హాంకాంగ్ నిరసనలు

Wed,June 12, 2019 11:02 PM

చైనా ఉక్కుపాదం మోపడానికి తెరవెనుక పావులు కదుపుతుంటే, తమ ప్రజాస్వామ్య పరిరక్ష ణ కోసం హాంకాంగ్ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. బుధవారం నుంచి హాంకాంగ్ ప్రజలు నిరసన ప్రదర్శనలు సాగిస్తూనే ఉన్నారు. 1997 నుంచి రెండు దశాబ్దాలకు పైగా హాంకాంగ్ ప్రజలు చైనా ఆధిపత్యాన్ని వీలైనంత అడ్డుకుంటూనే ఉన్నారు. ఒక్కోసారి ఈ నిరసన తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నది. తాజాగా హాంకాంగ్ ప్రభుత్వం చైనాకు అనుమానితులను అప్పగించే చట్టం చేయబోవడంతో నిరసనలు భగ్గుమన్నాయి. ఆదివారం దాదాపు పది లక్షల మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి మార్చి 31 వ తేదీన్నే హాంకాంగ్ ప్రజలు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఏప్రిల్ 28న మరో ప్రదర్శన సాగిం ది. ఈ నెల ఆరవ తేదీన న్యాయవాదులు ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా మౌన ప్రదర్శన చేశారు. తొమ్మిదవ తేదీన లక్షలాదిమంది తరలిరావడంతో ఈ ప్రదర్శన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే హాంకాంగ్‌లో పరోక్షంగా చైనా శాసనం అమలవుతున్నది. ఈ చట్టం అమలులోకి వస్తే హాంకాంగ్‌లోని ఎవరినైనా చైనా అప్పగించమని కోరవచ్చు. నేరస్థులను అప్పగించడానికే ఈ చట్టం చేస్తున్నట్టు పైకి చెబుతున్నా, రాజకీయ అసమ్మతిని అణిచివేయడమే అసలు ఉద్దేశమని హాంకాంగ్ ప్రజలు అంటున్నారు. హాంకాంగ్ ప్రజల పోరాటం ఈ ఒక్క చట్టానికి సంబంధించినది కాదు. తమ అస్తిత్వ పరిరక్షణ, హక్కులకు సంబంధించినది. ఈ బిల్లుపై చర్చను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ హాంకాంగ్ ప్రజలు నమ్మడం లేదు. తమ హక్కుల పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని అంటున్నారు.

మెరికాకు చైనాకు వాణిజ్య యుద్ధం సాగుతున్నది. సాంకేతికరంగంలో చైనా ఎదుగుదలను అమెరికా జీర్ణించుకోలేక పోతున్నదనే విమర్శలున్నాయి. చైనాకు చెందిన హువావెయి కంపెనీ అధికారిని అమెరికా కెనెడాలో అరెస్టు చేయించింది. దీంతో చైనా కెనెడాకు చెందిన ఒక వ్యాపారవేత్తను, మరో ప్రముఖుడిని అరెస్టు చేసింది. అమెరికా, చైనా వైషమ్యాలు హాంకాంగ్‌పై ప్రభావం చూపడం సాధారణమే. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే చర్చ వేరు. కానీ హాంకాంగ్ ప్రజల హక్కుల విషయంలో మాత్రం చైనాను కట్టడి చేయవలసిందే.


19వ శతాబ్దంలో రాచరికం ఉన్నప్పుడు చైనా నుంచి బ్రిటన్ హాంకాంగ్‌ను 99 ఏండ్ల లీజుకు తీసుకున్నది. ఆ లీజు గడువు 1997లో ముగియడంతో బ్రిటన్ హాంకాంగ్‌ను చైనాకు అప్పగించిం ది. అయితే చైనాలో ఉన్న వ్యవస్థకు, హాంకాంగ్ రాజకీయ, ఆర్థిక, పరిపాలనావ్యవస్థ భిన్నమైన ది. అప్పటికే హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య సం స్కృతి పాతుకుపోయింది. మరోవైపు ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలకు అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌లోను తమ దేశంలో కలుపుకున్నప్పటికీ, అక్కడి వ్యవస్థలకు ముప్పు ఉం డదని చైనా హామీ ఇచ్చింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అనే విధానాన్ని అమలుచేస్తామన్నది. కానీ క్రమేణా హాంకాంగ్ ప్రత్యేక అస్తిత్వాన్ని హరిస్తున్నది. హాంకాంగ్ శాసనసభ చైనా అనుకూలురతో నిండిపోయి ఉంటుంది. చైనా వ్యతిరేకులు చట్టసభలోకి అడుగుపెడితే, వారిని ఏదో కారణంగా బహిష్కరిస్తారు. హాంకాంగ్ ప్రభు త్వం చైనా చెప్పుచేతల్లో ఉంటుంది. చైనాలో రాజకీయ అసమ్మతికి తావు లేదు. కానీ చైనా ప్రభుత్వంతో ఏకీభవించని వారు హాంకాంగ్‌లో ఉంటారు. వారిని హాంకాంగ్ ప్రభుత్వం ద్వారా అణిచివేయడానికి చైనా ప్రయత్నిస్తుంటుంది. కొద్దికాలం కిందట హాంకాంగ్‌లోని ఐదుగురు పుస్తక ప్రచురణకర్తలు-విక్రేతలు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన కొంతకాలానికి వారు చైనా టీవీలో మాట్లాడుతూ, తాము తప్పుచేశామని అంగీకార ప్రకటన చేశారు. వీరు చైనా పాలకవర్గాల వ్యతిరేక సాహిత్యం అమ్మేవారు. హాంకాంగ్‌లోని ఒక వ్యాపారి కూడా ఇదేవిధంగా అదృశ్యమయ్యాడు. చైనా వంటి పెద్ద దేశంలో భాగంగా ఉంటూ, ఆ దేశ నిరంకుశ వ్యవస్థ నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం హాంకాంగ్ ప్రజాస్వామ్య ప్రియులు చేస్తున్న పోరాటం ఆశ్చర్యకరమైనది. ప్రజాస్వామ్యహక్కులు, అస్తిత్వం కోసం పడే తపన నుంచి ఆ ఆత్మ ైస్థెర్యం లభిస్తున్నది.

చైనా పక్కనే ఉన్న హాంకాంగ్‌ను బ్రిటన్ అధీనంలో పెట్టుకోవడాన్ని ఎవరూ సమర్థించరు. ఇదే రీతిలో హాంకాంగ్‌లోని వ్యాపార ప్రపంచంతో చైనాకు విభేదాలు ఉంటే ఉండవచ్చు. అమెరికా కు చైనాకు వాణిజ్యయుద్ధం సాగుతున్నది. సాంకేతికరంగంలో చైనా ఎదుగుదలను అమెరికా జీర్ణించుకోలేక పోతున్నదనే విమర్శలున్నాయి. చైనాకు చెందిన హువావెయి కంపెనీ అధికారిని అమెరి కా కెనెడాలో అరెస్టు చేయించింది. దీంతో చైనా కెనెడాకు చెందిన ఒక వ్యాపారవేత్తను, మరో ప్రముఖుడిని అరెస్టు చేసింది. అమెరికా, చైనా వైషమ్యాలు హాంకాంగ్‌పై ప్రభావం చూపడం సాధారణ మే. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే చర్చ వేరు. కానీ హాంకాంగ్ ప్రజల హక్కుల విషయంలో మాత్రం చైనాను కట్టడి చేయవలసిందే. చైనాలో రాజకీయ అసమ్మతికి స్థానం లేదు. పార్టీ పెద్దలు, వ్యాపార కుటుంబాలు, పాత రాచరిక వ్యవస్థ వారసులు పెత్తనం చెలాయిస్తున్నారు. పార్టీలు లేవు, హక్కులు లేవు, స్వతంత్ర న్యాయవ్యవస్థ లేదు. అటువంటి వ్యవస్థ నీడలో హాంగ్‌కాంగ్ ప్రజలు స్వేచ్ఛగా జీవించడం సాధ్యం కాదు. హాంకాంగ్ ప్రజలు అనుమానితుల అప్పగింత చట్టాన్ని చేయడాన్ని అడ్డుకోవలిసిందే. తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవలసిందే. హాంకాంగ్ ప్రజల పోరాటం చైనా ప్రజల్లో చైతన్యాన్ని రగిలింది అక్కడ రాజకీయ సంస్కరణలకు దారితీస్తే మరీ మంచిది.

204
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles