ఎగ్జిట్‌పోల్స్ ఎందుకు తప్పవుతాయి?

Wed,May 22, 2019 01:10 AM

ఓటర్లు కొత్త వ్యక్తికి తాము ఎవరికి ఓటు వేశారనేది చెప్ప డం ఎగ్జిట్‌పోల్స్‌లోని కీలకాంశం. ఈ ఒక్క అంశం అనే క సంక్లిష్ట కారణాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం తొమ్మిది ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ గెలుస్తుందని, మూడు వందల సీట్లకు దగ్గరగా ఉంటుందని జోస్యం చెప్పాయి. ఎన్నిక ల ముందు జరిపిన సర్వేలు మాత్రం బీజేపీ ప్రతిపక్షాల కన్నా మెరుగ్గా ఉంటుందని, అయితే లోక్‌సభలో మెజారిటీ సాధించబోదని తేల్చిచె ప్పాయి. బీజేపీ పట్ల ప్రజల్లో అసంతృప్తి లేదని కూడా స్పష్టం చేశాయి. వ్యవసాయ సంక్షోభం మూలంగా రైతులలో, నిరుద్యోగం వల్ల యువత లో, ఉద్యోగాలు పోవడం వల్ల కార్మికులలో, పారిశ్రామిక ప్రగతి దెబ్బతినడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ మొదలైన కారణాల వల్ల చిన్నతరహా ఉత్పత్తిదారులు, ట్రేడర్స్‌లో అసంతృప్తి నెలకొన్నదనే వార్తలు వచ్చినా అవేవీ లేవని ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. జాతీయోన్మాదాన్ని రెచ్చగట్టడం, పాకిస్థాన్‌పై దాడి, కశ్మీరీ మిలిటెంట్ యువతను హతమార్చడం, అల్పసంఖ్యాక వర్గాలను భయకంపితులను చేయడం ద్వారా మోదీ పాలనపై నెలకొన్న విశ్వాసరాహిత్యాన్ని అధిగమించారా? ఎగ్జిట్‌పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటే మోదీ ఈ ప్రతిబంధకాలను అధిగమించారనే భావించవచ్చు. కానీ ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను నమ్మవచ్చా? ఈ ఎగ్జిట్‌ల్స్ గతంలో ఎప్పుడైనా కచ్చితంగా ఫలితాలను వెల్లడించాయా? ఎగ్జిట్‌పోల్స్ కొన్ని కచ్చితంగా వెల్లడించాయి. కొన్ని తప్పుపోయినా కొంతమేరకు ఉపేక్షించేలా ఉన్నాయి. మిగతావి పూర్తిగా తప్పుడు అంచనాలు ఇచ్చాయి. తాజా ఎగ్జిట్‌పోల్స్ ఎటువంటివనేది తెలువాలంటే పాత ఎగ్జిట్ పోల్స్‌ను ఒకసారి పరిశీలించాలె. లోక్‌సభ ఎన్నికల విషయంలో గతంలో ఎగ్జిట్‌పోల్స్ ఎంతవరకు కచ్చితంగా ఉన్నాయో పరిశీలిద్దాం. 2004 లోక్‌సభ ఎన్నికలలో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయేకు 230 నుంచి 275 స్థానాల వరకు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనా. కానీ ఎన్డీయేకు 187 సీట్లే లభించడం వల్ల అధికారం కోల్పోయింది.

2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయేకు 230 నుంచి 275 స్థానాల వరకు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనా. కానీ ఎన్డీయేకు 187 సీట్లే లభించడం వల్ల అధికారం కోల్పోయింది. 2009 ఎన్నికలలో యూపీఏకు 199 స్థానాలే వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెబుతూ అధికారంలో కొనసాగుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ యూపీఏ 262 స్థానాలు తెచ్చుకొని, మద్దతు కూడగట్టుకొని అధికారంలో కొనసాగింది.


2009 ఎన్నికలలో యూపీఏకు 199 స్థానాలే వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెబుతూ అధికారంలో కొనసాగుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ యూపీఏ 262 స్థానాలు తెచ్చుకొని, మద్దతు కూడగట్టుకొని అధికారంలో కొనసాగింది. 2014లో మాత్రం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు సరిగ్గానే ఉన్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల అంచనాలు ఎట్లా ఉన్నాయో పరిశీలిద్దాం. 2015 బీహార్ ఎన్నికలలో బీజేపీకి 93 నుంచి 155 సీట్ల వరకు రావచ్చునని, మధ్యస్థంగా 108 వచ్చినా అధికారం చేపడుతుందని ఈ ఎగ్జిట్ పోల్స్ జరిపినవారు వెల్లడించారు. కానీ బీజేపీకి వచ్చిన సీట్లు 53. 20 17 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకి 161 నుంచి 170 సీట్లు వస్తాయనేది ఎగ్జిట్‌పోల్స్ అంచనా. ఎస్పీ, బీఎస్పీకి కలిసి 228 నుంచి 230 సీట్ల వరకు వస్తాయని అంచనా వేశారు. కానీ బీజేపీ 312 స్థానాలు గెలుచుకున్నది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ మాత్రం నిజమయ్యాయి. పోల్ ఆఫ్ పోల్స్ అని చెప్పుకుంటూ కాంగ్రెస్‌కు 80 స్థానా లు, బీజేపీకి 104 స్థానాలు, జనతాదళ్ (ఎస్)కు 38 స్థానాలు వస్తాయ ని అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 86, బీజేపీకి 103, జేడీఎస్‌కు 37 వచ్చా యి. 2018లో మూడు అసెంబ్లీ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్‌పో ల్స్ వెలువడ్డాయి. వీటిలో రెండు సరిగ్గానే వచ్చినా, ఒక అంచనా ఘోరం గా తప్పయింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో రెండు ప్రధా న రాజకీయపక్షాలకు సంబంధించి ఆరు ఎగ్జిట్ పోల్స్‌లో చాలా తేడా ఉన్నది. కానీ వాటి సగటు లెక్క వాస్తవానికి దగ్గరగానే ఉన్నది. కాంగ్రెస్‌కు 111, బీజేపీకి 108 అనేది సగటు అంచనా. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 108 అనేది సగటు అంచనా కాగా 110 వచ్చాయి. కానీ ఛత్తీస్‌గఢ్ విషయంలో ఘోరంగా లెక్కతప్పింది. బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 44 అనే ది అంచనా అయితే వాస్తవానికి బీజేపీకి 15 మాత్రమే వచ్చాయి. కాం గ్రెస్ 68 స్థానాలు గెలుచుకున్నది. ఈ తప్పుడు అంచనాలను బట్టి మనకు తెలుస్తున్నదేమిటి? ఎగ్జిట్ పోల్స్ అంతరార్థమేమిటీ అంటే పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చి న వ్యక్తి వాస్తవం చెబుతాడనీ, ఇక తాను దాచడం వల్ల జరిగేదేమీ లేదనుకుంటాడనీ ఒక అభిప్రాయం ఉన్నది.

ఎగ్జిట్‌పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే మరో అంశం కూడా గమనించాలె. ఒక అంశంపై భారీగా ఏకాభిప్రాయం ఉన్నప్పుడు, ప్రజలు ధైర్యంగా చెప్పగలుగుతారు. భారీ ప్రజా సమూహంలో భాగంగా ఓటరు ధైర్యంగా ఉంటాడు. 2014 ఎన్నికలకు ముందు ఇటువంటి నిర్భయమైన పరిస్థితులు ఉండేవి. మోదీ ఉద్యోగ, దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని ప్రచారం చేశారు. గుజరాత్‌లో ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉన్నది. ఈ పరిస్థితులలో మోదీకి ఓటేశామని ప్రజలు ధైర్యంగా చెప్పగలిగారు.


అదే ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రాతిపదిక. కానీ ఇది ఎప్పుడూ వాస్తవం కాదు. ఒపీనియన్ పోల్స్‌లో - విశ్రాంతిగా ఉన్నప్పుడు భిన్నమైన ప్రశ్నలు వేసి అబద్ధాలు చెబితే పసిగట్టి తొలిగిస్తా రు. కానీ ఎగ్జిట్ పోల్స్‌కు ఇంత వ్యవధి ఉండదు. అందువల్ల ఎవరికి ఓటేసిందీ చెప్పే ఓటరు ఎంత భద్రంగా భావిస్తున్నాడనే దానిపై కచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు ప్రశాంతంగా ఉండి, చట్టబద్ధ పాలన నెలకొని ఉన్నప్పుడు, ప్రజాస్వామిక సంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు ప్రజలు ధైర్యంగా వాస్తవాలు చెబుతారు. ప్రజలు ధైర్యంగా తాము ఓటు ఎవరికి వేసిందీ చెప్పాలంటే, దేశంలో సుస్థిరమైన పార్టీ వ్యవస్థ ఉండాలె. రాజకీయపక్షాలు అధికారానికి రావడం, దిగిపోవడం సాధారణంగా జరుగుతుండాలె. రాజకీయపక్షాలకు దిగిపోతామనే భయం ఉండకూడ దు. ఇటువంటి సాధారణ పరిస్థితులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలలో ఉన్నాయి. అందువల్ల ఎగ్జిట్‌పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నా యి. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నిర్భయ పరిస్థితులు లేవు. అందువల్ల ఎగ్జిట్‌పోల్స్ తప్పుగా ఉన్నాయి. ఎగ్జిట్‌పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే మరో అంశం కూడా గమనించాలె. ఒక అంశంపై భారీగా ఏకాభిప్రాయం ఉన్నప్పుడు, ప్రజ లు ధైర్యంగా చెప్పగలుగుతారు. భారీ ప్రజా సమూహంలో భాగంగా ఓటరు ధైర్యంగా ఉంటాడు. 2014 ఎన్నికలకు ముందు ఇటువంటి నిర్భయమైన పరిస్థితులు ఉండేవి. మోదీ ఉద్యోగ దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని ప్రచారం చేశారు. గుజరాత్‌లో ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉన్నది. ఈ పరిస్థితులలో మోదీకి ఓటేశామని ప్రజలు ధైర్యంగా చెప్పగలిగారు. ఎగ్జిట్‌పోల్స్ సక్రమంగా జరుగడానికి మూడో ప్రాతిపదిక కూడా ఉన్నది. పైన చెప్పిన రెండు కారణాల వల్ల ఏర్పడిన సమతుల పరిస్థితిని దెబ్బతీసే కొత్త కారకం ఏదీ ఉం డకూడదు. బీహార్‌లో 2015 ఎన్నికల అంచనాలు తప్పడానికి కారణం, మహాఘట్ బంధన్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం. ఓట్లను సీట్లుగా లెక్కించే క్రమంలో ఈ మహాఘట్‌బంధన్‌ను పట్టించుకోలేదు.

సాధారణ మెజారిటీతో సీటు గెలిచే అవకాశం ఉండే ఎన్నికల వ్యవస్థలో ఈ పొరపాటు మొత్తం అంచనాను దెబ్బతీసింది. ఇదే కారణంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్‌పోల్స్ జరిపేవారు తప్పుదోవ పట్టారు. ఓట్లను సీట్లుగా మార్చే క్రమంలో ఎస్పీ, బీఎస్పీ ఓట్లు చీలిపో యే అంశాన్ని పరిగణించలేదు. ఈ రెండుపక్షాలు హోరాహోరీగా పోరాడటం వల్ల ఇరుపక్షాల మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయాయి. మరోవైపు ఉన్నతవర్గాల ఓట్లు కేంద్రీకృతమయ్యాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్ పరిహాసంగా మారిపోయాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ మొత్తం 18 ఉప ఎన్నికలను గెలుచుకున్నది. ఇందుకు కారణం బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టకపోవడమే. దీంతో బీఎస్పీ ఓట్లు భారీ ఎత్తున ఎస్పీకి పడ్డాయి. తాజా లోక్‌సభ ఎన్నికలలో బీఎస్పీ, ఎస్పీ 2017 నాటి తమ ఓట్ల శాతాన్ని కాపాడుకోగలిగితే బీజేపీ తాను గెలుచుకున్న 73 స్థానాల లో 46 కోల్పోతుంది. మోదీ విధానాలు తెచ్చిన మార్పును కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉన్నది. మోదీ అనుకోకుండా అవలంబించిన కొన్ని విధానాల వల్ల కులాలు, తెగల రాజకీయాల స్థానంలో వర్గ రాజకీయం చోటుచేసుకున్నది. మోదీ వాగ్దానాలకు విరుద్ధంగా- పారిశ్రామిక రంగం స్తంభించిపోయి ఉద్యోగాలు కుంచించుకుపోయాయి. అయితే ఇదొక్కటే కారణం కాదు. ప్రభుత్వం చేసిన చట్టాలు, వాటిని అమలు చేయడానికి విశ్వహిందు పరిషత్ ఇతర సంఘ పరివార్ శక్తులకు మోదీ ఇచ్చిన స్వేచ్ఛ గమనార్హమైనది. గో వధ నిషేధం ఇందుకు ఉదాహరణ. గో రక్షకులు రెచ్చిపోయి పశు వ్యాపారుల మీద పడ్డారు. ముసలి పశువులు రైతుల పొలాలపై పడ్డాయి. పశువుల సంతలు మూతపడ్డాయి. ఈ క్రమంలో భూమి లేని పేదలు దెబ్బతిన్నారు. ముస్లింలపై దాడులు సాగాయి. ఈ విధంగా భారత రాజకీయాలలో వర్గం ప్రధానాంశమైంది. రెండేండ్ల కిందట ఇది అనూహ్యం.
prem-shankar-jha
ఈ దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా అణిచివేతకు గురైనవారంతా పేదలే. ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో భయం తో బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఫలానా పార్టీకి ఓటేశామని కొత్తవారికి నిర్భయంగా చెప్పేవారు తక్కువ. కానీ విశాల ప్రజా బాహు ళ్యం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఘట్‌బంధన్‌ల వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మే పరిస్థితి లేదు.
(వ్యాసకర్త: ఢిల్లీలోని ప్రముఖ పాత్రికేయుడు)

375
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles