బెంగాల్ విషాదం

Tue,June 11, 2019 01:14 AM

హింసాకాండ చెలరేగుతున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు అనుసరిస్తున్న విధానం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తీవ్ర హింసాకాండ చెలరేగింది. ఈ రాజకీయ ఘర్షణలు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా కొనసాగుతూ హత్యలకు దారితీయడం విచారకరమే. విజ్ఞతగల రాజకీయపక్షాల నాయకులు ఈ హింసా సం స్కృతిని అరికట్టడానికి కలిసికట్టుగా ప్రయత్నించాలె. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు కేంద్రంలోని బీజేపీకి కూడా ఈ హింసాకాండను రూపుమాపవలసిన బాధ్యత ఉన్నది. కానీ పశ్చిమబెంగాల్ పరిస్థితిని మరింత దిగజార్చి, రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ వ్యూహమనే అనుమానాలు కలుగుతున్నాయి. గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితిని వివరించడంతో బీజేపీ వ్యూహం ఏమై ఉంటుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో హింసాకాండపై కేంద్రం ఆందోళన వెలిబుచ్చుతూ రాష్ర్టానికి లేఖ రాసింది. చట్టబద్ధపాలన అందించి ప్రజలకు ధైర్యం కల్పించడంలో పాలనా యంత్రాంగం విఫలమవుతున్నదనే అభిప్రాయాన్ని కేంద్ర హోం మం త్రిత్వ శాఖ ఈ లేఖలో వెలిబుచ్చింది. శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రశాంతతను నెలకొల్పాలని సూచించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తమ కార్యకర్తల ను ఉసిగొల్పడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందనే పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ అనుమానిస్తున్నది.

లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలు తెచ్చుకుంటే, బీజేపీకి 18 లభించడం అసాధారణమే. రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు రావడం బీజేపీ ఆశలను పెంచింది. ఒక రాజకీయ పక్షంగా పశ్చిమబెంగాల్‌లో అధికారం పొందాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇందుకు మతపరమైన భావజాలాన్ని ఆశ్రయించి ఉద్రిక్తలను రెచ్చగొట్టడం సమర్థనీయం కాదు. రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి రాష్ట్రపతిపాలన విధించడం, ఉద్రిక్తతల మధ్య అసెంబ్లీ ఎన్నికల ను జరుపడం బీజేపీ పథకమనే ఆరోపణలున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న విధానం ఒక్క పశ్చిమ బెంగాల్‌కే కాదు, దేశానికే ప్రమాదం.


ఉత్తర ప్రదేశ్‌లో కూడా హింసాకాండ సాగుతున్నా, కేంద్రం పశ్చిమబెంగాల్‌కే ఎందుకు లేఖ రాసింద ని తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ ప్రశ్నించడం గమనార్హం. హింసాకాండకు ఎవరు బాధ్యులనే విషయ మై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీరత్ సబ్‌డివిజన్ అట్టుడి కిపోతున్నది. శనివారం నాటి హింసాకాండలో తమ పార్టీకి చెందిన ఐదుగురు కార్యకర్తలను తృణమూల్ కాంగ్రెస్ వారు హత్య చేసినట్టు బీజేపీ ఆరోపిస్తున్నది. బీజేపీ దాడిలో తమ కార్యకర్తలు ఇద్దరు మరణించారని తృణమూల్ కాంగ్రెస్ అంటున్నది. ఇంకా ఎంతమంది అదృశ్యమైందీ, అందులో ఎందరు మరణించిందీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హింసావాదం కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయింది. 1972 నుంచి 77 వరకు ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రాయ్ వామపక్షాలను అణచివేయడానికి తీవ్రమైన హింసను ప్రయోగించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వామపక్షాలు అదే బాటను అనుసరించాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి వామపక్షాల దాడులకు తట్టుకొని నిలిచి అధికారానికి రావడం గొప్ప విషయమే. కానీ తాను అధికారానికి వచ్చిన తరువాత అదే కరకుదనం ప్రదర్శించకూడదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వామపక్ష పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పార్టీ ప్రయోజనాలకు అతీతంగా మమతా బెనర్జీతో చర్చించి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి చర్చిస్తే, దేశంలో కొత్త రాజకీయ ఒరవడిని ప్రవేశపెట్టినట్టయ్యేది.

దేశ విభజన ప్రభావం పశ్చిమ సరిహద్దు రాష్ర్టాల తరువాత ఎక్కువగా పడ్డది పశ్చిమబెంగాల్‌పైనే. తమ మత అజెండాను అమలుచేసి అధికారం చేజిక్కించుకోవడానికి పశ్చిమబెంగాల్ రాష్ర్టాన్ని అనువైనదిగా బీజేపీ పెద్దలు ఎంచుకున్నారనే అభిప్రాయం ఉన్నది. లోక్‌సభ ఎన్నికల కు చాలాముందు నుంచే బీజేపీ పౌరసత్వ సమస్యను ముందుకు తెచ్చి మతపరమైన ప్రచారాన్ని సాగించింది. లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలు తెచ్చుకుంటే, బీజేపీకి 18 లభించడం అసాధారణమే. రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు రావడం బీజేపీ ఆశలను పెంచింది. ఒక రాజకీయ పక్షంగా పశ్చిమబెంగాల్‌లో అధికారం పొందాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇందుకు మతపరమైన భావజాలాన్ని ఆశ్రయించి ఉద్రిక్తలను రెచ్చగొట్టడం సమర్థనీయం కాదు. రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి రాష్ట్రపతిపాలన విధించడం, ఉద్రిక్తతల మధ్య అసెంబ్లీ ఎన్నికల ను జరుపడం బీజేపీ పథకమనే ఆరోపణలున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న విధానం ఒక్క పశ్చిమ బెంగాల్‌కే కాదు, దేశానికే ప్రమాదం. దేశ లౌకిక సంస్కృతికి భంగకరం. భిన్నత్వంలో ఏకత్వమనే భావనతో దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు రాష్ర్టాలలో అధికారాన్ని చేపట్టి కేంద్రంలో భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. దేశ రాజకీయ- పరిపాలనా వ్యవస్థ ఇప్పుడిప్పుడే సమాఖ్య స్వరూపాన్ని సంతరించుకుంటున్నది. ఈ దశలో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ ప్రాంతీ యశక్తులను దెబ్బకొట్టి రాష్ర్టాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే ధోరణి దీర్ఘకాలికంగా ప్రమాదకరం. బీజేపీ అనుసరిస్తున్న విధానల పట్ల దేశంలోని ప్రజాస్వామ్య, లౌకిక పక్షా లు, ప్రాంతీయశక్తులు అప్రమత్తం కావాలె.

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles