కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మామూలుగా కాదు. సీట్లు తగ్గినా ఓట్లు ఇంచుమించు అదేస్థాయిలో ఉండే స్థితి ఒకటి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌కు ఓట్లు కూడా పడిపోతున్నాయి. అంతే ముఖ్యంగా పార్టీ యంత్రాంగం, వనరులు బలహీనపడుతున్నాయి. మనోైస్థెర్యం దెబ్బతింటున్నది. కేంద్ర నాయకత్వాన్ని చూసి అయినా గుండె నిబ్బరం తెచ్చుకోగల పరిస్థితి లేదు. పోతే, అధికారపక్షమైన టీఆర్‌ఎస్ వైఫల్యాల వల్ల శూన్యం ఏర్పడి ఆ శూన్యంలోకి ప్రవేశించగల అవకాశం లభిస్తుందనుకుంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తమ్మీద అటువంటి అవకాశం ఇవ్వటం లేదు. ఈ పరిణామ క్రమంలో తాజాగా కన్పిస్తున్నవి పంచాయతీ పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు గతంలో ఎప్పుడూ లేనంతటి తీవ్ర పరాజయం, ఆ పార్టీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కావటం. కాంగ్రెస్ ఖాళీ అయితే ఆ శూన్యంలోకి ఎవరు అనే ప్రశ్న ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 19 సీట్లు వచ్చినప్పటి నుంచి మొదలైంది. అధికారానికి వచ్చితీరుతామనే ఆర్భాటంతో సాగినవారు అంతకుముందటి (2014లో 23) బలాన్ని అయినా నిలబ్టెటుకోలేకపోవటం మొదటిస్థితి. గెలిచినవారిలో ఒక్కొక్కరు టీఆర్‌ఎస్ వైపు చూడటం రెండవస్థితి. కనీసం లోక్‌సభ ఎన్నికలలో ఘన విసయం సాధించి కేంద్రంలో అధికారానికి రాగలమని ఆ ప్రభావంతో పరిస్థితి తెలంగాణలోనూ చక్కబడగలదనుకున్న ఆశలు భంగపడటం మూడవస్థితి. ఇక్కడ తమ లోక్‌సభ స్థానాలు మూడు కాగా బీజేపీకి నాలుగు రావటం నాలుగవ స్థితి. ఇక ఆ ఎన్నికల అనంతర పరిణామాలు పైన పేర్కొన్నవే.

తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ ఖాళీ అయితే ఆ చోటులోకి వచ్చేది ఎవరనే ప్రశ్న ఇటీవల తరచుగా వినవస్తున్నది. ఈ ప్రశ్న వేస్తున్న వారిలో స్వయంగా కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల వారు, ఆలోచనాపరులు, సాధారణ పౌరులు ఉన్నారు. ఈ ప్రశ్న ఎంత ముఖ్యమైనదో అందుకు సమాధానం చెప్పటం అంత కష్టమైన పని. అది మునుముందు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నది మాత్రమే ఇప్పటికి అనగలమాట. అదే సమయంలో ఆ విషయమై ఆలోచించటం, సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం చేయటం చైతన్యవంతమైన సమాజం చేయవలసిన పని.


పార్టీ నాయకు లు ఎక్కువమంది టీఆర్‌ఎస్ వైపు వెళ్తుండగా, తాము కూడా తగినంత మందిని ఆకర్షించగలమని, అది తమకు ఒక మిషన్ అని, ఆ విధంగా కాంగ్రెస్‌ను మూడవ స్థానంలోకి తోసి టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాగలమని బీజేపీ ధీమాగా ప్రకటిస్తున్నది. కాంగ్రెస్ ఖాళీ అయితే ఆ శూన్యంలోకి ఎవరనే ప్రశ్న ఆ విధంగా ఇటీవలి వారాలలో మరింత బలపడింది. సూటిగా మాట్లాడాలంటే, కాంగ్రెస్ ఖాళీ అయిన పక్షంలో ఆ చోటులోకి బీజేపీ రాగలదా? యథాతథంగా రంగంలో ఉన్న శక్తి బీజేపీ అయినందున, ప్రత్యామ్నాయం అయ్యేందుకు వారు గట్టిగా ప్రయత్నిస్తుండటాన్ని బట్టి, పశ్న ఈ విధంగా ఉండటం సహజం. టీడీపీ, వామపక్షాలు అంటూ ఇతర శక్తులు ఉన్నాయిగాని నామమాత్రంగా మారాయి. మరికొద్దికాలం తర్వాత అసలు టీడీపీ ఉనికి ఉండకపోవచ్చు. వామపక్షాల తీరును చూడగా అవి పుంజుకొనగల సూచనలు ఎంతమాత్రం కనిపించటం లేదు. అటువంటప్పుడు మిగిలింది బీజేపీ ఒక్కటే. అందువల్ల కాంగ్రెస్ శూన్యంలోకి బీజేపీ రాగలదా అనే ప్రశ్న, రావచ్చును అనే అంచనాలు ఏర్పడం సహజం. అదే జరుగుతున్నది కూడా. అయినప్పుడు, కాంగ్రెస్ ఖాళీలోకి బీజేపీ రాగలదని నిర్ధారణగా చెప్పుకోవచ్చు గదా. కాంగ్రెస్ నిజంగానే ఖాళీ అవుతుందని, అందులోకి ఎవరు రావచ్చునని ఆలోచించటం ఎందుకు? జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు ఇవే. చరిత్ర ఒక్కోసారి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంటుంది. పరిణామాలు ఒక కాల బిందువు (పాయింట్ ఆఫ్ టైమ్) వద్ద తోచిన విధంగానే మున్ముందు కూడా సాగుతాయనేమీ లేదు. సాగవచ్చు, సాగకపోవనూవచ్చు. అది తిరిగి వివిధ పరిణమాలపై ఆధారపడి ఉంటుం ది. ఆ పరిణామాలు ముందుగా ఊహించగలవి కావచ్చు, ఊహించలేనివి కావచ్చు.

కాంగ్రెస్ ఒకప్పుడు బలంగా ఉన్న కాలంతో పోల్చితే, మారింది కాంగ్రెస్ తప్ప తెలంగాణ సమాజం కాదు. ఇదేమాట దేశానికంతా వర్తిస్తుంది గాని అది ఇక్కడ చర్చనీయం కాదు గనుక పక్కన ఉంచుదాం. ఆ విధంగా తేలుతున్నదేమంటే, తెలంగాణలో కాంగ్రెస్ తన వైఫల్యాల వల్ల తనను తాను ఖాళీ చేసుకుంటున్నదే గాని, తెలంగాణ సమాజం స్వభావం గాని, భావజాలంగాని కాంగ్రెస్‌ను ఖాళీ చేయించేవి కావు. దీనిని బట్టి, రాగలకాలంలో మరింత బలహీనపడుతారా, మరింత ఖాళీ సృష్టిస్తారా, బీజేపీ లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది తేల్చుకోవలసింది, అందుకు అనుగుణంగా వ్యవహరించవలసింది కాంగ్రెస్ మాత్రమే.


అందువల్లనే పైన అనుకున్న ప్రశ్నలు ఈ దశలో తెలంగాణలో తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ నిజంగానే ఖాళీ అవుతుందా అన్నది మొదటి ముఖ్యమైన ప్రశ్న కాగా, ఒక వేళ ఆ పని జరిగితే అందులోకి రాగలది బీజేపేయేనా అన్నది రెండవ ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ ఒక వివరణ అవసరం. ఖాళీ అనే మాటకు అర్థం సీట్లు అని మాత్రమే కాదు. అంతకన్న ముఖ్యంగా భావజాల విస్తృతి, సామాజిక పునాది అనే అర్థంలో తీసుకోవాలి. ఇక్కడ ఒక మాట గుర్తుచేయటం అసందర్భం కాబోదు. బీజేపీకి 1984లో రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చినప్పుడు అద్వానీ మాట్లాడుతూ, తాము అందుకు ఆందోళన చెందటం లేదని, తమ భావజాల విస్తృతి, సామాజిక పునాది చెక్కుచెదరలేదనే అర్థంలో చెప్పారు. ఆ తర్వాతి ఎన్నికలలో ఏం జరిగిందో తెలిసిందే. తిరిగి ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్‌కు తెలంగాణలో మొదటినుంచి ఒక సామాజిక పునాది ఉంది. ఒకానొక భావజాలానికి అది ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆ రెండింటి ఆధారంగా రాజ్యం చేస్తూ వచ్చింది. తర్వాత క్రమంగా రాజ్యాన్ని కోల్పోవటానికి కారణం ఏమిటి? అందుకు మూడు కారణాలున్నాయి. తన సంప్రదాయిక భావజాలానికి కట్టుబడటం పూర్తి గా అంతర్ధానం లేదు గానీ బలహీనపడింది. తన ఆచరణ మొత్తంగా ముగియలేదు గాని గణనీయంగా తగ్గింది. ఈ రెండింటి వల్ల సామాజిక పునాదిని పూర్తిగా కాకున్నా తగినంత కోల్పోయింది. మొత్తమ్మీద గతం తో పోల్చితే, కాంగ్రెస్ ఒకప్పుడు బలంగా ఉన్న కాలంతో పోల్చితే, మారింది కాంగ్రెస్ తప్ప తెలంగాణ సమాజం కాదు. ఇదేమాట దేశానికంతా వర్తిస్తుంది గాని అది ఇక్కడ చర్చనీయం కాదు గనుక పక్కన ఉం చుదాం. ఆ విధంగా తేలుతున్నదేమంటే, తెలంగాణలో కాంగ్రెస్ తన వైఫల్యాల వల్ల తనను తాను ఖాళీ చేసుకుంటున్నదే గాని, తెలంగాణ సమాజం స్వభావం గాని, భావజాలంగాని కాంగ్రెస్‌ను ఖాళీ చేయించేవి కావు.
Ashok
దీనిని బట్టి, రాగలకాలంలో మరింత బలహీనపడుతారా, మరిం త ఖాళీ సృష్టిస్తారా, బీజేపీ లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది తేల్చుకోవలసింది, అందుకు అనుగుణంగా వ్యవహరించవలసింది కాం గ్రెస్ మాత్రమే. యథాతథంగా చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా గణనీయంగా బలహీనపడింది, ఇంకా పడుతున్నది గాని, భావజాల పరంగా, పునాది పరంగా ఖాళీ అయిపోతున్నదని ఇప్పటికైతే అనలేము. మరొకవైపు బీజేపీ, ఇతరుల రాజకీయ బలహీనతలోకి స్వల్పస్థాయి లో ప్రవేశించటమైతే చేసింది గాని, తెలంగాణ సమాజంలో భావజాలపరమైన, పునాదిపరమైన ఖాళీ అంటూ ఏర్పడటం, అందులోకి తాను ప్రవేశించటం ఇప్పటికైతే జరుగలేదు. నిజమైన అర్థంలో ఆ పని ఇంకా మొదలు కూడా కాలేదు. ఒకవేళ ఆ పార్టీ జాతీయస్థాయి బలం వల్ల కొం త ప్రభావం పడినా అది స్థూలంగా, ఉపరితల స్థాయిలో, తాత్కాలికంగా తప్ప, తెలంగాణ మూలాలలోకి వెళ్లగల అవకాశం సుదీర్ఘకాలం పాటు ఉండదు. ఈ లోగా అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌తో సహా ఇతరులంతా విఫలమై శూన్యాన్ని సృష్టిస్తే తప్ప. చివరగా కీలకమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. తెలంగాణ సమాజపు సంప్రదాయక స్వభావానికి, పునాదికి ఈ రోజున వారసత్వం టీఆర్‌ఎస్‌ది. కాంగ్రెస్ బలహీనపడుతున్నంత మేర ఆ స్వభావానికి, పునాదికి టీఆర్‌ఎస్ మరింత వారసత్వ పార్టీగా మారుతున్నది. అందుకు టీఆర్‌ఎస్ కట్టుబడినంత కాలం సఫలమైనంతకాలం, ఈ సమాజంలో మౌలి క శూన్యాలు ఏర్పడవు. సమాజం ప్రధానం, కాంగ్రెస్ ద్వితీయం. కాం గ్రెస్ రాజకీయంగా బలహీనపడవచ్చు. కాని సమాజాన్ని టీఆర్‌ఎస్ బలంగానే ఉంచగల ఆస్కారం ఉంది. దీని మధ్య బీజేపీ తన చోటును వెతుక్కొనగలదా?

387
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles