విలువలకు ప్రతీక గిరీశ్ కర్నాడ్

Fri,June 14, 2019 01:13 AM

girish-k
రచయిత, నటుడు, హక్కుల ఉద్యమకారుడు గిరీశ్ కర్నాడ్ జీవితాంతం శాస్త్రీయ, మానవీయ విలువల కోసం ఉద్యమించాడు. హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ విధమైన శషబిష లు లేకుండా వ్యతిరేకించాడు. దేనికీ లొంగలేదు. ఎవరికీ వెరువలేదు. తుదిశ్వాస వరకూ తాను విశ్వసించిన సిద్ధాంతాల కోసం కట్టుబ డి జీవించాడు. ఆ క్రమంలో ఆయన వ్యక్తిత్వం, విలువల ప్రస్థానం అడుగడుగునా మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ఒక ప్రఖ్యాత నాటకకర్త తన జన్మదినం సందర్భంగా గిరీశ్ కర్నాడ్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పుడు గిరీశ్ కర్నాడ్.. పుట్టుక, చావులు వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు. అవి మనకు అత్యంత ఆప్తులు మాత్రమే పట్టించుకునేవి. అయితే విషయమేమంటే.. పుట్టుక, చావుకు మధ్య అతను ఏం చేశాడన్నదే ప్రధానం. అదే పట్టించుకోవాల్సినది.. అం టూ స్పందించాడు. కర్నాడ్ 16 ఏండ్ల వయస్సున్నప్పటి నుంచి ప్రముఖుల ముఖచిత్రాలను గీసి వారికే పంపిస్తూ.. వారి సంతకాలతో వాటిని సేకరించేవాడు. అలా అల్బర్ట్ ఐన్‌స్టీన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంకా ఇతర ప్రముఖుల చిత్రాలను వారి ఆటోగ్రాఫ్‌లతో పొందాడు. ఒకసారి ఐరిష్ నాటక రచయిత సీన్ ఓ సెసీ ముఖచిత్రాన్ని కూడా గీసి ఆటోగ్రాఫ్‌తో దాన్ని తనకు పంపించాలని కర్నాడ్ కోరాడు. అప్పుడు ఐరిష్ నాటక రచయిత ఇలా అన్నాడు. ఎందుకు నీవు ఇతరుల చిత్రా లు గీసి వారి ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తున్నావు? నీవే నీ యొక్క ప్రజ్ఞాపాటవాల తో ఏదైనా భిన్నమైనపని చేయి. అప్పు డు నీవే నీ ఆటోగ్రాఫ్‌తో ఇచ్చే స్థితి వస్తుంది అని హితబోధ చేశాడు.

అంతే అప్పటి నుంచి గిరీశ్ కర్నాడ్ ఆలోచనాసరళిలో తీవ్ర మార్పు వచ్చింది. ప్రాపంచిక దృక్పథంలో నూతనత్వం వచ్చిం ది. ప్రపంచాన్ని చూడటంలో, అర్థం చేసుకోవటంలో వచ్చిన మార్పుతో ఆయన సామాజిక స్థితిగ తులను లోతుగా అర్థం చేసుకోసాగాడు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోంచే 22 ఏండ్ల వయస్సులోనే గిరీశ్ కర్నాడ్ ప్రఖ్యాత యయా తి రచన చేశాడు. అప్పటి నుంచి ఆయన అనేక నాటకాలు రచించాడు. ఈ క్రమంలోంచే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గొప్ప నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. గిరీశ్ కర్నాడ్‌కు సంబంధించి నాకు అతనితో ఉన్న అనుబంధం సుదీర్ఘమైనది. 25 ఏండ్ల కిందట బెంగళూరులోని జేపీ నగర్‌లో గిరీశ్ కర్నాడ్ ఉన్నప్పటి నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తెలుసు అనేకంటే మంచి అనుబంధం. ఒకరోజు ఆయన మా ఇంటి గుమ్మం ముందు ప్రత్యక్షమై.. తన ఇంట్లో చేసిన కూర బెల్లుల్లి తంబూలిని ఓ టిఫిన్ బాక్స్‌లో పెట్టుకొ ని మాకు తెచ్చి ఇచ్చాడు. ఇరుగు పొరుగు అన్నప్పుడు ఆహారపదార్థాలు, కూరలు ఇచ్చిపుచ్చుకోకుంటే అర్థమేమిటి అని మా అమ్మతో అంటూ తన ఇంట్లో చేసిన కూరలు మాకు పంచేవాడు. నేను అప్పటికే ఆయనను దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో ఆయన్ను చూసి ఉన్నాను. టీవీల్లో కనిపించే ఆయన మా ఇంటిముందు ప్రత్యక్షమ య్యేసరికి నేను ఆశ్చర్యపడటం, ఆనందపడటం ఒకేసారి జరిగాయి. కర్నా డ్ తన ఇంటిపక్కల ఉన్నవారినీ, పరిసరాల్లో ఉన్నవారినీ తనవారిగానే భావించేవాడు. అందరూ ఓ సమిష్టి కుటుంబంగా మెలగాలని కాంక్షించేవాడు. ఐదేండ్ల కిందట ఆయన ఇంటిముందు బెంగళూరు మున్సిపాలిటీవారు తవ్వకాలు జరుపుతూ అక్కడ ఉన్న చెట్లన్నీంటినీ నరికేశారు.

బెంగళూరు విస్తరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఇలా బెంగళూరులోని అనేక ప్రాంతాలు రూపురేఖలు మారిపోయాయి. మరో మాట లో చెప్పాలంటే ధ్వంసమయ్యాయి. దీంతో ఆ రోడ్డు వెంట విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. వాయు, ధ్వని కాలుష్యం పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల ప్రభావంతోనే కావచ్చు ఆయన బాయిల్డ్ బీన్స్ ఆన్ టోస్ట్, వెడ్డింగ్ ఆల్బమ్, ఏ హీప్ ఆఫ్ బ్రోకెన్ ఇమేజెస్ లాంటి నాటకాలు రాశారు గిరీశ్ కర్నాడ్. ఆ నాటకాల్లోని పాత్రలు బెంగళూరు నగరం రూపుమారిన విధానాన్ని వ్యంగ్యంగా అనేక సందర్భాల్లో చెబుతాయి. నేను కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ముంబాయికి వెళ్లాలనేది నా ఆలోచన. అప్పుడు మా నాయ న సూచన మేరకు నేను గిరీశ్ కర్నాడ్ వద్దకు వెళ్లాను. అప్పటికి ఆయన బాలీవుడ్‌లో పేరుగాంచిన నటుడుగా ఉన్నా రు. ఓ సినిమా షూటింగ్ కోసం కర్నాడ్ గారు లండన్ నుంచి షూటింగ్ స్పాట్‌కు ఒక గంటముందే చేరుకున్నా రు. అప్పడు.. మరో ప్రఖ్యాత నటుడు షూటింగ్‌కు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు తీవ్రంగా మందలించటం నేను చూశాను. సమయపాలన పట్ల ఆయన ఎంత కఠినంగా, నిబద్ధతతో ఉంటారో ఈ ఘటనద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి ఆయనను కలువటానికి అనుకున్న సమయానికన్నా ముందే వెళ్లి ఇంటిముందర వాలేవాడిని. నాకు ముంబైలోని బాలీవుడ్‌లో సహాయం చేయాలని ఆయన్ను కోరాను. ఆయన ఆశ్చర్యంగా నా వైపు చూడటంలో.. తన తండ్రి సలహా మేరకే ఆ కోరిక కోరానని తెలిపాను. అప్పుడాయన.. ముంబైకే ఎందుకెళ్లాలి. నేనో టీవీ సీరియల్ తీస్తున్నాను. నాకు సహాయకుడిగా ఉండగలవా? అని నన్నడిగారు. ఆ విధంగా మా ప్రయాణం సినిమాల నుంచి టీవీ రంగానికి మారింది. ఆయనతో కలిసి రెండు టీవీ షోలకు పనిచేశాను.

ఆయనతో సీరియళ్లకు పనిచేసే క్రమంలోనే నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాను. ఆయనతో కలిసి చేస్తున్న సమయంలోనే ఆయనకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు వచ్చింది. అప్పటికి మేం షూటింగ్‌లో ఉన్నాం. షూటింగ్ కార్యక్రమాన్ని నిలిపేయకుండానే తాను ఢిల్లీకి వెళ్తూ నన్ను మొత్తంగా షూటింగ్ వ్యవహార బాధ్యతను నాకు అప్పగించారు. మాల్గుడి డేస్‌కు పనిచేసిన ఎస్.రామచంద్ర గారే మా ప్రాజెక్టుకు సినిమాటోగ్రాఫర్. అప్పుడు నా వయస్సు 23 ఏండ్లు. ఆ తర్వాత వివిధ కారణాల చేత రెండు నెలలు షూటింగ్‌కు రాలేదు. ఆ ప్రాజెక్టు అం తా నేను దర్శకత్వం వహించాను. ఆ తర్వాత ఫిల్మ్ చూస్తూ.. తర్వాత భాగాలన్నింటినీ నన్నే డెరెక్ట్ చేయమన్నారు. ఆయన ఏ స్థానంలో ఎక్కడ ఉన్నా తనదైన ముద్రవేశారు. ఎక్కడా రాజీపడలేదు. ఆయన ఒక విషయాన్ని సంపూర్ణంగా నమ్మితే ఎవరు వ్యతిరేకించినా తన దారిన తాను పోయేవాడు. ఆయన పునా ఫిలిం ఇనిస్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓంపురిని విద్యార్థిగా తీసుకోవటానికి నిర్వాహకులు నిరాకరించారు. ఎందుకంటే.. ఆయన ముఖంపై గుంతలతో ఉన్న తట్టు మచ్చలు, సన్నని బక్కపల్చని దేహం. ఆయన వర్చస్సు నటనకు పనికిరాదని నిర్వాహకుల భావన. కానీ గిరీశ్ కర్నాడ్ ఓంపురికి ప్రవేశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి ఇప్పించాడు. ఓంపురి ఏం సాధించాడో చరిత్రే. గిరీశ్ కర్నాడ్ ఏ విషయంలోనైనా నిబద్ధతతో ఉండేవాడు. నిజాయితీతో వ్యవహరించేవాడు. సందర్భానుసారంగా వ్యవహరించే రకం కాదు. ఆయనకు గీత, ఉపనిషత్‌లపై విస్తారమైన పరిజ్ఞానం ఉండేది. సందర్భానుసారంగా వాటిలోని శ్లోకాలను నోటికి చెప్పేవారు. అలాగే ఆయన తన కర్తవ్య నిర్వహణకు ఎవరు, ఏ రూపంలో ఆటంకంగా నిలిచానా వెంటనే బాధ్యతల నుంచి తప్పుకునేవాడు.
chaitanya-km
అలా ఆయన అనేక పదవులను వదులుకున్నాడు. ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న అసహన, మెజార్టీవాద రాజకీయాలను తీవ్రం గా వ్యతిరేకించారు. లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం గొంతు విప్పారు. ముఖ్యంగా గౌరీలంకేశ్ హత్య తర్వాత ఆయన మరింత తీవ్రంగా పాలక ప్రభుత్వాల దమననీతికి వ్యతిరేకంగా గొంతువిప్పాడు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అర్బన్ మావోయిస్టుల పేరుతో అరెస్టులు చేసి జైలుపాలు చేస్తున్న తీరుకు నిరసనగా ఆయన నేను కూడా అర్బన్ మావోయిస్టునే అని బోర్డురాసి మెడకు వేసుకొని ప్రభుత్వ దమన కాండకు నిరసన వ్యక్తంచేశారు. తీవ్రమైన శ్వాసకోశ సంబంధ సమస్య ఉన్నా కూడా ఆక్సీజన్ పైపులు పెట్టుకొని గౌరీలంకేశ్, మైనారిటీలపై హిం దుత్వ వాదుల దాడులను నిరసిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొనటం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఆయన సాహిత్యరంగంలోనే కాకుం డా నటుడుగా, హక్కుల ఉద్యమ కార్యకర్తగా అందరికీ ఆదర్శం. జీవితమంతా నిత్య సంఘర్షణతో నిబద్ధ జీవితంతో నిలిచిన గిరీశ్ కర్నాడ్ లేని లోటు సినీ రంగానికే కాదు, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమానికి కూడా పూడ్చలేనిది.
(వ్యాసకర్త: సినీ నిర్మాత, నాటకరంగ కళాకారుడు)
ది వైర్ సౌజన్యంతో...

226
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles