రోదసిలో పరిశోధన

Fri,June 14, 2019 01:15 AM

అంతరిక్షంలో పరిశోధనశాలను నిర్మించతలపెట్టడం శాస్త్ర సాంకేతికరంగంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధికి మరో సంకేతం. చంద్రుడి మీద పరిశోధనకు చంద్రయాన్-2 పథకాన్ని చేపట్టినట్టు, రోదసిలోకి భారతీయలను పంపేందుకు గగన్‌యాన్ పథకాన్ని చేపట్టినట్టు బుధవారం ప్రకటించి న ఇస్రో మరుసటిరోజే అంతర్జాతీయ పరిశోధనశాలను నిర్మిస్తున్నట్టు వెల్లడించి సంచలనం సృష్టించింది. 2030 నాటికి ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని భారత్ భావిస్తున్నది. భారత్ ఇతరదేశాల పొత్తులేకుండా సొంతంగా ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించతలపెట్టడం కూడా విశేషమే. ఇప్ప టివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్మించుకున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఈ మూడు పెద్ద దేశాలతో పాటు కెనెడా, జపాన్ తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి అక్కడ పరిశోధనలు సాగించుకొని తిరిగివచ్చారు. మొదట భారతీయ శాస్త్రవేత్తలు రష్యా సహకారంతో ఐఎస్‌ఎస్‌కు వెళ్లి శిక్షణ పొందుతారు. ఆ తర్వాత మన సొంత అంతరిక్ష కేంద్రం సిద్ధం కాగానే అం దులో ప్రయోగాలు సాగిస్తారు. కొన్ని పరిశోధనలను భార రహిత స్థితిలో సాగించవలసి ఉంటుంది. ఔషధరంగంతో పాటు, ఖగోళ జీవశాస్త్రం, అనేక ఖగోళం, అంతరిక్షం, భౌతిక ధర్మాల పరిశీలన, వాతావరణం వంటి పలురంగాల్లో పరిశోధనలకు ఈ అంతర్జాతీయ పరిశోధనాశాల ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భారత్ నిర్మించతలపెట్టేది మిగతా దేశాల మాదిరిగా భారీ పరిశోధనాశాల కాదు. అయినప్పటికీ మనకంటూ సొంత పరిశోధనశాల నిర్మించుకోవడమే గొప్పతనం.

భారత్ ఆర్థికశక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో తన ప్రయోజనాల పరిరక్షణ కోసం భద్రతా ఏర్పాట్లు చేసుకోకతప్పదు. పొరుగునే ఉన్న చైనాను దృష్టిలో పెట్టుకొని భారత్ యుద్ధ వ్యూహాలను
రూపొందించుకోవలసి వస్తున్నది. అంతరిక్షాన్ని యుద్ధానికి వేదికగా కాకుండా శాంతియుత అవసరాల కోసమే వాడుకోవాలనేది భారత్ సాంప్రదాయ విధానం. కానీ అంతర్జాతీయరంగంలో వచ్చిన మార్పుల వల్ల భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయక తప్పడంలేదు. అంతర్జాతీయ రంగంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి లేదు. బలమైన రాజ్యాల మాటే చెల్లుబాటు అవుతున్నది. ఈ నేపథ్యంలో భారత్ ప్రపంచ శాంతికోసం తన వంతు ప్రయత్నాలను కూడా కొనసాగించాలె.


స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలోనే నెహ్రూ దార్శనికతతో పలు వైజ్ఞానిక రంగాల పరిశోధనల కు పునాది వేశారు. అణు శక్తి మొదలుకొని అంతరిక్ష శోధన వరకు భారత్ ఇవాళ ఈ దశలో ఉండటానికి ఆ పునాదులే కారణం. స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లవుతున్న సందర్భంగా గగన్‌యా న్ పథకం పేర 2022లో రోదసిలోకి భారతీయులను పంపాలని ఇస్రో నిర్ణయించడం సముచితంగా ఉన్నది. గగన్‌యాన్ పథకంలో భాగంగా మన శాస్త్రవేత్తలు వారం పదిరోజులు మాత్రమే గగనయానం చేసినా అది మనదేశ వైజ్ఞానిక రంగ చరిత్రలో మైలురాయి అవుతుం ది. భూ కక్ష్య లో పరిశోధనశాలను నిర్మించుకోవ డం కూడా ఈ గగన్‌యాన్ పథకానికి కొనసాగింపే. చంద్రయా న్-2, గగన్‌యాన్ రెండూ దేశం చేపట్టబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులే. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద పరిశోధనలను ఇప్పటివరకు ఏ దేశమూ చేయలేదు. భారత్ స్వయంగా చంద్రుడి తలం మీద తిరుగాడే పరికరాన్ని (రోవర్) దింపి పరిశోధనలు సాగించనుంది. ఇది మన దేశమే సొం తంగా చేపట్టబోయే ప్రాజెక్టు. వచ్చే నెల 15వ తేదీననే మన అంతరిక్ష నౌక చం ద్రుడి వైపుగా ప్రయాణం సాగించబోతున్నది. భవిష్యత్తులో చంద్రుడి మీద స్థావరాలను నెలకొల్పడం, అక్క డి వనరులను ఉపయోగించుకోవడం కోసం పెద్ద దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువల్ల చంద్రయాన్-2 ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. అంతరిక్షాన్ని ఆసరాగా చేసుకొని యుద్ధాన్ని ఎట్లా సాగించాలనే వ్యూహాలను రూపొందించడానికి డిఫెన్స్ స్పేస్ రిసెర్చి ఏజెన్సీ (డీఎస్‌ఆర్‌ఓ) ఏర్పాటుకు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇటీవలే ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలతో సమన్వయం చేసుకోవడానికి శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

అంతరిక్షయుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా భారత్ సిద్ధపడుతున్నదనేది మరో విశేషం. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ అంతరిక్షాన్ని కూడా వేదికగా చేసుకుంటున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలను కాపాడుకోవడం, శత్రుదేశాల వ్యవస్థలను ధ్వంసం చేయడం, శత్రు దేశాలపై నిఘా వేయడం, ఉపగ్రహ వ్యవస్థల ఆధారంగా నియంత్రణలు, ఆదేశా లు సాగించడం తప్పనిసరైంది. అంతరిక్ష హంగుల ద్వారా శత్రు దేశానిది పైచేయి కాకుండా ఉండాలంటే, ఆ రంగంలో కూడా దీటుగా ఎదుగక తప్పదు. ఇటీవలే అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని పేల్చివేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం కూడా భారత్ అంతరిక్ష రక్షణ విధానంలో భాగమే. భారత్ ఆర్థికశక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో తన ప్రయోజనాల పరిరక్షణ కోసం భద్రతా ఏర్పాట్లు చేసుకోకతప్పదు. పొరుగునే ఉన్న చైనాను దృష్టిలో పెట్టుకొని భారత్ యుద్ధ వ్యూహాలను రూపొందించుకోవలసి వస్తున్నది. అంతరిక్షాన్ని యుద్ధానికి వేదికగా కాకుండా శాంతియుత అవసరాల కోసమే వాడుకోవాలనేది భారత్ సాంప్రదాయ విధానం. కానీ అంతర్జాతీయరంగంలో వచ్చిన మార్పుల వల్ల భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయక తప్పడంలేదు. అంతర్జాతీయ రంగంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి లేదు. బలమైన రాజ్యాల మాటే చెల్లుబాటు అవుతున్నది. ఈ నేపథ్యంలో భారత్ ప్రపంచ శాంతికోసం తన వంతు ప్రయత్నాలను కూడా కొనసాగించాలె. భూగోళంపై శాంతి నెలకొన్నప్పుడే, అంతరిక్షం కూడా శాంతియుత పరిశోధనలకు వేదికగా మారుతుంది.

192
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles