విద్వేష రాజకీయాలకు వీడ్కోలు

Tue,May 21, 2019 01:35 AM

Mahatma-Gandhi
ఎన్నికల ప్రచారం ఆసాంతం ఎక్కడ చూసినా రాజకీయ విద్వేష మే కనిపించింది. సాధారణంగా ఎన్నికల సమయంలో, ప్రచారంలో పరస్పర విమర్శలతో రాజకీయపార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విద్వేషాలే కేంద్ర స్థానంలో నిలిచాయి. ఈ క్రమంలోంచి బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాటలు ఆశ్చర్యం కలిగించలేదు. ఆమె నాథూరాం గాడ్సేను మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేశారు. అతనే అసలైన దేశభక్తుడని కీర్తించారు. ప్రజ్ఞాసింగ్ మాటలతో దేశవ్యా ప్తంగా పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఆమె మాటలతో సంతృప్తి చెందలేనని చెప్పుకున్నారు. నిజానికి ఇది, ఇలాంటి మాటలు కొత్త కాదు. ప్రధానంగా బీజేపీ నేతలు అనేక విషయాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి వాద, వివాదాలయ్యాయో అందరూ చూస్తున్నదే. ఇది ఒకరకంగా విషపూరిత రాజకీయం. ఈ విషపూరిత రాజకీయంలోంచే గాడ్సే హింసకు మద్దతు, మెప్పుకోలు లభిస్తున్నది. గాంధీ, ఆయన ఆచరణ హేళనకు, నవ్వులాటకు గురవుతున్నది. గాంధీని విమర్శించటం కొత్త కాదు. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ రాజకీయాలను తన వాస్తవంతో ప్రయోగాలతో రాజకీయాలకు కొత్త అర్థం చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి సంయుక్త బెంగాల్ దాకా తనదైన తాత్త్విక రాజకీయాచరణతో ప్రభావితం చేశారు. సమాజంలో, రాజకీయాల్లో హింసకు బదులు ప్రేమ, సహనం, అహింసా ఆచరణతో సమా జ మార్పునకు పూనుకున్నారు. ప్రజా సమూహాల్లో, ఉద్యమాల్లో హిం సను తీవ్రంగా నిరసించారు. ఈ ఆచరణ చాలామందికి అనేకవిధాలుగా అయిష్టతను పెంచింది. ఈ క్రమంలోనే గాంధీని ఎంతగా ప్రేమించేవా రు ఉన్నారో, అంతేస్థాయిలో వ్యతిరేకించే వారూ తయారయ్యారు.

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ రాజకీయాలను తన వాస్తవంతో ప్రయోగాలతో రాజకీయాలకు కొత్త అర్థం చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి సంయుక్త బెంగాల్ దాకా తనదైన తాత్త్విక రాజకీయాచరణతో ప్రభావితం చేశారు. సమాజంలో, రాజకీయాల్లో హింసకు బదులు ప్రేమ, సహనం, అహింసా ఆచరణతో సమాజ మార్పునకు పూనుకున్నారు. ప్రజా సమూహాల్లో, ఉద్యమాల్లో హింసను తీవ్రంగా నిరసించారు. ఈ ఆచరణ చాలామందికి అనేకవిధాలుగా అయిష్టతను పెంచింది. ఈ క్రమంలోనే గాంధీని ఎంతగా ప్రేమించేవారు ఉన్నారో, అంతేస్థాయిలో వ్యతిరేకించే వారూ తయారయ్యారు.


ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గాంధీని వ్యతిరేకించటం ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. అంబేద్కర్‌వాదులు సవర్ణ హిందూ నినాదంతో గాంధీని వ్యతిరేకించారు, తూలనాడారు. అరుంధతీరాయ్ ఈ నేపథ్యంలోనే గాంధీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కానీ గాంధీ హత్యను కూడా కీర్తించేపని గాంధీ వ్యతిరేతకు కొత్త కోణాన్ని చేర్చింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రకటన హిం దుత్వ భావజాల సారాంశానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇలాంటి హిం దుత్వ జాతీయవాదంలో గాంధీని సర్వత్రా హత్య చేస్తారు. అప్పుడప్పు డు మోదీ అతని అనుచరులు గాంధీని తమ సొంత రాజకీయ ప్రయో జనాల కోసం పొగుడుతుంటారు, కానీ నిజమైన ప్రేమతో, నిబద్ధతతో కాదు. గాంధీ విధానాలను కొనసాగించేందుకు అంతకన్నా కాదు. విషాదమేమంటే.. చాలామంది అభ్యుదయవాదులమని, లౌకికవాదులమని చెప్పుకొనేవారు కూడా గాంధీ విషయంలో నిజాయితీగా మద్దతుదారు లుగా, ఆచరణాత్మక అనుచరులుగా లేరు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే.. దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది- విషపూరిత విద్వేష రాజకీయ సంస్కృతి. ఇలాంటి విద్వేష రాజకీయ సంస్కృతి 2014 నుంచి బాగా రాజకీయ ప్రయోజనాల కోసం పెంచి పోషించబడుతున్నది. ఇది అనేక సందర్భా ల్లో అనేక రూపాల్లో ప్రదర్శింపబడుతున్నది. అమిత్ షా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రయోగించిన భాష, చేసిన హింస చెప్పకనే చెబుతున్నది. ప్రధాని మోదీ కూడా రోడ్ పక్క దాబాలో మాట్లాడుకునే స్థాయిలో నిందాపూర్వక మాటలకు దిగజారారు. పార్టీ అగ్రనాయకులే ఈ విధమైన నిందాపూర్వక మాటలకు దిగటంతో ప్రజ్ఞాసింగ్ లాంటివారికి హద్దేమి ఉంటుంది. అలాగే బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న వాదనలు మరింత హింసాత్మకంగా ఉంటున్నాయి.

గాంధీ తనదైన తాత్వికతతో, సహన, శాంతి నినాదాలతోఅహ్మదాబాద్‌లోని చంపారన్ ఉద్యమం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ గాంధీ వారసులుగా చెప్పుకుంటున్నవారు 2002 హింసాకాండ ద్వారా తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి సమాజాన్ని హింసాత్మక విధ్వంసక పునాదులపై నిర్మించేందుకు పూనుకున్నారు. ఈ విధమైన కార్యక్రమమే 1984 ఢిల్లీలోనూ జరిగింది. దీనికి మరో రాజకీయపక్షం కారణమయ్యింది. పరిస్థితులు ఏవైనా మోదీ తన ప్రస్థానాన్ని విధ్వంసక రాజకీయాలతో ప్రారంభించి సమాజాన్నంతటినీ హింసాత్మ కం చేస్తున్న స్థితి ఉన్నది. గాంధీ విషయంలో ప్రజ్ఞాసింగ్ మాటలను మాటపూర్వకంగా ఖండించి, తాను సాధువునని చెప్పుకునే ప్రయత్నం చేశారు.


వారైతే హింసను ఎలిగెత్తి కీర్తించటమే పనిగా పెట్టుకున్నారు. మూకదాడులను, గో రక్షకుల పేరుతో చేసే హత్యలను, లైంగికదాడులను కూడా సమర్థించే స్థాయికి చేరుకున్నారు. ఇది ఏ స్థాయికి చేరుకున్నదంటే అది ఒక అంటువ్యాధిలా విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కూడా అదే బాటలో నడిచే స్థితి ఏర్పడటం నన్ను విస్తు గొల్పుతున్నది. దీనికి మమతా బెనర్జీ ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బెనర్జీ బీజేపీని సన్నిహిత శత్రువు అని అభివర్ణించారు! ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులను నిందాపూర్వకంగా విమర్శించటం పరాకాష్టకు చేరుకున్నది. ఇలాంటి రాజకీయ వాతావరణంలోనే ప్రజ్ఞాసింగ్ లాంటి వారిచే మరోసారి గాడ్సే చేతిలో గాంధీ హత్యగావింపబడుతున్నారు. ప్రజ్ఞాసింగ్ నేటి మతవాద రాజీకయ వ్యక్తీకరణకు సంకేతం మాత్రమే. రెండవది- హిందుత్వ వాదం. గోల్వాల్కర్, సావర్కర్ లాంటివారు ముందుకుతెచ్చిన హిందుత్వ వాదం ఇవ్వాళ మరిన్ని రూపాలు సంతరించుకొని సమాజ అన్ని పొరల్లోకి పాకింది. దాన్ని వాజపేయి, అద్వానీ లాంటివారు రాజకీయ ఆయుధంగా మారిస్తే, నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటివారు గాంధీ, అహింసా వ్యతిరేక రూపానికి ప్రతీకగా మార్చా రు. హిందుత్వను క్రిష్టియానిటీ, ఇస్లాంలకు ప్రతివాదిగానే గాక, శత్రువుగా తీర్చిదిద్దారు. గాంధీ టాల్‌స్టాయ్, రస్కిన్ లాంటి బోధనలతో మతాలకతీతమైన మానవవాదాన్ని నిర్మాణం చేస్తే, వీరు భగవద్గీతను హింసాబోధనగా మార్చేశారు. గాంధీ తనదైన తాత్వికతతో, సహన, శాంతి నినాదాలతో అహ్మదాబాద్‌లోని చంపారన్ ఉద్యమం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ గాంధీ వారసులుగా చెప్పుకుంటున్నవారు 2002 హింసాకాండ ద్వారా తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి సమాజాన్ని హింసాత్మక విధ్వంసక పునాదులపై నిర్మించేందుకు పూనుకున్నారు.
avijit
ఈ విధమైన కార్యక్రమమే 1984 ఢిల్లీలోనూ జరిగింది. దీనికి మరో రాజకీయపక్షం కారణమయ్యింది. పరిస్థితులు ఏవైనా మోదీ తన ప్రస్థానాన్ని విధ్వంసక రాజకీయాలతో ప్రారంభించి సమాజాన్నంతటినీ హింసాత్మ కం చేస్తున్న స్థితి ఉన్నది. గాంధీ విషయంలో ప్రజ్ఞాసింగ్ మాటలను మాటపూర్వకంగా ఖండించి, తాను సాధువునని చెప్పుకునే ప్రయత్నం చేశారు. వాస్తవమేమంటే.. వారు గాడ్సేను ప్రేమిస్తారు. గాంధీని ద్వేషిస్తారు. మే 23న ఈ చరిత్రాత్మకమై ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. ఏదే మైనా, ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా.. గత ఐదేండ్లుగా విధ్వంసమైన విలువల నిర్మాణానికి పూనుకోవాలి. ఇది అనుకున్నంత సులువు కాకపోయినా, ఆ దిశగా ప్రయత్నాలు చేయటానికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది. విద్వేష రాజకీయాలకు చరమ గీతం పాడాలి. సహన శీలత ను, శాంతిని పెంపొందించుకోవాలి.
(వ్యాసకర్త: జవహర్‌లాల్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్)

264
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles