ్చినవారిని విదేశీయులుగా పరిగణించాలని అందులో పొందుపరిచా రు. అస్సాంలో ఇప్పుడు చేపట్టిన జాతీయ పౌరసత్వ నమోదు రిజిష్టర్ ప్రకారం.. విదేశీయుల అన్న దానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఎవరైతే వారసత్వంగా అస్సామీకి చెందిన వారమనే రుజువులు సమర్పించ కపోతే వారంతా విదేశీయులుగానే పరిగణింపబడుతారు.

ఎన్‌ఆర్‌సీ విడుదల చేసే తుది జాబితా 42 లక్షల మంది పౌరుల భవిష్యత్తును తేల్చనున్నది. ఇంత జనాభా కలకత్తా నగరంలో సగం జనాభాకు సమానం. అలాగే స్విట్జర్‌లాండ్ దేశ జనాభాకు సగం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పౌరసత్వం తేలని స్థితి ఉండటం దుర్లభం. ఇలాంటి పరిస్థితి మరెన్నో సమస్యలకు దారితీస్తుంది.


అంటే దీన ర్థం.. 1971కి ముందు భారత్‌లో జన్మించినా తన కుటుంబీకులు, పూర్వీకులు తమ భారతీయతను రుజువు చేసుకోవాలి. లేనట్లయితే ఇక్క డ పుట్టినవారై 48 ఏండ్లు నిండినా విదేశీయులగానే పరిగణింపబడే పరిస్థితి ఏర్పడింది. విదేశీయులని పిలువబడుతున్న వారి గుర్తింప్తు ప్రక్రియను అక్రమ వలసలను గుర్తించే 1983 చట్టం ప్రకారం చేస్తున్నట్లు చెప్పారు. అయితే దాన్ని సుప్రీంకోర్టు 2005లో కొట్టివేసింది. అలాగే ఆ చట్టం ప్రకారం.. అక్రమ వలసలు, చొరబాటుదారులు, విదేశీయులు అన్నదాన్ని గుర్తించటం చట్ట సమ్మతంగా లేదని అలా గుర్తించటం కూడా అసాధ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరిగ్గా ఆ సమయంలోనే నాటి అస్సాం ముఖ్యమంత్రి, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నేతలు, ప్రధాని మన్మోహన్‌సింగ్ కూర్చొని అస్సాం సమస్యపై చర్చించారు. జాతీయ పౌరగణన రిజిష్టర్‌ను ఎలా రూపొదించాలో ఈ త్రైపాక్షిక చర్చల్లో నిర్ణయించారు. అదే సందర్భంలో ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టుకు పోయి న నేపథ్యంలో పౌర నమోదు రిజిష్టర్ నుంచి పేర్లను తొలిగించే ప్రక్రియ ను నిలిపివేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకో ర్టు జాతీయ పౌర నమోదు ప్రక్రియ విధివిధానాలను రూపొందించాలని 2013లో కేంద్రాన్ని కోరింది. అప్పటినుంచి పౌర నమోదు ప్రక్రియ అం తా సుప్రీం కనుసన్నల్లోనే కొనసాగుతున్నది. పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ అస్సాంలో ఓ బృహత్తర కార్యంగా మారింది. ఇది అనేక దశలుగా కొనసాగుతున్నది. మొదట రాష్ట్రవ్యాప్తం గా జనాభా గణన చేపడుతారు. ఈ క్రమంలో గమనించాల్సిన విషయం ఏమంటే.. ఒంటరి వ్యక్తులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ప్రక్రి య సంక్లిష్టంగా మారింది. వారు తమ పేరు నమోదు కోసం జాతీయ పౌర నమోదు రిజిష్టర్ (ఎన్‌ఆర్‌సీ) దరఖాస్తు చేసుకోవాలి. వారి కుటుంబీకులు, పూర్వీకులు 1971కన్నా ముందునుంచే అస్సాంలో నివసిస్తున్నారని రుజువులు చూపాలి. వారితో తమకు ఉన్న రక్త సంబంధాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే వారి దరఖాస్తు పరిశీలనకు నోచుకుంటుంది.

దరఖాస్తుదారులు దాఖలుపరిచిన నిజ ప్రతులు ఆధారంగా ఎన్‌ఆర్ సీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ధారిస్తారు. అలా ఒక దరఖాస్తుదారున్ని రక్తసంబంధీకులకు చెందినవారిగా గుర్తించి వారి కుటుం బ సభ్యుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని బెంగాలీ ముస్లింలు ఎక్కువగా బంగ్లాదేశీయులుగా, విదేశీయులుగా పరిగణింపబడుతున్న స్థితి ఉన్నది. ఎక్కువగా వారిపైనే అనేక విధాలుగా పరిశీలనలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఆర్‌సీలో అస్సాంలోని నిజ వాస్తవ్యుల సమస్య 2017లో ముందుకువచ్చింది. ఎన్‌ఆర్‌సీ అధికారుల ప్రకారం కూడా నిజ వాస్తవ్యుల విషయంలో శల్యపరీక్షలు, పరిశీలనలు ఉండటం లేదన్న వాదన కూడా ఉన్నది. దీంట్లో ఎక్కువగా ముస్లింలున్నారన్న ప్రచారం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో గౌహతి హైకోర్టు 2017లో గ్రామపంచాయతీ ఇచ్చిన నివాస పత్రాలు 1971 తర్వాత జన్మించిన వారి విషయంలో అనుసంధాన పత్రాలుగా పరిగణించబడవని తీర్పునిచ్చింది. ఈ విధమైన పరిస్థితి వివాహమైన మహిళలకు మరిన్ని కష్టాలను తెచ్చిం ది. ఆ తర్వాత పరిణామాల్లో గ్రామపంచాయతీ ఇచ్చిన సర్టిఫికెట్లకు మరికొన్ని పత్రాలు జతపరిస్తే చెల్లుతాయన్నారు. 2017 డిసెంబర్ 31న ప్రకటించిన మొదటి జాబితాలో ఈ మహిళల సమస్య తీవ్రంగా కనిపించిం ది. 2018 జూలై 30న ప్రకటించిన రెండో డ్రాఫ్ట్ ప్రకారం.. 2.48 లక్షల మదిని డి ఓటర్లుగా గురించారు. డీ అంటే డౌట్‌ఫుల్ (అనుమానా స్పద) పౌరులని అర్థం. ఇలా లక్షలాదిగా డీ ఓటర్లుగా ఉన్నవారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్న దానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమేదీ కనిపించటంలేదు. ఇప్పటిదాకా ఎన్‌ఆర్‌సీకి 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2.89 లక్షల మందిని మాత్రమే 2018 జూలై 30న విడుదల చేసిన డ్రాఫ్ట్‌లో చేర్చారు. కానీ ఇంకా 40.7లక్షల మంది ఇంకా ఎటూ తేలని స్థితిలో ఉన్నారు. ఇందులో సైనికులుగా పనిచేసినవారు, ప్రభుత్వో ద్యోగులు మరెంతో మంది ఉన్నారు.
ipsitha-chakravathi
ఎవరెక్కడ పుట్టారన్న దానికి విస్పష్ట గణాంకాలేవీ లేవు. కానీ దీంతో బెంగాల్‌కు చెందిన వారే ఎక్కువగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఎన్‌ఆర్‌సీ విడుదల చేసే తుది జాబితా 42 లక్షల మంది పౌరుల భవిష్యత్తును తేల్చనున్నది. ఇంత జనాభా కలకత్తా నగరంలో సగం జనాభాకు సమానం. అలాగే స్విట్జర్లాండ్ దేశ జనాభాకు సగం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పౌరసత్వం తేలని స్థితి ఉండటం దుర్లభం. ఇలాంటి పరిస్థితి మరెన్నో సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు విదేశీయుల గుర్తింపున కు అనుసరిస్తున్న విధివిధానాలతో పాటు, మానవీయ కోణంలో ఆలోచించి అడుగులు వేయాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విదేశీయులుగా తేలినవారిని ఉంచేందుకు ప్రత్యేక నివాస కేంద్రాలను ఏర్పాటు చేయటం గమనార్హం. ఇప్పటికే మూడు వేల మంది ఉండేవిధంగా నిర్బంధ క్యాం పులను ఏర్పాటుచేసింది. ఒక సమస్య పరిష్కారానికి తీసుకునే చర్యలు మరిన్ని సమస్యలకు ఆజ్యం పోయకుండా ఉండాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి, అడుగులు వేయాలి.
(స్క్రోల్ సౌజన్యంతో..)

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles