చిరుధాన్యాలకూ ప్రోత్సాహం

Sun,July 14, 2019 12:06 AM

వ్యవసాయంపై దేశ దృక్పథం మారుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నది. తాజా గా భారతీయ వ్యవసాయ పరివర్తన (ట్రాన్స్‌ఫార్మేష న్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్) కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కన్వీనర్‌గా హైపవర్డ్ కమిటీని నీతి ఆయోగ్ నియమించింది. దేశం లో వ్యవసాయరంగంలో తీసుకురావాల్సిన మార్పు లు, రైతుల ఆదాయాలు పెంచేందుకు కావాల్సిన విధానాలను రెండు నెలలలోపు నివేదించాలని కోరింది. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ కొత్త రాష్ట్రమైనా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ర్టానికి ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించకపోవడం శోచనీయం. ఉద్యమ సమయం నుంచి రైతుల సాధకబాధకాలు చూసిన కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలను తెచ్చి అమలుచేస్తున్నారు. ముఖ్యంగా రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రపంచ మేలిమి వ్యవసాయ పథకాలుగా రైతుబంధు, రైతుబీమాలు పేరు పొందాయి. రైతుబంధు పెట్టుబడి సహాయంతో రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నారు. రైతుబీమా కోసం ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తున్నది. ఈ పథకాలు ఉత్తమమైనవని, రైతులకు మేలు చేసేవని, పారదర్శకతను పెంచేవని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఆర్థిక సర్వే అభిప్రాయమూ ఇదే.

ఎరువులు, విద్యుత్, ఉపాధిహామీ పథకాల అమలుకు ఇస్తున్న సబ్సిడీని పరోక్షంగా కాకుండా నేరుగా నగదు రూపంలో రైతులకు ఇస్తే కచ్చితంగా మేలైన ఫలితాలు ఉంటాయి. ఇందుకు అవసరమయ్యే మొత్తం నగదు రైతులకు సరాసరిన సంవత్సరానికి ఒక లక్ష రూపాయల లోపే ఉంటుంది. కానీ బ్రహ్మాండమైన ఫలితాలుంటాయి. సబ్సిడీలు పక్కదారి పట్టవు. నేరుగా రైతులకు అందుతాయి. దళారుల ప్రమేయం ఉండదు. పథకాలలో పారదర్శకత పెరుగుతుంది. చిన్న, సన్నకారు రైతుల జీవితాలలో వెలుగులు నిండుతాయి. సబ్సిడీ ఉత్పత్తి కారకాలతో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వరి, గోధుమ పంటలకు ఇస్తున్న రాయితీలను అపరాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలకు ఇస్తే వర్షాధార ప్రాంతాలలో మరో హరిత విప్లవం సాధ్యమవుతుంది.


తెలంగాణ రాష్ర్టానికి కూడా ప్రాతినిథ్యం లభించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని రైతులందరికీ మేలు జరిగే అనేక సూచనలు చేసేవారు. దేశంలో వ్యవసాయ రూపురేఖలను మార్చిన మొదటి అంశం- హరి త విప్లవం. ఇది ప్రధాన ఆహారధాన్యమైన వరి, గోధుమల దిగుబడుల పెరుగుదలతో సాధ్యమైంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారత దేశాలకు ఈ ఫలితాలు అందాయి. ఆ తర్వాత డెయిరీ రంగంలో శ్వేతవిప్లవం చోటుచేసుకున్నది. ఫలితంగా పాల దిగుబడి పెరిగింది. ప్రాంతీయంగా మరికొన్ని అద్భుత ఫలితాలు చరిత్రలో ఉన్నాయి. గుజరాత్‌లో పత్తి, బీహార్‌లో మక్కజొన్న, ఉత్తరప్రదేశ్‌లో చెరుకు, మధ్యప్రదేశ్‌లో గోధుమ, పశ్చిమబెంగాల్‌లో ఆలుగడ్డలలో దేశం గర్వించదగిన ఫలితాలు సాధిం చాం. అయితే అంతా సవ్యంగా ఉన్నదని చెప్పలేం. రెండు అంశాల్లో మన దేశం పూర్తిగా వెనుకబడింది. సరాసరి వ్యవసాయ కూలీ ఉత్పాదకత చాలా తక్కువ. చైనాతో పోలిస్తే మూడోవంతు కూడా లేదు. పంట ఉత్పాదకతలోనూ భారత్ వెనుకంజలో ఉన్నది. పలుదేశాల కన్న భారత్‌లో హెక్టార్‌కు పంటల సరాసరి ఉత్పాదకత తక్కువే. వరిలో భారతీయ వరి దిగుబడులు చైనా దిగుబడులలో సగమే. అమెరికా దిగుబడులతో పోలిస్తే 33 శాతం మాత్రమే. ఏ రంగంలోని ఉపాధి అయినా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికే. కానీ రైతు ఆదాయం అరకొరగానే ఉన్నది. ఈ దశకంలో మధ్యస్థ కుటుంబం కలిగిన రైతు నికర సరాసరి ఆదాయం రూ. 19, 250. అంటే నెలకు రూ. 1600. దారిద్య్రరేఖకు దగ్గరగానే ఈ ఆదా యం ఉన్నది. ఈ నేపథ్యంలో రైతు ఆదాయం పెరుగడానికి కార్యాచర ణ కావాలి. అయితే వాతావరణ మార్పు నేపథ్యం, నేల నాణ్యతపై ప్రభా వాన్ని గమనంలోకి తీసుకోవాలె.

దురదృష్టం కొద్దీ పర్యావరణ మార్పు లు వ్యవసాయ ఉత్పాదకతపైన, రైతుల ఆదాయాలపైన వ్యతిరేక ప్రభా వం చూపనున్నాయి. దేశంలో అమలుచేసిన వ్యవసాయ విధానాలు ఇప్పటివరకు ప్రధానంగా ఆహారధాన్యాలైన వరి, గోధుమలకు ఉపయోగపడినాయి. ముఖ్యంగా ఉత్తరభారత రాష్ర్టాలు వరి, గోధుమ పండించే రాష్ర్టాలు ఈ విధానాలతో లబ్ధి పొందాయి. విద్యుచ్ఛ క్తి, నీరు, ఎరువులు, విత్తనాలు, పరపతిపై సబ్సిడీలు, ఆదాయ పన్నుల నుంచి వ్యవసాయదారులకు మినహాయింపు, తరచుగా రుణమాఫీలతో కొన్నిరాష్ర్టాలే బాగుపడ్డాయి. ఆ పంటలు పండించని రాష్ర్టాల రైతు లు వర్షాధార ప్రాంతాలు ప్రభుత్వ పరపతి సహాయానికి నోచుకోని ఫలితంగా దెబ్బతిన్నారు. ఆర్థిక సర్వే ప్రకారం ఎరువుల విషయంలో చిన్న, సన్నకారు రైతులకు 30 శాతం కంటే తక్కువగానే అందింది. తక్కువ వడ్డీ రుణాలు సరాసరిన రైతులకు అందింది 60 శాతం కంటే తక్కువే. ఆశ్చర్యం కలిగిం చే విషయం పంట రుణాల మాఫీ. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల నుంచి అందుతున్న రుణాలు 50 శాతం కంటే తక్కువే. పెద్ద రైతులకే 75 శాతానికి పైగా వ్యవస్థాగత సంస్థల నుంచి రుణాలు అందుతున్నాయి. విద్యుచ్ఛక్తి వినియోగంలోనూ అదే జరిగిం ది. మొత్తం సబ్సిడీలలో 10 శాతం మాత్రమే చిన్న రైతులకు అందుతున్నది. 37 శాతానికి పైగా రాయితీ విద్యుచ్ఛక్తి వినియోగిస్తున్నది పెద్ద రైతులే. దేశం అపరాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయల విషయంలో భారీగా విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఫలితంగా అత్యంత అనువైన వాతావరణం ఉండి, నిపుణులైన రైతులు ఉండి విదేశీ మారకద్రవ్యం కోల్పోవలసి వస్తున్నది. మూడు, నాలుగు ఏండ్లుగా మద్దతు ధ రలు పెంచటంతో 20 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అధికంగా ఉత్పత్తి అయ్యాయి.
pidigum-saidaiah
అయితే దళారుల బెడద ఇంకా తగ్గని మార్కెట్లలో రైతుల కు మద్దతు ధరలు అందటం లేదు. వినియోగదారులకు సరసమైన ధరలలో లభించడం లేదు. త్వరగా చెడిపోయే గుణం ఉన్న పండ్లు, కూరగాయలను మార్కెట్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఫ్యూచర్ మార్కెట్లు తీసుకునే వీలు కల్పించాల్సింది. అయితే ఇదింకా కార్యరూపం దాల్చలేదు. ఎరువులు, విద్యుత్, ఉపాధిహామీ పథకాల అమలుకు ఇస్తున్న సబ్సిడీని పరోక్షంగా కాకుండా నేరుగా నగదు రూపంలో రైతులకు ఇస్తే కచ్చితంగా మేలైన ఫలితాలు ఉంటాయి. ఇందుకు అవసరమయ్యే మొత్తం నగదు రైతులకు సరాసరిన సంవత్సరానికి ఒక లక్ష రూపాయల లోపే ఉంటుంది. కానీ బ్రహ్మాండమైన ఫలితాలుంటాయి. సబ్సిడీలు పక్కదారి పట్టవు. నేరుగా రైతులకు అందుతాయి. దళారుల ప్రమేయం ఉండదు. పథకాలలో పారదర్శకత పెరుగుతుంది. చిన్న, సన్నకారు రైతుల జీవితాలలో వెలుగులు నిండుతాయి. సబ్సిడీ ఉత్పత్తి కారకాలతో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వరి, గోధుమ పంటలకు ఇస్తున్న రాయితీలను అపరాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలకు ఇస్తే వర్షాధార ప్రాం తాలలో మరో హరిత విప్లవం సాధ్యమవుతుంది. ఆ ప్రాంతాలలో రైతుల ఆదాయాలు మెరుగుపడుతాయి. అధిక పోషక విలువలుండే పంట లు కాకుండా సాంఘిక కోణం అవసరం ఇప్పుడు ఉన్నది. అధిక నీటి వనరులున్నాయని ఈశాన్య ప్రాంతంలో వరిసాగును ప్రోత్సహించడం తో ఇప్పటికే పర్యావరణ సమస్యలు తలెత్తాయి. భూసారం దెబ్బతిన్నది. మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపింది. అక్కడ సహజసిద్ధంగా పెరుగుతున్న పంటలు, వైవిధ్యం దెబ్బతిన్నది.
(వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

295
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles