అభినందనీయం

Sat,June 15, 2019 12:55 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రారంభించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజె క్టు. కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తిచేస్తుండటం అభినం దనీయం. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన ప్రారంభిం చనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికావస్తుండ టం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. అయితే ఈ ప్రాజెక్టును అడ్డుకునేం దుకు ప్రతిపక్షాలు చేయని కుట్రలు లేవు, వేయని ఎత్తుగడలు లేవు. కానీ ప్రతిపక్షా పాచికలేమీ పారలేదు. ప్రతిపక్షాలు వేసిన కేసులన్నింటినీ కోర్టు కొట్టేసింది. ఇదిలా ఉంటే ప్రజా సంక్షేమం కోసం ఏం చేసినా వ్యతిరేకించడమే ప్రతిపక్షాల పనయిపో యిందంటూ ప్రజలు ఈసడించుకున్నారు.
- కొండం కృష్ణారెడ్డి, నామాపూర్, సిద్దిపేట జిల్లా

విరివిగా చెట్లు పెంచాలె

ఎండకాలంలో అనూహ్యమైన భూ తాపాన్ని చూశాం. మనుషులు అల్లా డిపోయారు. జంతువులు, పక్షులు భరించలేని వేడికి బెంబేలెత్తిపోయా యి. కాబట్టి కనీసం ఈ వర్షాకాలంలోనైనా వీలైనన్ని చోట్ల మొక్కలు నాటడం మనందరి సామాజిక కర్తవ్యం. హెచ్‌ఎండీఏ కమిషనర్ ఎం. దానకిషోర్ చెట్ల పెంపకానికి చేస్తున్న అమోఘమైన కృషి, చిత్తశుద్ధి ఆద ర్శం, అభినందనీయం. భవిష్యత్ తరాల కోసం ఎక్కువగా నీడనిచ్చే చెట్లు, స్వయం విత్తనోత్పత్తి ద్వారా తమ జాతిని అభివృద్ధి చేసుకునే మొక్కలు విరివిగా నాటాలి. మైదాన ప్రాంతాలు, చెరువు గట్లు, నదీతీరా లు, పిల్ల కాలువలు, కొండలు, జలపాతాల ఒడ్లు, బడులు, దవాఖాన లు, గ్రామ పంచాయతీలు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ విరివిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. చెట్లు విరివిగా నాటడం వల్ల పర్యావరణ మార్పుతో పాటు వర్షాలకు అనుగుణమైన మార్పులు ప్రకృతిలో చోటు చేసుకుంటాయి. రాష్ట్ర సంపద ఇతోధికంగా పెరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి ఎండకాలంలో ఎండలు ఎక్కడ ఎక్కువ నమోదయ్యాయో ఆయా చోట్ల మొక్కలను విరివిగా నాటాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొక్కలు నాటడం వరకే మన బాధ్యత కాదు, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉన్నదని గుర్తుంచుకోవాలి.
- యెలిశెట్టి శంకరరావు, హైదరాబాద్

209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles