ఈశాన్యం కలకలం

Thu,May 23, 2019 01:35 AM

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసినందుకు సంతోషిస్తున్న వేళ- అరుణాచల్‌ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేను, మరికొందరిని నాగా మిలిటెంట్లు కాల్చివేసిన ఘటన ఈశాన్యం రాష్ర్టాలలో వాస్తవ పరిస్థితిని గుర్తుకుతెస్తున్నది. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు స్థిరపడినప్పటికీ, ఇంకా ప్రయాణించవలసిన దూరం ఎంతో ఉన్నది. అరుణాచల్‌ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి అయిన తిరాంగ్ అబోహ్‌ను ఆయన కుమారుడిని మరో తొమ్మిది మందిని తీవ్రవాదులు మంగళవారం హతమార్చారు. నాగా తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తిరాంగ్ అబోహ్ ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రతీకగా నిలిచి హింసాయుత కార్యకలాపాలను వ్యతిరేకించారు. ఆయనపై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. ఆయ న అనుచరుడిని నాగా తీవ్రవాదులు అపహరించి చిత్రహింసలు పెట్టి హతమార్చారు. ఎన్నికలలో తలపడే దమ్ములేని నాయకులు ఇటువంటి అజ్ఞాతశక్తులతో చేతులు కలుపకూడదని హితవు చెప్పా రు. ఈశాన్య రాష్ర్టాలలో అనేక తీవ్రవాద గ్రూపులున్నాయి. రాష్ట్రంలోని ఆయా జాతుల అస్తిత్వానికి సూచికలుగా చిన్న రాజకీయపక్షాలు కూడా ఉన్నాయి. కానీ ఈశాన్యంలోని ఒకటి కన్నా ఎక్కువ రాష్ర్టాలకు విస్తరించిన స్థానిక రాజకీయపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ). మాజీ స్పీకర్ పీఏ సంగ్మా స్థాపించిన ఈ పార్టీకి ఇప్పుడు ఆయన కుమారుడు మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా నాయకత్వం వహిస్తున్నారు. ఎన్‌పీపీ మౌలికంగా గిరిజన పార్టీ అయినప్పటికీ, ఒక ప్రాంతానికి, తెగకు పరిమితం కాకుండా సార్వత్రిక ఆమోదం పొందడానికి యత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో అబోహ్ హత్య హింసా కార్యకలాపాలకు, శాంతియుత రాజకీయాలకు మధ్య ఘర్షణను సూచిస్తున్నది.

ఈశాన్యంలోని జాతులు, తెగలు తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే జాతీయ రాజకీయాలలో భాగస్వాములయ్యే పరిస్థితులు కల్పించాలె. జాతీయ రాజకీయ పక్షాల పట్ల ఘర్షణపూరిత పరిస్థితులు, అనుమానాలు నెలకొనడం మంచిది కాదు. అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నందున అబోహ్ హత్య ఈశాన్య రాష్ర్టాలలో ప్రకంపనలు సృష్టించింది. నిజానికి దేశమే ఉలిక్కిపడే ఘటన ఇది. కానీ ఈశాన్యంలోనో, కశ్మీర్‌లోనో, గిరిజన ప్రాంతాలలోనో జరిగే హింసను ప్రధాన స్రవంతి సమాజం పట్టించుకోదు.


ఈశాన్య రాష్ర్టాలలో బీజేపీ క్రియాశీల రాజకీయాలు ప్రారంభించిన తరువాత ఉద్రిక్తతలు పెరిగాయి. స్థానికంగా బలంగా ఉన్న చిన్న రాజకీయ పక్షాలు అధికారానికి వచ్చినప్పటికీ బీజేపీ ప్రభా వం నుంచి బయట పడలేకపోతున్నాయి. భారత్‌కు తూర్పు ఆసియాతో రహదారుల విస్తరణ, వ్యాపార సంబంధాలు వృద్ధి సాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం చేపట్టింది. ఈ నిధులు మొత్తం కేంద్రం చేతిలో ఉండేవిధంగా నిబంధనలను మార్చడం తో ఈశాన్యంలోని చిన్న రాజకీయపక్షాలు అనివార్యంగా బీజేపీతో స్నేహంగా ఉండక తప్పడం లేదు. మరోవైపు అనేక అంశాలపై బీజేపీకి ప్రాం తీయపక్షాలకు ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇటీవల కేంద్రం పౌరసత్వ బిల్లును ముందుకు తెచ్చినప్పుడు, అస్సాంతో సహా ఈశాన్య రాష్ర్టాలలోని పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా మారా యి. బీజేపీతో పొత్తు ఉన్న ఎన్‌పీపీ కూడా విడిగా పోటీచేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే అబోహ్ హత్య జరుగడం గమనార్హం. ఎన్‌పీపీ వర్గాలు అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పై అనుమానాలు వ్యక్తంచేయడం ఆశ్చర్యకరం. బీజేపీ స్నేహంగా ఉండవలసింది. కానీ దురదృష్టవశాత్తూ హింస చెలరేగి అబోహ్ జీవితాన్ని బలితీసుకున్నది అని అరుణాచల్‌ప్రదేశ్ ఎన్‌పీపీ అధ్యక్షుడు కబక్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనకు బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. దీనిపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరుపాలని కోరింది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పీఎంవో వెంటనే చర్యలు తీసుకోవాలని కోన్రాడ్ సంగ్మా కోరారు. నేషనలిస్ట్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్) ఐజాక్ మువియ వర్గంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు సాగించింది. ఈ నాగా తీవ్రవాద వర్గం కాల్పుల విరమణ కూడా ప్రకటించింది.

అయినప్పటికీ, కొన్ని ఎంపిక చేసిన రాజకీయపక్షాలపై దాడులు కూడా సాగిస్తుండటం గమనార్హం. సైన్యానికి ప్రత్యేకాధికారాలు కల్పించిన ప్రాంతంలోనే ఈ దాడి జరిగింది. నాగా తీవ్రవాదుల దాడి పట్ల కేంద్రం వెంటనే స్పందించింది. ఈశాన్యంలో సాధారణ పరిస్థితి ని భంగపరుచడానికి ఈ దాడి జరిగినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముక్తసరిగా ఖండించినప్పటికీ ఈశాన్యంలోని రాజకీయవర్గాల అభిప్రాయం ఏమిటన్నది ప్రధానం. ఈశాన్యంలోని జాతులు, తెగలు తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుం టూనే జాతీయ రాజకీయాలలో భాగస్వాములయ్యే పరిస్థితులు కల్పించాలె. జాతీయ రాజకీయ పక్షాల పట్ల ఘర్షణపూరిత పరిస్థితులు, అనుమానాలు నెలకొనడం మంచిది కాదు. అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నందున అబోహ్ హత్య ఈశాన్య రాష్ర్టాలలో ప్రకంపనలు సృష్టించింది. నిజానికి దేశమే ఉలిక్కిపడే ఘటన ఇది. కానీ ఈశాన్యంలోనో, కశ్మీర్‌లోనో, గిరిజన ప్రాంతాలలోనో జరిగే హింసను ప్రధాన స్రవంతి సమాజం పట్టించుకోదు. ఈ ఉపేక్షాభావం వల్లనే సమస్యలు రగిలిపోతూ చివరికి సంక్షోభం తలెత్తుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఈశాన్య ప్రాంత ప్రజల కు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టాలె. వారిలో అనుమానాలు, అపోహలకు తావివ్వకూడదు.

122
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles