బతుకమ్మ కమ్మ

Sat,June 15, 2019 12:58 AM

ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్‌సభకు 78 మంది మహిళలను ఎన్నుకోవడం ఘనకార్యం అంటున్నాం. 130 కోట్ల జనాభా, 90 కోట్ల ఓటర్లు ఉన్న ఈ దేశంలో 542 మంది సభ్యులున్న లోక్‌సభలో 78 మంది మహిళలు ప్రతినిధులుగా కూర్చోవడం ఘనకార్యం కాదేమో! ఇటీవలి అంచనాల ప్రకారం దాదాపు 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో (యూఎస్‌ఏ), అక్కడి అమెరికన్ కాంగ్రెస్‌లో మహిళా సభ్యుల సంఖ్య వంద కన్న ఎక్కువ. అక్కడి జనాభాతో నిష్పత్తిలో వంద సంఖ్య తక్కువ కాదు. గోదావరి తీరాన తెలంగాణ ప్రాంతంలో నిర్మాణమైన చరిత్ర ఉజ్వలమైనది. పంచవటి (మహరాష్ట్ర)లో పుట్టిన గోదావరి తెలంగాణ నేలపై అనాది నుంచి కొన్ని వందల మైళ్ల పొడవున విహారయాత్ర, విలాసయాత్ర, వైభవ యాత్ర జరుపుతున్నది. గోదావరి జలనిధి తెలంగాణ పెన్నిధి.

Prabhakar-Raoo
ఇది ఏదో ఒక సామాజిక వర్గం ప్రస్తావన కాదు, కానే కాదు. వెయ్యేండ్లకు మించిన తెలంగాణ చరిత్రలో, విశేషించి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో బతుకమ్మ పండుగ కమ్మకు (పేజీకి) ఉన్న ప్రాధాన్యం గురించి ప్రస్తావించడం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో, పండుగలూ పబ్బాల వరుసలో బతుకమ్మ కమ్మ కు ఉన్న విలువ ఇంకే పేజీకి లేదంటే అతిశయోక్తి కాదు. అనాది నుంచి అందరి పండుగ, ప్రజలందరి పండుగ బతుకమ్మ. బోనాలు మాట వినగానే శాన్పి చల్లిన వాకిట్లోకి బతుకమ్మ వచ్చినట్లన్పిస్తుంది. ఇండ్లల్లో కూర్చొని రంగురంగుల పూలతో, ప్రత్యేకించి చాటనిండా తంగేడు పూల తో బతుకమ్మలను పసందుగా పేర్చినప్పటికీ, సందుల్లోకి బతుకమ్మలను ఎత్తుకొని రావడానికి కొందరు పడతులు బిడియపడిన రోజులున్నాయి.

ఇటువంటి రోజులు ఇకరాకుండా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ఉద్య మం మలిదశదని నిస్సందేహంగా చెప్పాలె. అంతరాలు దొంతరలేవీ లేకుండా, మడులు, దడులకు ఆస్కారం లేకుండా, అన్నివర్గాల ప్రజల్లో సమాన రీతిన చైతన్యం కలిగించడానికి, పువ్వుల పండుగ బతుకమ్మతో ఉద్యమస్ఫూర్తి కలిగించడానికి, అస్తిత్వం ఆలోచనలు రేకెత్తించడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మలిదశలో జరిగిన విస్తృత, మహత్తర కృషి ప్రపంచంలో ఇంకెక్కడ, ఏ ఉద్యమంలోనూ జరుగలేదని చెప్పి, తలెత్తి గర్వించవచ్చు. బతుకమ్మ చరిత్ర కమ్మలలో స్వర్ణాక్షరాలతో రాయదగిన వి ఈ తెలంగాణ పండుగకు ప్రపంచమంతటా వివిధ దేశాల్లో లభించిన గుర్తింపు, ఉన్నతాసనం. భారతావని సాంస్కృతిక సమైక్యత కోసం లోక్‌మాన్య బాలగంగాధర తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు, తెలంగాణ ఉద్యమస్ఫూర్తికి బతుకమ్మ దోహదపడింది. ఇది తమ పండుగ అని చెప్పుకోవడానికి విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు గర్వపడుతున్నారు, సం బురపడుతున్నారు. బతుకమ్మ చైతన్య పర్యవసానమే కావొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిలాల్లో 20 జిల్లాలకు అతివలే, నిన్నమొన్నటి వరకు అబలలన్న ముద్రతో తెరచాటున మగ్గినవారే మహిళామణులై ఆధిపత్యం వహించడం.

ఇది సమకాలిక సమాజంలో విప్లవాత్మక పరిణామం, తెలంగాణ స్త్రీ శక్తి విజృంభణకు నిలువెత్తు నిత్య నీరాజనం. మహిళలకు 33 శాతం ప్రాతినిథ్యం (అన్ని ప్రజా ప్రాతినిథ్య సంస్థల్లో) కలిపించడానికి ఉద్దేశించిన బిల్లు ఇరువై ఏండ్ల నుంచి పార్లమెంట్ సెల్లారులో పాత, చిరిగిన కాగితపు కుప్పల్లో దిక్కులేకుండా మూలుగుతున్న ది. సోనియా జీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు ఈ బిల్లు వైపు తలెత్తి చూడలేదు. తర్వాత ఐదేండ్లు ఏకచ్ఛత్రాధిపత్యం నడిపి, నిన్నగాక మొన్న పుల్వామా పుణ్యాన రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీజీ తలాక్ బిల్లును చట్టం చేయడానికి తాపత్రయ పడుతున్నారు గాని మహిళల బిల్లు మాట ఎత్తడం లేదు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోద ముద్ర పొందినా పొందకపోయినా, చట్టాలున్నప్పటికీ, లేనప్పటికీ తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించిన మహిళలకు తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కూడా సముచిత, సమధిక ప్రాధాన్యం లభిస్తున్నది. జాతిపిత గాంధీజీ అభిలషించిన గ్రామ స్వరాజ్య సాధనలో కీలకపాత్ర నిర్వహించవలసిన పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం, ప్రాబల్యం అసాధారణ రీతిలో హెచ్చడం దేశానికి ఆదర్శప్రాయం, మార్గదర్శకం. ఎనభై, తొంభై ఏండ్ల కిందట గ్రామాలకు తిరిగి వెళ్లండి నినాదంతో గ్రామ స్వరాజ్యం, గ్రామీణ వికాసం కోసం గాంధీజీ వ్యక్తపరిచిన వేదన స్వాతంత్య్రం లభించి డ్బ్భై ఏండ్లయినా ఇంకా వేదనగానే, గ్రామీ ణ ప్రజల నివేదనగానే మిగిలి ఉన్నది. నూతన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ సంకల్పంలో, మాటల్లో, చేతల్లో గాంధీజీ దృక్పథం, వేదన బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజాభిప్రాయ ప్రకటనకు, గ్రామసురాజ్య స్థాపనకు పంచాయతీరాజ్ అత్యావశ్యకమని గాంధీజీ నొక్కిచె ప్పారు. పంచాయతీరాజ్ పటిష్టతకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకత్వంలో సంతరింపజేస్తున్న ప్రాధాన్యం అసాధారణమైనది.

అట్టడుగుస్థాయి ప్రజాస్వామ్య పటిష్టతలో, అధికార వికేంద్రీకరణలో మహిళలు అధిక సంఖ్యలో ముందుకువచ్చి నిర్వహిస్తున్న పాత్ర ఎంత ముఖ్యమైనదో జాతీయస్థాయిలో, ఫెడరల్ వ్యవస్థలో పటిష్టతకు నిర్వహించవలసిన పాత్ర అంతే ముఖ్యమైనది. ఐదేండ్ల కిందట తొలిసారి అధికారం చేపట్టినప్పుడు టీమ్ ఇండియా కో ఆపరేటివ్ ఫెడరలిజం వంటి నినాదాలిచ్చిన మోదీజీ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరించి డూమ్ ఇండియా నాన్ కో ఆపరేటివ్ ఫెడరలిజం మార్గంలో నడుస్తున్నదని గత ఐదేండ్ల జాతీయ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. అంకెల గారడీతో, సంఖ్యల ఉల్బణంతో జాతీయ ఆర్థిక వ్యవస్థ వార్షిక అభివృద్ధి రేటు పెరిగినట్లు ప్రచారం చేసే ప్రభుత్వాల, పాలకుల నినాదాలను ప్రజలు విశ్వసించలేరు. తెలంగాణ రాష్ట్రంలో అదే గత ఐదేండ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం కేవలం అంకెల్లో కాకుండా ప్రజ ల నిత్య జీవిత అనుభవంలో, కళ్లెదుట కన్పించడం విశేషం. బెంగాల్ ఈరోజు చేసిన ఆలోచన దేశం రేపు చేస్తుందన్నది నిన్నటివరకు లోకోక్తి; ఈ లోకోక్తిలో సవరణ అవసరం ఇప్పుడు. ఈ ఐదేండ్ల (గత) అనుభవంతో గట్టిగా చెప్పవలసిన మాట-ఈరోజు తెలంగాణ చేస్తున్న ఆలోచన దేశానికి రేపో ఎల్లుండో, ఇంకేదో రోజో వస్తున్నది. ప్రజా సేవను, పరిపాలనా విజయాలను తెలంగాణ రాష్ట్రం ఆచరణలో చూపిస్తుండగా జాతీ య ప్రభుత్వం వొట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నది. గట్టిమేల్ తలపెట్టవోయ్ సూక్తికి తెలంగాణ రాష్ట్రం నిత్యం కార్యరూపం ధరింపజేసే కృషి కొనసాగిస్తున్నది. ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ప్రగతిపయనం, సకల జన సౌభ్రాతృత్వం, మత సామరస్యం, సహనశీలత, భిన్నత్వంలో ఏకత్వం తెలంగాణ ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూసి కళ్లు కుట్టుతున్నవారు బోలెడుమంది-వాపు ను చూసి అదే బలుపని భ్రమపడుతున్న వీళ్లు భోరున ఏడ్వక తప్పదు. యద్భావం తద్భవతి అన్నట్లు తెలంగాణ రాష్ట్రం మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తున్నది. తెలంగాణ ప్రజల రక్తంలో అణుమాత్రమైనా కనిపించనిది తిరోగమన మనస్తత్వం.

కనీసం తల్లుల, బిడ్డల ఆరోగ్య పరిరక్షణ చేయలేని దేశం అంకెల గారడీలు, సంఖ్యల ట్రిక్కులు ఎన్నిచేసినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉం దని భావించక తప్పదు. మాతృ మరణాల రేటు (ప్రసూతి మరణాల రేటు), శిశు మరణాల రేటు తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే దేశస్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నది. గాంధేయ మార్గంలో విప్లవాత్మక పరివర్తన కోసం అహర్నిశలు ఆరాటపడుతున్న తెలంగాణ రాష్ట్రం స్త్రీ జనాభ్యుదయానికి పెద్దపీట వేస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్‌సభకు 78 మంది మహిళలను ఎన్నుకోవడం ఘనకార్యం అంటున్నాం. 130 కోట్ల జనాభా, 90 కోట్ల ఓటర్లు ఉన్న ఈ దేశంలో 542 మంది సభ్యులున్న లోక్‌సభలో 78 మంది మహిళలు ప్రతినిధులుగా కూర్చోవడం ఘనకా ర్యం కాదేమో! ఇటీవలి అంచనాల ప్రకారం దాదాపు 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో (యూఎస్‌ఏ), అక్కడి అమెరికన్ కాంగ్రెస్‌లో మహి ళా సభ్యుల సంఖ్య వంద కన్న ఎక్కువ. అక్కడి జనాభాతో నిష్పత్తిలో వంద సంఖ్య తక్కువ కాదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దైనందిన పరిపాలనలో, దేశ రాజకీయాల్లో (అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల దృష్ట్యా) గుండె దడ పుట్టిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ మహిళామణి, అత్యంత సాహసవంతురాలు నాన్సీఫెలోసి. ఆమె వయ స్సు 79 ఏండ్లని ఎవరూ నమ్మడం లేదు. జాతి విద్వేషి, స్త్రీ విద్వేషి, ప్రమాదకర వ్యక్తి ట్రంప్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించడం తమ ప్రథమ కర్తవ్యమని ఫెలోసి ప్రకటించారు. అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ పదవిలో కూర్చున్న మొదటి మహిళామణి, డెమొక్రాట్ నాన్సీ ఫెలోసి. శరణార్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం నిర్మిస్తున్న మెక్సికో ఓడను ఫెలోసి నాయకత్వంలో అమెరికన్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రష్యాతో ట్రంప్ రహస్య సంబంధాలు, స్త్రీలతో అక్రమ సంబంధాలు వంటి ఆరోపణలపై దర్యాప్తు జరిపించడంలో అమెరికన్ మహిళల పాత్ర గణనీయమైనది.

తెలంగాణ ఝరి, తెలంగాణ సిరి, తెలంగాణ ఉదరి గోదావరి. గోదా పట్ల తెలంగాణ ప్రజలకున్న భక్తి, వరి పట్ల తెలంగాణ రైతు లోకానికి ఉన్న ఆసక్తి అపారమైనది. గోదావరి తీరాన తెలంగాణ ప్రాంతంలో నిర్మాణమైన చరిత్ర ఉజ్వలమైనది. పంచవటి (మహారాష్ట్ర)లో పుట్టిన గోదావరి తెలంగాణ నేలపై అనాది నుంచి కొన్ని వందల మైళ్ల పొడవున విహారయాత్ర, విలాసయాత్ర, వైభవ యాత్ర జరుపుతున్నది. గోదావరి జలనిధి తెలంగాణ పెన్నిధి. గోదావరి పవిత్ర తరంగాల శింజానంతో తెలంగాణ తెలుగు సారస్వతం మాధుర్యాలను ఒలికించింది. యాభై ఏండ్ల కిందట ఒక తెలంగాణ పండితుడు భామలార పదంబు పాడుడారతి పట్టి, పయనించి ఏతెంచె పంచవటిన్ కుట్టి, ఈపూత గౌతమి, ఈ దక్షిణ తరంగ, ఈ స్వచ్ఛ సలిలాంగ, ఈ పాపముల దొంగ.. అంటూ గొంతెత్తి పాడినాడు. బంకించంద్ర ఛటర్జీ రాసిన సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం వాక్యాలకు తెలంగాణ ప్రతీక కాబోతున్నది. స్వాతంత్య్రానంతరం గత డ్బ్భై ఏండ్లలో పాలకులు ఎవరికీ (వారి రంగులు ఏవైనా) గోదావరి అమూల్య జలాలను గరిష్ఠ స్థాయి లో వినియోగించి తెలంగాణ కోటి ఎకరాల్లో బంగారు పంట పండించాలన్న ఆలోచన రాలేదు. ఐదేండ్ల కిందట ఈ ఉదాత్త ఆలోచనకు తెలంగాణ రాష్ట్ర నిర్మాత సీఎం కేసీఆర్ మస్తిష్కంలో అంకురార్పణ జరిగింది. తత్ఫలితంగా మూడేండ్ల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది-మరో ఆరు రోజుల్లో ఈ నీటి పారుదల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరుగబోతున్నది. ఆధునిక తెలంగాణ చరిత్రలో ఇదొ క చరిత్రాత్మక ఘటన-తెలంగాణ భాగ్యరేఖను మార్చి రాసే మహత్తర సంఘటన. ఈ అద్భుత నిర్మాణం స్రష్ట, ద్రష్ట, శిల్పాచార్యుడు కేసీఆర్

292
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles