పేదలకు భరోసా

Wed,May 22, 2019 01:10 AM

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అంతిమ యాత్ర పేరిట ఒక్క రూపాయికే అంత్య క్రియలు చేసే పథకాన్ని మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ప్రారంభించడం హర్షణీ యం. చనిపోయిన తర్వాత గౌరవంగా అంత్యక్రియలు చేయలేని పేదలెందరో ఉన్న ఈ రోజుల్లో అంతిమ యాత్ర కార్యక్రమం పేదలకు భరోసా ఇవ్వనున్న ది. అంత్యక్రియలు ముగిశాక కేవలం 5 రూపాయలకే యాభై మందికి భోజన ఏర్పాట్లు కూడా చేయడం అభినందనీ యం. ఇప్పటికే ఈ పథకం పట్ల ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఉప రాష్ట్రపతి, కేటీఆర్ లు సైతం ట్వీట్ల ద్వారా హర్షించడమే దీని కి ఉదాహరణ. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పథకాన్ని ప్రారంభించి పేదలకు బాసటగా బాగుంటుంది.
- బందెల శ్రీనివాస్, కమాన్, కరీంనగర్

కఠినంగా వ్యవహరించాలె

ఎండకాలం సెలవులు ముగిసి పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. జూన్ 1వ తేదీనుంచే పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే ప్రైవేట్ పాఠశాలల యాజమానులు తల్లిదండ్రులను నుంచి ఫీజులు అధిక మొత్తం లో వసూలు చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు దిక్కులేని స్థితిలో వారడిగినంత చెల్లించాల్సి వస్తున్నది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
- ఉప్పల ఉదయ్‌కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా

ఫేవరేట్‌గా భారత్

పది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలో భారత్ ఫేవరేట్‌గా దిగబోతున్నది. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచకప్‌ను భారతజట్టు కైవసం చేసుకునేందుకు అన్నివిధాలా అర్హత ఉన్న జట్టుగా కనిపిస్తున్నది. గత కొన్నేండ్లుగా సమిష్టిగా రాణిస్తున్న కోహ్లీ సేన ఇంగ్లండ్‌లో కూడా రాణించి దేశానికి మరో ప్రపంచకప్ అందివ్వాలని సగటు క్రికెట్ అభిమాని ఆకాంక్ష. ఆ కోరిక తీరాలని ఆశిస్తూ...
- చుంచు అరుణ్‌కుమార్, వెల్గనూర్, మంచిర్యాల

144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles