ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

Sat,June 15, 2019 11:56 PM

తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియాలోని దేశాలు పరస్పర సహాయ సహకారాలతో సమన్వయంతో పనిచేయాలి. ప్రాంతీయ భద్రత పేరుతో రూపొందించుకున్న చట్టాలను, నియమాలను ఉల్లంఘించకూడదు. విమానాశ్రయాలలో భద్రతాపరమైన చర్యలను పటిష్టపరుచాలి. అత్యవసర సమయాలలో ప్రయాణికులు ఎలా సహకరించాలో, ఉండాలో తెలిపే విధంగా మీడియా ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను స్వీక రించాలి. తద్వారా ప్రజల్లో సామాజిక శాంతి పట్ల నిబద్ధ తను పెంచే విధంగా కృషి చేయాలి.

అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిధి చాలా విస్తృతమైన ది. ప్రపంచీకరణ నేప థ్యంలో ప్రస్తుతం సంభవిస్తున్న మార్పులను క్రమబద్ధీకరిస్తూ దేశాల మధ్య నెలకొన్న సామాజిక, ఆర్థి క, భద్రతాపరమైన సమస్యలకు అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిష్కార మార్గాలను సూచిస్తుంది. అంతర్జాతీ య న్యాయశాస్త్రం ముఖ్యంగా యుద్ధ సమయంలో పాటించాల్సిన నియమాలను, యుద్ధ పరిస్థితులలో శాంతిని నెలకొల్పే సూచనలను, దౌత్యపరమైన సంప్రదింపులను, దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీల సంబంధిత అం శాల గురించి సలహాదారుగా, మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. అంతరిక్ష న్యాయ విషయాలపై, మానవహక్కులు, విధులు, బాధ్యతలపై విసృతంగా చర్చిస్తుంది. దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించడంలో అంతర్జాతీయ న్యాయశాస్త్రం ముఖ్య భూమిక పోషిస్తుంది.

అంతర్జాతీయ ఒప్పందాలు, దేశాల మధ్య సరైన ప్రమాణాలు గల నియమాలను పరస్పరం దేశాలు, వాటి భాగస్వాములు తూచా తప్పకుండా పాటించేవిధంగా రూపుదిద్దుకున్నాయి. ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందిన శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా ఊహించని మార్పులు ప్రస్తుతం మనం గమనించవచ్చు. అమెరికాలో ఆర్థిక విపత్తులు, సం క్షోభాలు వచ్చి వాటి ప్రభావం ఆసియాలోని భారత్, చైనా తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతున్నది. అలా గే దేశ సరిహద్దులు, భద్రతా విషయాలు, ఉగ్రవాద నిర్మూలన, దేశ సార్వభౌమత్వ అధికారాలు, ప్రకృతి, పర్యావరణ సమతుల్యత, అంతరిక్ష సంబంధిత విషయాలు తదితరాల న్నీ అంతర్జాతీయ న్యాయశాస్త్ర పరిధిలోనివే.

ప్రస్తుతం ఉగ్రవాదం ఒక ప్రాంతం, దేశానికే పరిమితం కాదు. ఇది విశ్వవ్యాప్తంగా దావానంలా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలకు తీవ్ర అశాంతిని కలిగిస్తున్నది. ఇరాక్, అఫ్ఘనిస్థా న్, పాకిస్థాన్ లాంటి దేశాలలో టెర్రరిస్టులు జీవం పోసుకుని సామూహిక హింసకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రపంచ శాంతి దెబ్బతింటున్నది. యూరోపోల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఆధారంగా 2012 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా జరుగుతున్నాయి. దీనికి ఫ్రాన్స్, బల్గేరియా తదితర దేశాల్లో ఇంటర్‌నెట్‌ను వినియోగించి దుశ్చర్యలకు పాల్పడిన ఉదంతాలున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్‌ను అజర్ అంతర్జాతీ య ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో భారత దౌత్యం కీలకంగా పనిచేసింది. జైషే మొహమ్మద్ సంస్థ అధినేత, పుల్వా మా దాడి సూత్రధారి సయ్యద్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై యావత్ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నో ఏండ్లుగా భారత్ తదితర దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని తాత్సారం చేస్తూ వచ్చిన చైనా చివరికి అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గింది. ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల ఉగ్రవాదుల కార్యకలాపాలకు ముఖ్యంగా ఆర్థికపరంగా, ఆయుధాల సమీకరణలపై తీవ్ర ప్రభావం పడి ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది.
KSC
జెనీవా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఎంత వరకు గౌరవించింది? నాటి కార్గిల్ యుద్ధం నుంచి నేటి పుల్వామా ఉగ్రవాద దాడులను గమనించాలి. 1999లో భారత పైలె ట్ నచికేత విడుదలకు ఎనిమిది రోజుల తాత్సారం ఎందు కు జరిగింది? ఆ ఎనిమిది రోజులు వారి కుటుంబ సభ్యు లు, యావత్ దేశం ఎంత మనోవేదనకు గురైంది. అలాగే నచికేతను విచారించాల్సిన ఆవశ్యత ఏమిటి? పాకిస్థాన్ ఆర్మీ నచికేతను ఎన్నోరకాలుగా చిత్రహింసలకు గురిచేసింది. అప్పటి ప్రధాని వాజపేయి అం తర్జాతీయ దౌత్యపరమైన సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత నచికేతను ప్రాణాలతో క్షేమంగా భారత్‌కు తీసు

కుని రాగలిగాం. ప్రస్తుతం అభినందన్‌కు సంబంధించిన విషయాలనూ పరిశీలిస్తే ఆయనకు అయిన గాయాలను చూస్తే వారు అతన్ని ఎన్ని చిత్రహింసలకు గురిచేశారో అర్థమౌతుంది. అదేవిధంగా పాకిస్థాన్ ఆర్మీ తాను చేసిన తప్పిదాలను ఎంత వ్యూహాత్మకంగా కప్పిపుచ్చుకున్నదో కొట్టొచ్చినట్టు తెలుస్తున్నది. జెనీవా ఒప్పందం ప్రకారం పట్టుబడిన వ్యక్తి పేరు, ర్యాంక్, పుట్టినతేదీ, సీరియల్ నంబర్ అడిగితే పాకిస్థాన్ ఆర్మీ అత్యుత్సాహం ప్రదర్శించింది. జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మీరు ఏ ప్రాంతం వారు అని, అభినంద న్ వివాహితుడా? కాదా అనే విషయం, ఏ యుద్ధ విమానంలో ప్రయాణించారని,ఆయన ఏ ఉద్దేశంతో పాక్ భూభా గంలోకి వచ్చారని, వారికి అప్పగించిన పని గురించి, తదితర విషయాల గురించి విచారించటం జెనీవా ఒప్పందాల ఉల్లంఘన కిందికే వస్తుంది.

తీవ్రవాదానికి ముఖ్య కారణాలు సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంగా చెప్పుకోవచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, ధనికపేదవర్గాల మధ్య వ్యత్యాసం పొరుగుదేశాల మధ్య చక్కటి సత్సంబంధాలు లేకపోవడం తదితర విషయాలు తీవ్రవాదానికి మూలాలుగా ఉంటున్నవి. తీవ్రవాదం ముఖ్యంగాజాతీయవాద ఉగ్రవాదం, మతపరమైన ఉగ్రవాదం, దేశా లు ప్రోత్సహిస్తున్న కుడి, ఎడమ విభాగాలకు సంబంధించిన తీవ్రవాదం విషయాల చుట్టూ తిరుగుతున్నది. ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌పోల్, సీఐఏ, ఎఫ్‌బీఐ, రా లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ తీవ్రవాద మూలాలు ఎందుకు నిర్వీర్యం కావడం లేదో విశ్లేషించుకోవాలి. టెర్రరిజానికి మూలాలె క్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.

తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భద్రతాపరంగా తగిన చర్య లు తీసుకోవాలి. దక్షిణాసియాలోని దేశాలు పరస్పర సహా య సహకారాలతో సమన్వయంతో పనిచేయాలి. ప్రాంతీ య భద్రత పేరుతో రూపొందించుకున్న చట్టాలను, నియమాలను ఉల్లంఘించకూడదు. విమానాశ్రయాలలో భద్రతాపరమైన చర్యలను పటిష్టపరుచాలి. అత్యవసర సమయాలలో ప్రయాణికులు ఎలా సహకరించాలో, ఉండాలో తెలిపే విధంగా మీడియా ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను స్వీక రించాలి. తద్వారా ప్రజల్లో సామాజిక శాంతి పట్ల నిబద్ధ తను పెంచే విధంగా కృషి చేయాలి.

విలువలతో కూడిన విద్యను ప్రాథమికస్థాయి నుంచి అన్ని వర్గాల వారికి కచ్చితంగా అందించాలి. సామాజిక స్పృహ సామాజిక అవగాహన కలిగించే పాఠ్యాంశాలుప్రవేశపెట్టాలి. పాఠశాల స్థాయి నుంచే సామాజిక విషయాలు, సమస్యల పట్ల విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంచాలి. కేవలం అక్షరాస్యత పెంచటంతోనే సరిపోదు. సామాజిక అవగా హనను పెంచటంతోనే విద్యా ర్థుల్లో సామాజిక బాధ్యత పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ప్రతి విద్యార్థి, యువత సామాజిక శాంతి కోసం కట్టబడి పనిచేస్తారు. ఈ క్రమంలోనే మనిషిలో సత్ప్రవర్తన, ఉత్తమగుణాలు ఏర్పడు తాయి. ఇవి లేకపోతే ఎన్నిచట్టాలు, నియమాలున్నా నిష్ర్పయోజనం.
-(వ్యాసకర్త: న్యాయవాది, న్యాయశాస్త్ర పరిశోధన
నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయం )

212
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles