ముందుచూపులే ఈ వెలుగులు

Sun,July 14, 2019 12:07 AM

తెలంగాణ ప్రజల కోసం, ముఖ్యంగా రైతాంగం కోసం ముఖ్యమంత్రి కేసీ ఆర్ గారు నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యా లలో కోతలు లేని కరంటు సరఫరా ఒకటి. ఈ లక్ష్యసాధనలో భాగస్వామి ని కావడం నా అదృష్టం. ఐదేండ్ల కింద టి ముచ్చట. తెలంగాణ బిల్లు ఆమో దం పొందింది గానీ, ఇంకా రాష్ట్రం ఏర్పడలేదు. 2014 ఏప్రిల్ 29. తెల్లా రితే తెలంగాణ ఓట్లువేసే బిజీలో ఉం టుంది. ఉదయమే కేసీఆర్ గారి నుంచి ఫోన్ వచ్చింది.
హౌ ఆర్ యు ప్లేస్డ్ టుమారో (రేపు మీ కార్యక్రమాలు ఏమిటి?)
ప్రత్యేకించి ఏమీ లేవని చెప్పాను.
అవతలి నుంచి ఒక ఆదేశం వంటి మాట అయితే ఫామ్‌హౌజ్‌కు రండి. ఇక్కడే లంచ్ చేద్దాం. పవర్ గురించి చాలా మాట్లాడుకోవలసి ఉన్నది
డ్రైవర్ లేకపోవడంతో అడ్వొకేట్ రామారావు గారి సహాయంతో ప్రయాణమయ్యా ను. దారిలో ఉండగానే కేసీఆర్ గారి నుంచి వరుసగా కాల్స్ ఏమైంది.. వొస్తున్నారా?
కేసీఆర్ గారితో నాకు చాలాకాలంగా పరిచయం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పు డు కరెంట్‌కు సంబంధించిన అంశాలు కేసీఆర్ గారు నాతో చర్చించేవారు. తెలంగా ణ ఉద్యమం ఉధృతమైన తర్వాత విద్యుత్‌రంగంతో అనుబంధం ఉన్న అనేకమంది తో కేసీఆర్ చర్చించి అధ్యయనం చేసేవారు. అందుకే తెలంగాణ ఏర్పడేనాటికే కొత్త రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు సంబంధించి కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉన్నది.

అరువై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్‌రంగం ఎంత అభివృద్ధినైతే నమోదు చేసిందో, దాదాపు అంతే అభివృద్ధి ఈ 4-5 ఏండ్లలో జరిగింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా ప్రస్తావన వచ్చినపుడు కూడా అందరూ వద్దని వారించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం సరఫరా చేయవలసిందే అని తేల్చిచెప్పారు.


మేము ఫామ్ హౌజ్‌కు వెళ్లేసరికి అప్పుడే కేసీఆర్ గారు ఓటువేసి వచ్చారు. ఆ రోజు అక్కడ రమణాచారి గారు, పాపారావు గారు, గోయెల్ గారు, సంతోష్ గారు ఉన్నారు. టీవీలో ఎన్నికల వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ గారు అవేం పట్టించుకో కుండా విద్యుత్‌రంగ అభివృద్ధి చర్చల మీదనే దృష్టిపెట్టారు. ఆరోజు మధ్యాహ్నం మొదలైన మా చర్చలు, సాయంత్రం ఆరున్నర వరకు కొనసాగినై. చర్చలు ప్రారం భించే ముందరే కేసీఆర్ గారు నాతో అన్నారు మీరే సీఎండీ అని. నేను కొంచెం తటపటాయించి ఐఏఎస్‌లు సహకరించరేమో? అన్న. దానికి ఆయన ఒక్క మాట లో అవన్నీ నాకొదిలేయండని తేల్చిపారేశారు. తెలంగాణ రాష్ట్రంలో కోతలు లేని కరంటు అందించాలన్నది కేసీఆర్ గారి లక్ష్యం. కానీ అందుకు సరిపడినంత విద్యుదుత్పత్తి లేదు. అప్పటికే గ్రామాల్లో ఇండ్లకు పగ టిపూట కరంట్ సరఫరా లేదు. హైదరాబాద్ వంటి నగరంలో కూడా అప్రకటిత విద్యుత్ కోతలు. పరిశ్రమలకు రెండురోజుల పవర్ హాలిడేస్. వ్యవసాయ పం పుసెట్లకు ఐదుగంటల కరెంటు సరఫరా కూడా ఇవ్వలేని స్థితి. విద్యుత్తు ఉన్నా సవ్యంగా అందించే విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలు లేవు. ఈ సవాళ్లను మిం చిన మరొక పెద్ద సవాలు, ఈ కొత్త విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు, విద్యుత్తు సరఫరా-పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం. కారణమేమంటే, తెలంగాణ విద్యుత్ సంస్థల ఏర్పాటు తర్వాత, ఆంధ్రప్రదేశ్ విద్యు త్ సంస్థలు తాత్కాలిక అకౌంట్స్‌ను మాత్రమే ఒప్పగించాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటుచేయబడిన డొల్ల కం పెనీలు అని ఆంధ్ర విద్యుత్ సంస్థలు కోర్టుల ముందు వాదించాయి.

రెండేండ్ల కాలం లోపల 3000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాలి అన్నారు కేసీఆర్ గారు. అది అసాధ్యమనీ, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు కనీసం మూడు, నాలుగేండ్ల సమయం పడుతుందనీ సాధకబాధకాలు వివరిం చాను. అయితే ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాల నుంచి మనం విద్యుత్తు తెచ్చుకునే వీలుం దని కూడా వివరించాను. గట్టిగా తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం సాధించడం అసాధ్యమన్నరు. సాధించి చూపించలేదా? అని ఆయన నన్ను మాన సికంగా సిద్ధం చేశారు. మొత్తమ్మీద, పొద్దుపోయేదాకా సాగిన నాటి ఆ సమా వేశంలో కొత్త రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాల, విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవ స్థల బలోపేతానికి రూపొందించవలసిన ప్రణాళికల గురించి, చేపట్టవలసిన చర్యల గురించి ఒక దశ దిశా నిర్దేశించినారు. మే నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్ విజయం సాధించిం ది. ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందించి వచ్చాను. తిరిగి, జూన్ 3న ఆయన నన్ను పిలిపించారు. మళ్ళీ విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి చర్యలపైన సుదీర్ఘ సమా వేశం జరిగింది. వారి దగ్గర సెలవు తీసుకొని బయల్దేరుతున్నపుడు నాతో అన్నారు రేపు ఆర్డర్ తీసుకొని, వెంటనే విద్యుత్ సౌధకు వెళ్లి జాయినై పని ప్రారంభించండి అని. నాకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాను, జెన్‌కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నీ ఇస్తూ మొట్టమొదటి ప్రభుత్వం ఉత్తర్వును విడుదల చేశారు. ఆ ఉత్తర్వును, ఏరో జు, ఏ సమయంలో విడుదల చేయాలో కూడా కేసీఆర్ గారే ముహూర్తం నిర్ణయిం చారు. ఎవరెవరిని డైరెక్టర్లుగా నియమిస్తే బాగుంటుందో నిర్ణయించే స్వేచ్ఛను కూడా నాకే ఇచ్చారు. శివాజీ వంటి తెలంగాణ విద్యుత్ ఉద్యమ నాయకులను పిలిపించి ప్రభాకర్‌రావ్ సాబ్‌కు సహకరించండి.

ప్రభుత్వానికి, మీ ఉద్యోగు లకు నడుమ ప్రభాకర్‌రావు వారధిగా వుంటారు అని కూడా చెప్పారు. రాష్ట్రంలో సరిపోయినంత కరంటు ఉంటే, గ్రామాల నుంచి వలసలు తగ్గు తా యి. రైతులు మంచి పంటలు పండిస్తారు. గ్రామాల్లో చిన్న పరిశ్రమలు బతుకు తా యి. కొత్త పరిశ్రమలు వచ్చి, రాష్ట్ర ఆదాయం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.. ఇవీ తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా వెనుక కేసీఆర్ గారి ఆలోచనలు. టీఎస్‌జెన్‌కో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలం లోనే, అనగా 2014 జూలై మాసంలోనే, కేసీఆర్ తెలంగాణ విద్యుత్ ప్రసార సంస్థ చైర్మన్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ పంపిణీ సంస్థల సమ న్వయ పరిచే కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా వచ్చిచేరాయి. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటి అడుగుగా విద్యుత్‌సంస్థల కీలక అధికారులతో నాగార్జునసా గర్ లో ఒక మేధోమథనం నిర్వహించాం. ఆ సమావేశంలో కేసీఆర్ గారు విద్యుత్ రం గానికి నిర్దేశించిన లక్ష్యాలను ఎట్లా సాధించాలన్న విషయమై అనేక ఆలోచనలు పంచుకున్నాం. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిగా దృష్టి సారించిన అంశం, తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫాక్టర్ (పీఎల్‌ఎఫ్)ను మెరుగుపరుచడం. దీనివల్ల వెంటనే అందుబాటులో ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి ఎక్కువ విద్యుత్తును పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం, అన్ని టీఎస్‌జెన్‌కో విద్యు త్తు ఉత్పత్తి కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన విడి భాగాలను అందుబాటులో ఉం చాం. మేము తీసుకున్న చర్యలు ఫలించి, జెన్‌కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల పీఎల్ ఎఫ్ గణనీయంగా మెరుగుపడింది. ఒకవైపు ముఖ్యమంత్రి నిర్దేశించిన భారీ విద్యుత్తు లక్ష్యాలు, మరొకవైపు తెలంగా ణ ప్రజల విద్యుత్తు ఆకాంక్షలు, ఇటుచూస్తే చాలినంత విద్యుత్తు లేని స్థితి, అత్యవ సరంగా ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టవలసిన స్థితి.

ఈ పరిస్థితుల్లో, అక స్మాత్తుగా ఆంధ్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి ఒక పిడుగు లాంటి లేఖ పంపించారు. ఆంధ్రలో ఉన్న వీటీపీఎస్, ఆర్‌టీపీపీ వంటి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి తెలంగాణకు విద్యుత్తు అందించవలసిన అవసరం లేదన్న ది అటునుంచి వచ్చిన ఆ లేఖ సారాంశం. ఉన్న విద్యుత్తు కొరతకు తోడు, ఆంధ్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల మరొక 700 మెగావాట్ల ఊహించని కొరత. అప్పటికే, కొత్తగా కొలువైన పార్లమెంట్ ప్రత్యే క సవరణ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి అప్పగించడం వలన చౌకధర విద్యుత్తు అందించే 460 మెగావాట్ల సీలేరు జల విద్యుత్తు కేంద్రాన్ని పోగొ ట్టుకున్న బాధలో ఉన్నాం. అయినా సరే, ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఎటు వం టి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనగలమన్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఆం ధ్రలోని కృష్ణపట్నం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్తును ఇవ్వవలసిన అవ సరం లేదని ఆంధ్ర విద్యుత్తు సంస్థలు వాదించినందువల్ల, మనం కూడా సింగరేణి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్తును ఇవ్వవలసిన అవసరం తెలంగాణకు లేదని తేల్చిచెప్పాం. దానివల్ల తెలంగాణకు మేలే జరిగింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 600 మెగావాట్ల కేటీపీపీ భూపాలపల్లి విద్యు త్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏడాదిన్నరకాలంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా చేశాం. అదేవిధంగా, 120 మెగావాట్ల పులిచింతల జల విద్యుత్తు కేంద్రం విషయంలో కూడా మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయవలసి వచ్చింది. టెండర్ల ప్రక్రియ ద్వారా, కొంత చౌక ధరకు నెల్లూరులోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంతో 570 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొని, సమస్య నుంచి కొంత బయట పడ్డాం. అట్లానే, కేటీపీఎస్ పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి 800 మెగా వాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని రికా ర్డు సమయంలో పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించినాం.

తక్కువ సమయంలో పూర్తిచే యడం వల్ల వందల కోట్ల రూపాయల పెట్టుబడి వడ్డీ ఆదా అయింది. మన ఎలక్ట్రిసి టీ ఇంజినీర్స్, ఇతర ఉద్యోగుల పనితీరుకు ఇది మరొక నిదర్శనం. 4000 మెగావా ట్ల యాదాద్రి భారీ విద్యుత్తు ఉత్పత్తి ప్రాంగణంలో కూడా పనులు ప్రారంభించాం. సింగరేణి సంస్థ ద్వారా కూడా 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టి, అవి సకాలంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించడం వల్ల కూడా సమస్యలను అధిగ మించాం. సోలార్ పవర్ అయితే చాలా తక్కువకాలంలో అందుబాటులోకి వస్తుం ది కాబట్టి, 2015లో 2000 మెగావాట్ల సోలార్ పవర్ కోసం బిడ్లను ఆహ్వానిస్తే మంచి స్పందన లభించింది. సాంప్రదాయిక పార్క్ పద్ధతిలో కాకుండా, దేశంలోనే తొలిసారిగా డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ పద్ధతిలో వెళ్లడం జరిగింది. దీనివల్ల, ప్రసార-పంపిణీ వ్యవస్థల అభివృద్ధి కోసం వెచ్చించవల సిన వందల కోట్ల రూపాయలు ఆదా కావడమే కాకుండా, ప్రసార-పంపిణీ నష్టాల నియంత్రణ కూడా సాధ్యమైం ది. ఇవాళ, దేశంలోని కొన్ని రాష్ర్టాలు తెలంగాణ చేపట్టిన ఈ పద్ధతిని అనుసరించ డం ముదావహం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 70 మెగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్తు సామర్థ్యం, 3600 మెగావాట్ల సామర్థ్యం దాటి, కొంతకా లం పాటు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. వార్ధా-డిచ్‌పలి లైన్ నిర్మాణం తొందరగా పూర్తిచేయించి, ఛత్తీస్‌గఢ్ విద్యుత్తుకు సరిపడా కారిడార్‌ను కూడా సాధించాం. ముఖ్యమంత్రి గారి సదా పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది. తెలంగాణ విద్యుత్‌రంగం వృద్ధిచెందడం ఓర్వలేని కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి అనేకరకాలైన వివాదాలను సృష్టించారు. రెండేండ్ల కిం దటనే విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించవలసిన 1080 మెగావాట్ల భద్రాచలం కేంద్ర నిర్మాణం ఆలస్యంగా ప్రారంభానికి సిద్ధమైంది.
dpr
అరువై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్‌రంగం ఎంత అభివృద్ధినైతే నమోదు చేసిందో, దాదాపు అంతే అభివృద్ధి ఈ 4-5 ఏండ్లలో జరిగింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా ప్రస్తావన వచ్చినపుడు కూడా అందరూ వద్దని వారించారు. కానీ, ముఖ్య మంత్రి కేసీఆర్ గారు మాత్రం సరఫరా చేయవలసిందే అని తేల్చిచెప్పారు. వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల ఉచిత కరంటు సరఫరా చేస్తున్న దేశంలోని ఒకే ఒక్క రాష్ట్రంగా కేసీఆర్ గారు రికార్డు సృష్టించారు. ఈ ఐదేండ్ల కాలంలో ఎదుర్కొన్న పరీక్షలన్నీ ఒకెత్తు అయితే, తెలంగాణ ప్రసార వ్యవస్థలను రెండేండ్ల కాలం లోపలే నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మెప్పు పొందడం మరొక ఎత్తు. సీబీఐపీ, ఎకానమిక్ టైమ్స్, స్కోచ్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను మన విద్యుత్ సంస్థలు అందుకోవడం సంతోషం.
(వ్యాసకర్త: ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ జెన్‌కో అండ్ టీఎస్ ట్రాన్స్ కో)

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles