భాషపేరుతో ఆధిపత్య రాజకీయం

Fri,June 14, 2019 01:15 AM

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధాన ముసాయిదా ప్రకటన దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ)లో భాగంగా చెప్పిన త్రిభాషా సూత్రంపై తీవ్రస్థా యిలో వ్యతిరేకత వ్యక్తమైంది. త్రిభాషా సూత్రంలో భాగంగా ప్రాథమిక విద్య స్థాయిలో స్థానిక భాషతోపాటు జాతీయ సమగ్రత కోసం హిందీని తప్పక నేర్చుకోవాలని, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాలని విద్యావిధాన ప్రకటనలో చెప్పుకొచ్చారు. దీనిపై దక్షిణాది రాష్ర్టాలపై హిందీ భాషను మరో రూపంలో రుద్దే ప్రయత్నంగా విమర్శలొచ్చాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గి త్రిభాషా విధానంలో భాగంగా హిందీ తప్పనిగా నేర్చుకోవాలన్న షరతు, తప్పనిసరి కాదని వివరణ ఇచ్చుకున్నది. దేశంలో త్రిభాషా విద్యా విధానం, విద్యలో భాష వినియోగంపై చర్చ లు జరిగినప్పుడల్లా మూస పద్ధతిలో జరుగుతున్నాయి. కొందరు త్రిభా షా సూత్రంతోనే జాతీయతా భావన వెల్లివిరుస్తుందని చెప్పుకొస్తే, మరికొందరు భాష పేర ఆధిపత్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ విధమైన చర్చలకు సుదీర్ఘమైన చరిత్రే ఉన్నది. కేవలం నూతనంగా ప్రకటించిన జాతీయ విద్యా విధాన ప్రకటనలో హిందీ ప్రాధాన్యం గురించిన చర్చగానే సాగటం సరైనది కాదు. దానిపేర, లేదా హిందీ మాటున కనిపించని విధానాలేవో చొచ్చుకు వస్తున్నాయి. ఈ చర్చను కేవలం హిందీ భాష చుట్టూ తిప్పితే లాభం లేదు. హిందీని ఆహ్వానించటమో, వ్యతిరేకించటమో చేస్తే అదే చాలదు. దీనిచుట్టూ అనే క విషయాలు అల్లుకొని ఉన్నాయి. హిందూ జాతీయవాదం, మతం, కులం ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ భాష పేరుతో విదేశీ భాష అయిన ఇంగ్లీష్ పంచన చేరటం అనేది కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఈపీ విధాన ప్రకటన వెలువడిన వెంటనే నిర్మ లా సీతారామన్, ఎస్.జైశంకర్, పి.చిదంబరం, ఏఆర్ రహమాన్ లాంటి వారు ఎన్‌ఈపీపై ట్విటర్‌లో తమవైన అభిప్రాయాలు పెట్టారు.

ఇప్పుడు మానవ జీవితం అంతా రాజకీయాల సమ్మిళితం. ప్రతిదాంట్లో రాజకీయాలు అంతర్లీనంగా ఉంటూ ప్రత్యేక ప్రయోజనాలను నెరవేరుస్తున్నాయి. ఆ క్రమంలోంచి.. హిందీ అంటే సంస్కృతం, హిం దూ అంటే ఉన్నత (అగ్రవర్ణం) కులం. ఇదే రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే అంతస్సూత్రం. ఈ నేపథ్యంలో హిందీని రుద్దే ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటే విషయాలు బోధపడుతాయి. దానివెనుక ఉన్న రాజకీయ శక్తి, ప్రయోజనాలు అవగతమవుతాయి.


విచిత్రమేమంటే.. ఆ కామెంట్లన్నింటీ చదివితే అన్నింటి సారం ఒకేవిధంగా ఉన్నది. ఆ క్రమంలో తమిళ ప్రాంత నేతలు ప్రకటించిన భయాలను దూరం చేయటానికి అన్నట్లు.. ద్రావిడియన్ భాషలను ఆక్రమించటాని కి హిందీని బోధనా భాషగా పెట్టటం లేదని వివరణ ఇచ్చారు. కేంద్రం హిందీని తప్పనిసరి చేయటంలో ఒక రాజకీయ కోణం ఉన్నది. దీనికి వ్యతిరేకంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు స్పందించినా అందులో రాజకీయ కోణం, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం లేకపోలేదు. మరొక ముఖ్య విషయమేమంటే.. దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ ఎంత మాత్రం కాదు. ఉత్తరభారత దేశంలోని చాలా రాష్ర్టాల్లో అనే స్థానిక భాషలు మాట్లాడుతారు. కేవలం అధికార పత్రాల్లో వినియోగించినంత మాత్రాన ఆ ప్రాంతాల్లో హిందీ ప్రజల భాష కానేరదు. నూతన జాతీయ విద్యావిధాన ముసాయిదా ప్రకటన ప్రకారం.. బహుభాషా, సంస్కృతి కలిగిన ప్రాంతంగా ప్రజల మధ్య ఐక్యతను, సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దేశంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకోవటం కష్టం కాబట్టి త్రిభాషా సూత్రంతో దేశ సమగ్రత పరిపుష్టం అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోంచే జాతీయ విద్యా విధానంలో ప్రతి విద్యార్థి ఒకటో తరగతి నుంచి మూడు భాషలు నేర్చుకోవాలనే నిబంధన పెట్టారు. కానీ అనేక రూపాల్లో విమర్శలు, నిరసనలు రావటంతో దాన్ని కొద్దిగా మార్చి ఈ విధంగా మార్చారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి కోసం.. ప్రాంతీ య, జాతీయ, అంతర్జాతీయ భాషలు నేర్చుకోవాలని తెలిపారు. మొద టిదాని ప్రకారం.. ఇంగ్లీష్ గ్లోబల్ కోసం, హిందీ జాతీయం కోసమని అర్థం చేసుకోవాలి. త్రిభాషా సూత్రంలోని అసలు లక్ష్యమేమంటే.. హిందీని జాతీయ భాష చేసి జాతీయతకు కొత్త అర్థం, రంగు పులుమటానికి ప్రయత్నిస్తున్నారు. హిందీ అంటే హిందూగా గూఢార్థాన్ని చొప్పిస్తున్నారు.

జాతీయ సమగ్రత అనేదాన్ని ఒక గణిత సమీకరణంగా కుదించి చెబుతూ దానికి హిందీని అనుసంధాన భాషగా ఉండాలంటున్నారు. ఆ పేరుతో ఇతర భాషలను నిర్లక్ష్యం చేయటమే కాదు, వాటి విధ్వంసానికి కారకులవుతున్నారు. ఏవో కొన్ని భాషలకు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన ప్రజల భాషాసంస్కృతులు కలగలిసిపోయి సమైక్యత ఏర్పడదు. ఈ క్రమంలో అనేక భాషలు తీవ్ర నిర్లక్ష్యానికి గురై అంతరించిపోతున్నాయి.


నిజాని కి ఏ భాషా మరో భాష కన్నా గొప్పది, పవిత్రమైనది కాదు. అలాగే హిం దీ కూడా మిగతా భాషలకన్నా ఏ విధంగానూ గొప్పది కాదు. చారిత్రకంగానూ, శాస్త్రీయంగానూ చూసినా హిందీకి మిగతా భాషలకన్నా ప్రత్యేకత ఏమీ లేదు. చాలా మంది భాషా శాస్త్రవేత్తలు కూడా హిందీకి ఏ విధమైన చారిత్రక విశిష్టత, ప్రత్యేకత లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు మానవ జీవితం అంతా రాజకీయాల సమ్మిళితం. ప్రతిదాంట్లో రాజకీయాలు అంతర్లీనంగా ఉంటూ ప్రత్యేక ప్రయోజనాలను నెరవేరుస్తున్నాయి. ఆ క్రమంలోంచి.. హిందీ అంటే సంస్కృతం, హిం దూ అంటే ఉన్నత (అగ్రవర్ణం) కులం. ఇదే రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే అంతస్సూత్రం. ఈ నేపథ్యంలో హిందీని రుద్దే ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటే విషయాలు బోధపడుతాయి. దానివెనుక ఉన్న రాజకీయ శక్తి, ప్రయోజనాలు అవగతమవుతాయి. ప్రస్తుత విద్యావిధానంతో జరిగే క్రమాలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థాగతంగా హిందీని ఆధిపత్యంలోకి తేవటమంటే, చారిత్రకంగా ఉన్న హిందీ-ఉర్దూ భాషాసంస్కృతిని నాశనం చేయటమే. ప్రస్తుత విధానం.. హిందీ-ఉర్దూ-అరబిక్-పర్షియన్, సంస్కృతం పరిభాషల మేలు కలియిక అయిన హిందుస్థానీ భాషా సంస్కృతిని ధ్వంసం చేస్తుంది. మరో వైపు.. ఈ విద్యా విధానం చెబుతున్నదేమంటే.. హిందీ, ఉర్దూ భాషలకు తప్పుడు మూలాలను అంటగడుతున్నది. హిందీని మెజార్టీ ప్రజల భాషగా చెబుతూ ఉర్దూ భాషను ముస్లింల భాషగా ముద్రవేస్తున్నది. అలాగే, నూత న జాతీయ విద్యావిధాన ప్రకటనలో తల్లిదండ్రులు అనవసర అత్యాశలతో అశాస్త్రీయంగా 15 శాతం కూడా మాట్లాడని ఇంగ్లీష్‌ను కోరుకుంటున్నారని చెబుతున్నది. తమది కాని భాషను ఎంచుకుంటున్నారని అంటూనే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్‌ను నేర్చుకోవటం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పింది.
Akshya-saxena
శుద్ధమైన హిందీ పేరిట కూడా కులాధిపత్యాన్ని నెరపే ప్రయత్నం జరుగుతున్నది. మనం నేర్చుకునే భాషల్లో మనదైన సంస్కృతి, విలువలుండాలని చెబుతున్నది. అంతేకాదు, హిందీ భాషను ప్రధాన భాషగా చేయటంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని సుస్థిరం చేసే ప్రయత్నం ఉన్నది. ఉత్తరాదిన కూడా అనేక భాషలున్నాయి. ఖరిబోలి, అవధి, మైథిలి, బ్రాజ్, ఉర్దూ భాషా సంస్కృతులు ప్రజల్లో వేళ్లూనుకొని ఉన్నాయి. వాటి అభివృద్ధికి ఏమి చేయకుండా హిందీని రాష్ట్ర భాషగా చేయటం ఆ భాషలకు తీరని నష్టం చేస్తుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాషను ఒక భావ వ్యక్తీకరణ పరికరంగా మాత్రమే చూశారు. కానీ భాష ఒక చారిత్రక, జీవనరీ తుల, సంస్కృతుల వ్యక్తీకరణగా చూడాల్సిన అవసరం ఉన్న ది. జాతీయ సమగ్రత అనేదాన్ని ఒక గణిత సమీకరణంగా కుదించి చెబు తూ దానికి హిందీని అనుసంధాన భాషగా ఉండాలంటున్నారు. ఆ పేరుతో ఇతర భాషలను నిర్లక్ష్యం చేయటమే కాదు, వాటి విధ్వంసానికి కారకులవుతున్నారు. ఏవో కొన్ని భాషలకు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన ప్రజల భాషాసంస్కృతులు కలగలిసిపోయి సమైక్యత ఏర్పడదు. ఈ క్రమంలో అనేక భాషలు తీవ్ర నిర్లక్ష్యానికి గురై అంతరించిపోతున్నాయి. అనేక భాషలకు స్క్రిప్ట్ కూడా లేదు. తరతరాలుగా ప్రజల్లో ఉన్న భాషలకు, వారి సం స్కృతిక వ్యక్తీకరణకు భాషగా, సాహిత్యంగా గుర్తింపు లేదు. అనేక ప్రజా భాషలకు రాతను అభివృద్ధి చేసి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలిసో తెలియకో ప్రధాన భాషల ఆధిపత్యంలో అనేక ప్రజా భాషలు కునారిల్లుతున్నాయి. ఈ భాషల పరిపుష్టితోనే దేశీయ సాం స్కృతిక ఏకత సాధ్యమవుతుంది.
(వ్యాసకర్త: వండర్‌బిల్ట్ వర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్) దివైర్ సౌజన్యం..

284
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles